AADI HINDU DALIT MOVEMENTS IN TELANGANA/తెలంగాణాలో ఆది హిందూ దళిత ఉద్యమాలు - job aspirants

Latest

job aspirants

TSPSC-POLICE-GROUPS-SSC-RRB

Translate to your preferred language

All subjects

Sunday 19 December 2021

AADI HINDU DALIT MOVEMENTS IN TELANGANA/తెలంగాణాలో ఆది హిందూ దళిత ఉద్యమాలు

 AADI HINDU DALIT MOVEMENTS  IN TELANGANA 
తెలంగాణాలో ఆది హిందూ దళిత ఉద్యమాలు
AADI HINDU DALIT MOVEMENTS  IN TELANGANA  తెలంగాణాలో ఆది హిందూ దళిత ఉద్యమాలు
TELANGANA AADI HINDU DALIT MOVEMENTS

భారతదేశంలో లో దాదాపు ప్రతి చోటా దళితులు ఆర్థికంగా, సామాజికంగా, పేదరికానికి కారణం అజ్ఞానం, అవిద్య, సామాజిక వెనుకబాటుతనం మొదలైన అనేక కారణాలు ఉన్నాయి. తెలంగాణలో కూడా దళితులు వెనుకబడే ఉన్నారు అయితే తెలంగాణలో దళితుల అభ్యున్నతికి కృషి చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్లలో ముఖ్యంగా భాగ్యరెడ్డి వర్మ, బి.ఎస్.వెంకట్రావు, అరిగే రామస్వామి, బత్తుల శ్యామ్ సుందర్, మాదరి ఆదయ్య, మొదలైన వాళ్ళు ఉన్నారు. వాళ్లు తెలంగాణలో దళితుల అభ్యున్నతికి ఏ విధంగా కృషి చేశారో తెలుసుకుందాం.

భాగ్యరెడ్డి వర్మ(1888-1939)

AADI HINDU DALIT MOVEMENTS  IN TELANGANA  తెలంగాణాలో ఆది హిందూ దళిత ఉద్యమాలు
Bhagya eddy Varma

భాగ్య రెడ్డి వర్మ అసలు పేరు మాధరి భాగయ్య. ఆర్య సమాజ సభ్యుడు అయిన బాలాజీ కృష్ణారావు భాగ్యరెడ్డికి 1913లో వర్మ అనే బిరుదు ఇచ్చాడు. భాగ్యరెడ్డి వర్మ దేవదాసీ విధానాన్ని తొలగించడానికి ఎంతో కృషి చేశాడు. దేవదాసీ విధానాన్ని నేరంగా ప్రకటించాలని నిజాంని ఒత్తిడి చేశాడు.

భాగ్య రెడ్డి వర్మ దళితుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశాడు. దళితులు వాళ్ళు అనుభవిస్తున్న పేదరికానికి ముఖ్య కారణం వారి అజ్ఞానం, అవిద్య అని అనేవాడు.

భాగ్యరెడ్డివర్మ జగన్ మిత్రమండలి 1906లో హైదరాబాద్ లో స్థాపించాడు. జగన్ మిత్ర మండలి మన్యం సంఘం గా 1911లో మారింది.

1922లో మన్యం సంగం ఆది “హిందూ సామాజిక సేవా సమాఖ్య” గా మార్పు చెందింది. ఈ ఆది హిందూ సామాజిక సేవా సమాఖ్య సదస్సు పాపన్న అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో మాకొద్దీ నల్ల దొరతనం” అనే పాటను కుసుమ ధర్మన్న పాడాడు.

భాగ్యరెడ్డివర్మ 1910లో లింగంపల్లిలో, ఇసమియ బజార్ లో ప్రాథమిక పాఠశాలను స్థాపించాడు. ఈ పాఠశాలల్లో ప్రభుత్వం ఉర్దూలోనే కాకుండా మాతృభాషలో బోధించేవారు.

భాగ్యరెడ్డివర్మ దళితులలో చైతన్యం తీసుకురావడానికి ఉత్సవాలను నిర్వహించారు. ఇతను జంతుబలిని వ్యతిరేకించి, మాంసాహారాన్ని వదలి పెట్టేవిధంగా దళితులను ఎంతో ప్రభావితం చేశాడు.

భాగ్యరెడ్డివర్మ స్వస్తిక్ దల్ అనే స్వచ్ఛంద సంస్థను 1912లో స్థాపించాడు. భాగ్యరెడ్డివర్మ బౌద్ధం వైపు ఆకర్షితుడు అయ్యి వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు 1913లో మొదటిసారి బౌద్ధ జయంతిని నిర్వహించారు. చివరిసారి 1937లో నిర్వహించారు.

1917 వ సంవత్సరంలో గూడూరు రామచంద్ర రావు విజయవాడలో మొదట ప్రాదేశిక పంచమ సదస్సును నిర్వహించగా దానికి భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో నే భాగ్యరెడ్డి వర్మ పంచమ శబ్దమును ఖండించారు. ఈ సదస్సులో ఉన్నవ లక్ష్మీనారాయణ భాగ్యరెడ్డివర్మ ప్రసంగంతో ప్రభావితం అయి “మాల్లపల్లి” అనే నవలను రచించాడు.

