కుతుబ్ షాహిలు
Part2
Qutb Shahi dynasty in Telugu
కుతుబ్ షాహీల గొప్పతనం:-
● కాకతీయుల కాలంలో గోల్కొండ
కోటపై గొర్రెల కాపరి అమ్మవారి విగ్రహాన్ని కనుగొనడంతో కాకతీయ రాజులు అప్పట్లో
అక్కడ మట్టితో ఒక నిర్మాణం చేశారు. కాలాలు మారినా ఇప్పటికీ అమ్మవారి
విగ్రహం ప్రతి రోజూ పూజలు అందుకుంటూనే ఉంది. బోనాల జాతర లో మొదటిసారిగా
ఇక్కడి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు.
●
కుతుబ్షాహి రాజులు ముస్లింలు అయినప్పటికీ గ్రామాలలో పన్నులు వసూలు చేయడానికి హిందువులను నియమించేవారు .
● “ట్రావెర్నియర్” అనే యాత్రికుడు బహుదేవతారాధన ,సతీ సహగమనం, మూఢనమ్మకాలు అనేకం ఉండేవి అని రాశాడు.
రవాణా వ్యవస్థ
●
వీరి కాలంలో లో రవానా మీద సాయరి పన్నులు వేసేవారు
●
షేర్వానీ ప్రకారం వీరి రాజ్యంలో 6 రాజ మార్గాలున్నాయి
1. సూరత్ - హైదరాబాద్
2. హైదరాబాద్ -గండి కోట మరియు
మద్రాస్
3. హైదరాబాద్ - మచిలీపట్నం
4. మచిలీపట్నం - శ్రీకాకుళం
5. మద్రాసు - విజయవాడ
6. హైదరాబాద్ - బీజాపూర్ మరియు
గోవా
ఆర్థిక పరిస్థితులు
నాణెములు
●
ఫ్రెండ్స్ యాత్రికుడు “థెవ్ నట్” అభిప్రాయం ప్రకారం గోల్కొండ
రాజ్యం లో రాగి నాణెముల ముద్రించేవారు , గోల్కొండ
రాజ్యం లో హునాలు అనే బంగారు నాణెములు చెలామణి అయ్యేవి.
●
ఇబ్రహీం కుతుబ్ షా కాలం నుండి రాగి నాణెముల
ముద్రణ ప్రారంభమయింది.
●
కుతుబ్షాహీల నుండి నాణెముల ముద్రణ కొరకు
డచ్ వారు అనుమతి పొందారు. వీరు తొలి సారిగా కుతుబ్షాహీల
నుండి ముద్రణ కొరకు అనుమతి పొందిన తొలి విదేశీయులు, వీరు నాగపట్నం ప్రాంతంలో
తమ ముద్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
●
క్రీస్తుశకం 1636 లో “ఇంకియద్ నామా” అనే లొంగుబాటు పత్రంతో నాణెములు ముద్రించారు.
● కుతుబ్షాహీల సమాచార వ్యవస్థను
గురించి వర్ణించిన ఫ్రెంచి యాత్రికుడు “ట్రావెర్నియర్”
●
వీరి కాలంలో ప్రముఖ రేవు పట్టణాలు
భీమునిపట్నం, పులికాట్ ,మచిలీపట్నం,
నరసాపురం.
●
ఈ రేవు పట్టణాలలో శిస్తు వసూలు చేసే అధికారాన్ని వేలంపాటలో అమ్మేవారు.
●
ఈ వేలం పాటలో అధికారం తీసుకున్న వారిని ముస్తజేర్లు అని అంటారు.
నీటిపారుదల మరియు వ్యవసాయం
●
వీరి కాలంలో ప్రధానంగా భూములు రెండు రకాలుగా ఉండేవి అవి
1. జమిందారీ భూములు
2. హవేలీ భూములు
జమిందారీ భూములు
●
ఇటువంటి భూములలో రైతులకు కావలసిన సదుపాయాలను కల్పించి వారి నుండి పన్నులు
వసూలు చేయడం భూస్వాముల ముఖ్య పని.
