DAILY GK AND CURRENT AFFAIRS TELUGU
13 AND 14 SEPTEMBER 2021
1. సెప్టెంబర్ 11న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని రాజీనామా చేసినందుకు బీజేపీ ప్రభుత్వం కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ను ఎంపిక చేసింది.
· గుజరాత్
గవర్నర్ ఆచార్య దేవ్రత్ గారి సమక్షంలో ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు.
· భూపేంద్ర
పటేల్ సివిల్ ఇంజనీరింగ్లో డిప్లమా కలిగి సర్దార్ దాం మరియు వరల్డ్
ఇండియా ఫౌండేషన్ తో పాటు పటిధార్ ట్రస్ట్లు
మరియు సంస్థలలో పదవులు నిర్వహించారు.
· అహ్మదాబాద్
మున్సిపల్ కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ చైర్మన్ మరియు అహ్మదాబాద్ అర్బన్ డెవలప్మెంట్
అథారిటీ చైర్మన్గా పదవులు నిర్వహించారు.
2. అహ్మదాబాద్లోని
“సర్దార్ ధాం” భవన్
ను ప్రారంభించిన ప్రధాని “నరేంద్ర మోడీ”.
· ప్రధాని
నరేంద్ర మోడీ అహ్మదాబాద్లోని సర్దార్ దాం భవన్ ను వీడియో కాన్ఫరెన్స్
ద్వారా ప్రారంభించారు. మరియు సర్దార్ధం ఫేస్ 2 యొక్క భూమి పూజలో
పాల్గొన్నారు.
· ఈ
రెండు సంస్థలు భారత దేశ ఉక్కు మనిషి “సర్దార్ వల్లభాయ్ పటేల్”
గారికి అంకితం చేయబడినది.
· ఈ
ప్రాజెక్ట్ను “విశ్వ పటిధర్ సమాజ” అనే
సంస్థ అభివృద్ధి చేసింది.
· అహ్మదాబాద్
గాంధీ నగర్ సరిహద్దు ప్రాంతంలోని వైష్ణో దేవి సర్కిల్ సమీపంలో సర్దార్ దామ్ భవన్
ను రూపాయలు 200 కోట్ల
అంచనాతో 11,672 చదరపు అడుగుల
విస్తీర్ణంలో నిర్మించబడింది.
· ఈ
సంస్థ 800 మంది బాలురు మరియు 800 మంది బాలికలకు హాస్టల్
సౌకర్యాన్ని కల్పిస్తుంది.
· సర్దార్ ధం ఫేస్ 2 లో 2000 బాలికలు కు హాస్టల్ సౌకర్యం కల్పించడానికి రూపాయలు రెండు వందల కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు.
3. ఉత్తరాఖండ్లో భారతదేశంలోనే అతిపెద్ద ఓపెన్ ఏర్ ఫెర్నరీ ప్రారంభించబడింది.
· ఉత్తరాఖండ్లోని
రాణిఖెట్ లో “ఓపెన్ ఎయిర్ ఫెర్నేరీ”
ప్రారంభించబడింది దీని యొక్క ఉద్దేశం ఫెర్న్ జాతుల పరిరక్షణతో పాటు వాటి పర్యావరణ
పాత్ర గురించి అవగాహన కల్పించి తదుపరి పరిశోధనలను ప్రోత్సహించడం.
· ఈ
ఫర్నరీ లో దాదాపు 120 రకాల జాతులున్నాయి.
మరియు ఇది ఇది 1800 మీటర్ల ఎత్తులో నాలుగు
ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయబడింది.
· కేంద్ర ప్రభుత్వ పరిహార అటవీ నిర్వహన నిధుల నిర్వహణ మరియు ప్రణాళిక సంస్థ (CAMPA) పతకం కింద ఉత్తరాఖండ్ ప్రభుత్వం 3 సంవత్సరాల వ్యవధిలో దీనిని అభివృద్ధి చేసింది.
4. భారతదేశంలో మొట్ట మొదటి “INS ధ్రువ” అణు క్షిపణి ట్రాకింగ్ నౌక ఆంధ్ప్రదేశ్లోనీ విశాఖ పట్నంలో ప్రారంభించబడింది.
· 1000 టన్నుల ఉపగ్రహం మరియు బాలిస్టిక్ క్షిపణి ట్రాకింగ్ నౌకను హిందుస్థాన్ షిప్
యార్డ్ లిమిటెడ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవల్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)
మరియు నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (NTRO) సహకారం తో నిర్మించింది.
· INS ధృవ నౌక అణు క్షిపణి లను సుదీర్ఘ శ్రేణిలో
ట్రాక్ చేయగలదు. మరియు చైనా మరియు భారత్ నుండి ప్రయోగించిన క్షిపణుల
నుండి ముందస్తు హెచ్చరికలను అందిస్తుంది.
· ఈ క్షిపణి తో ఇలాంటి నౌకలు కలిగిన ఫ్రాన్స్ , యుఎస్ , యుకే మరియు రష్యా,చైనా ల జాబితాల కలిగింది.
5. భారతదేశం
మరియు ఆస్ట్రేలియా మొట్టమొదటి 2+2 మంత్రివర్గ సంభాషణ ను
ప్రారంభించింది.
· భారతదేశం
మరియు ఆస్ట్రేలియా మొట్టమొదటి “2+2 మంత్రివర్గ
సంభాషణ” ఈరోజు న్యూఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్ లో
జరిగింది .
· ఈ 2+2 మంత్రివర్గ సంభాషణ లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరియు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు ఆస్ట్రేలియా సహచరులు మారిస్ పేన్ మరియు పీటర్ దట్టన్ లు పాల్గొన్నారు.
6. వికారాబాద్
లో సెప్టెంబర్ 11 న మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ను ప్రారంభించారు.