1931 జనాభా లెక్కలలో భాగ్యరెడ్డివర్మ కృషివలన నిజాం ప్రభుత్వం అంటరాని వర్గాలను ఆది హిందువులుగా పేర్కొన్నది.

1927లో అలహాబాద్లో జరిగిన అఖిల భారత దిగువ కులాల సదస్సులో దక్షిణ భారత దేశ ప్రతినిధిగా భాగ్యరెడ్డివర్మ పాల్గొన్నాడు.

1925లో హైదరాబాదులో ప్లేగు, కలరా వ్యాధులు సంభవించినప్పుడు “స్వచ్ఛంద ఆరోగ్య సేవా దళం” భాగ్యరెడ్డి వర్మ ఏర్పాటుచేసి ఎన్నో సేవలు చేశాడు. భాగ్యరెడ్డివర్మ తెలంగాణలో సమాంతర న్యాయ వ్యవస్థను నడిపాడు.

1930లో లక్నోలో జరిగిన ఆది హిందూ జాతీయ సమావేశానికి భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షత వహించారు.

1.     1.     ఈ సదస్సులో దళితులకు ఏకైక ప్రతినిధిగా డాక్టర్ అంబేద్కర్ ను ఎన్నుకున్నాడు.

2.    దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలను డిమాండ్ చేశారు.ఈ సమావేశంలోనే భాగ్యరెడ్డి వర్మ తన వర్మ అనే బిరుదును వదిలిపెట్టాడు.

ఇతను స్థాపించిన పత్రిక “భాగ్యనగర్”, తర్వాతి కాలంలో ఇది ఆది హిందూ పత్రిక గా మారింది. భాగ్య రెడ్డి వర్మ ఆది హిందూ లైబ్రరీ అనే గ్రంథాలయాన్ని స్థాపించారు. ఇతను జంతుబలికి వ్యతిరేకంగా జీవ దయ ప్రచార సభను స్థాపించాడు.

ఇతను క్షయ వ్యాధితో 1939లో మరణించడం జరిగింది.


B.S. వెంకట్రావ్

బి ఎస్ వెంకట్రావుని “హైదరాబాద్ అంబేద్కర్” అని అంటారు. భాగ్యరెడ్డివర్మ మరణం అనంతరం B.S.వెంకట్రావ్ ఆది హిందూ ఉద్యమానికి నాయకుడు అయ్యాడు. బి ఎస్ వెంకట్రావు సేవలకు మెచ్చి నిజాం ఇతనికి “కుస్రు- -అలీమ్” అనే బిరుదునిచ్చాడు.

బి ఎస్ వెంకట్రావ్ అసలు పేరు భత్తుల ఆశయ్య. B.S. వెంకట్రావ్ మొదట పునే లో శిల్పకారుడిగా పని చేసి, నిజాం ప్రభుత్వంలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్ గా పని చేశాడు.

దేవదాసీ విధానాన్ని అంతం చేయడమే అతని లక్ష్యం. B.S. వెంకట్రావ్ ఆది హిందూ మహాసభ ను 1927లో స్థాపించాడు. దీనిని స్థాపించడంలో K. రామస్వామి మరియు యతిరాజ్ సహకరించారు. ఆది హిందూ మహాసభ ఆధ్వర్యంలో దళితులకు ప్రత్యేక గ్రంథాలయాలు, దేవాలయాలను సికింద్రాబాద్ లోని ఘస్ మండిలో కట్టించారు.

B.S.వెంకట్రావ్ ఆది ద్రావిడ సంఘాన్ని 1922లో స్థాపించారు.

 

హైదరాబాద్ స్టేట్ డెప్రేస్డ్ క్లాసెస్ అసోసియేషన్

1936లో హైదరాబాద్ సంస్థానం లో “అంబేద్కర్ యూత్ లీగ్” అనే సంస్థను స్థాపించారు. తర్వాతి కాలంలో అంటే రెండు సంవత్సరాల తర్వాత అంబేద్కర్ యూత్ లీగ్ అనేది హైదరాబాద్ స్టేట్ డెప్రేస్డ్ క్లాసెస్ అసోసియేషన్ గా మారింది.

హైదరాబాద్ స్టేట్ డెప్రేస్డ్ క్లాసెస్ అసోసియేషన్ గా మారిన తర్వాత బి.ఎస్. వెంకట్రావ్ మొదటి అధ్యక్షుడు అయ్యాడు. తమకు ప్రత్యేక నియోజకవర్గాలు, విద్యాలయాలు కావాలని 1939లో హైదరాబాద్ స్టేట్ డెప్రేస్డ్ క్లాసెస్ అసోసియేషన్ వారు నిజాం ప్రధాని అయిన అక్బర్ హైదర్కి వినతి పత్రం సమర్పించారు.