●
దీనికి ప్రతిఫలంగా వీరికి పన్నులు
లేని కొన్ని భూములను ఇస్తారు ఈ భూములను సావరం అని అంటారు.
హవేలి భూములు
●
ఇది కోటలకు ,రాజధానికి సమీపంలో ఉండే ప్రభుత్వ భూములు ఈ పద్ధతి వలన మధ్యవర్తుల
ప్రమేయం లేకుండా రైతులు నేరుగా ప్రభుత్వానికి పన్నులు చెల్లించే అవకాశం ఈ పద్ధతిలో
కల్పించడం జరిగింది.
●
గ్రామాలలో రెండు రకాల రైతులు ఉండేవారు వారిలో
1.
కడెంరైతులు- ఈ
రైతులకు భూమి వంశపారంపర్య హక్కులు ఉండవు పన్ను చెల్లించినంతకాలం భూమిపై యాజమాన్యం ఉంటుంది.
2.
పైయ్కారి రైతులు - కడెం రైతుల దగ్గర కౌలుకు తీసుకొని పంటలు పండించే వారు .
●
కుతుబ్షాహీల కాలంలో చెరువు గట్ల
మరమ్మత్తు చేయించడానికి వడ్డెరలను నియమించేవారు.
●
ఉప్పు, తమలపాకులు మరియు పొగాకు పంటల పై ప్రభుత్వానికి గుత్తాధిపత్యం ఉండేది.
●
గ్రామాలలో భూమిశిస్తు విధించడం అనేది రెండు రకాలుగా జరిగేది అందులో
1.
వీసబడి పద్ధతి
2.
పాలు పద్ధతి
వీసబడి పద్ధతి
●
ఈ పద్ధతిలో మొదట నేలను స్వభావాన్ని బట్టి విభజిస్తారు.
●
రైతులకు ఉన్న పశుబలం మరియు సాధనా సామర్ధ్యం బట్టి గ్రామ పెద్ద వారికి
భూములను పంచుతారు ఆ విధంగా పొందిన భూమిపై రైతు భూమి శిస్తు చెల్లించడం జరిగేది.
పాలు పద్ధతి
●
పొలంలో అన్ని ఖర్చులను ప్రభుత్వం భరిస్తే వచ్చే పంట లో 1/4 వంతు మాత్రమే
రైతులకు చెందుతుంది.
●
ఒకవేళ ఖర్చులను రైతు భరిస్తె
వచ్చే పంట లో సగభాగం రైతులకు చెందుతుంది.
బరువులు కొలతలు
వస్తువులు |
కొలతలు |
వజ్రాలు |
గురువింద గింజ |
దూరాలు |
కోసులు (5 కోసులు = 8 మైళ్ళు) |
బట్టల పొడవు |
హస్తం లేదా మూర |
పరిశ్రమలు
వజ్ర పరిశ్రమలు
●
గోల్కొండ రాజ్యం లో వజ్రాల వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది.
●
గోల్కొండ కోటలో వజ్రాల వ్యాపారం జరిగే చోటును “మోతి దర్వాజా” అంటారు
●
కొల్లూరు( గుంటూరు జిల్లా)
పరిటాల (కృష్ణాజిల్లా) కోలార్ (కర్ణాటక) గుడి కోట(కడప
జిల్లా) రామప్ప కోట (అనంతపూర్ జిల్లా) ముఖ్యమైన వజ్రాల గనులు.
●
కృష్ణా తీరం వెంబడి దాదాపుగా 23 వజ్రాల గనులు ఉండేవని అంటారు.
●
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన “కోహినూర్ వజ్రం” కొల్లూరులో లభించింది
●
వజ్రగనుల కార్మికుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని మేత్ వోల్ట్
అనే ఫ్రెంచి యాత్రికుడు పేర్కొన్నారు.
