fundamental rights by the Indian constitution
ప్రాథమిక హక్కులు
article 12 to 35
·
భారత
రాజ్యాంగంలో మూడవ భాగంలో 12 నుండి 35వ ప్రకరణ వరకు ప్రాథమిక హక్కులను పొందుపరిచారు.
·
ఇవి
భారత రాజ్యాంగం లో అత్యంత ముఖ్యమైన లక్షణం అని అంటారు వీటిని అమెరికా సంయుక్త
రాష్ట్రాల నుండి గ్రహించారు.
·
1922లో
మహాత్మాగాంధీ ప్రజల హక్కుల గురించి యంగ్ ఇండియా లో ప్రస్తావించడం జరిగింది.
·
1931లో
రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీ భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను
చేర్చాలని కోరారు.
హక్కులు మరియు ప్రపంచ రాజ్యాంగాలు
మాగ్న కార్టా (1215)
·
ఇంగ్లాండ్
రాజు జాన్
ఎడ్వర్డ్ మొట్టమొదటిసారిగా ప్రజలకు కొన్ని
హక్కులను గుర్తిస్తూ ఒక ప్రమాణ పూర్వకమైన ప్రకటన చేశాడు అదే మాగ్నాకార్టా.
బిల్
ఆఫ్ రైట్స్(1689)
·
ఇంగ్లాండ్
పార్లమెంట్ ఒక చట్టం ద్వారా మొట్టమొదటిసారిగా హక్కులను గుర్తించింది. నిరపేక్ష
రాజరికం పై కొన్ని పరిమితులు విధించారు ఈ ప్రకటన అనేక దేశాల్లో హక్కుల ప్రకటనకి ప్రేరణగా
నిలిచింది.
బిల్
ఆఫ్ రైట్స్-1789
·
అమెరికా
రాజ్యాంగం లో హక్కుల ప్రస్తావన లేదు. సుమారు పది రాజ్యాంగ సవరణలు ప్రతిపాదించి ఈ బిల్ ఆఫ్
రైట్స్ ను రాజ్యాంగంలో చేర్చారు.
·
జేమ్స్ మాడిసన్ అమెరికా
రాజ్యాంగ పితామహుడు మరియు బిల్ ఆఫ్ రైట్స్ రూపకర్త.
·
1948
డిసెంబర్ 10 న
ఐక్యరాజ్యసమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన
భారత రాజ్యాంగంలో హక్కులకు స్ఫూర్తి.
ప్రకరణ 12
·
ఈప్రకరన
రాజ్యం అనే పదం యొక్క నిర్వచనం
సూచిస్తుంది .
·
రాజ్యం
పరిధిలోకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు శాసనసభలు, స్థానిక ప్రభుత్వాలు,
ప్రభుత్వ ఆదేశాల ద్వారా ఏర్పాటైన ఎల్ఐసి, NTPC మొదలైనవి.
ప్రకరణ 13
·
ప్రకరణ 13(1)
ప్రకారం అంత వరకు అమలులో ఉన్న చట్టాలు
ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే అలాంటి చట్టాలు చెల్లకుండా పోతాయి.
·
ప్రకరణ
13(2)
ప్రకారం ప్రాథమిక హక్కులను హరించే లేదా
పరిమితం చేసే చట్టాలు చెల్లవు.
సమానత్వపు హక్కులు ప్రకరణ 14-18
·
ప్రకరణ
14 ప్రకారం చట్టం
ముందు అందరూ సమానులే చట్టం మూలంగా అందరికి సమాన రక్షణ కల్పిస్తుంది.
·
సమన్యాయ
పాలన అనే భావాన్ని ఏవీ
డైసీ అనే రాజ్యాంగ నిపుణుడు ప్రతిపాదించారు PM నుండి సామాన్య ఉద్యోగి వరకు వారు
చేసిన తప్పులకు చట్టపరంగా సమాన బాధ్యత వహించాల్సి ఉండును.
·
ఆర్టికల్
14 లో పేర్కొన్నట్లుగా
ఈ సూత్రం
రాష్ట్రపతి మరియు గవర్నర్లకు వర్తించదు వారు ఈ సూత్రానికి మినహాయింపు గా ఉంటారు.
విశాఖ v/s స్టేట్ ఆఫ్ రాజస్థాన్(1997)
·
పనిచేసే ప్రదేశాలలో మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక
వేధింపులు గానీ,
అనుచిత ప్రవర్తన జరుగుతుంది. చట్టం
ముందు అందరూ సమానులే అని దానికి వ్యతిరేకం కాబట్టి మహిళల పట్ల పనిప్రదేశాల్లో
లైంగిక వేధింపులు నివారించడానికి సమగ్ర మార్గదర్శకాలను సుప్రీంకోర్టు జారీ చేసింది.
ప్రకరణ 15 ప్రకారం కుల, మత ,జాతి ,లింగ ,పుట్టుక అనే ఐదు రకాల వివక్షతలను పాటించరాదు.
·
ప్రకరణ
15(1) - ప్రకారం రాజ్యం పౌరులకి కుల, మత, జాతి, లింగ మరియు పుట్టిన ప్రాతిపదికన వివక్షత చూపించరాదు.
·
ప్రకరణ 15(2) - ప్రకారం ప్రజా ప్రయోజన కరమైన
ప్రదేశాల్లో అందరికీ సమాన ప్రవేశం ఉండాలి eg. బావులు, చెరువులు, రోడ్లు వినోద
ప్రదేశాల్లో అందరికీ సమాన అవకాశాలు ఉండాలి.
·
15(4) ని 1 వ
రాజ్యాంగ సవరణ లో చేర్చారు.
·
ప్రకరణ
15(3)
ప్రకారం మహిళలకు ,బాలలకు
ప్రత్యేక మినహాయింపులు సౌకర్యాలు కల్పించవచ్చు.
·
ప్రకరణ
15(4) ప్రకారం సామాజిక పరంగా, విద్యా పరంగా వెనుకబడిన
వర్గాల అభివృద్ధి కొరకు ప్రత్యేక సౌకర్యాలు మినహాయింపులు ఇవ్వొచ్చు.
·
ప్రకరణ 15(5) ప్రకారం ప్రైవేట్ మరియు ప్రభుత్వ
సహాయం పొందిన విద్యాసంస్థలో అన్నింటిలో సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు
ప్రత్యేక సదుపాయాలు ఇవ్వవచ్చు.
చంపకం దొరై రాజన్ v/s వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్(1951)
·
ఇందులో
మత ప్రాతిపదికపై విద్యాసంస్థలలో రిజర్వేషన్లు చెల్లవని సుప్రీం కోర్టు తీర్పు
చెప్పింది
·
మద్రాసు
ప్రభుత్వం కళాశాలలో ప్రవేశానికి కులం
మరియు మత ప్రాతిపదికపై సీట్లు కేటాయించడం జరిగింది అయితే దీనిని ప్రశ్నిస్తూ
విద్యార్థిని సుప్రీంకోర్టులో
సవాల్ చేశారు.
ఎం.ఆర్. బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్(1963)
·
ప్రకరణ
15(4) ప్రకారం వెనుకబాటుతనం
అనేది కేవలం కులం బట్టి కాకుండా విద్యాపరంగా, సామాజిక ప్రాతిపదికపై కూడా ఉండాలని మరియు ఒక
తరగతి ప్రజలు వెనుకబడిన లేదా అనే అంశాన్ని పేదరికం నివాసం ఇతర అంశాలను కూడా
పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది.
ప్రకరణ 16- ప్రభుత్వ ఉద్యోగాలలో వివక్షతలు
రద్దు
·
ప్రకరణ
16(1) -ప్రభుత్వ ఉద్యోగాలలో పౌరులందరికీ
సమాన అవకాశాలు.
·
ప్రకరణ 16(2)- ప్రభుత్వ ఉద్యోగాలలో పౌరులను కుల,
మత ,జాతి,
లింగ ,పుట్టుక
,వారసత్వ మరియు స్థిర నివాస అనే వివక్షత చూపించరాదు.
మినహాయింపులు
·
ప్రకరణ
16 (3)- ప్రభుత్వ ఉద్యోగాలలో షెడ్యూల్డ్
తెగలకు ,షెడ్యూల్డ్
కులాలకు మరియు ఇతర వెనుకబడిన తరగతులకు ప్రభుత్వ నియామకాల్లో ప్రత్యేక మినహాయింపు
సదుపాయాలు ఇవ్వవచ్చు.
·
ప్రకరణ 16(4)-ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రమోషన్లలో
షెడ్యూల్డ్ కులాలకు, తెగలకు ప్రత్యేక
రిజర్వేషన్లు కల్పించవచ్చు .
