parliament of India Lok Sabha in Telegu
భారత పార్లమెంట్ - లోక్ సభ
పార్లమెంట్
పార్లమెంట్ అనే పదం parley అనే
ఫ్రెంచ్ పదం నుండి పుట్టింది parley అంటే సమావేశం అని
అర్థం వస్తుంది. భారతదేశ దేశంలో ఉన్న ఆధునిక పార్లమెంటరీ వ్యవస్థకి బ్రిటన్
పార్లమెంటరీ వ్యవస్థను మనం మాతృకగా పరిగణిస్తారు. పార్లమెంట్ ను హిందీలో సంసద్
అంటారు.
ప్రస్తుతం పార్లమెంటు అంటే తెలియని వాళ్లు ఉండరు. అయితే ఈ పార్లమెంట్ భవనం ఢిల్లీలో సంన్సద్ మార్గ్ లో ఉంది. పార్లమెంట్ భవనాన్ని ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ చేమ్స్ ఫర్డ్ 1921లో
పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేశారు. 1927 వ సంవత్సరంలో గవర్నర్ జనరల్ లార్డ్
ఇర్విన్ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు.
స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి లోక్ సభ 1952
ఏప్రిల్ 17న ఏర్పాటయ్యింది. మొదటి రాజ్యసభ 1952
ఏప్రిల్ 3న అయింది. పార్లమెంట్ మొదటి సమావేశం 1952 మే 13న జరిగింది. పార్లమెంటు 2012 మే 13న
60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంటు వజ్రోత్సవాలు జరుపుకుంది.
భారత రాజ్యాంగంలోని ఐదవ భాగంలో ఆర్టికల్ 19 - 122 వరకు పార్లమెంట్ నిర్మాణం, అధికారాలు మరియు శాసన ప్రక్రియలు గురించి పేర్కొన్నారు.
ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంటు అంటే రాష్ట్రపతి, లోక్ సభ మరియు రాజ్యసభ. అయితే రాష్ట్రపతి
పార్లమెంటులో అంతర్భాగమే కానీ సభ్యులు కారు. పార్లమెంట్ లోని ప్రతి
శాసన విధానం రాష్ట్రపతితోనే ఆధారపడి ఉండడం వలన రాష్ట్రపతిని పార్లమెంటులో
అంతర్భాగంగా పరిగణిస్తారు. పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు, బిల్లు ఆమోదం తెలపడం,
లోక్ సభను రద్దు చేయడం, సభను ఉద్దేశించి ప్రసంగించడం, మొదలైన అంశాలు అన్ని
రాష్ట్రపతి తోనే ముడిపడి ఉంటాయి.
పార్లమెంట్ లో రెండు సభలు ఉంటాయి అవి
1. లోక్ సభ
2. రాజ్యసభ
లోక్ సభ -లోక్ సభ నిర్మాణం
ఆర్టికల్ 81 లో లోక్ సభ యొక్క నిర్మాణం, ఎన్నిక మొదలైన అంశాలు ఉన్నాయి. లోక్ సభను దిగువ సభ/
ప్రజా ప్రతినిధుల సభ/ అశాశ్వత సభ అంటారు. లోక్ సభను ఇంగ్లీష్
లో house of people (ప్రజల సభ)
అని అంటారు. ఎందుకంటే ఈ సభలోని సభ్యులు నియోజకవర్గాల ప్రజల ద్వారా
ఎన్నికవుతారు. అంటే ప్రజల నాయకుడు లోక్ సభ సభ్యుడు. దేశ ప్రజలందరి నాయకులు.
దేశ ప్రజల మనసులను దోచుకున్న నాయకులే లోక్ సభలో సభ్యత్వం పొందడానికి
అర్హత పొందుతారు.
18 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులు సార్వజనీన
ఓటు హక్కు పద్ధతిలో లోక్ సభ సభ్యులను ఎన్నుకుంటారు. సార్వజనీన వయోజన ఓటు హక్కు
ను ఆంగ్లంలో first past the post అంటారు దీని అర్థం winner
gets all అని వస్తుంది. 1952 లో జరిగిన మొదటి లోక్సభ ఎన్నికలలో 17.32 కోట్ల ఓటర్లు
ఉన్నారు.
