గ్రామ
పరిపాలన
· అయ్యగార్లు అనే పన్నెండు మంది అధికారులు గ్రామ
పాలన చేసేవారు.
· అయ్యగార్లలో కరణం, రెడ్డి, తలారి, వీరు ప్రభుత్వ సేవకులు, మిగిలినవారు గ్రామ సేవకులు
· తలారి- గ్రామ రక్షణ బాధ్యత వీళ్లదే .
· రెడ్డి- కరణం ఇచ్చే లెక్కల ఆధారంగా పన్నుల వసూలు చేసి ప్రభుత్వానికి అందచేసే
బాధ్యత వీరిది.
ఇతర అధికారులు
తీర్పరులు |
పండిన
పంటపై ప్రభుత్వ భాగం నిర్ణయించే అధికారి |
కొట్టారువు |
రాజ అంతపుర వస్తు భాండాగార అధ్యక్షుడు |
నగరి
శ్రీ వాకిలి |
రాజభవన
ద్వారపాలకుడు |
మండలేశ్వర |
రాష్ట్ర
పాలకుడు |
సంది
నిగ్రహక |
విదేశాంగ
శాఖ మంత్రి |
సుంకాధికారి |
పన్నుల
వసూలు చేసేవాడు |
శాసన
అధికారి |
రాజపత్ర రక్షకుడు |
బట్టారకనియోగాధిపతి |
ప్రభుత్వ
ఉద్యోగులను పర్యవేక్షించే అధికారి |
పన్నులు
· భూమిశిస్తు సాధారణంగా 1/5 వ వంతు ఉండేది. ఈ శిస్తును “అరీ” అంటారు.
· నిర్ణయించబడిన భూమిలో పండిన పంట మొత్తాన్ని “సిద్దాయం” అంటారు.
· పంట మొత్తంలో ఒక పుట్టి ధాన్యానికి ఒక బంగారు నాణెము చెల్లించాలి. దీనినే “పుట్టిపహండి” అని అంటారు.
· నీరు నేల- భూమిలో పండిన సిద్దయం.
· దర్శనం -రాజును
కలిసినందుకు ఇచ్చే కానుక.
· అప్పనం- అకారణంగా ఇచ్చేది.
· ఉపకృతి- రాజు గాని ఇతర అధికారులు గాని చేసిన మేలుకు ప్రతిఫలంగా ఇచ్చేది.
· మక్తల్ శాసనం ప్రకారం సైనికుల మీద కూడా వృత్తిపన్ను
విధించేవారు.
· ధాన్యం రూపంలో పన్ను కొలవడాన్ని పుట్టు కొలుచుట అంటారు.
ఇతర పన్నులు
అరి |
ఆస్తిపన్ను |
ఇళ్లరి |
ఇంటి
పన్ను |
సింగినాదం
పన్ను |
ప్రమాదం
వచ్చినప్పుడు ప్రజలను హెచ్చరించే ఉద్యోగి పన్ను |
ఖిలరమ్ |
గొర్రెల
మంద పై పన్ను |
కిరుదేరే |
దేవుడికి
ఇచ్చే పన్ను |
దోగరాచ
పన్ను |
యువ
రాజుల ఖర్చులకోసం విధించే పన్ను |
ఆర్థిక వ్యవస్థ
వ్యవసాయం
· ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం, ఇది చాలావరకు
వర్షాధారంగా ఉండేది. కానీ కాకతీయ రాజులు అనేక చెరువులు నిర్మాణం చేపట్టి వ్యవసాయ
అభివృద్ధికి కృషి చేశారు.
· రామప్ప చెరువు, పాకాల చెరువు, బయ్యారం చెరువు, చౌడ సముద్రం మొదలైన అనేక చెరువులను నిర్మించి నీటిపారుదల రంగంలో తమ వంతు కృషి చేశారు.
· వీరు ఎంతగా చెరువులను అభివృద్ధి చేశారంటే నేటి
మన తెలంగాణ ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణకు ఈ రాజ వంశం పేరు “మిషన్ కాకతీయ” అని పేరు పెట్టారు.
·
వ్యవసాయంపై 6వ నరసింహుడు రాసిన గ్రంథం నిరోస్ట కావ్యం.
