ASAFJAHI-DYNASTY-IN-TELUGU-PART-2
అసఫ్ జాహి వంశం
PART -2
ALSO READ:- ASAFJAHI PART-1
వీరి కాలం నాటి సాంఘిక దురాచారాలు
వెట్టి
·
ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఉచితంగా
చేసే పనులను వెట్టి అంటారు.
· భూస్వాములు
మరియు దేశముఖ్ ప్రజలకు అప్పు ఇచ్చి వారి నుండి వడ్డీల మీద వడ్డీలు వసూలు చేసేవారు
ఒకవేళ అప్పులు చెల్లించకపోతే ఇంటినుండి ఒకరు వెట్టిచాకిరి చేయడానికి వచ్చేవారు.
· వెట్టి గురించి వట్టికోట ఆళ్వారుస్వామి తన ప్రజల మనిషి, గంగు రచనలో మరియు దాశరథి రంగాచార్య తన చిల్లరదేవుళ్ళు గ్రంథంలో బొల్లిముంత శివరామకృష్ణ తన మృత్యు నీడలో తెలిపారు.
బగేలా
·
రైతులపై విధించిన పనులను వారు
తీర్చకపోతే భూస్వాములకు దాసుడిగా మారిపోయేవారు. వీరు సాధారణంగా వ్యవసాయ పనుల్లో
బానిసగా పని చేసేవారు.
· నిజాం ప్రభుత్వం 1930లో దీనిని నిర్మూలిస్తు ఒక చట్టం చేసింది.
ఆడ పాప
· జమీందార్లు
మరియు ఉన్నత కులస్థులు తమ ఇళ్లల్లో ఆడపిల్లలను బానిసలుగా ఉంచుకునే వ్యవస్థను ఆడ
పాప అంటారు.
· జమీందార్ల కుటుంబాలలోని స్త్రీలకు వివాహ మైనప్పుడు జీతగానీ కుమార్తెను అమ్మాయితో అత్తవారింటికి పంపేవారు ఇక్కడ ఈమె కట్టుబానిసగా మరియు ఉంపుడుగత్తె జీవించేది.
జోగిని వ్యవస్థ
·
ఆడపిల్లలను దేవుడి పేరుతో వదిలేసే ఒక
ఆటవిక సంప్రదాయమే ఈ వ్యవస్థ అగ్రవర్ణాల వారైనా నిమ్న వర్ణాల వారైనా వివాహ సమయంలో
జోగిని బృందాన్ని పిలుచుకొని వారి ఆశీస్సులు తీసుకుంటారు.
· అంటే జోగినిలు ఇతర వివాహ విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తారు కానీ
వారు మాత్రం వివాహానికి అర్హులు కాదు.
· అత్యధికంగా జోగినిలు కరీంనగర్ జిల్లాలో గుర్తించబడ్డారు.
పడుపు వృత్తి
· వీరిని తవాయిఫ్ అంటారు, వీరు సంగీత నాట్యాలలో పురుషులను ఆహ్లాదపరుస్తారు, తర్వాతి కాలంలో వీరు వేశ్యలుగా మార్చబడ్డారు.
పరదా పద్ధతి
· ముస్లిం మహిళలతోపాటు హిందూ ప్రభువులు మరియు ఉన్నత కులస్థులు స్త్రీలు పరదా పాటించేవారు అంటే తమ ముఖాన్ని బయటి వారికి చూపించేవారు కాదు.
తెలంగాణలో 1857 సిపాయిల తిరుగుబాటు
·
ఈ తిరుగుబాటు సమయంలో హైదరాబాద్ లోనీ
బ్రిటిష్ రేసిడెంట్ కల్నల్ డేవిడ్సన్.
· ఔరంగాబాద్
లో ఒకటి మరియు రెండవ అశ్విక దళాలు సంస్థానం వెలుపలికి వెళ్ళలేదు.
· ఈ అశ్వికదళ తిరుగుబాటు మీర్
ఫిదా అలీ మరియు జమెడర్ అమీర్
ఖాన్ నాయకత్వం వహించడం జరిగింది.
· అయితే మీరు ఫిదా అలీనీ ఉరి తీయడం
జరిగింది. అమీర్
ఖాన్ పారిపోయాడు
· బల్తనలో
చిడ్డాఖాన్ కూడా ఈ తిరుగుబాటులో నాయకత్వం వహించాడు , అయితే
ఇతను పారిపోయి హైదరాబాద్ నగరం చేరుకున్నాడు.
· సాలార్ జంగ్ ఇతనిపై 3000
ప్రకటించాడు తర్వాతికాలంలో సాలార్ జంగ్ మరియు అతని అనుచరులను అరెస్టు చేసి
బ్రిటిష్ రేసిడెంట్ కి అప్పగించడం జరిగింది.
