హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్(1938)Hyderabad State Congress-1938
హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్
భారత జాతీయ కాంగ్రెస్ 1885 డిసెంబర్ 28న స్థాపించడం జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ భారత దేశంలో బ్రిటిష్ వారి
వలస విధానాలకు వ్యతిరేకంగా స్థాపించడం జరిగింది.
మొదట్లో జాతీయోద్యమం బెంగాల్, కలకత్తా, ఢిల్లీ ప్రాంతాలలో మాత్రమే జరిగేది. జాతీయోద్యమాన్ని దేశమంతటా నడిపించడంలో భారత జాతీయ కాంగ్రెస్ కీలక పాత్ర పోషించడం జరిగింది.
భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ వారి
ఆర్థిక, సామాజిక దోపిడికి వ్యతిరేకంగా ఎంతగానో కృషి చేసింది. భారత జాతీయ కాంగ్రెస్
బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో మాత్రమే కాదు స్వదేశీ సంస్థానాల పైన కూడా తన ప్రభావాన్ని
చూపించింది.
కొంత మంది ప్రజల అభిప్రాయం ప్రకారం భారత జాతీయ కాంగ్రెస్ స్వదేశీ సంస్థానాల పైన ప్రభావం ఎక్కువగా చూపించక పోయినప్పటికీ భారత జాతీయ కాంగ్రెస్ భారతదేశానికి స్వతంత్రం ఏర్పడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. అయితే ఈ భారత జాతీయ కాంగ్రెస్ హైదరాబాద్ సంస్థానంపై ఎలాంటి ప్రభావం చూపిందో తెలుసుకుందాం.
●
సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత వహించిన హరిపుర కాంగ్రెస్ సమావేశానికి హైదరాబాద్ సంస్థానం
నుండి పెద్ద మొత్తంలో ప్రజలు హాజరయ్యారు. ఈ
సమావేశంలో దేశీయ సంస్థానాల గురించిన తీర్మానం ఆమోదించారు.
●
హైదరాబాద్ పరిషత్ సమావేశం 1938
జనవరిలో మాడపాటి హనుమంతరావు అధ్యక్షతన జరిగింది.
● “హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్” 1938 జూలై లో ఏర్పడింది. హైదరాబాద్
రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పాటు చేయడంలో స్వామి రామానంద తీర్థ కీలక పాత్ర పోషించాడు.
●
రామానంద తీర్థ 1938 సెప్టెంబర్ 9న
హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ మహా సభను నిర్వహించాలని పేర్కొన్నాడు. కానీ సెప్టెంబర్ 8న హైదరాబాద్ రాష్ట్ర
కాంగ్రెస్ పై నిజాం ప్రభుత్వపు హైదరాబాద్ ప్రధాని అక్బర్ హైదరి నిషేధం విధించాడు.
● హైదరాబాద్
స్టేట్ కాంగ్రెస్ లో కాంగ్రెస్ అనే పదం తీసివేస్తే
నిషేదం ఎత్తివెస్తాం అని నిజాం ప్రకటించింది.
● కాశీనాథ్
రావు వైద్య “హైదరాబాద్ నేషనల్ కాన్ఫరెన్స్” గా పేరు
మార్చాడు అయిన నిజాం ప్రభుత్వం నిషేదం ఎత్తివేయలేదు.
●
ఈ నిషేధం ఎత్తివేయాలని కాంగ్రెస్ నాయకుడు
అయిన మండముల నరసింహారావు అక్బర్ హైదరితో
ఐక్యత చర్చలు జరిపారు.ఈ చర్చలకు మధ్యవర్తి గా వ్యవహరించింది నవాబ్ బహదూర్ యార్జంగ్. ఈ చర్చలనే
సింగ్ - జంగ్ చర్చలు అంటారు.
● ఈ చర్చలు విఫలం అవడంతో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ 1938 అక్టోబర్ 24న వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమానికి మొదటి డిక్టేటర్ స్వామి రామానంద తీర్థ, చివరి డిక్టేటర్ కాశీనాథ్ రావ్ వైద్య.
సంస్థానాల ప్రతినిధుల సమావేశం
బ్రిటిష్ ప్రభుత్వం 1946లో భారత్ కు స్వాతంత్ర్యం
ఇవ్వబడుతుందని ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత 1946లో ఢిల్లీలో సంస్థానాల ప్రతినిధుల
సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి హాజరైన హైద్రాబాద్ స్టేట్ కాంగ్రెస్
నాయకులు స్వామి రామానంద తీర్థ మరియు బూర్గుల రామకృష్ణారావు. ఈ సమావేశం
అనంతరం నెహ్రూ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షునిగా
రామానంద తీర్థను నియమించాడు.
1946 జూలైలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్
పై ఉన్న నిషేధాన్ని తొలగించడం జరిగింది. 1947లో భారతదేశానికి స్వాతంత్రం రావడంతో
హైదరాబాదులో ఉన్న కాంగ్రెస్ నాయకులు స్వతంత్ర ఉత్సవాలను జరపడానికి సిద్దం అయ్యారు.
కానీ నిజాం స్వాతంత్ర ఉత్సవాలను నిషేధించింది. నిజాం ప్రభుత్వం ముందస్తు చర్యగా స్వామి రామానంద తీర్థ, జి.ఎస్.మెల్కోటే, అచ్చుతరావులను అరెస్ట్ చేయించారు.
జెండా దినోత్సవ కార్యక్రమం
●
హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ 1947 సెప్టెంబర్ 2న జెండా దినోత్సవం జరపాలని పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో బత్తిని మొగిలయ్య
గౌడ్, రామస్వామి గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు రజాకార్లు వీళ్ళని హన్మకొండ కోటలో
కాల్చిచంపారు.
●
ఈ దమనకాండకు నిరసనగా స్టూడెంట్ యూనియన్
సెప్టెంబర్ 8న నిరసన దినం పాటించాలని పిలుపునిచ్చింది.
●
హైదరాబాదులో పరిస్థితి ఎలా ఉందో వివరించడానికి
నెహ్రూ దగ్గరకి హైదరాబాద్ స్టేట్ నాయకులు ఆయన కొండా వెంకట రంగారెడ్డి మరియు బుర్గుల రామకృష్ణారావు వెళ్ళారు.
●
హైదరాబాద్ సంస్థాన విషయంలో నెహ్రూ
సానుకూలంగా స్పందించలేదు. దీనితో కె.ఎం.మున్షీ సూచనలతో ముస్సోరిలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ ను కలిశారు.
●
45 రోజుల్లో హైదరాబాద్ సంస్థానానికి విమోచనం లభిస్తుందని సర్దార్ వల్లభాయ్
పటేల్ హామీ ఇచ్చారు. అతను అన్నట్లుగానే హైదరాబాద్ పై పోలీస్ చర్య చేపట్టి 1948 సెప్టెంబర్ 17 న భారత్లో విలీనం చేయడం జరిగింది.
Lucky Club Live - Live Casino website
ReplyDeleteLucky Club is one of the best providers for online gaming in the world and it has a luckyclub huge range of games that players can play at. They offer great