·
ప్రకరణ
16 (5) -ప్రభుత్వంలో ఏదైనా ఒక శాఖలో పూర్తిగా
ఒక మత విశ్వాసానికి సంబంధించిన విషయం అయినప్పుడు ఆ శాఖలో కేవలం ఆ మత
విశ్వాసాలకు చెందిన వారిని మాత్రమే నియమించే విధంగా తగిన చట్టాలు రూపొందించుకోవచ్చు eg. దేవాలయ ధర్మాదాయ శాఖలో పని చేయడానికి
అర్హులుగా హిందువులను మాత్రమే
పరిగణిస్తారు.
ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా( దీనినే మండల్ కేస్ అంటారు)1993
·
వెనుకబడిన
తరగతులకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగబద్ధమే.
·
కొన్ని ప్రత్యేక పరిస్థితులలో తప్ప మిగితా అన్ని
రకాల రిజర్వేషన్లు కలిపి 50 శాతంకు మించరాదు.
·
వెనుకబడిన తరగతులలో క్రిమిలేయర్ (మెరుగైన వర్గాల వారు) వారిని గుర్తించి వారిని
రిజర్వేషన్లకు అనర్హులుగా పరిగణించాలి.
ప్రకరణ 17
·
ఈ
ప్రకరణ అనుసరించే అస్పృశ్యత అనే సాంఘిక దురాచారం నిషేధించడం జరిగింది. Untouchability
నీ ఏ
రూపంలో పాటించిన చట్టం ప్రకారం శిక్షించ బడతారు.
ప్రకరణ(18)
·
18(1)సైనిక మరియు విద్యాపరమైన గుర్తింపు
మినహా మిగితా అన్ని రకాల బిరుదులు రద్దు
·
18(2)- భారత పౌరులు విదేశీ బిరుదులను స్వీకరించరాదు.
·
18(3)- భారత పౌరులు కానప్పటికీ భారత ప్రభుత్వంలో లాభదాయక పదవిలో ఉన్నప్పుడు
రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశాల నుండి ఎలాంటి బిరుదులను స్వీకరించారు
·
ఉదాహరణకి
బ్రిటీష్ పాలనాకాలంలో
సమాజంలో వ్యక్తులు కొందరు రాజా బహదూర్,రాజా విక్రమార్క, జమిందార్ వంటి బిరుదులు
రద్దు చేశారు.
బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్
ఇండియా(1996)
·
భారత్ బిరుదులు అయినా భారతరత్న,
పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వంటి పురస్కారాలు బిరుదులు కావు.
·
కావున
వీటిని పేరుకు ముందు కానీ తర్వాత గానీ
వ్యాపార కార్యక్రమాలకు వినియోగించడం చేయరాదని
సుప్రీంకోర్టు అభిప్రాయం తెలియ చేసింది.
·
మోహన్ బాబు,
బ్రహ్మానందం తమ పద్మశ్రీ బిరుదు లను ఉపయోగించుకున్నారని వ్యతిరేకత మొదలైంది.
ప్రకరణం 19
· 19(a)- వాక్ స్వతంత్రం, భావవ్యక్తీకరణ, అభిప్రాయ ప్రకటన
·
19(b)-
శాంతియుతంగా సమావేశాలు నిర్వహించుకోవడం.
·
19(c)- సంఘాలను సంస్థలను ఏర్పాటు చేసుకోవడం మరియు నిర్వహించుకోవడం.
·
19(d) దేశవ్యాప్త సంచార స్వేచ్ఛ
·
19(e)దేశవ్యాప్త స్థిరనివాస స్వేచ్చ.
·
19(f)-ఆస్తిని సంపాదించే స్వేచ్ఛ. దీనిని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు .
·
19(g)-వృత్తి వ్యాపార స్వేచ్ఛ.
ఇవే కాక క్రింద స్వేచ్ఛను కూడా భావ వ్యక్తీకరణలో అంతర్భాగం అవి
·
పత్రికా
స్వేచ్ఛ, వాణిజ్య ప్రకటన స్వేచ్చ, సమాచార
స్వేచ్ఛ ,మౌనాన్ని
పాటించే స్వేచ్ఛ, రహస్యాలను కాపాడుకునే స్వేచ్ఛ.
· ప్రకరణ 20(1)- ప్రకారం ఏ వ్యక్తిని కూడా తప్పు చేయనిదే శిక్షించ రాదు. చట్టరీత్యా నేరం అయితేనే శిక్షించాలి. ఆ నేరానికి చట్టపరంగా ఎంత శిక్ష విధించాలో అంతకంటే ఎక్కువ శిక్ష విదించరాదు.
·
20(2)- ఏ వ్యక్తిని ఒకే నేరానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు విచారించి శిక్ష
విధించరాదు.
·
20(3)- ఏ వ్యక్తిని తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని నిర్బంధం చేయరాదు.
విద్యా హక్కు చట్టం ( ప్రకరణ 21-a)
·
విద్యాహక్కును
2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21-a లో చేర్చడం జరిగింది .
·
6-14 సంవత్సరాల బాలలకు ఉచిత నిర్బంధ
ప్రాథమిక విద్యను అందించాలని దీనిలో పేర్కొనడం జరిగింది.
ఈ విద్యా హక్కు చట్టంలోని ముఖ్యాంశాలు
·
ఒకటి
నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వారు నివసిస్తున్న ప్రదేశానికి ఒక
కిలోమీటర్ పరిధిలో పాఠశాల ఉండాలి.
·
ప్రైవేటు పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్యలో 25
శాతం బలహీన వర్గాలకు కేటాయించాలి
·
ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1: 30 గా ఉండాలి
·
చట్టం అమలు చేసేందుకు అయ్యే ఖర్చు కేంద్ర మరియు
రాష్ట్ర ప్రభుత్వాలు 65: 35 నిష్పత్తిలో భరించాలి.
ప్రకరణ-22 అక్రమ నిర్బంధం నుండి రక్షణ
·
22(a)
- ఈ ఆర్టికల్ ప్రకారం
అరెస్టుకు కారణం ఉండాలి లేదా కారణాన్ని తెలియజేయాలి మరియు న్యాయవాదిని సంప్రదించి
కునే అవకాశం ఇవ్వాలి.
·
22(b) అరెస్టు చేసిన సమయం నుండి నిందితుడిని 24 గంటల లోపు న్యాయస్థానంలో
హాజరు పరచాలి (ప్రయాణ
సమయాన్ని మినహాయించాలి)
ప్రకరణ 23,24 పీడన నిరోధించే హక్కులు
·
23 వ
article ప్రకారం మానవులతో
బలవంతంగా వెట్టిచాకిరి ,బానిస
వ్యాపారం నిషేధం.
·
ఈ ఆర్టికల్ లో బెగర్ అనే పదాన్ని ప్రయోగించారు.
·
బేగార్
అంటే వెట్టిచాకిరి.
·
బెగార్ అంటే ఉత్తర భారతదేశంలో దీనిని హాలి అంటారు.
ఆర్టికల్ 24 ప్రకారం బాల కార్మిక వ్యవస్థ రద్దు
·
దీని ప్రకారం 14 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న
పిల్లలను ప్రమాదకరమైన పనుల్లో ఉపయోగించరాదు,ఇలా చేస్తే చట్ట ప్రకారం శిక్షకు
గురి అవుతారు.
ఆర్టికల్ 25 to 28 మతస్వాతంత్రపు హక్కు లు
·
ఆర్టికల్
25 -1 ప్రకారం ప్రతి
వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని అవలంబించి ఆచరించవచ్చు.మరియు ప్రచారం చేసుకోవచ్చు.
·
25-2 ప్రకారం ఈ స్వేచ్ఛ ప్రజాశాంతికి నైతికతకు భంగం
కలిగించరాదు అలాంటి సమయంలో ప్రభుత్వం కొన్ని పరిమితులను విధించవచ్చు .
·
ఆర్టికల్26- ప్రకారం ప్రజాశాంతి నైతికతకు భంగం కలిగించకుండా
వ్యక్తులు తమ మత సంస్థలను ఏర్పాటు చేసుకుని నిర్వహించుకోవచ్చు.
·
మరియు స్థిర, చరాస్తులు సంపాదించుకోవచ్చు అయితే అమలులో ఉన్న చట్టాలకు లోబడి వుండాలి.
·
ఆర్టికల్ 27 ప్రకారం మత వ్యాప్తి కొరకు
మత పోషణకి పన్నులను వసూలు చేయడానికి మత ప్రాతిపదికపై ప్రజలపై పన్నులు విధించి
వసూలు చేయరాదు.
·
ఆర్టికల్
28-ప్రకారం
విద్యాలయాల్లో మత బోధన నిషేధం.
ప్రకరణ 29-30 విద్యా సాంస్కృతిక పరమైన హక్కులు
·
ఆర్టికల్
29-1
ప్రకారం భారత దేశంలో నివసిస్తున్న ప్రజలు ప్రత్యేక భాష , culture కలిగి ఉంటే వారిని పరిరక్షించుకోవచ్చు.
·
ఆర్టికల్ 29-2ప్రకారం ప్రభుత్వం నిర్వహిస్తున్న
మరియు ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుతున్న సంస్థలలో ప్రవేశానికి కులం, మతం, జాతి ,భాష ప్రాతిపదికపై వివక్షత చూపించరాదు.