·
లోక్‌సభలో గరిష్ట సభ్యుల సంఖ్య 552
·
ఆర్టికల్ 81(1a) ప్రకారం 530 సభ్యులకు మించకుండా రాష్ట్రాలనుండి ఎన్నికవుతారు.
·
ఆర్టికల్ 81(1b) ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాల నుండి 20 సభ్యులకు మించకుండా
ఎన్నిక అవుతారు.
·
మొట్ట మొదటి లోక్‌సభలో
సభ్యుల సంఖ్య 525 గా నిర్ణయించారు. అయితే 1973లో చేసిన 31 వ రాజ్యాంగ సవరణ
ద్వారా లోక్‌సభ సభ్యుల సంఖ్యను 525 నుండి 545 కు పెంచడం జరిగింది. 1976 లో చేసిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్ సభ స్థానాల సంఖ్యను స్టిరీకరించారు. దీని ప్రకారం 2000 సంవత్సరం
వరకు లోక్ సభ స్థానాల సంఖ్య మారలేదు. ఈ సంఖ్యను 1971 జనాభా
లెక్కల ప్రకారం నిర్వహించారు. అయితే 2001లో చేసిన 84 వ రాజ్యాంగ సవరణ
ద్వారా ఈ పరిమితిని 2026 సంవత్సరం వరకు పొడిగించారు. అంటే
ప్రస్తుతం లోక్ సభ సభ్యుల సంఖ్య 545 ఈ సంఖ్య 2026
వరకు మారదు.
·
ఆర్టికల్
330 ప్రకారం లోక్ సభ సీట్ల విషయంలో ఎస్సీ ఎస్టీల
రిజర్వేషన్లు వర్తిస్తాయి. అయితే ఈ రిజర్వేషన్లు లోక్‌సభలో మాత్రమే వర్తిస్తాయి.
ప్రస్తుతం లోక్ సభలో ఎస్సీలకు 84 ఎస్టీలకు 47 స్థానాలు కేటాయించారు.
·
ఫ్లాష్ – లోక్ సభ మరియు శాసనసభలో షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలకు (SC,ST) కేటాయించబడిన రిజర్వేషన్లను 126 రాజ్యాంగ సవరణ ద్వారా పెంచారు. ఈ
బిల్లు ప్రకారం లోక్ సభ మరియు శాసనసభ స్థానాలలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు 2020
జనవరి 25 తో ముగియగా, ఈ రిజర్వేషన్లను 2030 జనవరి 25 వరకు పెంచారు. ఇది 104 వ రాజ్యాంగ
సవరణ చట్టం గా మారింది.
·
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.ఇందులో
ఎస్సీలకు 3, ఎస్టీలకు 2 స్థానాలు కేటాయించారు. వరంగల్,
పెద్దపల్లి, నాగర్ కర్నూల్ నియోజక స్థానాలు ఎస్సీలకు,
ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాలను ఎస్.టి లకు కేటాయించారు.
లోక్ సభ సభ్యునిగా పోటీ చేయడానికి కావలసిన అర్హతలు
·
భారతీయ పౌరసత్వం ఉండాలి.
·
25 సంవత్సరాలు నిండి ఉండాలి.
·
ఆదాయం వచ్చే ప్రభుత్వ పదవుల్లో ఉండకూడదు
·
దివాలా తీసి ఉండకూడదు.
·
శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి.
·
దేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకుని ఉండాలి.
·
లోక్‌సభ
సభ్యునిగా పోటీ చేయడానికి జనరల్ అభ్యర్థి 25000 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థి 12,000 రూపాయలు డిపాజిట్ చెల్లించాలి.
డిపాజిట్ తిరిగి పొందాలంటే 1/6 వంతు ఓట్లు పొందాలి.
లోక్ సభ సభ్యుని పదవీకాలం
·
ఆర్టికల్ 83(2) ప్రకారం లోక్ సభ సభ్యుడు సాధారణంగా 5 సంవత్సరాలు పదవిలో ఉంటారు.
·
జాతీయ అత్యవసర
పరిస్థితి అమలులో కొనసాగుతున్నప్పుడు తన పదవీ కాలాన్ని ఒక సంవత్సరం వరకు పొడిగించవచ్చు.
