ARTICLE 1 - ARTICLE 4
భారత భూభాగం - భారత యూనియన్
భారత రాజ్యాంగం ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలు.
ఆధారం |
గ్రహించిన అంశాలు |
1935
చట్టం |
కేంద్ర రాష్ట్రాలతో సమైక్య వ్యవస్థ, రాష్ట్రపతి పాలన, ఫెడరల్
కోర్టు, గవర్నర్
పదవి, విచక్షణాధికారాలు, పబ్లిక్ సర్వీస్
కమిషన్. |
అమెరికా రాజ్యాంగం |
ప్రాథమిక హక్కులు, న్యాయ
సమీక్ష స్వతంత్ర
ప్రతిపత్తి గల
న్యాయశాఖ, ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్
గా వ్యవహరించడం, ప్రజా ప్రయోజనాల
వ్యాజ్యం, రాష్ట్రపతి ని తొలగించే
మహాభియోగ తీర్మానం,
రాజ్యాంగ సవరణ
బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడం. |
కెనడా రాజ్యాంగం |
బలమైన కేంద్ర ప్రభుత్వం, అవశిష్ట
అధికారాలను కేంద్రానికి ఇవ్వడం, గవర్నర్లను నియమించే పద్ధతి,
ప్రకరణ143 ప్రకారం
రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరడం. |
బ్రిటిష్ రాజ్యాంగం |
పార్లమెంటు తరహా పాలనా
పద్ధతి, ద్విసభా పద్ధతి, సమన్యాయ పాలన, స్పీకరు,డిప్యూటీ స్పీకరు,శాసన
సభ్యులు అధికారాలు ,శాసన
నిర్మాణ ప్రక్రియ, అటార్నీ
జనరల్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్,రిట్లు జారీ చేసే
విధానం. |
ఐర్లాండ్ రాజ్యాంగం |
ఆదేశిక సూత్రాలు,రాజ్యసభ కు విశిష్ట సభ్యుల నియామకం, రాష్ట్రపతిని
ఎన్నుకునేందుకు నైష్పతిక ప్రాతినిధ్యం, ఒక ఓటు బదిలీ
పద్ధతి |
ఆస్ట్రేలియా |
ఉమ్మడి జాబితా, పార్లమెంటు ఉభయ సభల
సంయుక్త సమావేశం అంతర్ రాష్ట్ర వ్యాపారం, వ్యాపార లావాదేవీలు |
జర్మనీ |
జాతీయ అత్యవసర పరిస్థితి, ప్రాథమిక
హక్కులను రద్దు
చేసే అధికారం. |
దక్షిణాఫ్రికా |
రాజ్యాంగ సవరణ విధానం, రాజ్యసభ
సభ్యుల ఎన్నిక పద్ధతి. |
ఫ్రాన్స్ |
గణతంత్ర విధానం,స్వేచ్ఛ, సమానత్వం,
సౌభ్రాతృత్వం. |
స్విజర్లాండ్ |
ప్రధానమంత్రి, మంత్రిమండలి
మధ్య సమిష్టి బాధ్యత. |
రష్యా |
ప్రాథమిక విధులు, సామ్య వాద సూత్రాలు. |
15 ఆగస్టు 1947 న స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ప్రభుత్వం శాఖలు.
