SHATHAVAHANA DYNASTY
శాతవాహనులు
PART-2
శాతవాహనుల పరిపాలన
· శాతవాహనుల పరిపాలనకి
మనుధర్మ శాస్త్రం మరియు కౌటిల్యుని అర్థశాస్త్రం వీరికి మార్గదర్శకాలు.
· వీరి పాలన
గురించి నాసిక్ శాసనం లో పేర్కొనబడింది.
· వీరు వికేంద్రీకృత పాలనా వ్యవస్థకు పాటించారు .
· శాతవాహనులు
రాజ్యాన్ని, ఆహార, విషయ, గ్రామంగా గా
విభజించారు
సామ్రాజ్యం |
రాజు |
ఆహార |
కుమారమాత్య, అమాత్యులు |
విషయ |
విషయపతి |
గ్రామం |
గ్రామిక /గోపు డు |
గ్రామ పరిపాలన
· గ్రామానికి ఉండే అధికారిని “గ్రామని” అంటారు.
· అనేక గ్రామాలను కలిపి గులిమి అనేవారు దీని అధిపతిని “గుల్మీకుడు” అంటారు.
· గుల్మీకుడు సరిహద్దు అంటే 30 మంది సైనికుల నాయకుడు. వీళ్ళు సరిహద్దు
ప్రాంతం రక్షణకు సైన్యాధిపతులు గా ఉండేవారు వీరి గురించి “మ్యాకధోని శాసనం” తెలుపుతుంది .
పట్టణ పరిపాలన
· పట్టణాన్ని
పరిపాలన చేయడానికి నిగమ సభ ఉండేది.
· నిగమ సభల
గురించి పేర్కొన్న గ్రంథం గాథా సప్తశతి మరియు ఇండికా.
· నిగమ సభల గురించి ప్రస్తావించబడిన శాసనం భట్టిప్రోలు శాసనం
· కుల
పెద్దలను గహపతులు అనేవారు వీరు నిగమసభలో సభ్యులుగా ఉండే సలహాలు ఇచ్చుటకు అమాత్యులు ఉండేవారు.
వీరి కాలంలో అధికారులు
· హిరణ్యకుడు- ధనరూప
ఆదాయాన్ని భద్ర పరిచే వాడు( కోశాధికారి ).
· బండాగారికుడు –(కోశాధికారి) వస్తు రూప శిస్తులను భద్రపరిచేవారు.
· లేఖకుడు -ఉత్తర
ప్రత్యుత్తరాలు రాసేవాడు.
· మహా ధార్మిక -విద్య మతపర
వివాదాలను పరిష్కరించే వాడు.
· మహా ఆర్యక - న్యాయపరమైన
వివాదాలను పరిష్కరించే వాడు.
వ్యాపారం వాణిజ్యం
విదేశీ వ్యాపారం
·
శాతవాహనులు అరబ్బులతో,రోమన్ల,ఈజిప్టు వారితో వ్యాపార సంబంధాలు కొనసాగించేవారు.
·
రోమ్ దేశ బంగారం
భారతదేశానికి వెళ్ళిపోతుందని “ప్లిని” తన
నాచురల్ హిస్టరీ లో పేర్కొన్నాడు.
·
తెలంగాణలో
రోమన్ నాణాలు సూర్యాపేట మరియు ఏలేశ్వరం లో లభించాయి.
·
వైసాస్పియర్ అనే రోమన్ రాజు
తన రాజ్య బంగారం భారతదేశానికి తరలిపోతుంది. అని భారతదేశంతో వ్యాపారాన్ని నిలిపివేశాడు.
·
విదేశాలతో
వ్యాపారం చేసే వర్తకులు వర్తకులను సార్ధవాహులు
అంటారు.
· శాతవాహనుల కాలం నాటి
విదేశీ వ్యాపారం వర్తక కేంద్రాలు, వ్యాపార కేంద్రాలు, రేవుల గురించి పేర్కొన్న గ్రంథం
“పెరిప్లేస్ఆఫ్
ఎర్రిత్రియన్ సి”.
·
వీరి కాలంలో పల్నాడు
వజ్రాల పరిశ్రమలకు
·
విదిష బట్టలకు,దంతపు పనులకు
·
వినుకొండ లోహ పరిశ్రమలకు
·
గూడూరు సన్నని బట్టలకు ప్రసిద్ధి చెందింది.
సాంఘిక వ్యవస్థ
·
వీరి కాలంలో చతుర్వర్ణ వ్యవస్థ ఉండేదని తెలుస్తోంది.
ఇందులో క్షత్రియులు, బ్రాహ్మణులు ,వైశ్యులు, శూద్రులు ఉండేవారు మరియు వీళ్ళల్లో ఉప కులాలు కూడా ఉండేవారని
తెలుస్తుంది.
