Directive Principles of State Policy
ఆదేశిక సూత్రాలు (నిర్దేశిక నియమాలు)
· భారత రాజ్యాంగంలో ఉన్న ఆదేశిక సూత్రాలు(నిర్దేశిక నియమాలు) ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించారు.
·
ఆదేశిక నియమాలు ప్రధాన ఉద్దేశం సంక్షేమ రాజ్య స్థాపన,
సామ్యవాద తరహా సమాజ స్థాపన, ఆర్దిక సామాజిక ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచి
అందరికీ సమాన అవకాశాలు కల్పించడం.
·
రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆర్టికల్ 36
నుండి 51 వరకు నిర్దేశిక నియమాలు పొందుపరచడం జరిగింది.
·
ఈ
ఆదేశిక సూత్రాలకు ఎలాంటి న్యాయసంరక్షణ లేదు కావున స్వయంగా ఇవి అమలులోకి
రావు, వీటిని అమలు
చేయడానికి న్యాయస్థానాల ద్వారా ఆదేశాలను పొందలేము.
·
ఇవి కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలకు
ముఖ్యమైన మార్గదర్శక సూత్రాలు.
·
భారతదేశంలో
ఆర్థిక సమానత్వాన్ని సాధించి, సమాజాన్ని సామ్యవాద తరహా సమాజంగా నిర్మించడం వీటి
ముఖ్య విధి.
·
ప్రభుత్వాలకు ఇవి మార్గదర్శక సూత్రాలు. ఇవి ఎల్లప్పుడు ప్రభుత్వానికి తన బాధ్యతను తెలియజేస్తాయి.
·
ఇవి
శాసనశాఖకు కార్యనిర్వహణ శాఖకు మార్గదర్శిగా మరియు స్నేహితుడిగా పనిచేస్తాయి.
·
ఆదేశిక
సూత్రాలను ప్రొఫెసర్ ఎం.పీ.శర్మ ,
ప్రొఫెసర్ జి.ఎన్.జోషి పలు రకాలుగా విభజించారు ఈ వర్గీకరణకు
రాజ్యాంగ బద్ధత లేదు. అవి
1.
సామ్యవాద
నియమాలు – ఆర్టికల్
37,38,39,41,42,43.
2.
గాంధెయ
నియమాలు - ఆర్టికల్ 40,46,47,48,49.
3.
ఉదారవాద
నియమాలు -ఆర్టికల్ 44,45,50,51.
ఆర్టికల్ 36 (రాజ్య నిర్వచనం)
·
12 వ
ఆర్టికల్లో ఉన్న విధంగానే రాజ్యం యొక్క నిర్వచనం ఉండును.
ఆర్టికల్ 37
·
ఇందులో
ఆదేశిక సూత్రాలు న్యాయ సంరక్షణ లభించదు అని,వీటిని న్యాయస్థానాల ద్వారా అమలు పరచలేము అని
స్పష్టంగా పేర్కొనడం జరిగింది.
ఆర్టికల్ 38
·
ప్రభుత్వం
సాంఘిక, రాజకీయ న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజాసంక్షేమం కోసం ఎల్లపుడూ కృషి చేయాలి.
ఆర్టికల్ 38(1)
·
ప్రకారం
ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వాలు సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని సమకూర్చే సాధనంగా
ఉండాలి.
Article 38(2)
·
ప్రకారం ప్రజల మధ్య ఆదాయ అసమానతలు
తగ్గించాలి. మరియు
హోదాలో అసమానతలను నిర్మూలించడానికి రాజ్యం ప్రత్యేక కృషి చేయాలి. ప్రజల మధ్య ఉన్న
ఆర్థిక స్థితిలో, పని ,ఉద్యోగ
అవకాశాలలో అసమానతలను నివారించాలి.
ఆర్టికల్ 39
·
ఆర్టికల్
39(a) పౌరులందరికీ స్త్రీ పురుష భేదం లేకుండా సమాన
జీవనోపాధిని కనిపించాలి.
·
ఆర్టికల్
39(b) దేశంలోని
వనరుల పంపిణీ సమాజ అభివృద్ధికి దోహదపడేలా నిర్వహించాలి.
·
ఆర్టికల్ 39(c)ఆర్థిక
వనరులు కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి .
·
ఆర్టికల్
39(d) స్త్రీలకు, పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.
