Telangana saayudha poratam part 2 in Telugu
తెలంగాణ సాయుధ పోరాటం
పార్ట్ -2
కమ్యూనిస్టు సిద్ధాంతాలపై
రావి నారాయణరెడ్డి, ఎల్లారెడ్డి హనుమయ్యలకు N.G. రంగా కమ్యూనిస్టు సిద్ధాంతాలపై శిక్షణ ఇచ్చాడు. అనంతరం
1940లో హైదరాబాద్ లో కమ్యునిస్టు పార్టీని బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి హైదరాబాద్ లో స్థాపించారు.
1940 నుండి 1951 వరకు కమ్యూనిస్టు పోరాటాలను (తెలంగాణ
సాయుధ పోరాటం) నాలుగు దశలుగా విభజించారు. అవి
1. మొదటి దశ (1940-46) - కమ్యూనిస్టులు బలపడడం.
2. రెండవ దశ (1946-47) - జమిందారుకు, కౌలుదారులకు, గడిల వ్యవస్త్యకు
వ్యతరేకంగా సాయుధపోరాటం.
3. మూడవ దశ - (1947-1948 సెప్టెంబర్
17)నిజాం వ్యతిరేకంగా పోరాటం.
4.
నాలుగవ దశ - (1948
సెప్టెంబర్ 17- 1951 అక్టోబర్ 21)భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల తిరుగుబాటు.
మొదటి దశ – (1940- 46) కమ్యూనిస్టులు
బలపడడం
·
రావి నారాయణరెడ్డి 1941లో చిలుకూరు సభకు
అధ్యక్షత వహించాడు. ఈ సభకి ఆంధ్ర కమ్యూనిస్టు నాయకుడైన చండ్ర రాజేశ్వరరావు హాజరయ్యారు. ఈ సమావేశంలోనే ఆంధ్ర మహాసభ
పూర్తిగా కమ్యూనిస్టుల చేతిలోకి వెళ్ళింది.
·
ఆ తర్వాత ఈ సభ అనేక జిల్లాల్లో గ్రామాలలో శాఖలను
ఏర్పరిచింది. ఈ శాఖలను సంఘాలు
అంటారు. ఈ సంఘాలు రైతులని, వ్యవసాయ కూలీలను చైతన్యవంతుల్ని చేసింది. ఈ సంఘాల
సభ్యులు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజలను చైతన్యవంతం చేయడంలో, ప్రజలను సాయుధ
పోరాటంలో పాల్గొనేటట్లు చేయడంలో కీలక పాత్ర పోషించారు.
·
కమ్యూనిస్టుల సాంస్కృతిక సంస్థ అయిన ప్రజానాట్యమండలి బుర్రకథలు ఇతర సాంస్కృతిక
కార్యక్రమాల ద్వారా కమ్యూనిస్టుల సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లారు. ఈ
ప్రజానాట్యమండలి ద్వారా తెలంగాణలో నిరక్షరాస్యులు కమ్యూనిస్టుల సిద్ధాంతాన్ని
అర్థం చేసుకున్నారు.
బుర్ర కథలతో ప్రజలను చైతన్య పరచడం |
· కమ్యూనిస్టులు ఇచ్చిన ప్రోత్సాహంతోనే రైతులు జమీందార్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం మొదలు పెట్టారు. ఇదే సమయంలో నిజాం ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానంను ఒక స్వతంత్ర దేశంగా స్థాపించడంపై తన దృష్టి పెట్టాడు అందువలన గ్రామాలలో సహజంగా తలెత్తుతున్న వ్యతిరేకతను పట్టించుకోలేడు. ఈ పరిస్థితులను చక్కగా ఉపయోగించుకొని తెలంగాణలో కమ్యూనిస్టులు బలపడ్డారు. కమ్యూనిస్టు భావాలు తెలంగాణ ప్రజలందరికీ మెదడులోకి చొచ్చుకొని వెళ్ళింది.
రెండవ దశ (1946 – 1947)
జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం
·
రెండవ దశలో రైతులు జమీందారులకు,
పెట్టుబడిదారులకు, వడ్డీ వ్యాపారులకు, గడీల వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు.
·
తెలంగాణలో లెవీ ధాన్య వసూళ్ళకు వ్యతిరేకంగా
జరిగిన ఆకునూరు, మాచిరెడ్డిపల్లిలొ జరిగిన రైతాంగ తిరుగుబాటు జాతిపిత మహాత్మా గాంధీ
దృష్టిని ఆకర్షించింది.
·
మాచిరెడ్డి పల్లి, ఆకునూరు దుర్మార్గాల గురించి
వివరించిన పత్రిక – ప్రీ ప్రేస్ జర్నల్.
·
ఆకునూరు, మాచిరెడ్డి పల్లి దుర్ఘటన గురించి
గాంధీజీకి నివేదించింది - పద్మజా
నాయుడు
·
ఆకునూరు, మాచిరెడ్డి పల్లి దుర్మార్గాలపై “ఆకునూరు మాచిరెడ్డి పల్లి దురంతాలు” అనే పుస్తకాన్ని రచించినవారు - దేవులపల్లి వెంకటేశ్వరరావు
·
ఈ సంఘటనలపై గాంధీజీ అక్బర్ హైదరికి (హైదరాబాద్ ప్రధాని) లేఖ రాయగా సర్ అక్బర్ హైదరీ ఈ దుర్ఘటనపై
విచారణ సంఘాన్ని నియమించారు.
ఆకునూరు సంఘటన
·
నిజాం ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఆకునూరు
ప్రజల నుండి బలవంతంగా లెవీ గల్లా పేరుతో ధాన్యాన్ని దోచుకో సాగారు. ఉన్న కొద్ది
ధాన్యాన్ని దోచుకునే సరికి ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రైతులు సహనం
కోల్పోయి SI, గిర్థావర్ పట్టుకుని మిగతా అధికారులను తరిమివేశారు.
·
ఎడ్ల బండి ముందు ఎస్.ఐ.ని గిర్ధవర్ ను పరిగెత్తించి వాళ్ల మీద బరువును ఎత్తించి
రైతుల కష్టాలు వీరికి తెలియచేసేటట్లు చేశారు.
·
సితల్ సింగ్ వీళ్లకు శిక్ష విధించడంలో ముఖ్య పాత్ర పోషించారు.
· ఇదంతా జరిగిన విషయాన్ని SI, గిర్థావర్ మనసులో పెట్టుకొని పెద్ద మొత్తంలో పోలీసు బలగాలతో వచ్చి ప్రజలపై అనేక ఆకృత్యాలకు పాల్పడ్డారు. వారిద్దరు కలిసి సితల్ సింగ్ ను అరెస్టు చేసి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించారు.
మాచిరెడ్డి పల్లి సంఘటన
·
మాచిరెడ్డి పల్లి గ్రామంలో స్థానిక తాహసిల్దార్
అయినా కాజా మొయినుద్దీన్ లెవీ ధాన్యం వసూలు చేయడానికి వచ్చాడు. ప్రజలు ఆ పన్నులను
భరించలేక తాసిల్దార్ పై తిరుగుబాటు చేశారు.
·
తాహసిల్దార్ ప్రజలు చేసిన పనికి కోపంతో పెద్ద
మొత్తంలో పోలీసు బలగాలతో వచ్చి ప్రజలను హింసించడం, స్త్రీలను మానభంగం చేశాడు.
ప్రజలను హింసిస్తూ అనేక ఆకృత్యాలు పాల్పడుతూ పైశాచిక ఆనందం పొందాడు.
·
నిజాం ప్రభుత్వం యొక్క దుర్మార్గాలను ప్రపంచం
మొత్తం తెలియచేయాలని రావి నారాయణరెడ్డి ముంబైలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసీ నిజాం
ప్రభుత్వం యొక్క దుర్మార్గాలను వెల్లడించాడు.