వ్యక్తి |
శాఖ |
జవహర్లాల్ నెహ్రూ |
ప్రధానమంత్రి, విదేశీ
వ్యవహారాలు, శాస్త్రీయ పరిశోధన, కామన్వెల్త్ సంబంధాలు, |
వల్లభాయ్ పటేల్ |
హోం శాఖ, ఇన్ఫర్మేషన్, బ్రాడ్కాస్టింగ్ |
మౌలానా అబుల్ కలాం
ఆజాద్ |
విద్యాశాఖ |
ఆ బి ఆర్
అంబేద్కర్ |
న్యాయశాఖ |
డాక్టర్ రాజేంద్రప్రసాద్ |
ఆహారం, వ్యవసాయం |
డాక్టర్ జాన్ మత్తయ్ |
రవాణా, రైల్వే |
RK షణ్ముగం
చేట్టి |
ఆర్థిక శాఖ |
జగ్జీవన్ రాయి |
కార్మిక శాఖ |
సర్దార్ బల్ దేవ్ సింగ్ |
రక్షణ శాఖ |
సిహెచ్ బాబా |
వాణిజ్యం |
రాజకుమారి అమృత్ కౌర్ |
ఆరోగ్యం |
అహ్మద్ కిద్వాయి |
కమ్యూనికేషన్స్ |
శ్యాం ప్రసాద్ ముఖర్జీ |
పరిశ్రమలు, పౌరసరఫరాలు |
వి ఎం ఏం
గాడ్గిల్ |
శక్తి ఇంధనం మైన్స్ అండ్ వర్క్ |
|
|
భారత భూభాగం - భారత యూనియన్
భారత
రాజ్యాంగంలో 1వ భాగం లో ఒక ఆర్టికల్ 1 నుండి 4వ
ఆర్టికల్ వరకు రాష్ట్రాల ఏర్పాటు గురించి వివరిస్తుంది.
ప్రకరణ(ఆర్టికల్)1
·
ఈ ప్రకరణ ప్రకారం భారత భూభాగం అన్ని రాష్ట్రాల సరిహద్దులు,
కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు కేంద్ర ప్రభుత్వం సముపార్జించుకున్న ఉన్న ఇతర భూభాగాలు ఉంటాయి.
·
ప్రస్తుతం భారతదేశంలో 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్ర
పాలిత ప్రాంతాలు కలవు.
·
వివరంగా చెప్పాలంటే ఆర్టికల్ 1 ప్రకారం “భారతదేశం రాష్ట్రాల సమ్మేళనం”.
ప్రకరణ 2
·
ఈ ప్రకరణ ప్రకారం పార్లమెంటు ఒక చట్టం ద్వారా కొత్త ప్రాంతాలను(విదేశీ ప్రాంతాలు) భారతదేశంలో చేర్చుకోవచ్చు మరియు ఇతర దేశాలకు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను బదిలీ చేయవచ్చు. ఈ
అధికారం భారత భూభాగంలో లేని అంశాలకూ వర్తిస్తుంది.
·
ఈ అధికారం పార్లమెంట్ కు సంబంధించింది అయినప్పటికీ అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి ఉండాలని అంటారు.
·
1961లో ఫ్రెంచి వారి ఆధీనంలో ఉన్న గోవాను 12 వ
రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశంలో కలుపుకోవడం జరిగింది మరియు 9 వ రాజ్యాంగ సవరణ ద్వారా పశ్చిమ బెంగాల్లోని బెరుబారి ప్రాంతాన్ని పాకిస్థాన్ కి బదిలీ చేయడం జరిగింది.
ప్రకరణ 3
·
ఈ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర
విస్తీర్ణాన్ని పెంచుకోవచ్చు.
·
రాష్ట్ర విస్తీర్ణాన్ని తగ్గించుకోవచ్చు .
· రాష్ట్ర సరిహద్దులు సవరించవచ్చు.
·
కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.1956లో ఆంధ్ర రాష్ట్ర మరియు హైదరాబాద్ రెండు రాష్ట్రాలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరియు అలాగే ఈ ఆర్టికల్ ప్రకారమే రాష్ట్రాన్ని విడగొట్టి తెలంగాణ అనే కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ప్రకరణ 4
·
ప్రకరణ2,3 ప్రకారం ఏ సవరణ చేసిన దానినే రాజ్యాంగ సవరణగా పరిగణించరు . అంటే రాష్ట్రాల ఏర్పాటు కొరకు పునర్వ్యవస్థీకరణకు రాజ్యాంగ సవరణ తప్పనిసరి కాదు.
·
ప్రకరణ2,3 ప్రకారం ఏ
సవరణ చేసిన దానినే రాజ్యాంగ సవరణగా పరిగణించరు . ప్రకరణ 2,3 ప్రకారం ఏదైనా సవరణ చేసినప్పుడు 1,4 షెడ్యూల్లో పేర్కొనబడిన అంశాలు కూడా తదనుగుణంగా మార్చాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment