Vande Mataram quit India and khilafath movements in Telangana
తెలంగాణాలో వివిధ జాతీయ ఉద్యమాలు
భారతదేశంలో స్వతంత్ర్య ఉద్యమం జరుగుతున్న సమయంలో
ప్రజలు స్వతంత్ర ఉద్యమానికి మద్దతు పలికారు. నిజాం ప్రభుత్వం మాత్రం స్వాతంత్ర్య
ఉద్యమాన్ని హైదరాబాద్ రాజ్యంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ
కొన్ని ఉద్యమాలు నడిచాయి.
భారతదేశానికి స్వతంత్త్యం వస్తే నిజాం రాజ్యం ఉనికిని కోల్పోతుందని, ప్రజాస్వామ్యం ఏర్పడుతుందని, నిరంకుశ రాజ్యం అంతమవుతుందని, రాజులు, నవాబులు అంతరించిపోతారని, ప్రజల మన్ననలు పొందిన వారు మాత్రమే నాయకులు అవుతారని నిజాం గ్రహించాడు.
నిజాం విదేశాల్లో జరుగుతున్న అనేక పరిణామాలను గ్రహించి
తమ దేశంలో ఏవైనా విప్లవాలు, తిరుగుబాటు రావచ్చని నిజాం ముందుగానే పసిగట్టి స్వాతంత్రోద్యమంను
నిజాం రాజ్యంలోకి ప్రవేశించకుండా ప్రయత్నించాడు. అందువల్లనే బహిరంగంగా సమావేశాలు నిర్వహించుకోవడాని
నిషేధించాడు.
నిజాం రాజు “గస్తి నిషాన్ 53” ద్వారా ప్రజలకు వాక్, సభ, పత్రికా స్వేచ్ఛను నాశనం చేశారు. మరియు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ని నిషేధించాడు. నిజాం
ప్రభుత్వం నిజం రాజు అనేక చర్యలు తీసుకున్నప్పటికీ భారత స్వాతంత్ర ఉద్యమాలు
హైదరాబాద్ సంస్థానంలోకి ఎలా ప్రవేశించాయో తెలుసుకుందాం.
ఉస్మానియా యూనివర్సిటీలోని వందేమాతర
ఉద్యమం
·
1915లో మొదటి విద్యా సంబంధమైన సమావేశం మహమ్మద్ మూర్తజ ఏర్పాటు చేశాడు. ఈ సమావేశంలో మీరు అక్బర్ అలీ(సహిఫా పత్రికా సంపాదకుడు)
విశ్వవిద్యాలయం స్థాపించాలని నిజాంను కోరడం జరిగింది. ఆయన కోరిక వలన
విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిజాం అనుమతి ఇచ్చాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించారు.
· 1938 సంవత్సరంలో దసరా ఉత్సవాల సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో హిందూ
విద్యార్థులు వందేమాతర గీతాన్ని ఆలపించారు. అయితే కొందరు ముస్లిం విద్యార్థులు వార్డెన్
కు ఫిర్యాదు చేయడంతో వందేమాతరం పాడకుండా నిషేధించారు.
· దసరా సెలవుల తర్వాత
వందేమాతరం గీతం పాడకుండా ఫార్మానా జారీచేశారు. ఇదంతా పట్టించుకోకుండా అచ్యుత రెడ్డి నాయకత్వంలో
కొందరు విద్యార్థులు 1938 నవంబర్ 29న వందేమాతరం గీతం పాడారు.దీనినే మనం హైదరాబాద్ సంస్థానంలో “వందేమాతరం ఉద్యమం” అంటారు. వందేమాతరం ఉద్యమం ఇలా ప్రారంభించడం జరిగింది.
· వందేమాతరం గీతం పాడినందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని హాస్టల్ అధికారులు
వందేమాతరం గీతం పాడిన విద్యార్థులను హాస్టల్ నుండి ఖాళీ చేయించారు. దీంతో ఆ
విద్యార్థులు హాస్టల్ కాళీ చేసి సుల్తాన్ బజార్ లోని జైన మందిరంలో కొద్ది రోజులు ఉన్నారు.
·
ఉస్మానియా యూనివర్సిటీల విద్యార్థుల సమస్యలను డాక్టర్
జయసూర్య అనే నాయకుడు మహాత్మా గాంధీ, జవహర్
లాల్ నెహ్రు, సుభాష్ చంద్రబోస్ దృష్టికి తీసుకువెళ్లాడు.
·
మహాత్మా గాంధీ ప్రార్థనా మందిరాల్లో వందేమాతరం
గీతం పాడే హక్కు ఉందని పేర్కొన్నాడు. సుభాష్ చంద్రబోస్,జవహర్లాల్ నెహ్రూ విద్యార్థులకు ఉత్తరాలు రాసి ఉద్యమాన్ని ప్రోత్సహించారు.
· ఉస్మానియా యూనివర్సిటీ నుండి విద్యార్థులు బయటకు వెళ్లడంతో ఇతర
విశ్వవిద్యాలయాలలో చదువుకోవడానికి వెళ్లడం జరిగింది.కొన్ని విశ్వవిద్యాలయాలు
తమ కళాశాలలో ప్రవేశించడానికి నిరాకరించింది. అవి మద్రాస్ లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం( వైస్ ఛాన్సలర్ - కట్టమంచి రామలింగ రెడ్డి)., అన్నమలై
విశ్వవిద్యాలయం, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం(వైస్ ఛాన్సలర్ - సర్వేపల్లి రాధాకృష్ణన్).
·
ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బయటికి వెళ్లిన
విద్యార్థులకు నాగపూర్ విశ్వవిద్యాలయం(వైస్ ఛాన్సలర్ – కేదార్నాథ త్రిపాటి) తమ కళాశాలలో
చదువుకోవడానికి అనుమతి ఇచ్చింది. సైన్స్
విద్యార్థులకు నాగపూర్ క్యాంపస్
లో ఆర్ట్స్ విద్యార్థులకు జబల్ పూర్ క్యాంపస్ లో అడ్మిషన్లు అందుకున్నారు.
·
నాగపూర్ లో చదువుకుంటున్న విద్యార్థులకు ఆర్థిక
సహాయం చేయడానికి కౌన్సిల్ ఆఫ్ యాక్షన్
కమిటీ ఏర్పాటు చేసి విరాళాలు సేకరించారు. ఈ కమిటీకి విరాళాలు సేకరించడంలో కాళోజీ
నారాయణరావు, వరదరాజులు సహాయపడ్డారు.
హైదరాబాద్ సంస్థానంలో క్విట్ ఇండియా ఉద్యమం
· క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అబుల్ కలాం ఆజాద్
భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఉన్నాడు.
· క్విట్ ఇండియా ఉద్యమ తీర్మానాన్ని ప్రభాకర్ జి హైదరాబాద్ సంస్థానంలోని ఎం.ఎస్.రాజలింగం కు పంపించాడు. ఎం.ఎస్.రాజలింగం
వరంగల్ కి వెళ్లి భూపతి కృష్ణమూర్తి (తెలంగాణ గాంధీ),హయగ్రీవాచారిల ద్వారా క్విట్ ఇండియా ఉద్యమాన్ని నడిపించారు.
· డాక్టర్ మేల్కోటే క్విట్ ఇండియా ఉద్యమాన్ని హైదరాబాద్ సంస్థానంలో
విశృతం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. బురుగుల రామకృష్ణారావు,
రామానంద తీర్థ లాంటి నాయకులను
క్విట్ ఇండియా నినాదాలు ఇచ్చినందుకు నిజాం ప్రభుత్వం అరెస్టు చేసింది.
· క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో పద్మజా నాయుడు, జ్ఞాన కుమారి హిడ, టి.రామస్వామి హైదరాబాద్ రెసిడెన్సీ
ప్రాంతంపై జాతీయ జెండాను ఎగరవేశారు.
· హైదరాబాద్ కు చెందిన అబిద్ హసన్ సప్రాని, మరియు సురేష్ చంద్ర సుభాష్ చంద్రబోస్
నాయకత్వంలో రూపొందిన “ఆజాద్ హింద్ ఫౌజ్” లో చేరారు. ఆజాద్ హింద్ ఫౌజ్ లో మంత్రిగా అబిద్ హసన్ సప్రని, సుభాష్ చంద్రబోస్ యొక్క అంతరంగిక కార్యదర్శిగా సురేష్ చంద్ర పనిచేశాడు.
హైదరాబాద్ సంస్థానంలో ఖిలాఫత్ ఉద్యమం
·
మహాత్మాగాంధీ ఖిలాఫత్ ఉద్యమం ద్వారా ముస్లింలను
జాతీయోద్యమంలోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు. ఖిలాఫత్ ఉద్యమం హైదరాబాద్లోని
ముస్లింలను చాలా విశేషంగా ఆకట్టుకుంది.
·
ఖిలాఫత్ ఉద్యమానికి డాక్టర్ ఆన్సారి, మౌలానా సోదరులు,
హుమాయూన్ మీర్జా మద్దతు ప్రకటించారు.
·
హైదరాబాద్ సంస్థానంలో ఖిలాఫత్ ఉద్యమంను ముమయిన్ మోర్తజ మరియు హసన్ మహమ్మద్ మొర్తజ లు ప్ప్రారంభించారు.
·
1920 ఏప్రిల్ 23న ఖిలాఫత్ డే సందర్భంగా ఒక బహిరంగ సభను హైదరాబాద్లోని వివేకవర్ధిని మైదానంలో నిర్వహించారు.
· ఖిలాఫత్ భావాలను ప్రచారం చేసిన హైదరాబాద్ ఉర్డు పత్రికలు – జమిందార్, జమాన, సియాసత్.
అదనపు సమాచారం
· హైదరాబాద్ సంస్థానంలో స్వదేశి ఉద్యమం వ్యాప్తి చేసినవారు - దామోదర్ సత్య లేఖన్,అప్పాజీ తుల్జా పుర్కర్.
·
సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతున్న సమయంలో
హైదరాబాద్ బయట చదువుతున్న అనేక మంది విద్యార్థులు తమ చదువులను మధ్యలో ఆపివేసి సహాయ
నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. సరోజినీ నాయుడు కుమారుడు అయిన జయసూర్య తన మెడికల్ కోర్స్
కు స్వస్తి చెప్పారు.
·
ప్రజలలో నిజాం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత
భావాలను తొలగించడానికి బి.బి.సి పాత్రికేయుడు అయినా విలియం రష్ బ్రూక్ ను హైదరాబాదుకు ఆహ్వానించారు. ఇతను నిజాంకు మద్దతుగా వ్యాసాలు రాశాడు.
She now has to roll another 9 before she will get a 7. The new Grazie® Rewards offers you the access you deserve. Always get 바카라사이트 the most effective suite rates, exclusive resort access, comps for gaming play, and more. If you’re caught inside and wish one thing to assist reduce your anxiousness, these relaxed video games will get the job carried out.
ReplyDelete