Majlis-E-Ittehadul Muslimeen
మజ్లీస్-ఇ- ఇతేహాదుల్ ముస్లిమిన్(ఎమ్.ఐ.ఎమ్)
మజ్లీస్-ఇ- ఇతేహాదుల్ ముస్లిమిన్ (ఎం.ఐ.ఎం) అనేది భారతదేశంలోనే మహమ్మదీయుల అభ్యున్నతికి ఉన్న రాజకీయ పార్టీ. భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో రాజకీయాలలో MIM అనే రాజకీయ పార్టీ గురించి తెలియని వారు ఉండరు. ఎమ్.ఐ.ఎం. పార్టీ ముస్లింల అభ్యున్నతికి వారి జాతి పరిరక్షణకి ఎంతగానో కృషి చేసింది. తెలంగాణలో ఆపరేషన్ పోలో అనంతరం ఎం.ఐ.ఎమ్ అనేది ఏ.ఐ.ఎం.ఐ.ఎమ్ గా మారింది. ఇలా మారిన తర్వాత ఈ పార్టీ కేవలం మహమ్మదీయుల సంరక్షణ కొరకు మాత్రమే కాకుండా దళితుల,ఆదివాసులు సంరక్షణ కూడా చేపట్టింది.
MIM సంస్థ
స్వాతంత్రానికి పూర్వం అంటే 1927 నవంబర్ 12న నవాజ్ ఖాన్ స్థాపించాడు. ఇది ఒక సంస్థగా ప్రారంభించబడింది.
దీనికి మొదటి అధ్యక్షుడు నవాజ్
సదర్ యార్. ఎంఐఎం సంస్థ యొక్క నినాదం అనల్ మాలిక్. ఎంఐఎం ఐక్యత(ఇత్మత్) అనే పత్రిక
నిర్వహించింది.
ఎమ్.ఐ.ఎం అనే సంస్థ తెలంగాణ
భారతదేశంలో విలీనం కాకముందు నిజాం రాజుతో కలిసి ప్రజలకు ఎన్నో ఇబ్బందులు
కలిగించినప్పటికీ ప్రస్తుతం దేశ సేవకై రాజకీయాలలో చెరగని ముద్ర వేస్తుంది.
ప్రస్తుత ఏ.ఐ.ఎం.ఐ.ఎమ్(AIMIM) (All India Majlis-E-Ittehadul Muslimeen) అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ. ఈ పార్టీ కేవలం ముస్లింల మేలు కొరకే ఉందని కొందరు హిందువులు అనుమానిస్తునప్పటికి ఈ పార్టీ కులమతాలకు అతీతంగా దేశ ప్రజలకు చేసిన సేవలు బట్టి ఎంఐఎం పార్టీ గొప్పతనం మనం గుర్తించవచ్చు.
ఆపరేషన్ పొలోకు పూర్వం ఎంఐఎం యొక్క కార్యకలాపాలు
హైదరాబాద్ సంస్థానంలో అంజుమన్ తబ్లి
గులిస్తన్ అనే సంస్థ ఉండేది.
·
హిందువులలోనీ పేదలను,దళితులకు ఆశలు
చూపి మహమ్మదీయ
మతంలోకి చేర్చుకోవడం ఈ సంస్థ యొక్క పనిగా ఉండేది.
·
అంజుమన్ తబ్లి గులిస్తన్ సంస్థకు
వ్యతిరేకంగా ఆర్య సమాజం వారు శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఈ రెండు సంస్థలను నిజాం ప్రభుత్వం నిషేధించింది.
నవాజ్ బహదూర్ యార్ జంగ్
నవాజ్ బహదూర్ యార్ జంగ్ ప్రతి ముస్లిం
స్వయంగా ఒక రాజు(అనల్ మాలిక్) అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. ఈ సిద్ధాంతాన్ని 1938లో అబ్దుల్ ఖాదర్ సిద్ధికి ఇచ్చిన ఉపన్యాసం నుండి గ్రహించాడు.
1938లో అబ్దుల్ ఖాదర్ సిద్ధికి (ఉస్మానియా విశ్వవిద్యాలయం మత శాఖాధిపతి)MIM రెండవ అధ్యక్షుడిగా ఉండి రాజకీయ సంస్థగా మార్చాడు.
ఆర్యసమాజ నాయకుడైన పండిట్
నరేంద్రజి పెద్ద ఎత్తున శుద్ధి కార్యక్రమాలు నిర్వహించేవాడు. దీనివలన హైదరాబాద్
నగరంలో మత గొడవలు జరిగాయి. మొదటిసారి 1938లో హైదరాబాద్ నగరంలో హిందూ
ముస్లింల మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. ఈ గొడవలు దేశం అంతటా వ్యాపించి దూల్ పేట్ కేసుగా ప్రసిద్ధి
చెందింది.
రజాకార్ల వ్యవస్థ
·
రజాకార్ల వ్యవస్తను
మొదటగా సయ్యద్ మహమ్మద్ హసన్ జాంగ్ సూచించగా 1940 అక్టోబర్లో బహదూర్
యార్ జంగ్ స్థాపించాడు. రజాకార్ల వ్యవస్థ యొక్క ప్రధాన ఉద్దేశం
మహమ్మదీయులు ప్రత్యేక హక్కులను రక్షించడం.