·
ఆర్టికల్
39(e) ఆర్థిక దుస్థితి వల్ల కార్మికులు,
మహిళలు తన శక్తికి లేదా వయసుకు మించిన పని భారంతో వారి అనారోగ్యంపై దుష్ప్రభావం చూపే విధంగా
పని చేయమని బలవంతం పెట్టకూడదు.
·
ఆర్టికల్ 39(f) బాలలకి స్వేచ్ఛ మరియు గౌరవప్రదమైన
వాతావరణంలో వికాసం చెందడానికి అవసరమైన సదుపాయాలు కల్పించాలి.
ఆర్టికల్ 40
· గ్రామ పంచాయతీల ఏర్పాటు మరియు స్థానిక సంస్థల అభివృద్ధి ద్వారా సమీకృత గ్రామీణ అభివృద్ధి చేయాలని ఈ ఆర్టికల్ చెప్తుంది.
ఆర్టికల్ 41
· నిరుద్యోగులకు, వికలాంగులకు,వృద్ధులకు జీవన భృతిని కల్పించాలి. విద్యా హక్కును, పని హక్కును కల్పించాలి.
ఆర్టికల్ 42
· హేతుబద్ధమైన పని గంటలను, పనిచేయడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించేందుకు తోడ్పడాలి స్త్రీలకి ప్రసూతి సౌకర్యం కల్పించాలి.
ఆర్టికల్ 43
· సంపూర్ణం శారీరక వికాసం కోసం శ్రద్ధ వహించాలి కుటీర పరిశ్రమలను స్థాపించి ప్రజలకు ఉపాధి లబించెట్లు చర్యలు తీసుకోవాలి.
ఆర్టికల్ 44
·
ఈ ఆర్టికల్ ప్రకారం
దేశ ప్రజలందరికీ వర్తించేలా ఉమ్మడి సివిల్ కోడ్ రూపొందించాలి. దేశంలో ఉన్న
ప్రజలందరికీ ఒకే రకమైన క్రిమినల్ చట్టాలు ఉన్నాయి. కాని సివిల్ వ్యవహారాలు అయిన వివాహం,
ఆస్తి,వారసత్వం
మొదలైన వాటిలో మతాల వారీగా రకరకాల సంప్రదాయాలు ఉన్నాయి. అందువలన సామాజిక సామరస్యానికి,
జాతీయ భావానికి అనుగుణంగా ఒక ఉమ్మడి పౌర నియమం ఉండాలని ఈ ఆర్టికల్ పేర్కొంటుంది.
·
అయితే
ఇంతవరకు ఉమ్మడి పౌర నియమావళిని అమలు పరచలేదు ఇలా అమలుకు నోచుకోని ఏకైక ఆర్టికల్ 44 మాత్రమే.
·
గోవా
రాష్ట్రంలో మాత్రమే ఉమ్మడి పౌర స్మృతి అమలులో ఉంది
· కేంద్రానికి సుప్రీంకోర్టు ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయమని ఇప్పటివరకు ఆరుసార్లు కోరింది .చివరిసారిగా 2019 సెప్టెంబర్ 13న ఉమ్మడి పౌర స్మృతి దేశవ్యాప్తంగా అమలు చేయమని కేంద్రానికి కోరింది.
·
1986లో
ముస్లిం మహిళలకు వివాహం విడాకులు మరియు హక్కుల చట్టం ను రాజీవ్ గాంధీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
ఆర్టికల్ 45
· ప్రకారం ఆరు సంవత్సరాల లోపు బాలబాలికలకు ఉచిత విద్య సదుపాయాలు కల్పించాలి.
ఆర్టికల్ 46
·
షెడ్యూలు
కులాలు,షెడ్యూల్ తెగల ,మరియు వెనుకబడిన తరగతుల ప్రజల యొక్క
సామాజిక విద్యాభివృద్ధికి శ్రద్ధ చూపాలి. వారిని సాంఘిక దోపిడీ అన్యాయాల నుండి రక్షించాలి.
ఆర్టికల్ 47
·
ఆరోగ్యవంతమైన
పౌష్టికాహారాన్ని ఇచ్చి ప్రజల ఆరోగ్య స్థాయిని మెరుగు పరచాలి.ఔషధ, పారిశ్రామిక అవసరాల నిమిత్తం
మినహాయించి ఇతర పరిస్థితులలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు పరచాలి మత్తు
పదార్థాలు నుండి ప్రజలను కాపాడాలి.
· సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తున్న రాష్ట్రం గుజరాత్,బీహార్. ఆంధ్ర రాష్ట్రంలో 1954లో ఆంధ్రప్రదేశ్ లో 1994 లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధించారు.