1943లో నిజాం రక్షణ మండలికి నిజాం ప్రభుత్వము వెంకట్ రావ్ ని నామినేట్ చేశారు. 1937లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి నామినేటెడ్ సభ్యుడు గా నియమించబడ్డాడు.

వెంకట్రావ్ హైదరాబాద్ అసెంబ్లీకి పోటీ లేకుండా 1946లో ఎన్నికయ్యాడు. హైదరాబాద్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ద్వార రాజ్యసభకు 1952లో ఎన్నికయ్యాడు.

 

బత్తుల శ్యాంసుందర్

భత్తుల శ్యాంసుందర్ దళితుల అభ్యున్నతికి మరియు వారి పేదరికాన్ని నిర్మూలించడానికి ఎంతగానో కృషి చేశాడు బత్తుల శ్యాంసుందర్ ఐక్యరాజ్యసమితిలో ఇతర అంతర్జాతీయ వేదికలపై దళితుల స్థితిగతులు గురించి ప్రసంగించాడు.  మరాట్వాడాలో 1942 లో జరిగిన డిప్రెసెడ్ క్లాసేస్ మహాసభకు అధ్యక్షత వహించారు.

బత్తుల శ్యాంసుందర్ దళితుల ఆత్మగౌరవ చిహ్నాలుగా అంబేద్కర్ విగ్రహాలను ప్రతిష్టించే విధానాన్ని బీదర్ లో ప్రారంభించాడు.

 ప్రత్యేక నిజాం రాష్ట్ర సాధనకి నిజాం ప్రభుత్వ ప్రతినిధిగా బత్తుల శ్యాంసుందర్ ఫ్రాన్స్ వెళ్ళాడు.  P.R. వెంకట స్వామి శ్యాంసుందర్ యొక్క దళిత ఉద్యమ ప్రదేశాన్ని RED LETTER DAY గా అభివర్ణించాడు.

అరిగే రామస్వామి(1875-1973)

అరిగె రామస్వామి మొదట రైల్వేలో టికెట్ కలెక్టర్ గా పని చేశాడు. ఇతను దళితుల ఐక్యతను సాధించడానికి ఎంతగానో కృషి చేశాడు.

సునీత బాల సమాజాన్ని స్థాపించి మద్యపాన నిషేధం,జంతు బలి, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపాడు.

 

సంఘాభివృద్ధి సమాజం

సంఘ అభివృద్ధికి సమాజాన్ని స్థాపించి దళిత వర్గాలలో ఐక్యత సాధించడానికి కృషి చేశాడు. హరిజన వర్గాల్లో ఉన్న మాల, మాదిగ, దాసరి అనే ఉప కులాలను ఏకం చేసి ఏకం చేసి వారి ఐక్యతకు పాటుపడ్డాడు.ఈ సంఘాభివృద్ధి సమాజాన్ని అరిగే రామస్వామి మరియు మాదరి ఆదయ్య స్థాపించారు.

 

అది హిందూ జాతీయ సభ

అరిగె రామస్వామి 1922లో “ఆది హిందూ జాతీయ సభ” స్థాపించాడు. ఈ సభ ముఖ్య ఉద్దేశం.

1.     నీచ జన్మ సిద్ధాంతాన్ని వ్యతిరేకించడం.

2.    సర్వమానవ సమానత్వాన్ని దేశమంతటా చాటడం.

ఈ సదస్సులోనే భాగ్యరెడ్డి వర్మ దళితులు భారతదేశం యొక్క మూల వారసులు అని వారిని ఆది ఆంధ్రులు అని ఆది హిందువులగా పిలవాలి అని పేర్కొన్నాడు.

 

మాదరి ఆదయ్య

ఇతను 1906లో మాల, మాదిగల కోసం సికింద్రాబాద్ లో పాఠశాలను నిర్మించారు. ఈ పాఠశాల నిర్మించడానికి విలియం బార్టర్ స్థలాన్ని దానం చేశాడు.

మొదలు విలియం బార్టర్ పేరుమీదనే స్కూలు ప్రారంభించడం జరిగింది. బి ఎస్ వెంకట్రావ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ స్కూల్ ని M.L. ఆదయ్య మెమోరియల్ పాఠశాల” గా పేరు మార్చారు.

 

దళితులకు సంబంధించిన ఇతర అంశాలు

“పాలేరు నుండి పద్మశ్రీ వరకు” అనే రచనను ప్రముఖ దళిత కవి అయిన “భోయి భీమన్న” రచించాడు.  మాల- మాదిగ అనే పదప్రయోగం బోయి భీమన్న ప్రచారంలోకి తెచ్చాడు.

ఆనాటి హైదరాబాద్ రాజ్య దళితుల స్థితిగతులు వివరించే గ్రంథం “దెబర్న్”. దీనిని రచించింది శ్యాంసుందర్.

పిసరి వీరన్న అనే దళిత ఉద్యమ కారుడు గాంధీజీ వాడిన హరిజన పదాన్ని వ్యతిరేకించాడు.

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment