పౌరసత్వం (Citizenship)
ARTICLE 5 - ARTICLE 11
పౌరసత్వం అనే పదం ఆంగ్ల భాషలోని సిటిజెన్షిప్ అనే పదానికి అనువాదం, సిటిజన్ షిప్ అంటే లాటిన్ భాషలోని సివీస్ మరియు సివితాస్ అనే పదాల నుండి ఉద్భవించింది.
సివిస్ అనగా పౌరులు అని అర్థం. సివితస్ అనగా నగరం అని అర్థం. ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలలో పౌరసత్వ భావన మొదటిసారి అవతరించింది. రాజ్యాంగంలోని రెండవ భాగంలో 5వ ప్రకరణనుండి 11వ ప్రకరణ వరకు పౌరసత్వానికి సంబంధించిన విషయాలు పొందుపరచడం జరిగింది.
పౌరసత్వ ప్రకరణలు
5వ ప్రకరణ
· ఈ ప్రకరన ప్రకారం జనవరి 26 1950 నుండి (రాజ్యాంగం అమలు లోకి వచ్చినప్పుడు) భారత దేశంలో నివసించే పౌరులు భారతీయులే.
· రాజ్యాంగం అమలు నాటికి ఐదు సంవత్సరాల ముందు నుండి భారతదేశంలో నివసించే వారు కూడా భారతీయులే, అలాగే రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత దేశంలో జన్మించిన వారందరూ భారతీయులే.
6వ ప్రకరణ
· పాకిస్తాన్ నుండి వలస వచ్చిన వారు 1948 జూలై 19 వ తేదీ వరకు తమ పేర్లను దగ్గర ఉన్న కమిషనరేట్ల వద్ద నమోదు చేసుకున్నచో భారత పౌరసత్వం లభిస్తుంది.
· ఈ పద్ధతిలో పౌరసత్వం పొందిన వారు 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం భారత పౌరులుగా నమోదు అయి ఉండాలి.
7 వ ప్రకరణ
· ఈ ప్రకరన ప్రకారం పాకిస్తానుకి వలస వెళ్లి తర్వాత కాలంలో తిరిగి భారతదేశానికి వచ్చి 1948 మార్చి 21వ తేదీ లోపు కమిషనరేట్ దగ్గర తమ పేర్లను నమోదు చేసుకున్న వారికి భారత పౌరసత్వం లభిస్తుంది. కాని వీరందరూ 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం భారతీయులు అయి ఉండాలి.
8వ ప్రకరణ
· ఈ ప్రకరణ ప్రకారం తల్లిదండ్రులులలో కనీసం ఒక్కరైనా భారత సంతతికి చెంది ఉన్నట్లయితే వారికి భారత పౌరసత్వం లభిస్తుంది.
9వ ప్రకరణ
· ఈ ప్రకరణ ప్రకారం భారత దేశ పౌరులు స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వాన్ని పొందుతె సహజంగానే భారతీయ పౌరసత్వాన్ని కోల్పోతారు.
10వ ప్రకరణ
· భారత దేశ పౌరులు గా పరిగణించబడే వారు భారత దేశ పౌరునిగా కొనసాగుతారు .
11వ ప్రకరణ
· ఈ ప్రకరణ ప్రకారం పౌరసత్వానికి సంబంధించిన అన్ని అంశాలపైనా అంటే పౌరసత్వాన్ని పొందే పద్ధతి మరియు రద్దు చేసే పద్ధతులపై పార్లమెంటుకి అంతిమ అధికారం ఉంటుంది.
భారతదేశంలో పౌరసత్వాన్ని పొందే పద్ధతులు
(భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారం)
పుట్టుక ద్వారా పౌరసత్వం
1950 జనవరి 26 తర్వాత మరియు 1 జులై 1986 లోపల భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి భారతీయుడు అవుతాడు. జూలై 1987 భారతదేశంలో పుట్టిన వారు భారత పౌరసత్వాన్ని పొందాలంటే తల్లిదండ్రులలో ఎవరో ఒకరు భారత పౌరుడై ఉండాలి. 2004 డిసెంబర్ న చేసిన సవరణ ప్రకారం తల్లిదండ్రులు ఇద్దరూ కూడా భారతీయ పౌరులు ఉంటేనే వారి పిల్లలకు భారత పౌరసత్వం వస్తుంది.
రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వం
భారత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ద్వారా వారసత్వాన్ని పొందుపరుస్తుంది. భారత సంతతికి చెందిన వారు భారత దేశంలో 7 సంవత్సరాలు నివాసం ఉండాలి.అయితే వీరు భారతీయ పౌరులను వివాహం చేసుకుని ఉండాలి.
సాహజికృత పౌరసత్వం
· భారత ప్రభుత్వం రూపొందించిన చట్టాలకు లోబడి నిర్ణీత షరతులకు లోబడి ఉండి దరఖాస్తు చేసుకున్న విదేశీయులకు భారతీయ పౌరసత్వం కల్పించబడుతుంది.
