కుతుబ్ షాహిలు
QUTB SHAHI DYNASTY IN TELUGU
PART-1
స్థాపకుడు |
సుల్తాన్ కులీ కుతుబ్ షా |
రాజధాని |
మహమ్మద్ నగరం/ గోల్కొండ |
గొప్పవాడు |
మహమ్మద్ కులీ కుతుబ్ షా |
చివరివాడు |
అబుల్ హసన్ తానీషా |
అధికార భాష |
పారశీకం |
నగర నిర్మాతలు |
మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ – (1591) చార్మినార్(1594) |
విదేశీ యాత్రికులు |
మీర్ జైనుల్ అదిబిన్ (సుల్తాన్
మహమ్మద్ కుతుబ్షా కాలంలో), ట్రావెర్నియర్ (అబ్దుల్లా కుతుబ్ షా
కాలంలో) |
సుల్తాన్ కులీ కుతుబ్ షా
●
కుతుబ్షాహీ రాజ్య స్థాపకుడు ఇతడు.
●
ఇతను మరియు ఇతని పూర్వీకులు ఇరాన్ ప్రాంతానికి చెందిన వారు వీరు ఈ ప్రాంతంలో
నల్ల గొర్రెలను మేపుతూ ఉండేవారు, వీళ్ళు భారతదేశానికి వలస వచ్చి కొద్దిరోజులు ఢిల్లీలో
తర్వాత బహమనీ సుల్తాన్ దగ్గర పనిచేశాడు,
●
గోల్కొండను జయించి బహమనీ రాజ్యానికి
సామంత రాజుగా అయ్యాడు.
●
బహమనీ సుల్తాన్ 3వ మహమ్మద్
యొక్క అంగరక్షక దళంలో మామూలు సాధారణ సైనికుడిలా చేరాడు.
● 1512లో మూడవ మహమ్మద్ మరణానంతరం సుల్తాన్ కులీ కుతుబ్ షా గోల్కొండ రాజధానిగా స్వతంత్రం ప్రకటించుకున్నాడు.
జంషీద్ కులీ కుతుబ్ షా(క్రీస్తుశకం 1543 to 1550)
●
జంషీర్ కులికుతుబ్షా,మీర్ మహమ్మద్ హందాని సహాయంతో 90 ఏళ్ల వృద్ధుడు
అయిన తన తండ్రిని చంపి ఇతను రాజు అయ్యాడు.
● ఇబ్రహీం కులీ కుతుబ్ షా తన అన్న జంషీరుకు
వ్యతిరేకంగా అనేక కుట్రలు చేశాడు, కానీ ఈ కుట్రలు అన్నిటినీ అణచి వేశాడు జంషీద్
కులీ కుతుబ్ షా.
●
దీంతో ఇబ్రహీం కుతుబ్ షా విజయనగరంలో అలియా రామరాయ ఆశ్రమాన్ని
పొందాడు.
ఇబ్రహీం కులీ కుతుబ్ షా (క్రీస్తుశకం 15050- 1580)
●
ఇబ్రహీం కుతుబ్ షా విజయనగర రాజ్యంలో ఏడు సంవత్సరాలు నివాసం తర్వాత విజయనగర
సైన్యం సహాయంతో గోల్కొండ సింహాసనాన్ని ఆక్రమించాడు.
●
ఇతను చేసిన సహాయం మర్చిపోయి తనను ఆదుకున్న రామరాయలపై బహమనీ రాజ్యాలతో కలిసి “రాక్షసి తంగడి” యుద్ధంలో
(1565) ఆలియ రామ రాయలను చంపాడు.
●
రాక్షసి తంగడి యుద్ధంలో ఫిరంగి దళాల అధికారి - రూమి ఖాన్ (టర్కీ)
●
రాక్షసి తంగడి యుద్ధంలో ఇతను మొదటిసారిగా తోప్ అనే కొత్త ఫిరంగులను
ప్రవేశపెట్టాడు ఇదే ఇతని విజయానికి కారణం.
మహమ్మద్ కులీకుతుబ్ షా (క్రీస్తుశకం 1580 – 1612)
●
కుతుబ్ షాహీ వంశంలో గొప్ప రాజు ఇతను 1593లో ప్లేగు వ్యాధి
నిర్మూలించినందుకు చిహ్నంగా చార్మినార్ నిర్మించారు, ఈ నిర్మాణంలో టర్కీ,
ఇరాన్, అరబిక్,భారతీయ శైలులు ఉన్నాయి.
●
ఇతను సంపూర్ణ ఆంధ్రదేశాన్ని పాలించిన
పాలకుడు,
●
కులీ కుతుబ్ షా భాగమతి అనే బంజారా స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు,
ఆ తర్వాత ఆవిడ పేరు మీదనే “భాగ్యనగర్” అని పేరు పెట్టాడు.
●
కొద్ది రోజులకి భాగమతి
ఇస్లాం మతం స్వీకరించి ఆమె తన పేరును హైదర్ మహల్ అని మార్చుకుంది దాన్ని
అనుసరించి నగరం పేరు కూడా “హైదరాబాద్” అని రూపాంతరం చెందింది.
●
మొగల్ చక్రవర్తి అక్బర్
తన రాయబారిగా మసూద్ బేగ్ ను ఇతని ఆస్థానానికి పంపాడు .
●
ఇతని కాలంలో హిందువులకు ఉన్నత పదవులు లభించాయి.
●
అద్దంకి గంగాధరుడు “తపతీ సంహారణోపాఖ్యానం”లో భాగమతి అనే హిందూ
స్త్రీని ప్రేమించి మహమ్మద్ కులీ కుతుబ్ షా పెళ్లి చేసుకున్నాడని తెలిపాడు.
●
ఈ భాగమతి ఒక భోగం మహిళ
మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలం నుండి వేశ్యలకి సమాజంలో గౌరవం ఉండేది.
●
మహమ్మద్ కులీ కుతుబ్ షా తెలుగు నెలలో “మొహరం” పండుగను ప్రారంభించాడు. గ్రామాలలో మొహరం పండుగలో కోలాటం
ఆట ముఖ్యమైనది.
సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా (క్రీస్తుశకం 1612-1626)
●
మీర్ మాక్కి అనే రాయబారిని మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఇతని
ఆస్థానానికి పంపాడు
●
ఇతను హైదరాబాదును సుల్తాన్ నగర్ గా నామకరణం చేశారు.
●
ఇతని కాలంలోనే పారశీక రాయబారి
1614లో “మీర్ జైనుల్ అబిదిన్”
హైదరాబాద్ నగరంను దర్శించాడు.
●
ఇతని ఆస్థానంలో మహమ్మద్ మోమిన్
అనే పారశీక కవి తూనికలు కొలతలపై “రిసాల మిక్డారియా” అనే పుస్తకాన్ని పారశీక భాషలో రాశాడు.
అబ్దుల్లా కుతుబ్ షా (క్రీస్తు శకం 1626- 1672)
●
అత్యధిక అత్యధిక కాలం పాలించిన కుతుబ్షాహీ పాలకుడు.
●
ఇతని కాలంలోనే కోహినూరు
వజ్రం కృష్ణా జిల్లా కొల్లూరు వద్ద కనుగొనబడింది అని ఫ్రెంచ్ వజ్రాల వ్యాపారి ట్రావెర్నియర్ పేర్కొన్నాడు.
●
అబ్దుల్లా కుతుబ్ షా 1636లో గోల్కొండలో ఆంగ్లేయులు స్వేచ్చా వ్యాపారం
చేసుకోవడానికి ఒక “బంగారు ఫార్మానా” జారీచేశాడు.
● క్రీస్తుశకం 1636లో
షాజహాన్ గోల్కొండపై దాడి చేశాడు. దీంతో అబ్దుల్లా కుతుబ్ షా ఒక శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాడు
ఆ ఒప్పందంలోని ప్రధాన అంశాలు.
1,గోల్కొండ మొగులులకు ఒక సామంత రాజ్యంగా ఉంటుంది.
2, సంవత్సరానికి రెండున్నర లక్షల కప్పం మొగులులకు చెల్లించాలి.
3, మొగల్ బాద్ షా పేరును శుక్రవారం నమాజ్ లో ప్రస్తావించాలి.
●
అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానంలోని
మహమ్మద్ సయీద్ లేదా అబ్దుల్లా సైదా కోహినూర్ వజ్రాన్ని షాజహాన్ కి ఇచ్చాడు.
●
అబ్దుల్లా కుతుబ్ షా ప్రేమమతి, తారామతి అనే నాట్య కతెలను చేరదీశాడు. వీరి పేరుతో తారామతి పేట ,ప్రేమమతి పేట అనేక గ్రామాలను నిర్మించాడు.
అబుల్ హసన్(తానీషా) (క్రీస్తుశకం 1672 – 1687)
●
కుతుబ్షాహి పాలకులలో చివరి రాజు ఇతను.
●
అతని సూఫీ గురువు షారజూ కట్టాల్.ఈ సూఫీ గురువు అబుల్ హసన్ కి తానిషా అనే బిరుదునిచ్చాడు. తానీషా అంటే
భోగి.
●
అబుల్ హసన్ తానీషా అక్కన్న
మాదన్నలకు ఉన్నత స్థానాలను కల్పించాడు. అక్కన్నను సైన్యాధ్యక్షుడు గా మాదన్నకు సూర్య ప్రకాష్ అనే బిరుదు ఇచ్చి ప్రధానిగా
నియమించాడు.
●
ఔరంగజేబు తన కుమారుడు అయిన షాఅలంను
1685లో గోల్కొండ పైకి దండయాత్రకు పంపగా
షాఅలం యుద్ధంలో గోల్కొండ సైన్యాన్ని
ఓడించాడు.
●
ఔరంగజేబు గోల్కొండ సైన్యంతో శాంతి
ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీని ప్రకారం యుద్ధ నష్టపరిహారం చెల్లించుట మరియు అక్కన్న మాదన్నలను ఉద్యోగం నుండి తొలగించుటకు అంగీకరించడం జరిగింది.
●
తర్వాత 1687లో ఔరంగజేబు
తానే స్వయంగా గోల్కొండ ఆక్రమించడానికి బయలుదేరాడు. గోల్కొండ సేనాధిపతులలో ఒకరైన అబ్దుల్లాపాని
లంచం తీసుకొని గోల్కొండ కోట యొక్క తూర్పు ద్వారం తేరిపించాడు ,గోల్కొండ సేనాని అయిన
“అబ్దుల్ రజాక్ లౌరీ” పోరాడినప్పటికీ గోల్కొండ కోటను క్రీస్తుశకం 1687 అక్టోబర్ లో మొఘల్ సామ్రాజ్యంలో విలీనం అయింది.
● ఇతని కాలంలో హిందువులైన అక్కన్న మరియు మాదన్న లను సర్వ సైన్యాధ్యక్షుడుగా
మరియు ప్రధాన మంత్రిగా వారికి పెద్ద పదవులు ఇప్పించాడు.
● భద్రాచల రాముడు అనే హిందూ దేవునికి తానీషా
ప్రభువు భద్రాచలం, శంకర గిరి, పాల్వంచ గ్రామాలలో వందల ఎకరాల భూమిని రాసిచ్చాడు.
● అక్కన,మాదన్న కాలంలో గోల్కొండ
కోటలో “ఎల్లమ్మ దేవి” ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రతి ఏడాది
ఆషాడమాసంలో బోనాల జాతర జరుపుతారు. ఈ జాతరను చూసేందుకు నగరాల నుండి
అధిక సంఖ్యలో జనాలు తరలివస్తారు.
కుతుబ్ షాహీల పరిపాలన విధానం
రాజ్యం |
సుల్తాన్ (రాజు) |
రాష్ట్రాలు (తరఫ్) |
తరాఫ్ దార్ |
సర్కార్లు (జిల్లాలు) |
పౌజ్ దార్ |
పరగణాలు(తాలూకా) |
తహసిల్దార్ |
●
రాజ్యాన్ని రాష్ట్రాలుగా సర్కారులుగా పరగణాలు గా విభజించారు.
●
సుల్తాన్ తర్వాత ప్రధానాధికారి పీష్వా, ఇతనే ప్రధానమంత్రి .
● రాజ్య వ్యవహారాలలో రాజుకు సహాయపడటానికి
మంత్రి పరిషత్తు ఉండేది.