·
మక్కా మసీదులో ప్రజల సమావేశంమై చిద్దాఖన్ నీ విడిపించాలని
తీర్మానించుకున్నారు.
దీనికి నాయకత్వం వహించింది తుర్రెబాజ్ ఖాన్ మరియు మౌల్వీ అల్లాఉద్దీన్.
· వీరిని
పటుకోవడనికి మేజర్ బ్రిక్స్ నాయకత్వంలో బ్రిటిష్ సైన్యం దాడి ప్రారంభించింది,
కుర్బాన్ అలీ అనే ద్రోహి సమాచారంతో తుర్రేబాజ్ ఖాన్ ను తుఫాన్ వద్ద
చుట్టుముట్టి కాల్చిచంపారు, అల్లా ఉద్దీన్ ను అరెస్టు చేయడం జరిగింది.
· దీంతో
తెలంగాణలో తిరుగుబాటును అణచి వేయడం జరిగింది.
· ఈ
తిరుగుబాటును అణచి వేయడానికి సహకరించిన నవాబుకి తన పేరుతో నాణాలు ముద్రుచుకునే
అవకాశం బ్రిటిష్ వారు కల్పించడం జరిగింది.
·
నిజాం నుండి తీసుకున్న రాయచూరు మరియు ఉస్మానాబాద్ లను తిరిగి
ఇచ్చి వేయడం జరిగింది. ప్రధాని అయినా మీరు తురబ్ అలీ ఖాన్ కి “సాలార్
జంగ్”(సాలార్
జంగ్ 1) అనే
బిరుదు ఇవ్వడం జరిగింది.
ప్రాజెక్టులు
1. ఉస్మాన్ సాగర్ (గండిపేట) హిమాయత్ సాగర్
· ఈ రెండు ప్రాజెక్టులను 7వ
నిజాం కట్టించాడు.
· 1908వ
సంవత్సరంలో మూసీ నది వరదల వల్ల జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని మరియు
హైదరాబాద్ పట్టణ ప్రజలకు తాగునీటి అవసరం కోసం నగరానికి 20 కిలోమీటర్ల ఎగువన
మూసీ నదిపై తన పేరున ఉస్మాన్ సాగర్ నూ 1919లో కట్టించాడు.
· మూసీ
నది ఉపనది అయిన ఈసా పై తన కుమారుడైన హిమాయత్ అలీఖాన్ పేరుమీద
1927 హిమాయత్సాగర్ నిర్మించాడు.
2.పోచారం రిజర్వాయర్
· దీనిని
నిజామాబాద్ జిల్లాలోని పోచారం గ్రామంలో ఆలేరు ఉపనదిపై నిర్మించారు.
3.బేలాల్ ప్రాజెక్టు
· దీనినే
నిజామాబాద్ జిల్లాలోని బోధన్ లో తాగునీటి కొరకు నిర్మించారు.
4.నిజాం సాగర్ ప్రాజెక్ట్
· ఏడవ
నిజాం నిర్మించిన ప్రాజెక్టులలో అతి పెద్దది
దీన్ని నిజామాబాద్ జిల్లాలో అచ్చంపేట
గ్రామం లో మంజీరా నదిపై నిర్మించారు, ఈ ప్రాజెక్టు చెరుకు పంటలకు నీరు అందించడం ద్వారా నిజాం చక్కెర పరిశ్రమ ఇక్కడ నెలకొల్పారు.
5. నాగార్జునసాగర్
· దీనిని
మొదటగా కృష్ణా నదిపై నందికొండ గ్రామంలో నిర్మించాలని ప్రముఖ ఇంజనీర్
జాఫర్ అలీ చేత ఏడవ నిజామ్ ప్రయత్నాలు సాగించారు.
· కానీ
తర్వాత కెఎల్ రావు ఆధ్వర్యంలో ప్రాజెక్టుని ఇంకొద్దిగా దిగువకు తీసుకుపోయి
ఎక్కువ భాగం ఆంధ్రప్రాంతానికి పోయేటట్లు చేయడం జరిగింది.
6. డిండి ప్రాజెక్టు
· ఈ
ప్రాజెక్టును కృష్ణా నది ఉపనది అయిన దిండి నదిపై నల్గొండ జిల్లాలో దేవరకొండలో నిర్మించారు.
7. రాయంపల్లి రిజర్వాయర్
· దీనిని
మెదక్ జిల్లాలో రాయంపల్లిలో నిర్మించడం జరిగింది.
8. పాలేరు ప్రాజెక్టు
· దీనిని
ఖమ్మం జిల్లాలోని పాలేరు నది పై నాయికుంద గ్రామంలో
నిర్మించడం జరిగింది.
9. వైరా ప్రాజెక్టు
· దీనిని
ఖమ్మం జిల్లాలోని మధుర తాలూకాలో వైరా నది పైన నిర్మించడం జరిగింది.