· తెలంగాణలోని
వికారాబాద్ జిల్లాలో పౌర విమానయాన శాఖ మంత్రి “జ్యోతిరాదిత్యా
సిందియా” మరియు మంత్రి k.
తారక రామారావు గారు మరియు విద్యాశాఖ మంత్రి సబితా
ఇంద్రరెడ్డి గారు ప్రారంబించారు.
· రవాణా
సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు ఆకాశ మార్గంలో వేగంగా వాక్సిన్ లు మరియు మందులు రవాణా
చెయ్యడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం.
· ఈ
ప్రోజెక్ట్ విజయవంతం అయితే డ్రోన్లు ద్వారా మందులు రవాణా చేసిన మొదటి రాష్ట్రంగా
తెలంగాణ నిలుస్తుంది.
14 September
7. నేషనల్ “హిందీ దివాస్” ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న జరుపుకుంటున్నాం
· 1949
సెప్టెంబర్ 14 న హిందీ భాష ను భారతదేశపు
అధికార భాష లోఒకటిగా “దేవనాగరి”
లిపిలో హిందీ భాష చేర్చబడింది కావున ఆరోజున హిందీ దివాస్ జరుపుకుంటున్నాం.
· హిందీ
భాష ను భారతదేశపు అధికార భాషలలోకి చేర్చడానికి కృషి చేసిన బియోహర్ రాజేంద్ర సింహా
అతని 50 వ పుట్టినరోజున అనగా 14 సెప్టెంబర్
1959
నుండి ఈ హిందీ భాష దినోత్సవం ను
జరుపుకుంటున్నాం.
· భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 343 ప్రకారం దేవనగరి లిపిలో హిందీ భాష ను భారతదేశపు అధికార భాష లలోకి స్వీకరించబడింది.
8. “మిల్లెట్ మిషన్” ను ప్రారంభించిన ఛత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి “భూపేష్ భాఘెల్”
· మిల్లెట్
మిషన్ యొక్క ఉద్దేశం రైతులకు చిరు ధాన్యపు పంటలకు సరైన
ధరలను అందించటం మరియు మిల్లెట్ కోసం ఇన్పుట్ సహాయం ,సేకరణ
ఏర్పాట్లు,పంటల ప్రాసెసింగ్ రైతులకు సహాయపడటం మరియు నిపుణులు నైపుణ్యాన్ని రైతులకు
అందేలా చూడటం.
· ఈ మిషన్ ను అమలు చేయడానికి “ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ , హైదరాబాద్” మరియు రాష్ట్రంలోని 14 జిల్లా కలెక్టర్లతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
9. PM-KUSUM
కింద సౌర పంపుల ఏర్పాటులో హర్యానా రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది.
· కేంద్ర
కొత్త మరియు ఇంధన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం “PM
-KUSUM” (ప్రధాన్ మంత్రి
కిసాన్ ఉర్జా సురక్ష ఎవమ్ ఉత్తమ్ మహభియన్ ) కింద ఆఫ్ గ్రిడ్ సోలార్ పంప్ లను ఏర్పాటు చేయడం లో హర్యానా రాష్ట్రం భారత్
లోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
· 2020-21 సంవత్సరం కు హార్యానా ప్రభుత్వం మంజూరు
చేసిన 15,000 పంప్లకు గను 14,418 పంప్ లను ఏర్పాటు చేసింది .
· PM
KUSUM కింద PM మోడీ గారు భారత్ లో 20 లక్షల
పంప్లను ఏర్పాటు చేయడం లక్షం తో 2019 లో ప్రారంభించారు.
· ఈ
స్కీమ్ కింద రైతు 40 శాతం భరిస్తే కేంద్ర ప్రభుత్వo 60
శాతం రాయితీ ఇస్తుంది.
· హర్యానా ప్రభుత్వం మరియు కొన్ని ఇతర రాష్ట్రాలు మరికొంత రాయితీ కల్పిస్తూ రైతులకు కేవలం 25 శాతం కే సోలార్ పంప్ లను అందజేసింది.
10.అక్టోబర్ మరియు నవంబర్ లో జరిగే T20 వరల్డ్ కప్ టోర్నమెంట్ కు “M.S. ధోనీ” ని ప్రకటించింది.
· MS ధోనీ 15 ఆగస్టు 2020 నుండి అంతర్జాతీయ పరిమిత క్రికెట్ ఓవర్ల నుండి
రిటైర్మెంట్ ప్రకటించాడు.
· మా ధోనీ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తార్పున మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫీ మరియు మూడు ప్రధాన్ ఐసీసీ వరల్డ్ కప్ లు అవి ప్రపంచ T 20, ఛాంపియన్ ట్రోఫీ మరియు ప్రపంచ కప్ ను భారత కు అందించాడు.
11.
హైదరాబాద్ లోని ICRISAT
కు ఆఫ్రికా ఫుడ్ ప్రైజ్ 2021 లభించింది.
· హైదరాబాద్
కి చెందిన “ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఫర్ సెమీ అరిడ్
ట్రాపిక్స్(ICRISAT)”
కు ఆఫ్రికా ఫుడ్ ప్రైజ్ 2021 లభించింది.
· ఉప
సహారా ఆఫ్రికాలో ఆహార భద్రతను మెరుగు పరిచినందుకు మరియు 266 రకాల మెరుగైన పప్పు ధాన్యాలు మరియు అర మిలియన్ టన్నుల
విత్తనాలను అభివృద్ధి చేసింది.
· వీటిలో
ఆవుపాలు, బఠాణీలు ,సాధారణ బీన్,చిక్ పీ,వేరుశనగ,మరియు సోయాబీన్ ఉన్నాయి.
No comments:
Post a Comment