Telangana saayudha poratam Part 1 in Telugu
తెలంగాణ సాయుధ పోరాటం
తెలంగాణ సాయుధ పోరాటం మరియు దానికి గల కారణాలు
తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రధాన కారణం చివరి నిజాం నవాబు అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రజలపై అనేక రకాల
పనులను విధించారు. ముస్లిం మత వ్యాప్తికి, హిందూ సంస్కృతికి వ్యతిరేకంగా అనేక
సామాజిక చర్యలు చేపట్టాడు.
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉస్మానియా యూనివర్సిటీనీ నెలకొల్పినప్పటికి తెలుగులో బోధన చేయడానికి నిరాకరించాడు. తెలంగాణలో అధికంగా తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నప్పటికీ ఉర్దూలో బోధన చేయమని చెప్పాడు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హిందూ సంస్కృతికి వ్యతిరేకంగా ప్రాంతాల పేర్లలో మార్పులు చేశాడు. వాటి స్థానాల్లో ముస్లిం పేర్లు పెట్టడం జరిగింది. అవి
·
ఏలుగండల - కరీంనగర్
·
పాలమూరు - మహబూబ్ నగర్
·
ఇందూరు - నిజామాబాద్
·
భువనగిరి - భోంగిర్
·
మెతుకు - మెదక్
·
మానుకోట - మహబూబాబాద్
కొన్ని వందల సంవత్సరాల నుంచి కొనసాగుతున్న పేర్లను మార్చి వాటి స్థానంలో
ముస్లిం పేరు పెట్టడం జరిగింది. నిజాం నవాబు
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వేసిన పనులు ఏ విధంగా ఉన్నాయంటే ఆ పన్నులను కట్టలేక ప్రజలు
తిరుగుబాటు చేయగలిగేలా, ఆ పన్నులను కట్టలేక ఆహార ధాన్యాల లోటు ఏర్పడి ఆకలి చావులు పెరిగాయి. బ్రిటిష్ పాలిత
ప్రాంతాల కంటే అధికంగా హైదరాబాద్ సంస్థానంలో అధికంగా పన్నులు ఉన్నాయి.
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని ప్రత్యేక దేశంగా ఉంచాలని ప్రయత్నించాడు.
అందుకోసం ఖాసీం రజ్వీ సహాయంతో రజాకార్ల సైన్యం పెంచాడు. తనకు తాను ఆర్థికంగా, సైనిక పరంగా,
సామాజికంగా బలంగా మారిన తర్వాత
నూతన దేశంగా హైదరాబాద్ సంస్థానాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. మీర్ ఉస్మాన్
అలీ ఖాన్ “గస్తీ నిషన్ 53” ద్వారా ప్రజలకు వాక్, సభ, పత్రిక స్వతంత్రాలను
నిలిపివేశాడు.
ఖాసీం రజ్వి అసఫ్ జహి జెండను ఢిల్లీలోని ఎర్రకోటపై ఎగర వేస్తామని
హైదరాబాద్ సంస్థానాన్ని మాత్రం భారతదేశంలో విలీనం చేయమని బెదిరించాడు. చివరికి 1948 సెప్టెంబర్ 13 నుండి 17 వరకు చేపట్టిన ఆపరేషన్
పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం చేశారు.
ఆపరేషన్ పోలో చేపట్టడానికి
ప్రధాన కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్. ఖాసిం రజ్వీ భారత జాతీయ కాంగ్రెసును,
ఢిల్లీలో రాజకీయ నాయకులను బెదిరించినపటికి భారత సైన్యాన్ని వారం రోజులు కూడా
నిలువరించలేకపోయారు.
అయితే తెలంగాణ సాయుధ పోరాటానికి గల ముఖ్య కారణాల గురించి వివరంగా తెలుసుకుందాం అవి.
భూస్వామ్య వ్యవస్థ
సాలార్ జంగ్ ప్రవేశ పెట్టిన సర్వే సెటిల్ మెంట్ మరియు జిల్లా బంది విధానాల వలన దివాని ప్రాంతంలోని భూములపై శిస్తు చెల్లించి
పట్టాదారులు అయ్యారు. ఉదాహరణకి
1.
జన్నారెడ్డి ప్రతాపరెడ్డి – 1,50,000 ఎకరాలు
2.
కల్లూరు దేశ్ ముఖ్ – 1,00,000 ఎకరాలు
3.
విస్నూరు దేశముఖ్
– 40,000 ఎకరాలు
4.
సూర్యాపేట దేశముఖ్
-20,000 ఎకరాలు
హైదరాబాద్ సంస్థానంలో 1901 నుండి 1941 సంవత్సరాల మధ్య లెక్కల
ప్రకారం వ్యవసాయ కూలీల వృద్ధిరేటు
గణనీయంగా పెరిగింది. నల్గొండ జిల్లాలో అధికంగా 47.3% వ్యవసాయ కూలీలు పెరిగారు. తెలంగాణలో మొత్తంగా 72% వ్యవసాయ కూలీలు పెరిగారు. వ్యవసాయ పంటలో ½ భాగం ,2/3 భాగం కౌలు రూపంలో వసూలు చేసేవారు.
తెలంగాణ సాయుధ పోరాటంకు ప్రధాన కారణాలుగా కౌలుదారులు, భూస్వాములు, రజాకారులు అతి ముఖ్యంగా నిజాం నవాబు, కాశీం రజ్వీ కారణాలుగా చెప్పవచ్చు. జెన్నా రెడ్డి ప్రతాపరెడ్డి నిరంకుశత్వానికి తిరుగుబాటుగా బండి యాదగిరి బండెనక బండి కట్టి అనే పాట రచించారు.ఈ సంగటన ఆధారంగా “మా భూమి” అనే సినిమా ను తేరకేక్కించారు.
వడ్డీ వ్యాపారం
ఉస్మాన్ అలీఖాన్ కాలంలో వడ్డీ వ్యాపారం నాగువడ్డి ప్రకారం జరుగుతుండేది. నాగు వడ్డి ప్రకారం అప్పు తీసుకుంటే ఒక సంవత్సరంలో రెట్టింపు అవుతుంది రెండు సంవత్సరాలలో 4
రెట్లు అవుతుంది.
రైతులపై ప్రభుత్వ లేవి పన్నులు
రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో తెలంగాణలోని ఆహారధాన్యాలను
యుద్దానికి సరఫరా చేయడం వలన ఆహార కొరత ఏర్పడింది అందువలన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1943
వ సంవత్సరంలో కొత్త పన్నుల
విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతి రెండు
రకాలుగా ఉంటుంది.
1. గల్లా లెవీ - ఈ పద్ధతి ప్రకారం ప్రతి రైతు ఒక ఎకరం పొలానికి 20 షేర్ల ధాన్యాన్ని పన్నుగా చెల్లించవలసి ఉంటుంది.
2. ఖుషి గల్లా - ఈ విధానం ప్రకారం రైతు తన ఇష్ట ప్రకారం ఎంత
ధాన్యం అయినా ఇవ్వవచ్చు.
ఈ గల్లా లేవి పద్ధతి వలన తాను పండించిన వరి ధాన్యంలో
మరియు ఇతర ఆహార ధాన్యాలలో కొంత భాగాన్ని నిజాం ప్రభుత్వం
నిర్ణయించిన రేటు ప్రకారం అమ్మవలసి వచ్చేది.
ఈ లేవి ప్రకారం రైతులు వాణిజ్య పంటలు పండించకూడదు. ఈ విధానం ప్రకారం ధాన్యం నిల్వ చేసుకోవడానికి రైతులకు వీలుండేది కాదు. ఈ విధానానికి వ్యతిరేకంగా మాచిరెడ్డి పల్లి, ఆకునూరు ఉద్యమాలు జరిగాయి.
వెట్టిచాకిరీ విధానం
వెట్టిచాకిరి చేసే వారిలో దళితులు అధికంగా ఉండేవారు దళితులకి, పేదవారికి డబ్బు ఆశ చూపించి అనేకమందిని
మహ్మదీయులుగా మార్చారు. మాలలు గ్రామ సేవకులుగా (నిరటి, మస్కురు, తలారి) పని చేశారు.
·
మాదిగలు అగ్రవర్ణాల వారికి
తోలు పనిముట్లు సమకూర్చేవారు.
·
పటేల్ వ్యవస్థలలో
వార్తలు
మోయడానికి మాలలు ఉపయోగపడేవారు.
·
బోయ, బెస్త కులస్తులు పల్లకిలు మోయడానికి ఉండేవారు. నిజాం ప్రభుత్వ
అధికారాలు గ్రామాలను సందర్శించినప్పుడు మంగలి కులస్తులు చావడి శుభ్రం చేయడానికి
మరియు వాళ్లకు ఆహారం అందించడానికి ఉండేవారు.
· ఈ విధంగా వెట్టిచాకిరి విధానం తెలంగాణలో అధికంగా ఉండేది. ఈ వెట్టిచాకిరీ విధానంపై సుద్దాల హనుమంతు “వెట్టి చాకిరి విధానమేమి రైతన్న” అనే పాటను రాశాడు.