అయితే జాతీయ అత్యవసర పరిస్థితి రద్దయిన తర్వాత ఆరు నెలల కంటే ఎక్కువ పొడిగించడానికి
వీలు ఉండదు. అయితే కొన్ని రాజకీయ కారణాల వలన రాజకీయ అనిశ్చితి ఏర్పడినపుడు ఆర్టికల్
85 ప్రకారం ఐదు సంవత్సరాల కంటే ముందు లోక్ సభను రద్దు చేసుకోవచ్చు.
·
1976 లో చేసిన 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్ సభ పదవీకాలం ఆరు
సంవత్సరాలకు పొడిగించారు. మళ్లీ రెండు సంవత్సరాల తర్వాత 44వ రాజ్యాంగ సవరణ
ద్వారా తిరిగి ఐదు సంవత్సరాలకి లోక్ సభ పదవీకాలాని పునరుద్ధరించారు.
పార్లమెంట్ సభ్యుల సమావేశాలు
·
ఆర్టికల్ 85 ప్రకారం సంవత్సరానికి రెండు సార్లు పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు కావాలి.
అయితే రెండు సమావేశాల మధ్య ఆరు నెలలకు మించకూడదు. అవసరమైనప్పుడు
మరియు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో, అత్యవసర పరిస్థితులలో మరికొన్ని సమావేశాలు నిర్వహించుకోవచ్చు.
·
ప్రస్తుతం పార్లమెంటు
ఆనవాయితీగా మూడుసార్లు సమావేశాన్ని జరుపుతారు. సమావేశాల పైన గరిష్ట కాల పరిమితి
అనేది లేదు.
·
ప్రతి
సమావేశాన్ని ఎన్ని రోజులు నిర్వహిస్తారు అనే అంశంపై స్పష్టమైన సంఖ్య లేదు. కానీ ఒక
ఆర్థిక సంవత్సరంలో జరిపే మూడు సమావేశాలకు కలిపి 90 నుండి 110 రోజులు వరకు
సమావేశాలు నిర్వహించుకోవచ్చు.
·
ప్రస్తుతం
బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి నుండి ఏప్రిల్ మాసంలో, వర్షాకాల
సమావేశాలను జూలై నుండి ఆగస్టు మాసాల్లో, శీతాకాల సమావేశాలను నవంబర్ నుండి డిసెంబర్
మాసాలలో నిర్వహిస్తారు.
·
పార్లమెంట్
సభ్యులు పదవి ప్రమాణ స్వీకారం చేయకుండా సభా కార్యక్రమాల్లో పాల్గొంటే పాల్గొన్న
ప్రతి రోజుకి 500 రూపాయల అపరాధ రుసుము చెల్లించవలసి వస్తుంది.
పార్లమెంటు సభ్యుల రాజీనామా (ఆర్టికల్ 101(3)(b))
పార్లమెంట్ సభ్యులు తన రాజీనామా పత్రాన్ని
సంబంధిత సభాధ్యక్షులను సంబోధిస్తూ పంపాలి. పార్లమెంట్ సభ్యులు స్వచ్ఛందంగా
రాజీనామా చేసినప్పుడు దానిని ధృవీకరించుకున్న తర్వాత మాత్రమే సభాధ్యక్షుడు
రాజీనామాను ఆమోదిస్తారు. ఈ అంశాన్ని 1974వ సంవత్సరంలో చేసిన 33 వ రాజ్యాంగ
సవరణ ద్వారా చేర్చారు.
పార్లమెంటు సభ్యుల అనర్హతలు
ఆర్టికల్ 102(1) పార్లమెంట్
సభ్యుల అనర్హతలకు సంబంధించిన అంశాలను పేర్కొంటుంది. ఈ ఆర్టికల్ ప్రకారం ఈ క్రింది
ప్రాతిపదికన పైన పార్లమెంట్ సభ్యుల సభ్యత్వం రద్దు అవుతుంది.
·
భారత పౌరసత్వాన్ని కోల్పోయినప్పుడు.
·
ఎన్నికల్లో అక్రమాలు జరిగినప్పుడు.
