Nuclear power plants in India
భారతదేశంలోని అణువిద్యుత్
ఉత్పత్తికేంద్రాలు
అణుశక్తి సంప్రదాయ వనరులకు చెందినది.
సంప్రదాయ వనరులు అనగా ఒకసారి వినియోగంతో అంతమై పోయే వనరులను సంప్రదాయ వనరులు
మరియు “నాన్ రెన్యువబుల్ రిసోర్సెస్” అంటారు.
ఉదా :- బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, అను శక్తి.
ప్రస్తుతం మన భారతదేశంలోని అణువిద్యుత్ కేంద్రాలు అన్నీ కలిపి ఉత్పత్తి చేయబడుతున్న విద్యుత్ – 6780 MW.
అను విద్యుత్ అనేది భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి వనరులలో నాలుగవ ప్రధానమైనది.
భారత దేశ అణు శాస్త్ర పితామహుడు - హోమి జహంగీర్ బాబా.
భారతదేశంలో మొట్ట మొదటి అణు విద్యుత్ ఉత్పత్తి
కేంద్రం మహారాష్ట్రలోని తారా
పూర్ లో 1969
అక్టోబర్ 28 న ప్రారంభించడం జరిగింది.
అణు విద్యుత్ ఉత్పత్తి
అణువుల నుండి ఉత్పత్తి చేయబడే శక్తినీ
అణు శక్తి అంటారు.ఈ అణు శక్తితో తక్కువ ఖర్చులో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. 1970
కాలంలో విదేశాలలో జరిగిన కొన్ని యుద్ధాల వలన పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాల కొరత
ఏర్పడటం వల్ల అను శక్తిపైన ఎక్కువ శ్రద్ధ వహించారు. అను శక్తిని(న్యూక్లియర్
ఎనర్జీ) విమర్శించే వాళ్ళు కూడా అధికం అయ్యారు. ఎందుకంటే 1986 లో చేర్నబిల్ అణు
దుర్ఘటన, 1979 లో అమెరికాలో ఉన్న త్రిమైల్ దీవి దుర్ఘటన, 2011 లో జపాన్లో సునామీ
రావడంతో పుకుషిమ దైచి అణు విస్పోటనం జరగడం వలన కలిగిన ప్రాణ నష్టం వలన
వ్యతిరేకించిన వాళ్లు కూడా ఉన్నారు.
అణు ఇంధనాలు
1. యురేనియం
ప్రపంచ యురేనియం నిల్వలల్లో భారత
యూరెనియం శాతం – 1.4%. యూరేనియం యొక్క ముడి పదార్థం పిచ్ బ్లెండ్.
2. ప్లుటోనియం
యురేనియం నుండి ఏర్పడే పదార్థం ఇది.
అంటే కృత్రిమమైనది.
3. ధోరియమ్
దోరియం నిల్వల్లో భారతదేశం మొదటి స్థానంలో(32%) కలదు.అయితే దోరియంను ఇంధనంగా వాడే సాంకేతిక పరిజ్ఞానం భారతదేశంలో ఇంకా అభివృద్ధి చెందలేదు. ధోరియం కేరళ బీచ్ లో మొనోజైట్ ఇసుక రూపంలో లభిస్తుంది.
మన భారతదేశంలో ముఖ్యంగా యురేనియం ఇంధనాన్ని ఉపయోగించి అణు విద్యుత్ ను ఉత్పత్తి చేస్తారు.
మన భారతదేశంలో ప్రస్తుతం 7 అణువిద్యుత్ కేంద్రాలు మరియు 22 న్యూ క్లియర్ రియాక్టర్లు కలవు. అవి
1.
కుదంకులం ( తమిళనాడు)
– 2000 MW.
·
ఈ అను విద్యుత్ కేంద్రం 2013 సంవత్సరంలో రష్యా దేశ సహకారంతో
నిర్మించడం జరిగింది.
·
ప్రస్తుతం భారతదేశంలో సామర్థ్యం పరంగా అతిపెద్ద అణు విద్యుత్
కేంద్రం.
·
దీని యొక్క సామర్థ్యం 2000 మెగావాట్లు.
2.
తారపుర్ ( మహారాష్ట్ర)
– 1400 MW
·
దీని పూర్తి పేరు తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ (TAPS) అంటారు.
·
దీని యొక్క సామర్థ్యం 1400 మెగావాట్లు.
·
ఈ అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం 1963 సంవత్సరంలో భారత్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఒప్పంద
ప్రాతిపదికన రెండు వేడి నీటి రియాక్టర్ ల తో నిర్మించబడింది.
·
ఇది ఆసియాలోనే మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం.
·
ఈ అణు విద్యుత్ కేంద్రం 1969 అక్టోబర్ 28న వాణిజ్య
కార్యకలాపాల కోసం 2 యూనిట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
·
ప్రస్తుతం ఇది భారత్లో రెండవ అతిపెద్ద అను విద్యుత్ కేంద్రం.
·
ఇక్కడ గల అను యాక్టర్ – అప్సర.
3.
రావత్ బాట (రాజస్థాన్)
-1180 MW
·
అను విద్యుత్ కేంద్రం 1973 డిసెంబర్ 16 కెనడా దేశ సహకారంతో
ఏర్పాటు చేశారు.
·
దీని సామర్థ్యం -1180 మెగావాట్లు.
·
దీనిని కోట అణు విద్యుత్ కేంద్రం అని మరియు రావత్ బాట అటామిక్ పవర్
స్టేషన్(RAPS) అని
కూడా అంటారు.
·
ఈ అణు విద్యుత్ కేంద్రం చంబల్ నది ఒడ్డున కలదు.
4.
కైగా (కర్నాటక)
– 850MW.
·
ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని 2000 నవంబర్ 16న స్థాపించారు.
·
ఈ అభివృద్ధి కేంద్రం కర్ణాటకలోని కాళీ నది ఒడ్డున కలదు.
·
ఈ అణువిద్యుత్ కేంద్రం యొక్క సామర్థ్యం 850 మెగావాట్లు.
5.
కల్పకం ( తమిళనాడు)-
440 MW
·
ఈ అను విద్యుత్ కేంద్రం 1984 జనవరి 24న స్థాపించారు.
·
దీని సామర్థ్యం -440MW.
·
దీనిని ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్(IGCAR) అని అంటారు.
·
దీనిని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు.
·
న్యూక్లియర్ రియాక్టర్ – కామిని.
6.
నరొరా (ఉత్తర
ప్రదేశ్)-440MW
·
1991 జనవరి 1 న ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని
స్థాపించారు.
·
ఈ అణు విద్యుత్ కేంద్రం ఉత్తరప్రదేశ్‌లోని వ్యవసాయ క్షేత్రాలకు మరియు ఢిల్లీ
పట్టణానికి విద్యుత్ సరఫరా చేస్తుంది.
·
దీని సామర్థ్యం 440 మెగావాట్లు.
7.
కొక్రపార ( గుజరాత్ )
– 440 MW
·
ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని 1996 మే 6న స్థాపించారు.
·
ఈ అణువిద్యుత్ కేంద్రం గుజరాత్‌లోని తపతి నది ఒడ్డున కలదు.
· దీని సామర్థ్యం 440 మెగావాట్లు.
Casino Queen Casino & Hotel | Mapyro
ReplyDeleteView detailed 성남 출장마사지 information and reviews 양산 출장샵 of Casino Queen Casino 삼척 출장마사지 & Hotel in 남양주 출장마사지 El Paso, including address, telephone number, 안양 출장마사지 map, hours, map,