●
నరసాపురం నౌకా నిర్మాణానికి ప్రసిద్ధి చెందిన పట్టణం.
●
ఓడరేవుల దగ్గర దిగుమతి వస్తువులపై
3.5% విలువను సుంకం గా ప్రభుత్వానికి
చెల్లించేవారు .
●
పులికాట్ సరస్సులో మాత్రం 2%
చెల్లించేవారు, ఓడరేవులో లంగరు వేస్తే పదిహేను హౌనుల సుంకం చెల్లించేవారు.
● వీరి కాలంలో వస్తువులకు ప్రసిద్ధి
చెందిన ప్రాంతాలు
డమాస్కస్ కత్తులు |
గోల్కొండ |
కత్తులు |
ఇందూర్ |
నౌక నిర్మాణాలు |
కోరంగి, నర్సాపూర్ |
తుపాకులు, తెరచాపల బట్ట తయారీ |
మచిలీపట్నం |
కొయ్య బొమ్మలు |
కొండవల్లి |
గోల్కొండ తివాచీలు |
ఓరుగల్లు, గోల్కొండ |
నగిషీ పనులు |
విశాఖపట్నం |
కట్టే హస్త కళా ఖండాలు |
నర్సాపురం |
ఆయుధ పరిశ్రమ (ఇనుము ఉక్కు) |
ఇందల్వాయి, కోనసముద్రం |
కవులు మరియు రచనలు
ఇబ్రహీం కుతుబ్ షా
●
వీరికాలంలో సుల్తానులు స్వయంగా కవులు మరియు పండితులు.
● ఇబ్రహీం కుతుబ్ షా “మల్కిభరాముడు” గా ప్రసిద్ధి చెందాడు.
●
ఇతను కవిసమ్మేళనాలు ఏర్పరిచి (తెలుగు and ఉర్దూ) కవులను పండితులను సత్కరించే
వాడు.
●
ఇతని ఆస్థాన కవులు
● కందుకూరి రుద్రకవి –రచనలు
1.
సుగ్రీవ విజయం (యక్షగానం)
2. నిరంకుశోపాఖ్యానం (ప్రబంధం)
3. బలవదరి (శతకం)
4. జనార్దనాష్టకములు (శతకం)
●
ఇబ్రహీం కుతుబ్ షా కందుకూరి
రుద్రకవి కి నెల్లూరు జిల్లాలోని రెంటచింతల లేదా చింతలపాలెం అనే గ్రామాన్ని
దానం చేశాడు.
●
పొన్నగంటి తెల్లగనార్యుడు- యయాతి చరిత్ర ( అచ్చతెలుగు కావ్యం) దీనిని పటాన్చెరు
సర్దార్ అమీర్ ఖాన్ కు అంకితం చేశాడు.
● అద్దంకి గంగాధర కవి- తపతీ సంహారణోపాఖ్యానం (ఇబ్రహీం కుతుబ్ షా కి అంకితం చేశాడు).
●
కృష్ణయామాత్యుడు- రాజనీతి
రత్నాకరం
●
ఫేరోజ్ – తేసల్ నామా
మహమ్మద్ కులీ కుతుబ్ షాకాలంలో
●
మహమ్మద్ కులీ కుతుబ్ షా ఉర్దూభాషలో మరియు పారశీక భాషలలో
కావ్యాలు రాశాడు.
●
ఇతని కలం పేరు “మాని” మరియు ఇతని కవిత్వ సంకలనం ను
“కులియత్ కులి” అని అంటారు.
తెలుగు కవులు
●
సారంగు తమ్మయ్య- వైజయంతి విలాసం
●
చరికొండ నరసింహ కవి -
శశిబిందు చరిత్ర
●
రాజ మల్లారెడ్డి -శివధర్మోత్తర,పద్మ పురాణం, షాట్చక్రవర్తి చరిత్ర
●
వెల్లుట్ల నారాయణ కవి- వజ్ర అభ్యుదయం
●
బాల సరస్వతి మరియు తురుగ రాజకవి
వీరు కులికుతుబ్షా కాలం నాటి జంటకవులు వీరి రచన నాగర ఖండం.
