Lok Sabha speaker
లోక్ సభ స్పీకర్
పార్లమెంటులో, రాష్ట్ర అసెంబ్లీలో ఎగువ సభ దిగువ సభ అనే రెండు సభలు ఉంటాయి. ఈ సభ సమావేశాలు జరిగే సమయంలో ఈ సభ సమావేశాలు నిర్వహించడానికి ఒక వ్యక్తి అధ్యక్షత వహించడం తప్పనిసరి వీరినే మనం స్పీకర్ అంటాము.
లోక్ సభలో స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్,
రాజ్యసభలో చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ అనే పదవులు ఉంటాయి. వీరు ఆయా సభలకు
అధ్యక్షత వహించి సభా కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ఆర్టికల్ 93 స్పీకర్ పదవి గురించి తెలుపుతుంది. భారతదేశంలో మొదటిసారి 1921వ సంవత్సరంలో ఈ స్పీకర్ పదవిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమయంలో స్పీకర్ ను అధ్యక్షునిగా పిలిచేవారు. అధ్యక్షుడు అనే పదాన్ని స్పీకర్‌గా 1935 నుండి మార్చారు. స్వతంత్ర భారత మొట్టమొదటి లోక్ సభ స్పీకర్ G.V. మౌలంకార్
ప్రస్తుతం మన భారత లోక్ సభ 17 వ స్పీకర్ గ బారతీయ జనత పార్టీ తరపున ఓం బిర్ల గారు 19 జూన్ 2019 న నియమితులయ్యారు.
ప్రస్తుత లోక్ సభ స్పీకర్ ఓం బిర్ల గారు |
ఎన్నిక విధానం
లోక్ సభ ప్రారంభ సమావేశంలోనే లోక్‌సభ సభ్యులు
మెజారిటీ ప్రాతిపదికపై స్పీకర్ ను నేరుగా ఎన్నుకుంటారు. స్పీకర్ గా ఎన్నిక
కావడానికి లోక్‌సభలో సభ్యత్వం కలిగి ఉండాలి.
ప్రస్తుతం లోక్‌సభ
స్పీకర్ వేతనం 4,00,000 రూపాయలు.
స్పీకర్ అధికారాలు – విధులు
·
స్పీకర్ లోక్ సభ తరఫున ముఖ్య ప్రతినిధిగా ఉంటాడు. సభలో జరిగే చర్చలు, తీర్మానాలు,
ఓటింగ్ మొదలైన అంశాలను నియంత్రిస్తాడు.
·
స్పీకర్ లోక్‌సభకు అధ్యక్షత వహించి సభా కార్యక్రమాలను సజావుగా నిర్వహిస్తాను.
·
ఆర్టికల్ 122 ప్రకారం చట్టసభను నియంత్రించడంలో స్పీకర్ పాటించిన విధానాలను ఏ న్యాయస్థానంలోను
ప్రశ్నించకూడదు.
·
లోక్ సభ ఆమోదించిన బిల్లును రాజ్యసభకు పంపుతాడు.
రాజ్యసభ ఆమోదించి పంపిన బిల్లును ధ్రువీకరించి వాటిని రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు.
·
స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత తన పార్టీ రాజకీయాలకు అతీతంగా ఉంటాడు. తన
పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఏ పార్టీకి చెందని సభ్యులుగా వ్యవహరిస్తారు.
అధికార పక్షంను, ప్రతిపక్షంను సమానంగా చూసి సభా కార్యక్రమాలు సజావుగా నిర్వహిస్తాడు.
·
ఆర్టికల్ 100 ప్రకారం ఏదైనా
ఒక బిల్లు విషయంలో అనుకూల ఓట్లు, వ్యతిరేకమైన ఓట్లు సమానంగా వచ్చినప్పుడు నిర్ణయాత్మక ఓటు వినియోగిస్తాడు. సభా హక్కులను,
సభా గౌరవాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటారు.
·
సభలో గందరగోళం తలెత్తకుండా తన ఆదేశాల ద్వారా పరిస్థితిని మెరుగుపరుస్తాడు.
లోక్ సభలో ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినప్పుడు వారిని హెచ్చరించడం మితిమీరినపుడు
స్పీకర్ వాళ్లని బయటకి పంపించడం, లేదా బలవంతంగా అధికారుల చేత బయటకి పంపించడం చేస్తారు.
లోక్ సభ సమావేశాలు మొత్తం స్పీకర్ ఆదీనంలోనే ఉంటాయి.
·
స్పీకర్ కొన్ని పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్‌గా ఉంటాడు ఉదాహరణకి రూల్స్
కమిటీ, సభా వ్యవహారాల కమిటీ, జనరల్ పర్పస్ కమిటీ. కొన్ని
కమిటీలకు చైర్మన్‌లను నియమిస్తాడు.
·
సభ్యులకు సంబంధించిన వసతులు, సౌకర్యాలు మొదలైన అంశాలను నిర్వహణను పర్యవేక్షిస్తారు.
బిల్లులకు సంబంధించిన వివిధ అంశాలను నిశితంగా పరిశీలించడానికి కమిటీని ఏర్పాటు చేస్తాడు.
స్పీకర్ యొక్క ముఖ్యమైన అధికారాలు
·
అఖిలభారత స్పీకర్ ల సమావేశానికి అధ్యక్షత వహించడం.
·
ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్‌కి
హోదా రిత్యా అధ్యక్షునిగా ఉండటం.
·
లోక్‌సభ సంరక్షకుడిగా ఉండడం.
·
ద్రవ్య బిల్లులను దృవీకరిస్తాడు. స్పీకర్ ధ్రువీకరణ అంతిమం.
·
ఉభయ సభల మధ్య సాధారణ బిల్లు విషయంలో ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు
ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశానికి
అధ్యక్షత వహిస్తారు.
స్పీకర్ కాలపరిమితి
లోక్‌సభ స్పీకర్ పదవి కాలం 5 సంవత్సరాలు. కానీ నూతన స్పీకర్ ఎన్నిక అయ్యేంత వరకు పదవిలో కొనసాగుతారు. లోక్ సభ
రద్దుయిన తన కాలవ్యవధి పూర్తయినప్పటికీ స్పీకర్ పదవి రద్దు కాదు. కొత్త స్పీకర్ ఎన్నిక అయ్యేంత వరకు పదవిలోనే ఉంటారు.
స్పీకర్ ను తొలగించే పద్ధతి
ఆర్టికల్ 94 ప్రకారం లోక్‌సభయే
స్పీకర్ ను తొలగిస్తుంది. స్పీకర్ తన పదవిని దుర్వినియోగ పరిచిన, రాజ్యాంగ ఉల్లంఘన
అనే కారణాలు పైన తొలగించవచ్చు. లోక్ సభలో స్పీకర్ ను తొలగించే తీర్మానాన్ని
ప్రవేశపెట్టడానికి 14 రోజుల ముందస్తు నోటీసును స్పీకర్ కు అందచేయాలి.
సభలో హాజరై ఓటు వేసిన సభ్యులలో మెజారిటీ సభ్యులు
స్పీకర్ ను తొలగించాలని ఆమోదిస్తే స్పీకర్ తన పదవి నుండి తొలగించబడతారు. అయితే
స్పీకర్ ను తొలగించే తీర్మానం ఆ సభా పరిశీలనలో ఉన్నప్పుడు ఆ సభకు అధ్యక్షత వహించ
కూడదు కానీ ఆ సమావేశానికి హాజరు కావచ్చు. తన మీద వచ్చిన అభియోగాన్ని వ్యతిరేకించవచ్చు.
తీర్మానంపై సభ్యునిగానే ఓటు వేయవచ్చు. కానీ నిర్ణయాత్మక ఓటు ఉండదు.
రాజీనామా – స్పీకర్ రాజీనామా చేయాలి అనుకుంటే తన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్‌కు
సమర్పించవచ్చు.
స్పీకర్ స్థానం యొక్క ప్రాముఖ్యత
స్పీకర్ భారత అధికార హోదాలో ఏడవ స్థానాన్ని కలిగి
ఉండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా గౌరవం పొందుతారు.
స్పీకర్ గురించి G.V. మౌలంకర్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. స్పీకర్ స్థానం అసమానమైనది. దేశ పరిపాలన. విదేశాంగ విధానంలో ప్రత్యక్షంగా తన అధికారాన్ని వినియోగిస్తున్నట్లు
కనిపించకపోయినా పరోక్షంగా కొంత ప్రభావాన్ని రెండిటి మీద చూబుతారు.
పార్లమెంటరీ ప్రభుత్వంలో స్పీకర్ ముఖ్యమైన
స్థానాన్ని కలిగి ఉంటాడు. స్పీకర్ లోక్ సభకు ఒక స్వరంగా వ్యవహరిస్తారు. లోక్ సభలో స్పీకర్ మొదటి సభ్యుడు. జవహర్లాల్
నెహ్రూ మాటల్లో స్పీకర్ లోక్ సభకి ప్రతినిధి, జాతి స్వేచ్ఛకు
చిహ్నం, ఆయన గౌరవ ప్రతిపత్తి గొప్పది.
అందువల్ల విశేష సామర్థ్యం, నిష్పాక్షికత, ముందుచూపు ఉన్న వ్యక్తులు స్పీకర్ పదవిలో
ఉంటే స్పీకర్ కి ఉన్న హోదా గౌరవం మరింత పెరుగుతాయి తాను తన పనిని సమర్థవంతంగా
క్రియాశీలకంగా నిర్వహించగలరు.
డిప్యూటీ స్పీకర్
ఆర్టికల్ 93 డిప్యూటీ
స్పీకర్ పదవి గురించి తెలుపుతుంది. డిప్యూటీ స్పీకర్‌ను కూడా ప్రత్యక్షంగా
మెజారిటీ ప్రతిపాదికన లోక్‌సభ సభ్యులే ఎన్నుకుంటారు. అయితే పార్లమెంటరీ
సంప్రదాయాల ప్రకారం లోక్‌సభలో అత్యధిక స్థానాలు సాధించిన ప్రతిపక్ష పార్టికి
ఏకగ్రీవంగా ఆ పదవిని ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. స్వాతంత్య్రానంతరం మొదటి
డిప్యూటీ స్పీకర్ గా అనంతశయనం అయ్యంగార్ ఉన్నారు.
డిప్యూటీ స్పీకర్ విధులు
స్పీకర్ పదవి కాళీ అయినప్పుడు లేదా స్పీకర్ తన
విధులను నిర్వర్తించే లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహించి
సభా కార్యక్రమాలను నిర్వహిస్తారు. పార్లమెంటరీ కమిటీలలో డిప్యూటీ స్పీకర్ సభ్యుడు
అయితే ఆ కమిటీలకు డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు.
తొలగింపు- ఆర్టికల్ 94 ప్రకారం
లోక్ సభ లో సాధారణ మెజారిటీ ద్వారా డిప్యూటీ స్పీకర్ ను తొలగించవచ్చు.
రాజీనామా- డిప్యూటీ స్పీకర్ తన పదవికి రాజీనామా చేయాలి అనుకుంటే
తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు అందజేయాలి.
ALSO READ:- Parliament of India Lok sabha in Telugu
No comments:
Post a Comment