పీష్వా (వఖిల్ ముత్లాక్) |
ప్రధానమంత్రి |
మీర్ జుమ్లా |
ఆర్థిక శాఖ మంత్రి |
కోత్వాల్ |
నేటి పోలీస్ కమిషనర్ |
ఐనుల్ ముల్క్ |
యుద్ధ మంత్రి |
నజీర్ |
పరిపాలన విషయాలను తనిఖీ చేసే అధికారి |
మజుందార్ |
నేటి ఆడిటర్ జనరల్ |
దబీర్ |
నేటి కార్యదర్శి (అధికారిక ఉత్తర
ప్రత్యుత్తరాలు నిర్వహించే అధికారి) |
సర్
ఖేల్ |
రాజధానిలో ముఖ్య ఆదాయ అధికారి |
షా బంధర్ |
రేవు ముఖ్య అధికారి |
హవల్దార్ |
ప్రభుత్వ బండారాలను, ఏనుగులను, గుర్రాలను
నిర్వహించే వ్యక్తి |
●
సుల్తానుకు సలహాలు ఇవ్వడానికి “మజ్లీస్ ఈ కింగాష్” లేదా “మజ్లిస్
దివాన్ దారి” అనే సలహా సంఘం ఉండేది.
గ్రామ పరిపాలన
●
గ్రామ పరిపాలన “గొత్సభల” ద్వారా జరిగేది.
●
పంతన్ దారులు, మీరాశి దారులతో గొత్సభ ఏర్పడింది. గోత్సభాధ్యక్షులను గ్రామాధికారి అంటారు.
●
ప్రభుత్వం ద్వారా భూస్వామ్య హక్కులు పొందిన వారిని పతందారులు అంటారు, వీరిని “ప్రభుత్వ
అధికారులు” అని కూడా అంటారు.
●
వంశపారంపర్యంగా భూస్వాముల అయిన వారిని మీరాశి దారులు అంటారు, వీరిని
శాశ్వత భూమి హక్కుదారులు అంటారు.
●
ప్రజలలో నైతిక విలువలు పెంపొందించడానికి మహాత్ సిబ్ అనే అధికారిని
నియమించడం జరిగింది.
న్యాయ పరిపాలన
●
సుల్తాన్ తర్వాత న్యాయ వ్యవస్థ పర్యవేక్షణాధికారిగా షరియత్ పంచ్ అనే అధికారి ఉండేవాడు.
●
వీరికి ఖూరాన్ లు,ఫర్మానాలు, స్థానిక ఆచార వ్యవహారాలు న్యాయ నిర్ణయానికి
ఆధారాలుగా ఉండేది.
●
ప్రతి పరిగణలో మజ్లీస్, హవల్దార్ అనే అధికారులు ఉండేవారు మజ్లీస్, సివిల్
వివాహాలను విచారించే వాడు.
●
ఠానేదర్ న్యాయవ్యవస్థలో అట్టడుగు అధికారి ఇతను స్థానిక గొత్సభ సహాయంతో
కేసులు వాదించేవాడు.
●
కులీకుతుబ్షా కాలంలో దాదు మహల్
(న్యాయ మందిరం) కట్టబడింది.
●
అబ్దుల్లా కుతుబ్ షా ఎంతో న్యాయవంతుడు అని చరిత్రకారుల అభిప్రాయం.
సైనిక వ్యవస్థ
●
అబ్దుల్లా కుతుబ్ షా మరియు అబుల్ హసన్ తానీషా స్థిర సైన్యానికి అధిక ప్రాధాన్యత
ఇచ్చారు మొదట్లో ఎక్కువగా జాగీర్దారుల, సామంతుల సైన్యంపై ఆధారపడేవారు.
●
జాగీర్దార్ల సైన్యం మూడు రకాలుగా
ఉండేవి .
1. పదాతిదళం- ఈ దళంలో సాధారణ సైనికులు ఉండేవారు.
2. అశ్విక దళం -అశ్వాలను కలిగిన సైనికులు వీరు
ప్రధానంగా టర్కులు, పర్షియన్లు అరబ్బులు ఉండేవారు.
3.
ఫిరంగి దళం -ఈ దళంలో ప్రధానంగా టర్కీలు,
యూరోపియన్లు ఉండేవారు.
No comments:
Post a Comment