ఉర్దూ కవులు
●
మీర్జా మహమ్మద్ అమీన్ -లైలా మజ్ను (ఉర్దూ)
●
గులాం అలీ -పద్మావతి
(షేర్ షా ఆస్థానకవి అయినా మాలిక్ మహమ్మద్ జైసి హిందీలో రచించిన పద్మావతి అనే పుస్తకాన్ని
ఉర్దూలో అనువదించాడు).
అబ్దుల్లాకుతుబ్ షా కాలంలో
క్షేత్రయ్య
●
అబ్దుల్లా కుతుబ్ షా క్షేత్రయ్యను
ఆదరించాడు. ఇతను కృష్ణాజిల్లాలో మొవ ప్రాంతంలో జన్మించాడు ఇతని అసలు పేరు వరదయ్య
,క్షేత్రయ్య బిరుదు “పద కవితా పితామహుడు”, ఇతని రచనలను మువ్వగోపాల పదాలు అంటారు ఇతను
4,500 కీర్తనలను రచించాడు.
వేమన
●
ఇతను ప్రధానంగా మానవత్వంపై మూఢనమ్మకాలను
పారద్రోలుతకు రచనలు చేశాడు.
●
ఇతను తన పద్యాలను ఆటవెలది ఛందస్సులో రచించాడు.
●
ఇతను వేదాలను, విగ్రహారాధనను,
శ్రద్ధ కర్మలను,యజ్ఞాలను విమర్శించాడు.
నాట్యాలు
●
ప్రదర్శనలకు ప్రదర్శన కారులకు సమాజంలో గౌరవం అందించడానికి సిద్ధేంద్ర
యోగి ఒక శాసనం వేయించాడు. ఈ శాసనం ప్రకారం స్త్రీల వేషాలు
వేయకూడదు.
●
కూచిపూడి నాట్యానికి మూల పురుషుడు
సిద్ధేంద్ర యోగినే.
●
కూచిపూడి నాట్య సంప్రదాయాల్లో ప్రదర్శించే ఉషాపరిణయం, గొల కలాపం, భామాకలాపం ముఖ్యమైనవి .
●
అబుల్ హసన్ తానీషా గారు కూచిపూడి భాగవతుల కూచిపూడి అనే గ్రామాన్ని ఇనాముగా
ఇచ్చాడు.
రామదాసు (కంచర్ల గోపన్న)
● ఈ కాలం నాటి ప్రముఖ వాగ్గేయకారుడు
కంచర్ల గోపన్న.
●
,ఆనందభైరవి రాగంతో కీర్తనలు చేసిన మొదటి వాగ్గేయకారుడు రామదాసు
●
ఇతని శతకం దాశరథి శతకం
● రామదాసు యొక్క కొన్ని కీర్తనలు-
పలుకే బంగారమాయెనా
ఎటుబోతివో రామ ఎటు పోతివి
ఇక్ష్వాకు కుల తిలక ఇకనైన పలుకవే
వీరి ప్రముఖ నిర్మాణాలు
●
వీరి కాలంలో పారశీక మరియు హిందూ సంప్రదాయాల సమ్మేళనం తో
ఇండో శర్షసానిక్ అనే కొత్త మిశ్రమ శైలి పుట్టింది.
●
ఈ శైలిని కులీకుతుబ్షా ప్రారంభించగా అబుల్ హసన్
కాలంలో అభివృద్ధి జరిగింది.
● ఇబ్రహీం కుతుబ్ షా నిర్మాణాలు-
1.