· అయితే వారు భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో పేర్కొనబడిన 22 భాషలలో ఏదో ఒక భాషను నేర్చుకుని ఉండాలి. భారతదేశంలో కనీసం 10 సంవత్సరాల నివాసం కలిగి ఉండాలి. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో భారత ప్రభుత్వానికి 14 సంవత్సరాలు పని చేసినప్పుడు కూడా పౌరసత్వానికి అర్హులు అవుతారు.
· అయితే పై అర్హతలను కేంద్ర ప్రభుత్వం కొన్ని సందర్భాలలో మినహాయించవచ్చు. విదేశాలకు చెందిన మేధావులు,గొప్ప వ్యక్తులు, విఐపిలను వీటి నుండి మినహాయింపు ఉంటుంది.
భూభాగ విలీనం ద్వారా-
భారత భూభాగంలో ఏదైనా ఒక ప్రాంతం వేరే దేశాల నుండి విలీనం చేసినట్లయితే ఆ ప్రాంత ప్రజలకు భారత పౌరసత్వం లభిస్తుంది.
Ex - గోవా, పాండిచ్చేరి భారతదేశంలో కలవడం.
భారతీయ పౌరులు ఎవరైనా తన దేశ ద్రోహానికి పాల్పడిన, రాజ్యానికి విధేయత పాటించకపోయిన, శత్రు దేశాలకు సహాయం చేసిన,సాధారణ పౌరుడిగా 7 సంవత్సరాల పాటు విదేశాల్లో నివసించి ఉన్న, పౌరసత్వాన్ని పొందిన 5 సంవత్సరాల లోపు ఏ దేశంలో రెండు సంవత్సరాల శిక్ష అనుభవించి ఉన్నా పౌరసత్వం శాశ్వతంగా రద్దు చేస్తారు.
ప్రవాస భారతీయులు (NRI)
· విదేశాలలో శాశ్వతంగా లేదా తాత్కాలికంగా నివాసం ఉంటున్న మొదటి తరం భారతీయులు. 182 రోజులు భారతదేశం బయట నివసిస్తూ ఉంటే వారిని NRI లు అంటారు వీరికి భారత పాస్ పార్ట్ ఉంటుంది.
· అమెరికాలో స్థిర నివాసం ఉంటున్న వారికి అమెరికా ప్రభుత్వం గ్రీన్ కార్డ్ అనే అధికారిక అంగీకార పత్రం ఇస్తుంది.
పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్- PIO
· విదేశీ పౌరసత్వంని కలిగి ఉన్న రెండవ తరం భారతీయులు వీరు అంటే విదేశాలకు వెళ్లి స్థిరపడి ఆ దేశ పౌరసత్వాన్ని పొందిన తల్లిదండ్రులకు జన్మించిన సంతానం. ఉదాహరణకి అమెరికాలో లూసియానా రాష్ట్రానికి గవర్నర్ గా ఎన్నికైన బాబీ జిందాల్.
· PIO కార్డ్ పొందేవారు 15 సంవత్సరాలు నివాసం ఉండాలి. ఈ కార్డు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక ,నేపాల్ ,భూటాన్ లకు వర్తించదు. ఈ కార్డు పొందడానికి పెద్దవారు రూపాయలు15000/- పిల్లలు రూపాయలు7500/- చెల్లించాలి.
ఓవర్సీస్ సిటిజెన్స్ ఆఫ్ ఇండియా (2005)
· ఈ చట్టం 2005 డిసెంబర్ 2వ తేదీ నుండి అమలులోకి వచ్చింది.
· ఈ చట్టం ఇతర దేశాల్లో ఉన్న భారతీయ సంతతికి చెందిన అందరికీ అవకాశం కల్పించారు. వీటికి కూడా NRI లతో సమానమైన ప్రతిపత్తి ఉంటుంది. ఈ కార్డును పొందేవారు పెద్దవారు రూ15000/- పిల్లలు 7500/- చెల్లించాలి.
· వీరికి రాజకీయ పరమైన హక్కులు ఉండవు.
సరోగసి పౌరసత్వం
· సరోగసి అంటే వైద్యశాస్త్ర పరంగా తల్లిదండ్రులు మరొక తల్లి ద్వారా సంతానాన్ని పొందడం. కేవలం పిండం పెరుగుదల కోసం తన గర్భసంచిని ఆధారంగా అందిస్తోంది. తన గర్భసంచిలో పెరిగే బిడ్డకు తనకు ఏమాత్రం సంబంధం ఉండదు.ఇలా జన్మించిన పిల్లలను "సరోగసి బేబీ" అంటారు.
· అయితే ఇలాంటి వారికి భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో పుట్టినప్పటికీ పౌరసత్వం రాదు. ఈ మధ్యనే సుప్రీంకోర్టు మానవతా దృక్పథంతో ఇలాంటి వారికి పౌరసత్వం ఇవ్వచ్చు అని పేర్కొంది.( "వెల్కమ్ ఒబామా" మూవీ దీని గురించే చెబుతోంది).