·
పదవీ దుర్వినియోగ పరచిన్నప్పుడు.
·
ఎన్నికల ఖర్చుల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి నిర్ణీత గడువులోగా సమర్పించనప్పుడు.
·
దివాలా తీసినప్పుడు.
·
మానసికంగా దృఢంగా లేడని కోర్ట్ ధ్రువీకరించినప్పుడు.
·
లాభదాయక పదవిలో కొనసాగినప్పుడు.
·
వరకట్నం, అస్పృశ్యత, సతీ సహగమనం చట్టాల కింద అరెస్టు అయినప్పుడు తన
సభ్యత్వం కోల్పోతారు.
·
పార్టీ
ఫిరాయింపు చట్టప్రకారం పార్టీ ఫిరాయించిన, పార్టీ విప్ కు వ్యతిరేకంగా ఓటు వేసినప్పుడు,
పార్టీకి రాజీనామా చేసిన అతను సభ్యత్వం రద్దు అవుతుంది.
·
పార్టీ
ఫిరాయింపుల చట్టం మినహాయించి కేంద్ర ఎన్నికల సంఘం సలహా మేరకే రాష్ట్రపతి పార్లమెంటు
సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయడం జరుగుతుంది.
·
అయితే
పార్లమెంట్ సభ్యుల అర్హత, అనర్హతకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ట్రపతికి
వుంటుంది. పార్లమెంట్ సభ్యులు అనర్హతకు సంబంధించిన అంశాలు న్యాయస్థానాలు సాధారణంగా
జోక్యం చేసుకోవడానికి వీలు ఉండదు.
పార్లమెంటు స్థానం ఖాళీ ఏర్పడే సందర్భాలు (ఆర్టికల్ 101)
ఈ కింది సందర్భాలలో పార్లమెంటు స్థానాలు ఖాళీ
ఏర్పడవచ్చు
·
రాజీనామా - లోక్ సభ సభ్యులు అయితే స్పీకర్ కి రాజ్యసభ
సభ్యులు అయితే రాజ్యసభ చైర్మన్ కి మనస్ఫూర్తితో తన రాజీనామా పత్రాలను వ్యక్తిగతంగా
ఇవ్వాలి.
·
గైహాజరు - సభాధ్యక్షుల అనుమతి లేకుండా పార్లమెంట్ సభ్యులు
నిరవధికంగా 60 రోజులు సభ సమావేశాలకు హాజరు కాకపోతే సభ్యత్వం కోల్పోతారు.
·
ద్వంద
సభ్యత్వం కలిగి ఉండడం - పార్లమెంట్
సభ్యులు ఏకకాలంలో రెండు సభలలో అంటే లోక్‌సభలో మరియు రాజ్య సభలో సభ్యత్వం కలిగి
ఉంటే ఏదైనా ఒక సభలో సభ్యత్వం కోల్పోతారు.
· లోక్ సభకి, రాజ్యసభకి ఒకేసారి ఎన్నిక అవుతే ఎన్నికైన పది రోజుల లోపు తాను ఏ సభలో
కొనసాగుతారో తెలియ చేయాలి. లేకపోతే రాజ్యసభ సభ్యత్వం రద్దు అవుతుంది.
·
ఒక అభ్యర్థి
రాష్ట్ర శాసనసభకి, పార్లమెంట్ కి ఒకేసారి ఎన్నికయితే 14
రోజుల లోపు రాష్ట్ర శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. అలా చేయని యెడల
పార్లమెంట్ సభ్యత్వం రద్దు అవుతుంది.
·
ఒక అభ్యర్థి
రెండు స్థానాల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత తాను ఏ నియోజకవర్గంలో కొనసాగుతారో 10
రోజుల లోపు తెలపాలి. లేకపోతే రెండు స్థానాల్లో తన సభ్యత్వం కోల్పోతారు.
పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు
ప్రస్తుతం మన దేశంలో ప్రతిపక్ష నాయకుడు గురించి
తెలియని వాళ్లు ఉండరు. ప్రతిపక్ష నాయకుడు అధికారంలో ఉన్న నాయకులు(ప్రధానమంత్రి)
చేసే తప్పులను విమర్శించడం గాని, సరిదిద్దుకోమని చెప్పడం గాని, బహిరంగ గాని,
పార్లమెంటులో గాని పత్రికలకు తెలియజేస్తుంటారు. వీరే ప్రతిపక్ష నాయకులు ప్రస్తుతం
నరేంద్ర మోడీ(అధికార పార్టీ)ని రాహుల్ గాంధీ
వ్యతిరేకిస్తున్నప్పటికీ రాహుల్ గాంధీకి ప్రతిపక్ష హోదా లేదు. ఎందుకంటే లోక్ సభ
మొత్తం సీట్లలో కనీసం 1/10 వంతు
సీట్లు తమ పార్టీ గెలవలేదు. కావున ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు
అయిన రాహుల్ గాంధీకి ఉండదు.
·
రాజ్యాంగం
పరంగా ప్రతిపక్ష నాయకుడు గురించి రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. కానీ మొట్టమొదటి
స్పీకర్ అయిన g.v మౌలంకర్ రూపొందించిన నియమాల ప్రకారం లోక్‌సభలో కనీసం 1/10 వంతు సభ్యులు కలిగిన మరియు అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు
అధికారికంగా ప్రతిపక్ష నాయకుడు హోదాను పొందుతారు.
·
రాజ్యసభలో కూడా
ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఇదే రకమైన హోదా కల్పించారు. ప్రతిపక్ష నాయకుడికి
క్యాబినెట్ హోదా కూడా ఇవ్వబడుతుంది. 1977వ సంవత్సరంలో చట్టప్రకారం లోక్ సభ, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులకు ప్రతిపక్ష
హోదాకు మొదటి సారి చట్టబద్ధత కల్పించడం జరిగింది.
·
ఈ చట్టం
ప్రకారం 6వ లోక్ సభలో ప్రతిపక్ష నేతగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు చెందిన Y.B. చవాన్ గుర్తింపు పొందాడు. రాజ్యసభలో
మొట్టమొదటిసారిగా కమల త్రిపాఠి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందారు.
·
మొదటి, రెండవ, మూడవ, ఐదవ, 7వ లోకసభ లకు కూడా ప్రతిపక్ష నాయకుడు లేరు.16,17 వ లోక్‌సభలలో కూడా బిజెపి పార్టీకి ప్రతిపక్షం లేదు.
ప్రతిపక్ష పార్టీ హోదా యొక్క ఆవశ్యకత
·
భారతదేశంలో
అనేక రాష్ట్రాల నుండి పుట్టగొడుగుల్లా పార్టీలు పుట్టుకురావడం తర్వాత చీలిపోవడం,
అనేక సార్లు కలిసి పోవడం, డబ్బుకు ఆశ పడడం, రాజకీయ అనిశ్చితి, అవినీతి మొదలైన
కారణాల వలన రాజకీయ పార్టీలు ఏకతాటిపై నడవడానికి వీలు ఉండటం లేదు. అయితే ప్రతిపక్ష
పార్టీకి అధికారిక హోదా ఉండడం వలన కొన్ని అధికారాలు ఇవ్వడం వలన అధికార పార్టీలో
ఉన్న నాయకులు చేసిన తప్పులను ఎత్తిచూపడం వలన దేశం అభివృద్ధి చెందుతుంది.
·
అధికారం ఎవరికి
శాశ్వతం కాదు ఈరోజు అధికారంలో ఉన్న నాయకులు రేపు ప్రతిపక్షానికి రావచ్చు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు రేపు అధికారంలోకి రావచ్చు ఏదిఏమైనప్పటికీ
ఒకరినొకరు అర్థం చేసుకొని అధికార పార్టీలో నాయకుల తప్పులను ప్రతిపక్ష నాయకులు పసిగట్టడం,
ప్రతిపక్ష నాయకులు చేసిన తప్పులను అధికార నాయకులు పసిగట్టడం వలన జవాబుదారితనం మెరుగుపడి,
అవినీతి, కుంభకోణాలు మొదలైనవి తగ్గి దేశం అభివృద్ధి చెందుతుంది.
ALSO READ:- Parliament of India Lok sabha in Telugu
No comments:
Post a Comment