ఫుల్ బాగ్
2. లంగర్ హౌస్
3. ఇబ్రహీం బాగ్
4. ఇబ్రహీంపట్నం తాటకం
5. గోల్కొండ దుర్గా ప్రకారం ,
6. మూసీ నదిపై వంతెన (పురానాపూల్) 1578లో
7. హుస్సేన్ సాగర్ -ఇబ్రహీం కుతుబ్ షా యొక్క అల్లుడు హుస్సేన్ షావలి దీన్ని నిర్మించాడు.
మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మాణాలు
a.
హైదరాబాద్-( ఇరాన్ లోని ఇర్ఫాహన్ నగర నమూనా ఆధారంగా నిర్మించారు)
b.
చార్మినార్
c.
చార్ కమాన్
d.
దారుల్ షిఫా (యునాని ఆరోగ్య కేంద్రం)
e.
దాదు మహల్ (న్యాయస్థానం)
f.
జామా మసీద్ -గోల్కొండకోటలో రెండు మినార్ల తో నిర్మించబడింది.
సుల్తాన్ మహమ్మద్ కుతుబ్షా నిర్మాణాలు
●
మక్కా మసీదు దీనిని 1614 లో ఇతను ప్రారంభించగా ఔరంగజేబు
దీన్ని పూర్తి చేశాడు.
●
ట్రావెర్నియర్ అనే విదేశీ
యాత్రికుడు “మక్కా మసీదు” నిర్మాణం గురించి పేర్కొన్నాడు.
అబ్దుల్లా కుతుబ్ షా నిర్మాణాలు
●
షేక్పేట్ మసీదు -దీనిని అబ్దుల్లా కుతుబ్ షా(1633) నిర్మించాడు .
దీనిపై నిర్మాణపు తేదీ ,సుల్తాన్ పేరు చెక్కబడి ఉంది.
●
టోలి మసీదు-అబ్దుల్లా కుతుబ్ షా యొక్క గృహ నిర్మాణాలను పర్యవేక్షించే
అధికారి అయినా మూసాఖన్ 1671 లో ఈ మసీదు నిర్మించాడు ఈ మసీదు లో హిందూ దేవాలయం
మరియు ముస్లిం మసీదుల వాస్తు శైలి ఉంటుంది.
●
హయత్ నగర్ రాజప్రసాదం-అబ్దుల్లా కుతుబ్ షా తన తల్లి అయిన హయత్
బక్షి బేగం పేరుమీద అ హయత్నగర్ ను నిర్మించాడు. ఇది ఇది ఫ్రెంచ్ రాజప్రసాదం
అంత మనోహరంగా ఉండేదని ట్రావేర్నియర్ అని చరిత్రకారుల అభిప్రాయం.
●
తారామతి మసీదు- తారామతి పేరుమీద ఈ మసీదును హిందూ మరియు ముస్లిం వాస్తు
శైలి తో నిర్మించారు.
●
అబుల్ హసన్ తానీషా ముషీరాబాద్ షియా మసీదును 5 ఆర్చరీలతో నిర్మించాడు.
కుతుబ్ షాహీ సమాధులు
గోల్కొండ కోట పక్కన వీరి రాజవంశీయుల సమాధులు దాదాపు 30కి పైగా ఉన్నాయి. కుతుబ్షాహి రాజులు సమాధులు ముఖ్యమైనవి.
1. సుల్తాన్ కులీ -చతుర్భుజ ఆకారంలో
2. మహమ్మద్ కులీ- 42.5 మీటర్ల ఎత్తు
3. జంశిర్ - అష్టభుజ ఆకారంలో
4. హయత్ బక్షి- సమాధి ముందు ఫౌంటెయిన్ లతో
5. అబ్దుల్లా- రాజ చిహ్నలతో వీధి సమాధులు
నిర్మించడం జరిగింది.
ReplyDeleteAmazing post about government jobs age limit 35 years
in this blog hopes more people reaching your blog because you are sharing good information.
I noticed some useful tips from this post. Thanks for sharing this.
Thank you very much For the appreciation
Delete