·
ఇందులోని సభ్యులను రజాకార్లు అంటారు. అంటే స్వచ్ఛంద సేవకులు(ఉర్దూ భాషలో) అని అర్థం వస్తుంది.
·
రజాకార్లు ఖాకీ చొక్కా, కాకి పాయింట్, నల్ల టోపీ, పెద్ద
బెల్టు ధరిస్తారు.
·
1943లో మజ్లిస్ వార్షికోత్సవ సభను వరంగల్ లో నిర్వహించారు.
ఈ సభలో బహదూర్ యార్ జంగ్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు వెల్లడించారు. అది ఏమిటంటే ఈ రాజ్యం
నిజాం సొత్తు కాదు
ముస్లిం ప్రజలందరిదీ ఆస్తి అని ఇది నా అభిప్రాయం మాత్రమే మజ్లిస్ అభిప్రాయం కూడ అని ప్రకటించారు. దీనితో బాహదూర్ ఉపన్యాసాలపై ఒక సంవత్సరం పాటు నిజాం నిషేధం విధించాడు.
రజాకార్ల దౌర్జన్యాలను విమర్శించిన పత్రికలు
·
ఇమ్రోజ్ పత్రిక - షోయబుల్లాఖాన్
·
తెలుగు దేశం పత్రిక - సూర్యదేవర
రాజ్యలక్ష్మీదేవి
·
హైదరాబాద్ వార పత్రిక - తాళ్లూరి రామానుజస్వామి
ఎంఐఎం అధ్యక్షులు వరుసగా
1. మొదటి అధ్యక్షుడు
- నవాజ్ సదర్ యార్ జంగ్
2. రెండవ
అధ్యక్షుడు - మౌల్వి అబ్దుల్
ఖాదర్ సిద్ధికి
3. మూడవ అధ్యక్షుడు
- నవాజ్ బహదూర్ యార్ జంగ్
4. నాలుగవ అధ్యక్షుడు
- అబుల్ హసన్
5. ఐదో
అధ్యక్షుడు - మజూర్ అలీ కమీల్
6. ఆరవ
అధ్యక్షుడు(చివరి)- కాశీం రజ్వీ
ఖాసిం రజ్వి
·
కాశీం రజ్వి మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి.
1946 నవంబర్లో జరిగిన ఎంఐఎం పార్టీ అధ్యక్ష ఎన్నికలలో భారీ విజయాన్ని(ప్రత్యర్థి
అబ్దుల్ రెహమాన్) సాధించాడు.
·
కాశీం రజ్వి ఎంఐఎం పార్టీకి అధ్యక్షుడు అయిన తర్వాత అతను
50000 ఉన్న రజాకార్ల సైనిక శక్తిని 5 లక్షలకు పెంచుతాం అని చెప్పాడు. రజాకార్లకు
వివాదాస్పదమైన వాఖ్యలతో ఉపన్యాసాలు ఇచ్చేవాడు. రజాకార్లతో అధిక పన్నులు
వసూలు చేయించేవాడు. నిజాం ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వారిని చంపించేవాడు. తన సామ్రాజ్యం విస్తరించాలని అనేక ఆకృత్యాలు చేశాడు.
·
తనను విమర్శిస్తున్నారని
షోయబుల్లాఖాన్ ను రజాకార్లతో చంపించాడు. షోయబుల్లాఖాన్ మృతికి ధవళ శ్రీనివాస
రావు అనే వ్యక్తి “కన్నీటి కానుక పోలీస్ చర్య” అనే గీతాన్ని రచించాడు.
·
ఖాంశి రజ్వీ బైరాన్ పల్లిలో 88 మంది నిలబెట్టి కాల్చిచంపాడు బైరంపల్లి
దుర్ఘటనపై “కాలంబు రాగానే కాటేసి తీరాలి” అనే గేయం కాళోజీ నారాయణరావు రచించాడు. నవాజ్
దీన్ యార్ జంగ్ అనే పోలీస్ కమిషనర్ పూర్తి సహాయ సహకారాలు అందించారు.
·
హైదరాబాద్ సంస్థానంలో రజాకార్ల అకృత్యాలు పెరిగాయని అనేక
ఫిర్యాదులు రావడంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ 1948
సెప్టెంబర్ 13-17వ తేదీ వరకు
చేపట్టిన ఆపరేషన్ పోలో ద్వారా
భారతదేశంలో హైదరాబాద్ సంస్థానంను విలీనం చేశారు. ఖాసిం రజ్వీనీ అరెస్టు చేయించాడు.
·
ముస్సోలిని తన బ్లాక్ షర్ట్ దళంతో ఇటలీ రాజును బంది చేసినట్లు ఖాసిం రజ్వీ కూడా తన రజాకార్ల సైన్యంతో నిజాంను
బందీ చేస్తాడు అని నరసింహారావు పేర్కొన్నాడు.
·
కాశీం రజ్వీపై ప్రభుత్వం 3 కేసులు పెట్టింది అవి
1. ఆలంద్ షరీఫ్ హత్య కేసు
2. షోయబుల్లాఖాన్
హత్య కేసు
3. బీబీ నగర్
కేసు.
No comments:
Post a Comment