·
వీరి కాలంలో
కులాంతర వివాహాలు జరిగాయని కథాసరిత్సాంగరం
ప్రకారం తెలుస్తుంది.
·
వీరి కాలంలో పురుషులతో పాటు స్త్రీలకు సమాన గౌరవం హోదా
లభించాయి. వీరి కాలంలో సమిష్టి కుటుంబం వ్యవస్థ ఉండేది.
·
దీనికి
ఉదాహరణ గాథా సప్తశతి రచనలో పాల్గొన్న శాతవాహనుల కాలం నాటి మహిళలు మాధవి, రేవా, అనుపలబ్ది, అనులక్ష్మి.
·
గుణాడ్యుడు తన బృహత్కథ లో బానిస వ్యాపారం గురించి ప్రస్తావన చేశాడు.
·
ప్రజలకు ఆభరణాలపై
విపరీతమైన ఆసక్తి ఉండేదని త్రవ్వకాల వలన తెలిసిపోయింది .
మత పరిస్థితులు
శైవ మతం
·
గాథా సప్తశతి అనే గ్రంథం గౌరీ,పశుపతి ప్రార్థనతో ప్రారంభమవుతుంది ఈ
గ్రంథంలో శివుడు విష్ణువు యొక్క అనేక కథలున్నాయి.
·
దేశంలో అత్యంత ప్రాచీన శివలింగం గుడిమల్లం (చిత్తూర్ )లో
ఉంది అది వీధి కాలం నాటిదే.
జైన మతం
·
మునుల గుట్ట మీద( కోటిలింగాల) జైనులు సల్లేఖన వ్రతాలు ఆచరించినట్లు తెలుస్తుంది.
·
చివరి రాజు సంప్రాతి అమరావతి దగ్గర వడ్డెమాన కొండపై జైనవిహారాన్ని కట్టించాడు.
·
శ్రీముఖుడు
మొదట జైన మత అభిమాని అని ముద్దుల గుట్ట వద్ద లభించిన నాణెముల ద్వారా తెలుస్తోంది.
·
జనగామ, జన్నారం మొదలైన పేర్లు జైన
మతానికి సంబంధించినవి
·
ఆంధ్రాలో మొదటి జైన ఆచార్యుడు కొండకుదంతాచార్యుడు
ఇతను సరస్వతి గచ్చను స్థాపించాడు.
భాగవత మతం
·
మొదటి కృష్ణుడి కాలంలో ఈ మతం
దక్షిణ ప్రాంతానికి ప్రాంతానికి వచ్చింది.
·
నానాఘాట్ శాసనం భాగవత మత దేవుడైన వాసుదేవా, సంకర్షణ ప్రార్థనలతో ప్రారంభమవుతుంది.
·
మొదటి
శాతకర్ణి కాలంలో ఈ రాజు అనేక వైదిక క్రతువులను
జరిపి బ్రాహ్మణులకి భూములు మరియు గోవులను దానం చేసినట్లు శాసనంలో
పేర్కొన్నారు.
బౌద్ధమతం
·
బుద్ధుని జీవిత
కాలంలోనే బౌద్ధమతం ఆంధ్రాలో పాకిందని టిబెట్ లోని బౌద్ధ సన్యాసుల విశ్వాసం.
·
శంబల రాజు సుబెంద్రుని కోరికపై బుద్ధుడు
అమరావతి సందర్శించి కాలచక్ర మాల తంత్ర ఉపదేశం చేశాడని టిబెట్ బౌద్ధ సన్యాసుల
విశ్వాసం.
·
వైశాలి లో జరిగినటువంటి రెండవ బౌద్ధ సంగీతి లో పాల్గొన్న ఆంధ్రప్రాంత
భిక్షువు మహాదేవ భిక్షువు వలన బౌద్ధంలో తెరవాదులు మహా
సాంఘికగా విడిపోయారు.
·
కతావత్తు ప్రకారం పాటలీపుత్ర లో జరిగిన మూడవ బౌద్ధ సంగీతి
లొ అంధకులు అనగా ఆంధ్రులు పాల్గొన్నారు.
·
రెండో పులోమావి భద్రయాన శాఖను, గౌతమీపుత్ర శాతకర్ణి మహా సాంఘిక
శాఖను ఆదరించారు.
·
సుతనిపాత బౌద్ధ మత గ్రంధం ప్రకారం బుద్ధుని సమకాలికుడైన బావరి తన 16 మంది శిష్యులను రాజగృహ
పంపించాడు.
·
ధాన్యకటకం మహసాంఘిక శాఖకు ప్రధాన కేంద్రం, మాహా సాంఘిక శాఖను చైత్యక వాదం అని ఉంటారు.
·
దీని స్థాపకుడు మహాదేవ భిక్షువు ఇతను ఆంధ్రాలో మొదటి బౌద్ధ చార్యులు.