ఆర్టికల్ 48
· వ్యవసాయం, పాడి పరిశ్రమను శాస్త్రీయమైన పద్ధతిలో నిర్వహించి గోవులు, పశువులు ,ఇతర పెంపుడు జంతువుల వధను నిషేధించాలి.
ఆర్టికల్ 49
· చారిత్రక ప్రాముఖ్యత గల ప్రదేశాలను, కట్టడాలను పరిరక్షించాలి.
ఆర్టికల్ 50
· కార్యనిర్వహణ శాఖను న్యాయశాఖ నుండి వేరు చేయాలి.
ఆర్టికల్ 51
· ప్రకారం అంతర్జాతీయ శాంతి భద్రతలను ప్రోత్సహించాలి. అన్ని దేశాల మధ్య సత్సంబంధాలు పెంపొందించాలి. అంతర్జాతీయ న్యాయ సూత్రాల ఒప్పందాలపై గౌరవం వుంచి వారిని అనుసరించాలి.
కొత్తగా చేర్చబడిన ఆదేశిక సూత్రాలు
42
వ రాజ్యాంగ సవరణ ద్వారా(1976)
·
39(f)-పిల్లలు
హుందాగా పెరగడానికి అవకాశం కల్పించాలి.
·
39(a)
ప్రకారం పేద ప్రజలకు ఉచితంగా న్యాయ సహాయాన్ని అందించాలి.
·
43(a)- పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి.
· 48(a)- వన్యప్రాణినీ రక్షించాలి మరియు పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలి.
44వ
రాజ్యాంగ సవరణ ద్వారా
·
ఆర్టికల్
38(2) ప్రకారం ప్రజల
మధ్య ఆర్థిక అసమానతలు తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి.
2011లో 97వ రాజ్యాంగ సవరణ ద్వారా
·
సహకార సంఘాలను ఏర్పరిచి స్వతంత్రంగా
ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిర్వహించాలి.
ప్రాథమిక హక్కులు
ఆదేశిక సూత్రాల మధ్య పోలికలు- తేడాలు
ప్రాథమిక హక్కులు |
ఆదేశిక సూత్రాలు |
వీటికి
న్యాయ సంరక్షణ ఉంది. |
ఆదేశికసూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. |
ప్రాథమిక
హక్కులు ప్రజల వ్యక్తిగత ప్రయోజనాలను పెంపొందిస్తాయి. |
ఇది
సమాజ సంక్షేమాన్ని పెంపొందిస్తాయి ఇవి ప్రభుత్వానికి సంబంధించినవి. |
దేశాన్ని
ప్రజాస్వామ్య రాజ్యంగా మార్చడానికి ఇవి తోడ్పడుతాయి. |
దేశాన్ని ఆర్థిక,
ప్రజాస్వామ్య, రాజ్యాంగ మార్చడానికి ఇవి తోడ్పడతాయి. |
వ్యక్తి
వికాసానికి దోహదం చేస్తాయి. |
ప్రజల సమిష్టి
ప్రయోజనాల కోసం ఉద్దేశించినవి. |
స్వాతంత్రం
వచ్చి దాదాపు 70 సంవత్సరాలు అయింది కానీ
ప్రజల మధ్య ఆర్థిక సామాజిక అసమానతలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే సామాజిక ఆర్థిక
న్యాయం కోసం చాలా సంపదను జాతీయం చేశారు. ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసి పంచవర్ష
ప్రణాళికలను అమలు చేశారు.
భూసంస్కరణల చట్టాలను రూపొందించారు . జగిర్థారి, జమీందారీ వ్యవస్థను రద్దు చేశారు.
భారత ప్రభుత్వం గత 70 సంవత్సరాల నుండి అనేక చట్టాలను చేశారు అందులో ముఖ్యమైనవి.