·
నిజాం ప్రభుత్వం కమ్యూనిస్టుల నుండి తిరుగుబాటు
తిరుగుబాటు వస్తున్న నేపథ్యంలో కమ్యూనిష్టులపై ఆకస్మిక దాడులు చేసింది. 1946
నవంబరులో నిజాం ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించింది.
· నిజాం ప్రభుత్వం కమ్యూనిస్టులను అరికట్టేందుకు సైనిక శిబిరాలను ఏర్పాటు చేసింది. అప్పుడు కమ్యూనిస్టులు ప్రధాన కేంద్రాన్ని విజయవాడకు(స్టాలిన్ గ్రాడ్) తరలించారు. విజయవాడ నుండి ఆయుధాలను సేకరించేవారు కావున విజయవాడను స్టాలిన్ గ్రాడ్ అంటారు.
మూడవ దశ(1947-1948 సెప్టెంబర్
17) నిజాంకు వ్యతిరేకంగా తిరుగుబాటు
·
నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత దేశానికి
స్వాతంత్ర్యం వస్తుందన్న సందర్భంలో అతను 1947 జూన్ 12న సర్వ స్వతంత్రుడు అని
ప్రకటించుకొని, హైదరాబాద్ సంస్థానంను ప్రత్యేక రాజ్యాంగా ప్రకటించుకున్నాడు.
·
హైదరాబాద్ సంస్థానం ప్రత్యేక రాజ్యాంగా వుంటే
ప్రజలు ఇంకా అధిక పన్నులు చెల్లించాల్సి వస్తుందని అనుమానం వ్యక్తం చేసి నిజాంకు
వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు.
·
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ
హైదరాబాద్ సంస్థానానికి మాత్రం స్వాతంత్రం రాలేదని ప్రజలు కమ్యూనిస్టులు, రైతులు
సాయుధ పోరాటానికి అధికారికంగా 1947 సెప్టెంబర్ 11న పిలుపునిచ్చారు.
· ఈ సాయుధ పోరాట ప్రకటన చేసిన కమ్యూనిస్టు నాయకులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముఖ్దుం మోయునుద్దిన్. తర్వాత కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభను వదిలిపెట్టి కమ్యూనిస్టు పార్టీ పేరుతో తిరుగుబాటు ప్రారంభించారు.
నాలుగవ దశ(1948 సెప్టెంబర్ 17 – 1951 ఆక్టోబర్ 21) భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం
·
కమ్యూనిస్టు పార్టీ
కార్యదర్శి రణదివె ఆపరేషన్ పోలో తర్వాత సాయుధ
పోరాటాన్ని భారత యూనియన్ కు వ్యతిరేకంగా కొనసాగించాలని ప్రకటన చేశాడు. వల్లభాయి
పటేల్ హైదరాబాద్ లో పర్యటించి తెలంగాణలో ఒక్క కమ్యూనిస్టుని కూడా ఉండనివ్వం అని చెప్పాడు.
·
మిలటరీ
ప్రభుత్వం కమ్యూనిస్టులను అనిచివేయడానికి బ్రిక్స్ ప్రణాళికను అమలు చేసింది. నంజప్ప అనే అధికారి
ఆధ్వర్యంలో బ్రిక్స్ ప్రణాళిక ఏర్పడింది.
·
భారత ప్రభుత్వాలకు కమ్యూనిస్టులకు పోరాటాలు సాగుతున్న నేపథ్యంలో ఈ
సాయుధ పోరాటాన్ని కొనసాగించాలా లేదా ఆపివేయాలని అని మాస్కో వెళ్లిన కమ్యూనిస్టుల బృందం
- అజయ్ ఘోష్, డాంగే, చండూరు రాజేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్య.
·
రష్యా
ప్రతినిధి బృందం నాయకుడు అయిన స్టాలిన్ సలహాతో కమ్యూనిస్టు పార్టీ 1951
అక్టోబర్ 21న తన సాయుధ పోరాటాన్ని విరమించింది.
