RAJYA SABHA
రాజ్యసభ
·
రాజ్యసభని ఎగువ సభ అని అంటారు. ఎగువ సభకి రాజ్య సభ అని పేరు పెట్టింది మాత్రం సర్వేపల్లి రాధాకృష్ణన్.
ఈ రాజ్యసభని రాష్ట్రాల సభ/నిరంతర సభ/శాశ్వత సభ/కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనే పేర్లతో పిలుస్తారు.
రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
·
ఆర్థికల్ 80 రాజ్యసభ నిర్మాణం గురించి తెలుపుతుంది రాజ్యసభలో గరిష్టంగా 250
మంది సభ్యులు ఉంటారు.
·
ప్రస్తుతం రాజ్యసభ సభ్యుల సంఖ్య 245 ఇందులో 225 మంది సభ్యులు వివిధ రాష్ట్రాల నుండి
పరోక్షంగా ఎన్నికవుతారు. 8 మంది సభ్యులు కేంద్ర పాలిత ప్రాంతాల(ఢిల్లీ-3, పాండిచ్చేరి-1, జమ్మూ అండ్ కాశ్మీర్-4) నుండి
ఎన్నికవుతారు. ప్రస్తుతం తెలంగాణలో 7 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి.
·
మిగిలిన 12 మందిని రాష్ట్రపతి వివిధ రంగాలలో (కళలు,
సాహిత్యం, సామాజిక సేవ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో) నిష్ణాతులైన వారిని నామినేట్ చేస్తారు.
·
రాజ్యసభ సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు. ప్రతీ 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు మంది సభ్యులు పదవీ విరమణ చేసి వారి
స్థానంలో కొత్త వారు ఎన్నిక అవుతారు. రాజ్యసభ సభ్యుల సంఖ్య రాష్ట్ర జనాభాపై
ఆధారపడి ఉంటుంది.
రాజ్యసభ సభ్యునిగా పోటీ చేయడానికి కావలసిన అర్హతలు (ఆర్టికల్ 80)
·
భారతీయ పౌరుడై ఉండాలి.
·
30 సంవత్సరాలు నిండి ఉండాలి.
·
పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలు కూడా కలిగి ఉండాలి.
·
దేశంలో ఎక్కడైనా ఓటరుగా ఉండాలి.
·
రాజ్యసభ సభ్యునిగా పోటీ చేయడానికి జనరల్ అభ్యర్థి 25000 రూపాయలు, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థి 12,500 రూపాయలు డిపాజిట్
చేయాలి. ఈ డిపాజిట్ తిరిగి పొందాలంటే 1/6 వంతు ఓట్లు రావాలి.
రాజ్యసభ చైర్మన్(ఉప రాష్ట్రపతి)
·
ఆర్టికల్ 89 ప్రకారం రాజ్యసభకు హోదా రిత్యా
ఉపరాష్ట్రపతి చైర్మన్ గా వ్యవహరిస్తారు.
ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు ఉన్నారు. రాజ్యసభ చైర్మన్ రాజ్యసభకు
సభ్యులు కాదు కానీ బిల్లుల విషయంలో నిర్ణయాత్మక ఓటును వినియోగించుకోవచ్చు.
ప్రస్తుత ఉపరాస్ట్రపతి మరియు రాజ్యసభ చైర్మన్ ఎం .వెంకయ్య నాయుడు |
·
ఉపరాష్ట్రపతి రాజ్య సభకు అధ్యక్షత వహించి సభా కార్యక్రమాలను నిర్వహిస్తారు.
రాజ్యసభ చైర్మన్ (ఉపరాష్ట్రపతి)ను తొలగించే తీర్మానం సభా పరిశీలనలో ఉన్నప్పుడు రాజ్య
సభకు అధ్యక్షత వహించరాదు. అయితే సభా కార్యక్రమాల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి తన
వాదనను వినిపించవచ్చు.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
·
ఆర్టికల్ 89 రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి గురించి తెలుపుతుంది.
రాజ్యసభ సభ్యులు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ను ఎన్నుకుంటారు. ఈ
రాజ్యసభ సభ్యులే ఒక తీర్మానం ద్వారా రాజ్య సభా డిప్యూటీ చైర్మన్ ను తొలగించగలరు.
·
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి కాలం 6 సంవత్సరాలు. డిప్యూటీ చైర్మన్
గా ఎన్నిక కావడానికి రాజ్యసభలో సభ్యత్వం కల్గి ఉండాలి.
·
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రాజీనామా చేయాలనుకుంటే తన రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్(ఉప రాష్ట్రపతి)కి
ఇస్తాడు. ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరి వంశ్ నారాయణ్ సింగ్.