ఆచార్య నాగార్జునుడు
·
బౌద్ధమతం లో మహాయానం, మాధ్యమిక వాదం, శూన్య
వాదనలను ప్రవేశపెట్టాడు.
·
ఇతని యొక్క
శూన్యవాదవిస్తరణ ఆదిశంకరాచార్య మాయావాదం .
·
ఇతను అమరావతికి
ప్రాకారం, శ్రీశైలం వద్ద
మంటపాలను నిర్మించాడు.
·
ఇతను బ్రాహ్మణుల కుట్ర వలన చంపబడ్డారు అని సోమ దేవుని
కథాసరిత్సాగరం లో చెప్పబడింది.
ఇతని రచనలు
1.
ప్రజ్ఞా పారమిత శాస్త్రం
2.
రత్నావళి -రాజపరికథ
3.
మూల మాధ్యమిక
వాదం
4.
లలిత
విస్తారా
5.
రసరత్నాకరం
అమరావతి స్తూపం
·
1797 లో కల్నల్ మెకంజీ ఈ స్తూపాన్ని కనుగొన్నాడు
·
అమరావతి స్తూపం రెండవ పులోమావి కాలంలో నిర్మించడం
జరిగింది స్తూపానికి అన్ని దిక్కుల వేదికల
నుండి ప్రతి వేదికపై ఐదు ఆయక స్థంభాలు
ఉంటాయి ఈ ఆలయ స్తంభాలపై బుద్ధుని జీవితానికి సంబంధించిన ముఖ్య ఘట్టాలు
నిర్మించబడ్డాయి.
· 1 వ స్థంభం పైన, తామర
· 2వ స్తంభం పైన గుర్రం
· 3వ స్తంభంపైన, రావి చెట్టు
· 4వ స్తంభంపైన,. చక్రం
· 5వ స్తంభంపైన, స్తూపం
· ఈ స్తూపానికి శిలా
ప్రాకారాన్ని నిర్మించింది ఆచార్య నాగార్జునుడు .
·
ఈ అమరావతి
స్తూపానికి మరమ్మతులు చేయించిన బౌద్ధ బిక్షువు మహాదేవ బిక్షువు .
·
అమరావతి స్థూపాన్ని సందర్శించి ధిమిక అనే
చర్మకారుడు పూర్ణకుంభం సమర్పించాడు.
·
ఈ పూర్ణకుంభం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార చిహ్నంగా తీసుకుంది.
·
గాంధార శిల్పంలోని కొన్ని లక్షణాలు అమరావతి శిల్ప
కళలలో అంతర్లీనం. అయిపోయాయని సర్
జాన్ మార్షల్ పేర్కొన్నాడు.
·
భారతీయ శిల్పాలలో అతి సుకుమారసుందరాలు అమరావతి
శిల్పాలు అని ఆనంద కుమారస్వామి పేర్కొన్నాడు.
ముఖ్యమైన అంశాలు
·
వీరి కాలం నాటి రాజభాష ప్రాకృతం.
·
మ్యకదొని శాసనం లో ఉన్న తెలుగు పదం వేపూరు.
·
అమరావతి శాసనం లోని తెలుగు పదం నాగబు .
·
అజంతా లోని 9, 10 గుహలలో చిత్రలేఖనం శాతవాహనులకు చెందినవే లో 10వ గుహ లో ఉన్న శ్వేత గజ జాతక చిత్రం వీరి కాలం నాటిది.
·
వీరి కాలంలో రామాయణం భాగవతం కథలు, పురాణ గాధలు గోడలపై చిత్రించేవారు అని గాథాసప్తశతి
వలన తెలుస్తుంది.
·
విహారం అంటే బౌద్ధ సన్యాసుల విశ్రాంతి
మందిరాలు.
·
చైత్యం అంటే బౌద్ధుల
ప్రార్థనా మందిరాలు ఇవి దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి .
·
ఆరామం అంటే స్తూపం, విహారం, చైత్యం,
విద్యాలయం ఒకే చోట ఉన్న ప్రాంతాన్ని ఆరామం అంటారు .
·
స్థూపం అంటే అవశేషాలు పై నిర్మించే నిర్మాణాలు స్తూపం
ఇది మూడు రకాలు
·
1, దాతు గర్భితాలు -బుద్ధుని శారీరక అవశేషాల పై నిర్మించిన స్తూపాలు.
·
2,పారిభోజక స్తూపాలు- గొప్ప బౌద్ధ భిక్షువులు వాడిన వస్తువుల పై నిర్మించిన స్తూపాలు.
·
3,ఉద్దేశిక స్తూపాలు- బుద్ధుని పై భక్తి భావాలు వెల్లడిస్తూ నిర్మించిన స్థూపాలు.
No comments:
Post a Comment