· వ్యవసాయదారులకు వచ్చిన ఆదాయంలో సగం
భాగం చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకుని రాచ దొడ్డి భూములు (రాజు
ఆధీనంలో ఉన్న భూములు) ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రాజు భూములను కౌలుకి ఇచ్చే పద్ధతిని
అడపగట్టు అంటారు.
· ప్రైవేటు వ్యక్తులు భూములను కౌలుకు ఇచ్చే పద్ధతిని “తాంబూల స్రవ” అంటారు.
· ప్రతిపోలాన్ని గడ,దండ లేక కొలలొ కొలిచేవారు. (ఒక గడ పొడవు 32 జానలు ఉండేది)
· వీరి కాలంలో వర్షాధార భూములను అచ్చుకట్టు భూములు అంటారు.
· నీటి సౌకర్యం ఉన్న భూములను మాగాణి
భూములు అంటారు.
నీటిపారుదల సౌకర్యాలు
· చెరువులు,కాలువల అభివృద్ధి కొరకు “దశబంధ ఈనాము” అనే పద్ధతిని ఈ రాజులు ప్రవేశపెట్టారు.
· ఈ విధానంలో చెరువును నిర్మించి
వాటిని బాగు చేస్తూ వాటి నిర్వహణ బాధ్యతలు నిర్వహించేవారు 1/10 వంతు పన్ను చెల్లించే షరత్తుతో చెరువు కింది భూములను ఇచ్చే పద్ధతి.
· శ్రీశైలంలో వేల ఎకరాల భూములను
సాగులోకి తెచ్చారు. ఈ భూమిని రెండు విధాలుగా సాగులోకి తెచ్చారు అది 1, అడవులను నరికి వేయడం 2, నీటిపారుదల సౌకర్యాలను కల్పించడం
ద్వారా వ్యవసాయం అభివృద్ధి చెంది శ్రీశైలం పరిసరాల్లో వందలాది గ్రామాలు వెలిశాయి.
· కాకతీయుల కాలంలో నిర్మించిన ప్రధాన
చెరువులు
·
ఒకటవ ప్రోలరాజు |
·
కేసముద్రం, జగత్ కేసరి |
·
రేచర్ల రుద్రుడు |
·
రామప్ప చెరువు |
·
మైలమ |
·
కొటుకూరు చెరువు |
·
కుంద మాంబ |
·
కుంద సముద్రం |
·
మైలాంబ( గణపతిదేవుని సోదరి) |
·
బయ్యారం చెరువు |
·
మల్యాల చౌడప్ప |
·
భాస సముద్రం, గణప సముద్రం , చౌడ సముద్రము |
·
గంగాధరుడు |
·
హనుమకొండ చెరువు |
·
నత వాడి రాజులు (సామంత
రాజులు) |
·
గణపురం చెరువు, లక్కవరం చెరువు |
న్యాయ పాలన
· అంతిమ న్యాయస్థానం రాజు స్థానం, అంతిమ న్యాయనిర్ణేత రాజు మాత్రమే, దుగ్గిరాల శాసనం ప్రకారం దుగ్గిరాల, మోరంపూడి గ్రామాల సరిహద్దుల సమస్యను గణపతి దేవుడు స్వయంగా పరిష్కరించాడు.
. అప్రతిష్ఠత - గ్రామాల్లో తాత్కాలికంగా నియమించబడ్డ న్యాయస్థానం.
· ప్రత్యేక వివాదాలను పరిష్కరించడానికి ధర్మాసనాలను
ఏర్పాటు చేసేవారు.
· వీరు చెప్పిన తీర్పులను జయపత్రాలు అనే
పేరుతో రాజముద్రిక ఇచ్చేవారు.
· ఈ ముద్రను వేయడానికి రాజుల దగ్గర ముద్రవర్తులు అనే ప్రత్యేక ఉద్యోగులు ఉండేవారు.
సైనిక
వ్యవస్థ
· కాకతీయ రాజులు తమ సైన్యాన్ని చక్రవర్తి
సైన్యం,నాయంకర సైన్యం అనీ రెండు భాగాలుగా
విభజించారు.
· కాకతీయ రాజులు ప్రత్యేక అంగరక్షక
దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, అంగరక్షక నాయకులను లెంకలు అని పిలిచేవారు, రాజు యొక్క రక్షణ
వీరి బాధ్యత.
· బద్దెన రచించిన నీతిశాస్త్ర ముక్తావళిలో శత్రువుల రక్తంతో, వారి భార్యల
కన్నీళ్లతో నేల తడవని నాడు రాజు గొప్పతనం,ప్రతిష్ట
ఉండదు అని పేర్కొన్నాడు.
· పరాజయాన్ని మించిన దుఃఖం విజయాన్ని
మించిన ఆనందం ఉండదు అని కామాంధుడి నీతిసారం లో పేర్కొనబడింది.
· వీరి కాలంలో గద్యలు లేదా మాడ
అత్యంత విలువైన బంగారు నాణెములు, గద్యమీద వరాహం బొమ్మ ఉంటుంది.
పరిశ్రమలు వాణిజ్యం
· పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య
చరిత్రలో 20కి పైగా వస్త్రాల గురించి పేర్కొనబడింది. మహా రాజులు సైతం గర్వించదగ్గ
వస్త్రాలు ఇక్కడ తయారవుతాయి అని మార్కోపోలో పలుమార్లు ప్రస్తావించారు.
· మైసొలియ
ప్రాంతం వస్త్ర తయారికి
ప్రసిద్ధి చెందింది అని ప్లీని పేర్కొన్నాడు.
· వీరి కాలంలో ప్రసిద్ధమైనవి.
·
పల్నాటి - ఇనుప పరిశ్రమకు
·
నిర్మల్ - డమాస్కస్
కత్తులకి
· గోల్కొండ - వజ్రాల గనులుకి ప్రసిద్ధి చెందింది.
· కాకతీయుల సమయంలో కుటీర పరిశ్రమలు నిర్వహించే ప్రతి కులానికి కుల సంఘం ఉండేది. ఈ కుల సంఘాలనే సమయాలు అంటారు, అన్ని సమయాలను కలిపి “అయ్యవలి” అని అంటారు.
· భూమిని దానం చేయాలన్న పన్ను విధించాలన్న ఈ సమయాల అనుమతి తప్పనిసరిగా కోరవలసి ఉండేది.
· కాకతీయుల కాలంలో మరి కొన్ని సమయాలు.
· మహా జనుల సమయం అంటే బ్రాహ్మణుల యొక్క సమయం.
· బలింజసెట్టులు అంటే అన్ని వర్గాల ప్రజల వర్తక వ్యాపారాల కోసం ఏర్పాటు చేసుకున్న సమయం.
· కాంపుల సమయం అంటే ఇది పంట కాపుల యొక్క సంఘం.
· శైవ సమయం, సాని మున్నూర్వురు - దేవాలయంలోని సమయాలు.
విదేశీ వ్యాపారం
· వీరి కాలంలో విదేశీ వ్యాపారం ఎంతో బాగా
అభివృద్ధి చెందింది కానీ సముద్రపు దొంగల వల్ల వ్యాపార నౌకలకు రక్షణ లేకుండా
పోయింది. దీంతో మోటుపల్లిలో గణపతి దేవుడు అభయ శాసనం వేయించాడు. ఈ శాసనంలోని
ఎగుమతులు దిగుమతుల గురించి పేర్కొన్నాడు.
· వీరి కాలం నాటి ప్రధాన ఓడరేవులు మోటుపల్లి,మచిలీపట్నం, కృష్ణపట్నం, హంసలదీవి.
· మోటుపల్లి శాసనం ప్రకారం ఎగుమతులు దిగుమతులపై 1/30 వంతు సుంకం విధించేవారు.
· కాకతీయుల వస్తువులు మూడు రకాలుగా ఉండేది
1. భూసిబండములు - ఆహార ధాన్యాలు
2. కొల భాండములు అంటే ఆవాలు, మిరియాలు, నువ్వుల నూనె
3. మని బండములు అంటే ముత్యాలు, పగడాలు
వాస్తు మరియు శిల్పకళ
కాకతీయుల ప్రధాన ఆలయాలు
స్వయంభు
దేవాలయం
· ఈ దేవాలయాన్ని “రెండవ ప్రోలరాజు” కట్టించాడు .
· ఈ దేవాలయ తూర్పు భాగాన్ని గణపతి దేవుడు
మరియు పశ్చిమ భాగాన్ని రుద్రమదేవి కట్టించింది ఈ ఆలయానికి నాలుగు దిక్కులా నాలుగు శిలాతోరనాలు
కాకతీయ వాస్తు శిల్ప కళలకు నిదర్శనాలు.
· ఈ దేవాలయంలోని మంటప స్తంభాలపై ఏనుగు తొండం మీద నిలుచుని ఉన్న సింహంపై కత్తి ధరించిన రుద్రమదేవి ఉన్న శిల్పాలు మనకు కనిపిస్తాయి.
వేయి స్తంభాల గుడి/ రుద్రేశ్వరాలయం (హనుమకొండ)
·
ఇది త్రికూట ఆలయం ఈ ఆలయంలో శివుడు, విష్ణువు ,సూర్య దేవుళ్ళు గల 3 మందిరాలు కలవు ఈ ఆలయాన్ని
నిర్మించింది “రుద్రదేవుడు”.
రామప్ప గుడి (శివాలయం)
· రేచర్ల రుద్రుడు పాలంపేట వద్ద ఈ ఆలయంను ఏకశిలా పద్ధతిలో 1213 వ సంవత్సరంలో నిర్మించాడు.
· ఈ దేవాలయంలో ఎటు చూసినా ప్రేక్షకుల
వైపు చూస్తున్నట్లు ఉండే నంది ఉంది.
· ఈ దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన
ఇటుకలు నీళ్ళలో తేలుతాయి ఈ దేవాలయంలో నాగిని శిల్పాలు కూడా చెక్కబడ్డాయి .
· ఈ దేవాలయంపై పేరనీ నృత్యభంగిమలు చెక్కబడి ఉన్నాయి.
· జాయప సేనాని రచించిన నృత్య రత్నావళి పుస్తకంలోని నృత్య బంగిమలు ఈ దేవాలయ గోడలపై చెక్కబడ్డాయి.
· జాయపసేనాని గొప్ప యుద్ధవీరుడు గాక
గొప్ప రచయిత.
· నటరాజ రామకృష్ణ ఈ దేవాలయం పైన ఉన్న నాట్య భంగిమలు ఆధారంగా పేరని నృత్యంను అభివృద్ధి చేశాడు.
· ఈ దేవాలయానికి 2021 వ సంవత్సరంలో యూనిస్కో గుర్తింపు పొందింది.
· పిల్లలమర్రి దేవాలయం “నామిరెడ్డి” నిర్మించాడు.
· వెల్లంకి గంగాధరుడు (రుద్రదేవుని మంత్రి) హన్మకొండలో ప్రసన్న కేశవాలయం,
మడికొండలో భీమేశ్వరాలయం కట్టించాడు.
చిత్రలేఖనం
· ఓరుగల్లులో దాదాపు 1500 మంది చిత్రకారులు ఉన్నట్లు ప్రతాపరుద్ర
చరిత్ర చెప్తుంది.
· కాకతీయుల కాలం నాటి వర్ణ చిత్రాలను మనం పిల్లలమర్రిలో చూడవచ్చు.
· ఈ కాలంలో నవకాశి చిత్రకారులు కాన్వాసు బట్టపై పురాణ,రామాయణ, మహాభారత చిత్రాలను అత్యంత కళాత్మకంగా చిత్రించేవారు.
సాంఘిక పరిస్థితులు
· కాకతీయుల కాలంను శూద్రయుగం అంటాం
ఎందుకంటే వీరి కాలంలో బ్రాహ్మణులు రాజకీయ ప్రాబల్యాన్ని కోల్పోయారు.
· పాలంపేటలోని రామప్ప చెరువు దగ్గర గల
ఆలయంలో స్త్రీలు మద్దెలూ వాయిస్తూ ఉండగా
మరి కొందరు స్త్రీలు నాట్యం చేస్తున్నట్లు ఉండే శిల్పాలు మనకు దర్శనమిస్తాయి.
· వీరి కాలం నాటి పలనాటి బ్రహ్మనాయుడు
అన్ని కులాలకు కలిపి ఓకే బంతిలో
భోజనాలు ఏర్పాటు చేయాలని అందరూ స్వాగతించారు. వీటిని చాపకూల్లు అనేవారు.
· పల్నాటి యుద్ధం తర్వాత ఓరుగల్లులో
పల్నాటి వీరులకు జాతర చేయడం వీరి సంప్రదాయం అయ్యింది.
No comments:
Post a Comment