సాయుధ పోరాటం విరమించిన తర్వాత కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేశారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళలు కూడా క్రియాశీలక పాత్ర వహించారు. ముఖ్యంగా
మల్లారెడ్డి గూడానికి చెందిన దళిత మహిళలు అయినా గురవమ్మ, నాగమ్మ,
తోండమ్మ నిజాం సైన్యాని ఎదిరించి
తెలంగాణ సాయుధ పోరాటంలో మరణించిన తొలి దళిత మహిళలు అయ్యారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పోరాటం కూడా ఎంతోమందికి ఆదర్శం అయ్యింది.
చాకలి ఐలమ్మ మల్లెంపల్లి మక్తేదారు దగ్గర కొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేది.
విసునూరు రామచంద్రారెడ్డి గుండాలు చాకలి
ఐలమ్మ పంటను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. చాకలి ఐలమ్మ వాళ్లపై తిరుగుబాటు చేసింది. ఈ తిరుగుబాటులో చాకలి
ఐలమ్మకు సహకరించిన ఆంధ్ర మహాసభ నాయకులు - ఆరుట్ల రామచంద్రారెడ్డి,చకిలం యాదగిరిరావు, భీంరెడ్డి నరసింహారెడ్డి.
ధర్మ పురానికి చెందిన మంగ్లీ అనే లంబాడి మహిళ విసునూరు దేశ్ ముఖ్ కు వ్యతిరేకంగా పోరాదింది.
తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణిచివేయడానికి నిజాం ప్రభుత్వం చేసిన హింసాత్మక సంఘటనలు
బైరాన్ పల్లి దుర్ఘటన
నిజాం ప్రభుత్వ అధికారులు బైరాన్ పల్లి గ్రామ ప్రజలపై అధిక పన్నులు వసూలు చేసే
సమయంలో బైరాన్ పల్లి ప్రజలు అధికారులపై తిరగబడ్డారు.
దీంతో అధికారులు, పోలీసు సైనికులు బైరంపల్లి ప్రజలపై దెబ్బకొట్టాలని పెద్ద
మొత్తంలో రజకార్లను తీసుకుని వచ్చి బైరాన్పల్లిలో చుట్టుముట్టారు. బైరంపల్లి
స్థానిక భూస్వామి గ్రామ ప్రజలందరినీ ఒక చోటికి చేర్చి రజాకార్లకు అప్పచెప్పాడు . ఆ తర్వాత రజాకార్లు ఆ
గ్రామ ప్రజలను నిలబెట్టి కాల్చి చంపారు.
ఇది జలియన్ వాల భాగ్ దుర్ఘటనలాగా ఈ ప్రాంతంలో రక్తం ఏరులై పారింది. రజాకార్ల కాల్పుల
వలన 118 మంది వీరమరణం పొందారు. ఈ దుర్ఘటన 1948 ఆగస్ట్ 27న జరిగింది. బైరాన్ పల్లి దుర్ఘటనపై
కాళోజీ “కాలంబు రాగానే కాటేసి తీరాలె” అనే గేయాన్ని రచించాడు.
బైరాన్ పల్లిలో వీరమరణం పొందిన వారికి 2003లో స్థూపాన్ని
ఏర్పాటు చేయడం జరిగింది.
గుండ్రాంపల్లి దుర్ఘటన
తెలంగాణ చరిత్రలో జరిగిన మరో నరమేధం గుండ్రంపల్లి దుర్ఘటన. గుండ్రంపల్లిలో
స్థానిక ప్రజలు రజాకార్లకు ఎదురుతిరిగినందుకు రజాకార్లు ప్రజలపై దాడులు చేసి
ప్రజలను నీరులేని బావిలో వేసి సామూహిక దహనం చేశారు.
ఈ దుర్ఘటనపై సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం ప్రభుత్వం ఇంత అరాచకం చేస్తుంటే
భారత ప్రభుత్వం ఊరుకోదు అని పార్లమెంట్లో అన్నాడు.
Also Read :- తెలంగాణ సాయుధ పోరాటం PART -1
No comments:
Post a Comment