·
రాజ్యసభ చైర్మన్ పదవి ఖాళీ అయినపుడు మరియు ఉప రాష్ట్రపతి రాష్ట్రపతిగా
వ్యవహరించినప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సభకి అధ్యక్షత వహించి సభా
కార్యక్రమాలను నిర్వహిస్తారు.
·
ఆర్టికల్ 98 ప్రకారం పార్లమెంటులో లోక్‌సభ, రాజ్యసభలో ప్రత్యేక సచివాలయ సిబ్బంది ఉంటారు. లోక్ సభ కార్యదర్శిని లోక్‌సభ
సెక్రటరీ జనరల్ అని రాజ్యసభ కార్యదర్శిని రాజ్యసభ సెక్రటరీ జనరల్ అని అంటారు.
ప్యానల్ స్పీకర్/ ప్యానల్ చైర్మన్
లోక్‌సభలో రాజ్యసభలో సభాధ్యక్షులు ఉపాధ్యక్షులు(స్పీకర్,డిప్యూటీ స్పీకర్) సభా కార్యక్రమాలకు హాజరు కానప్పుడు
ప్యానెల్ స్పీకర్ సభా కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీరిని సభాధ్యక్షులు నియమిస్తారు.
గరిష్టంగా 10 మంది వరకు ప్యానల్ స్పీకర్లగా నియమించవచ్చు.
అయితే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవి ఒకే సమయంలో ఖాళీ ఏర్పడినప్పుడు ప్యానల్
స్పీకర్ సభకు అధ్యక్షత వహించినకూడదు. ఆ సందర్భంలో రాష్ట్రపతి నియమించిన వ్యక్తి
స్పీకర్ గా వ్యవహరిస్తారు.
ప్రొటెం స్పీకర్/ తాత్కాలిక స్పీకర్
నూతన లోక్ సభ ఏర్పాటయినప్పుడు రాష్ట్రపతి సభ్యుల
చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి తాత్కాలిక స్పీకర్ ను నియమిస్తాడు. సాధారణంగా
తాత్కాలిక స్పీకర్‌గా లోక్‌సభలోని సీనియర్ సభ్యుడిని నియమించడం ఆనవాయితీ. లోక్ సభ
సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సభకు అధ్యక్షత వహించి నూతన స్పీకర్ ను
ఎన్నుకునే ప్రక్రియ నిర్వహిస్తారు. నూతన స్పీకర్ ఎన్నికైన వెంటనే ప్రొటెం స్పీకర్
పదవి రద్దవుతుంది.
పార్లమెంట్ సభ్యుల సమావేశాలు
·
ఆర్టికల్ 85 ప్రకారం సంవత్సరానికి రెండు సార్లు పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు కావాలి.
అయితే రెండు సమావేశాల మధ్య ఆరు నెలలకు మించకూడదు. అవసరమైనప్పుడు
మరియు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో, అత్యవసర పరిస్థితులలో మరికొన్ని సమావేశాలు నిర్వహించుకోవచ్చు.
·
ప్రస్తుతం పార్లమెంటు
ఆనవాయితీగా మూడుసార్లు సమావేశాన్ని జరుపుతారు. సమావేశాల పైన గరిష్ట కాల పరిమితి
అనేది లేదు.
·
ప్రతి
సమావేశాన్ని ఎన్ని రోజులు నిర్వహిస్తారు అనే అంశంపై స్పష్టమైన సంఖ్య లేదు. కానీ ఒక
ఆర్థిక సంవత్సరంలో జరిపే మూడు సమావేశాలకు కలిపి 90 నుండి 110 రోజులు వరకు
సమావేశాలు నిర్వహించుకోవచ్చు.
·
ప్రస్తుతం
బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి నుండి ఏప్రిల్ మాసంలో, వర్షాకాల
సమావేశాలను జూలై నుండి ఆగస్టు మాసాల్లో, శీతాకాల సమావేశాలను నవంబర్ నుండి డిసెంబర్
మాసాలలో నిర్వహిస్తారు.
·
పార్లమెంట్
సభ్యులు పదవి ప్రమాణ స్వీకారం చేయకుండా సభా కార్యక్రమాల్లో పాల్గొంటే పాల్గొన్న
ప్రతి రోజుకి 500 రూపాయల అపరాధ రుసుము చెల్లించవలసి వస్తుంది.
పార్లమెంటు సభ్యుల రాజీనామా (ఆర్టికల్ 101(3)(b))
పార్లమెంట్ సభ్యులు తన రాజీనామా పత్రాన్ని
సంబంధిత సభాధ్యక్షులను సంబోధిస్తూ పంపాలి. పార్లమెంట్ సభ్యులు స్వచ్ఛందంగా
రాజీనామా చేసినప్పుడు దానిని ధృవీకరించుకున్న తర్వాత మాత్రమే సభాధ్యక్షుడు
రాజీనామాను ఆమోదిస్తారు. ఈ అంశాన్ని 1974వ సంవత్సరం లో చేసిన 33 వ రాజ్యాంగ
సవరణ ద్వారా చేర్చారు.
పార్లమెంటు సభ్యుల అనర్హతలు
ఆర్టికల్ 102(1) పార్లమెంట్
సభ్యుల అనర్హతలకు సంబంధించిన అంశాలను పేర్కొంటుంది. ఈ ఆర్టికల్ ప్రకారం ఈ క్రింది
ప్రాతిపదికన పైన పార్లమెంట్ సభ్యుల సభ్యత్వం రద్దు అవుతుంది.
·
భారత పౌరసత్వాన్ని కోల్పోయినప్పుడు.
·
ఎన్నికల్లో అక్రమాలు జరిగినప్పుడు.
·
పదవీ దుర్వినియోగ పరచిన్నప్పుడు.
·
ఎన్నికల ఖర్చుల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి నిర్ణీత గడువులోగా సమర్పించనప్పుడు.
·
దివాలా తీసినప్పుడు.
·
మానసికంగా దృఢంగా లేడని కోర్ట్ ధ్రువీకరించినప్పుడు.
·
లాభదాయక పదవిలో కొనసాగినప్పుడు.
·
వరకట్నం, అస్పృశ్యత, సతీ సహగమనం చట్టాల కింద అరెస్టు అయినప్పుడు తన
సభ్యత్వం కోల్పోతారు.
·
పార్టీ
ఫిరాయింపు చట్టప్రకారం పార్టీ ఫిరాయించిన, పార్టీ విప్ కు వ్యతిరేకంగా ఓటు వేసినప్పుడు,
పార్టీకి రాజీనామా చేసిన అతను సభ్యత్వం రద్దు అవుతుంది.
·
పార్టీ
ఫిరాయింపుల చట్టం మినహాయించి కేంద్ర ఎన్నికల సంఘం సలహా మేరకే రాష్ట్రపతి
పార్లమెంటు సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయడం జరుగుతుంది.
·
అయితే
పార్లమెంట్ సభ్యుల అర్హత, అనర్హతకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ట్రపతికి
వుంటుంది. పార్లమెంట్ సభ్యులు అనర్హతకు సంబంధించిన అంశాలు న్యాయస్థానాలు సాధారణంగా
జోక్యం చేసుకోవడానికి వీలు ఉండదు.
పార్లమెంటు స్థానం ఖాళీ ఏర్పడే సందర్భాలు (ఆర్టికల్ 101)
ఈ కింది సందర్భాలలో పార్లమెంటు స్థానాలు ఖాళీ
ఏర్పడవచ్చు
·
రాజీనామా - లోక్ సభ సభ్యులు అయితే స్పీకర్ కి రాజ్యసభ
సభ్యులు అయితే రాజ్యసభ చైర్మన్ కి మనస్ఫూర్తితో తన రాజీనామా పత్రాలను వ్యక్తిగతంగా
ఇవ్వాలి.
·
గైహాజరు - సభాధ్యక్షుల అనుమతి లేకుండా పార్లమెంట్ సభ్యులు
నిరవధికంగా 60 రోజులు సభ సమావేశాలకు హాజరు కాకపోతే సభ్యత్వం కోల్పోతారు.
·
ద్వంద
సభ్యత్వం కలిగి ఉండడం - పార్లమెంట్
సభ్యులు ఏకకాలంలో రెండు సభలలో అంటే లోక్‌సభలో మరియు రాజ్య సభలో సభ్యత్వం కలిగి
ఉంటే ఏదైనా ఒక సభలో సభ్యత్వం కోల్పోతారు.
·
సభకి, రాజ్యసభకి ఒకేసారి ఎన్నిక అవుతే ఎన్నికైన పది రోజుల లోపు తాను ఏ సభలో
కొనసాగుతారో తెలియ చేయాలి. లేకపోతే రాజ్యసభ సభ్యత్వం రద్దు అవుతుంది.
·
ఒక అభ్యర్థి
రాష్ట్ర శాసనసభకి, పార్లమెంట్ కి ఒకేసారి ఎన్నికయితే 14
రోజుల లోపు రాష్ట్ర శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. అలా చేయని యెడల
పార్లమెంట్ సభ్యత్వం రద్దు అవుతుంది.
·
ఒక అభ్యర్థి
రెండు స్థానాల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత తాను ఏ నియోజకవర్గంలో కొనసాగుతారో 10
రోజుల లోపు తెలపాలి. లేకపోతే రెండు స్థానాల్లో తన సభ్యత్వం కోల్పోతారు.
ALSO READ:- Parliament of India Lok sabha in Telugu
No comments:
Post a Comment