రాజకీయ కారణాలు
భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి
ప్రధాన కారణం భారత జాతీయ కాంగ్రెస్. భారత జాతీయ కాంగ్రెస్
హైదరాబాద్ సంస్థానం లో జాతీయ ఉద్యమానికి ప్రోత్సాహం ఇచ్చినప్పటికీ నిజాంను ఎధిరించడంలో కొద్దిగా విఫలం అయిందని,
నిజాం ప్రభుత్వంను, రజాకార్లను ఎదిరించడానికి తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఎంతో
బలంగా తయారైందని కమ్యూనిస్టులు అన్నారు.
రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి 1940లో
కమ్యూనిస్టు పార్టీనీ హైదరాబాదులో స్థాపించి తెలంగాణలోని
ప్రజలను సాయుధ పోరాటంలో పాల్గొనే విధంగా కృషి చేశాడు.
కృష్ణా జిల్లాలోని
కంకిపాడు వద్ద రావినారాయణరెడ్డి,బద్దం ఎల్లారెడ్డి,
హనుమయ్యలకు ఎన్.జి.రంగా కమ్యూనిటీ
సిద్ధాంతాలపై శిక్షణ ఇచ్చాడు. కమ్యూనిస్టు సిద్ధాంతాలను తెలంగాణాలోని అనేక మారుమూల
ప్రాంతాల్లోనీ ప్రజలకు తెలియజేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న 90% ప్రజలు నిరక్షరాస్యులు.
ఈ కమ్యూనిస్టు పార్టీలో పాల్గొన్న రైతుల
దాడుల వలన దాదాపు 4000 గ్రామాల్లో నిజాం ప్రభుత్వం నామరూపం లేకుండా పోయింది.
దీనిని బట్టి తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ ఎంతగా బలం పుంజుకుందో అర్థం చేసుకోవచ్చు.
మరొక ముఖ్యమైన ఉదాహరణ ఏమిటంటే తెలంగాణలో పార్లమెంటు స్థానాల్లో కమ్యూనిస్టు పార్టీ మూలాలు ఉన్న నాయకులు అత్యధిక పార్లమెంట్ స్థానాలు అత్యధిక మెజారిటీతో గెలిచాయి. రావి నారాయణరెడ్డి నల్గొండ ప్రాంతం నుండి దేశంలోనే అత్యధిక మెజారిటీతో(జవహర్లాల్ నెహ్రూ కంటే) పార్లమెంటుకు సభ్యత్వానికి ఎన్నికయ్యాడు. మొదటి సార్వత్రిక ఎన్నికల సమయంలో కమ్యూనిస్టు పార్టీపై తాత్కాలిక నిషేదము ఉన్నందువలన కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు పీపుల్స్ డెమోక్రటిక్ ఫెడరేషన్ పార్టీ నుండి పోటీ చేశారు.
తెలంగాణ విమోచన ఉద్యమం సమయంలో ప్రచురించబడిన గ్రంథాలు
·
వీర తెలంగాణ, నా జీవన
పధంలో - రావి
నారాయణరెడ్డి
·
నా అనుభవాలు, జ్ఞాపకాలు - రావి నారాయణరెడ్డి
·
తెలంగాణ పోరాట స్మృతులు - ఆరుట్ల
రామచంద్రారెడ్డి
· వీర తెలంగాణ విప్లవ పోరాటం – చండ్రపుల్లారెడ్డి
తెలంగాణ విమోచనోద్యమ సమయంలో వచ్చిన పాటలు
·
సుద్దాల హనుమంతు - పల్లెటూరి
పిల్లగాడ పశువుల గాసే మొనగాడా, వెయ్యి వెయ్యి
·
బండి యాదగిరి - బండెనక బండి
కట్టి పదహారు బండ్లు కట్టి
·
దాశరథి కృష్ణమాచార్యులు - నా తెలంగాణ కోటి రతనాల వీణ
·
తిరునగరి రామాంజనేయులు – సై సై గోపాలరెడ్డి నీవు నిలిచిన ప్రాణాలు ఒడ్డి, జ్వలిత జ్వాల
· విశాలాంధ్ర - తెలంగాణ పోరాట గేయాలు
తెలంగాణ విమోచనోద్యమ సమయంలో వచ్చిన కవిత్వం
·
దాశరథి కృష్ణమాచార్య – అగ్నిధార, రుద్రవీణ, మహోద్రయం
·
కాలోజి నారాయణరావు – నా గొడవ
·
సి నారాయణ రెడ్డి - మంటలు మానవుడు, అక్షరాల గవాక్షాలు.
·
పొట్లపల్లి రామారావు - ఆత్మ వేదన
·
అనిశెట్టి సుబ్బారావు - అగ్నివీణ
·
నరప రెడ్డి – నా వీణ
·
కుందుర్తి ఆంజనేయులు - తెలంగాణ
·
రెంటాల గోపాలకృష్ణ – సప్త యాగం
No comments:
Post a Comment