రెఫ్యూజీ
రాజకీయ కారణాల వల్ల స్వదేశాన్ని వదిలి వేరొక దేశానికి వలస వెళ్ళిన ప్రజలను "రెఫ్యూజీ" అంటారు.
ఏమిగ్రి
రాజకీయ కారణాల వల్ల స్వదేశాన్ని వదిలి వెళ్ళిన పౌరులు.
ఎక్స్ పాట్రియేట్
స్వదేశాన్ని స్వచ్ఛందంగా వదిలి వెళ్లిన పౌరులు.
ప్రవాస భారతీయ దివాస్(జనవరి 9)
· జనవరి 9 నాడు ప్రవాస భారతీయ దివాస్ (మహాత్మా గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చిన రోజున జనవరి 9)జరుపుకుంటాం.ప్రవాస భారతీయ దినోత్సవం 2003వ సంవత్సరం నుండి జరుపుకుంటున్నాం.
· మొదటి ప్రవాస భారతీయ దినోత్సవం న్యూఢిల్లీలో జరిగింది.
· ఇటీవల కాలంలో 15వ ప్రవాస భారతీయ దినోత్సవం వారణాసిలో 2019 జనవరి 21- 23 మధ్య జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా ప్రధాని శ్రీ పవింద్ జగన్నాథ హాజరయ్యారు.
· ప్రవాసి కౌశల్ వికాస్ యోజన అనే పథకం విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు వెళ్లే యువతలో నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది.
పౌరసత్వ సవరణ చట్టం (2019)
· ఇటీవలి కాలంలో భారతదేశంలో అనేక వ్యతిరేకతకు గురి అయింది ఈ చట్టం.
· పౌరసత్వ సవరణ చట్టం
ప్రకారం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్,బంగ్లాదేశ్ నుండి వచ్చిన హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులకు, జైనులు, పాలసీకులకు సాహజికృత పౌరసత్వం కల్పించడానికి ఉద్దేశించినది.
· అయితే ఈ చట్టంలో ముస్లింల ప్రస్తావన లేదు.
· 2014 డిసెంబర్ 31 నాటికి వచ్చిన వలసదారులకు ఈ పౌరసత్వాన్ని కల్పిస్తారు.
· ఈ చట్టంలో పౌరసత్వం పొందడానికి అవసరమైన 11 సంవత్సరాల నివాస షరతును భారత దేశంలోని 5 సంవత్సరాలకు తగ్గించారు.
· ఈ పౌరసత్వం సవరణ బిల్లును 2019 లోక్ సభలో అమిత్ షా ప్రవేశపెట్టగా అనుకూలంగా 311 వ్యతిరేకంగా 80 ఒట్లు పడ్డాయి.
· డిసెంబర్ 11న రాజ్యసభలో ప్రవేశపెడితే 125 అనుకూలమైన 105 వ్యతిరేక ఓట్లు పడ్డాయి. 2019 డిసెంబర్ 12 రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
· 2019లో మొట్టమొదటిసారిగా మతాన్ని ప్రాతిపదికన తీసుకొని పౌరసత్వం ఇవ్వడానికి నిరాకరించడానికి ఈ చట్టంలో ఉంది.
· ఈ చట్టం 2020 జనవరి 10 నుండి అమలులోకి వచ్చింది.
· ఈ చట్టం నుండి ఆరవ షెడ్యూల్లో పేర్కొన్న మిజోరం, అస్సాం,మేఘాలయ, త్రిపుర గిరిజన ప్రాంతాలను మినహాయించారు.
జాతీయ జనాభా పట్టిక (NPR)
· ఈ జనాభా పట్టికను 2020 ఏప్రిల్ నుండి 2020 సెప్టెంబర్ వరకు ప్రతి ఇంటికి తిరిగి వివరాలు సేకరిస్తామని ప్రకటించింది.
· ఈ జనాభా పట్టిక తయారు చేయడానికి 8500 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది.
· ఈ NPR ఆలోచన మొదటిసారిగా 2000 సంవత్సరంలో "వాజ్ పేయి" కాలంలో వచ్చింది.
· ఇందులో నివాసులకు సంబంధించి 15 అంశాలు సేకరిస్తారు.
జాతీయ పౌర పట్టిక (NRC)
· దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని బయటికి పంపడమే దీని ప్రధాన ఉద్దేశం.
· 1971 మార్చి 25 బంగ్లాదేశ్ ఏర్పడింది. అయితే ఈ దేశం నుండి వచ్చిన వారందరినీ అక్రమ చొరబాటుదారులుగా గుర్తించాలని పేర్కొంది.
· అస్సాం జనాభాలో భారత పౌరులు కాని వారు కోటి ఇరవై లక్షల మంది ఉండొచ్చు అని NRC అంచనా వేసింది.
· 2019 ఆగస్టు 31న ప్రకటించిన NRC తుది జాబితాలో 19,06,657 ప్రజలు అక్రమ చొరబాటుదారులు అని తేలింది.
ALSO READ:- ARTICLE 1 TO ARTICLE 5
No comments:
Post a Comment