·
ఆర్టికల్30 ప్రకారం మైనారిటీ వర్గాల వారు
ప్రత్యేక విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకునీ నిర్వహించుకోవచ్చు.
ఆర్టికల్ 32 వ రాజ్యాంగ పరిహార హక్కు
·
ప్రాథమిక హక్కులకు ఈ ఆర్టికల్ పరిరక్షణ ఇస్తుందని బి.ఆర్ అంబేద్కర్
అన్నాడు.
·
ఈ
హక్కును అంబేద్కర్ రాజ్యాంగ ఆత్మగా, హృదయం
గా అభివర్ణించాడు.
·
ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు
లేదా అవి అమలు కానప్పుడు ఆ వ్యక్తి నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించి పరిహారం పొందవచ్చు.
·
ఈ ఆర్టికల్ లో నే భాగంగా హక్కులను కాపాడడానికి
ప్రత్యేక ఆదేశాలు మాండమస్, హేబియస్ కార్పస్, షేర్షియోరరి, ప్రోహిబిషన్ మొదలైన
రీట్లను సుప్రీంకోర్టు
జారీ చేస్తుంది.
·
రిట్లు
జారీ చేసే పద్ధతిని బ్రిటిష్ రాజ్యాంగం నుండి గ్రహించారు నిబంధన 32 ప్రకారం
సుప్రీంకోర్టుకు నిబంధన 226 ప్రకారం రాష్ట్ర హైకోర్టులకు కల్పించారు.
·
పార్లమెంట్
ప్రత్యేక చట్టం ద్వారా ఈ అధికారాన్ని జిల్లా న్యాయ స్థానాలకు కూడా కల్పించవచ్చు
కానీ ఇంతవరకు పార్లమెంటు అలాంటి చట్టాలను రూపొందించే లేదు. కనుక సుప్రీం కోర్టు,
హైకోర్టుకు మాత్రమే రిట్లు జారీ చేసే అధికారం కలదు.
·
ప్రాధమిక
హక్కుల పరిరక్షణలో సుప్రీంకోర్టుకు ప్రత్యేక, ప్రధాన ప్రాథమిక విచారణ పరిధి
ఉంటుంది అందుకే సుప్రీంకోర్టును ప్రాథమిక హక్కుల
పరిరక్షణ కర్త అని అంటారు.
ఆర్టికల్33- ప్రకారం ప్రాథమిక హక్కులు ఈ క్రింది
వర్గాల ప్రజలకు కొన్ని పరిమితులను పార్లమెంటు చట్టం ద్వారానే విధించవచ్చు.
·
వారు
సైనిక దళాలు, పారామిలటరీ దళాలు ,పోలీసులు
,రక్షణ పరమైన
విధులను నిర్వహించే సంస్థలు.
ఆర్టికల్ 34 (మార్షల్ లా) సైనిక శాసనం
·
అంటే
ఒక ప్రాంతంలో సైనికులకు అధికారాలను విస్తృతంగా ఉంటాయి ఆ ప్రాంతంలో సైనికులు
తీసుకున్న ఏలాంటి చర్యలు అయిన వారిని బాధ్యులను చేయరాదు.
·
ఈ ఆర్టికల్ అనేది శాంతిభద్రతల నిర్వహణలో
పరిపాలనా యంత్రాంగం వైఫల్యం చెందినప్పుడు సాధారణ పరిస్థితులు ఆ ప్రాంతంలో
నడపడానికి పూర్తి అధికారాలు ఇవ్వడం.
·
మార్షల్ లా అమలు లో ఉన్న రాష్ట్రాలు రెండు
జమ్మూకాశ్మీర్ ,
మణిపూర్ మణిపూర్లో
వీటిని రద్దు చేయాలని 17 సంవత్సరాలుగా దీక్ష చేసి 2016 ఆగస్టు 9న దీక్ష విరమించిన మహిళ- ఇనోమిచా ఎ షర్మిల.
ఆర్టికల్ 35
·
కొన్ని
ప్రాథమిక హక్కులు ప్రత్యేకంగా అమలు చేయాలంటే వాటి అమలు కోసం పార్లమెంట్
ప్రత్యేకంగా చట్టం చేయాలి.
also read:- CITIZENSHIP-పౌరసత్వం ARTICLE 5 TO ARTICLE 11
also read :- ARTICLE 1 - ARTICLE 4-భారత భూభాగం - భారత యూనియన్
No comments:
Post a Comment