·
కనీస
వేతనాల చట్టం (కార్మికుల
కోసం)-1948
·
గ్రామీణ
అభివృద్ధి సమాజ వికాస పథకం -1952
·
అస్పృశ్యత నివారణ చట్టం-1955
·
ప్రసూతి
రక్షణ చట్టం-1961
·
బోనస్
చెల్లింపులు చట్టం -1965
·
బ్యాంకుల
జాతీయకరణ-1969
·
రాజభరణాల రద్దు చట్టం-1971
·
వన్య
ప్రాణి సంరక్షణ చట్టం-1972
·
వెట్టిచాకిరి నిషేధ చట్టం -1976
·
మహిళల
కోసం సమాన వేతనం చట్టం-1976
·
అడవుల సంరక్షణ చట్టం-1980
·
బాలల కోసం బాల కార్మిక నిషేధ చట్టం -1986
·
జాతీయ
అటవీ విధానం-1988
·
ఎస్సీ, ఎస్టీలపై ఆకృత్యాలు నివారణ చట్టం -1989
·
Sc, st లకు ప్రత్యేక
జాతీయ కమిషన్ జాతీయ-1992
·
గ్రామీణ ఉపాధి హామీ పథకం -2006
·
సహకార
సంఘాల ఏర్పాటు చట్టం-2011
ఆదేశిక నియమాలు -
సుప్రీంకోర్టు తీర్పులు
కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్
కేరళ (ప్రాథమిక హక్కుల కేసు)
·
ప్రాథమిక
హక్కులు ఆదేశిక నియమాలు నిర్దేశిక నియమాలలో పరస్పర పోషకాలు అని ప్రాథమిక హక్కులు
వ్యక్తిగత వికాసానికి సహాయపడితే ఆదేశిక సూత్రాలు సమాజ హితానికి తోడ్పడతాయని వ్యాఖ్యానించింది.
సరళ ముద్గల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా(1995)
·
ఉమ్మడి సివిల్ కేసుగా పరిగణిస్తారు
·
హిందువుల మత మార్పిడి ద్వారా వివాహం చేసుకుంటే
అది చెల్లదు.
·
భారత
పౌరులుగా ఉన్నంతవరకు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారు భారత చట్టాలకు కట్టుబడి ఉండాలి.
ఉమ్మడి సివిల్ కోడ్ ను అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది.
సిద్ధాస్ వర్సెస్ యూనియన్ స్టేట్
ఆఫ్ ఢిల్లీ
·
ఉచిత
న్యాయ సహాయాన్ని అవసరమైనవారికి చేకూర్చవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందని
ఆర్టికల్ 21 ప్రకారం ఇది ప్రాథమిక హక్కుగా పరిగణించాలని పేర్కొంది.
షాబానో బేగం వర్సెస్ మహ్మద్ అహ్మద్
ఖాన్(1985)
·
భార్యకు
భర్త నుండి భరణం పొందే హక్కు ఉంటుంది అని ఇది ముస్లిం స్త్రీలకు కూడా
వర్తిస్తుందని పేర్కొంది.
ఆదేశిక నియమాలపై ప్రముఖుల అభిప్రాయాలు
·
శాసన
వ్యవస్థ కు కరదీపం లాంటిది -ఎం.సీ.సేతల్ వాడ్
·
ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ కల్పించనంత
వరకు వాటిని అంతగా పట్టించుకోరు- k.
సంతానం
·
బ్యాంకు
సౌకర్యం ప్రకారం ముందు తేదీని చెల్లింపదగిన చెక్కు వంటిదని, విలువలేని అనవసరపు పత్రాలు అని అన్నారు- K.T.షా.
· ఆదేశిక సూత్రాలు ప్రతి కొత్త సంవత్సరం ప్రారంభం రోజున తీసుకునే తీర్మానాల వంటివి అని జనవరి 2వ తేదీన భంగం అవుతాయి- నసీరుద్దీన్ షా
· సాంఘిక విప్లవ భావాలు నిర్దేశిక నియమాలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి -గ్రాండ్ విలే ఆస్టిన్
· ఈ నిర్దేశిక నియమాలు ఏ మంత్రివర్గం విష్మరించ జాలదు -అల్లాడి కృష్ణస్వామి అయ్యర్.
IMPORTANT BITS
-
A)
సామాజిక
ప్రజాస్వామ్యం
-
A) ప్రపంచీకరణ
- ...
Answer is D)పైవన్నీ
- 3.ఆదేశిక నియమాలకు సంబంధించి ఏ
ప్రభుత్వం అయినా వీటిని విస్మరిస్తే వారు ఎన్నికల కాలంలో ప్రజల ముందు జవాబుదారిగా
తప్పనిసరిగా నిలవాల్సి ఉంటుంది అని వ్యాఖ్యానించింది ఎవరు?
-
జవహర్లాల్ నెహ్రూ
B.N రావ్.
-
న్యాయ
సంరక్షణ లేదు
ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రాలు
-
ప్రాథమిక
హక్కులు
కేంద్ర జాబితా
No comments:
Post a Comment