10. సింగభూపాలెం రిజర్వాయర్
· దీనినే
ఖమ్మం జిల్లాలోని ఇల్లందు తాలూకాలో వైరా నది పైన నిర్మించడం జరిగింది.
11. మానేరు రిజర్వాయర్
· దీన్ని
కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల తాలుకలో నిర్మించడం జరిగింది.
పరిశ్రమలు
·
డాక్టర్ కింగ్ అనే వ్యక్తి మొట్టమొదటి బొగ్గు గనినీ ఖమ్మం
జిల్లాలోని ఇల్లందు దగ్గర సింగరేణిలో కనుగొన్నారు.
· నిజాం
ప్రభుత్వం 1920 లో సింగరేణి
కాలరీస్ కంపెనీనీ స్థాపించింది.
· నిజాం ప్రభుత్వం 1918లో కామర్స్ అండ్
ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ను స్థాపించారు.
· ఈ డిపార్ట్మెంట్
1921లో డిపార్ట్మెంట్ ఆఫ్ డెవలప్మెంట్ గా మారింది దీని ఆధ్వర్యంలో నిజాం
ప్రభుత్వం 1929లో ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్ ను కోటి రూపాయలతో
ఏర్పాటు చేసింది.
· ఏడవ
నిజాం అనేక పరిశ్రమలను నెలకొల్పాడు.
· దక్కన్ బటన్ ఫ్యాక్టరీ (1916), నిజాం
షుగర్ ఫ్యాక్టరీ(1937) , దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ(1927),సిర్పూర్ కాగజ్ పరిశ్రమ(1939), గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ(1941), హైదరాబాద్
ఆల్విన్ మెటల్స్(1942), ఆజంజాహి మిల్స్ వంటి అనేక పరిశ్రమలు నెలకొల్పాడు.
· హైదరాబాద్
సంస్థానంలో మొదటిసారిగా పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన 1856లో చాదర్ఘాట్
లో ఏర్పాటు చేయడం జరిగింది.
· ఉస్మానియా అసోసియేషన్ వారు 1935 నుండి
హైదరాబాద్ పారిశ్రామిక ప్రదర్శనను శాశ్వత ప్రాతిపదికన నిర్వహించడం మొదలుపెట్టారు. ఈ
పారిశ్రామిక ప్రదర్శనను “నుమాయిష్” అంటారు.
ఇతర ముఖ్యమైన అంశాలు
· 1918లో “టాటా
ఇండస్ట్రియల్ బ్యాంక్” మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రభుత్వ సహాయంతో
ఇక్కడ ప్రారంభించడం జరిగింది. తర్వాతి కాలంలో టాటా ఇండస్ట్రియల్ బ్యాంక్
అనేది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది ఈ బ్యాంకులో మీర్ ఉస్మాన్
అలీ ఖాన్ ప్రభుత్వం 20 లక్షల రూపాయలను అతి తక్కువ వడ్డీకి డిపాజిట్ చేయడం జరిగింది.
· నిజాం ప్రభుత్వం హైదరాబాద్ స్టేట్ బ్యాంకును
1942 లో ప్రారంభించడం జరిగింది.
· బ్రిటిష్ ఇండియాలో కేవలం హైదరాబాద్ సంస్థానానికి
మాత్రమే సొంతంగా కరెన్సీని ముద్రించుకుని హక్కు ఉండేది.
· హైదరాబాద్ స్టేట్ బ్యాంకు లావాదేవీలను ఉస్మానియా
సిక్క రూపంలో
నిర్వహించింది.
· 1918లో మీర్
ఉస్మాన్ అలీ ఖాన్ వంద రూపాయల నోటు జారీ చేయడం జరిగింది.
· 1919 ఆగస్టు
28న ఉస్మానియా యూనివర్సిటీనీ ఉస్మాన్ అలీఖాన్ చే ప్రారంభించడం
జరిగింది దీనిలో బోధన భాషగా ఉర్దూ ఉండేది.
· స్థానిక
భాషల్లో విశ్వవిద్యాలయం స్థాపించాలనీ జమాలుద్దీన్ మరియు రఫత్ యార్
జాంగ్ పేర్కొనడం జరిగింది
· ఏడవ
నిజాం అలీఘర్ ముస్లిం యూనివర్సిటీకి జామియా-మిలియా-
ఇస్లామియా మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి నిధులు ఇవ్వడం జరిగింది.
· మొదటి
ప్రపంచ యుద్ధంలో సైనిక పరంగా మరియు ఆర్థిక
పరంగా సహకరించిన ఉస్మాన్ అలీ ఖాన్ కి
బ్రిటిష్ ప్రభుత్వం “హిజ్ ఎగ్జాల్ టెడ్
హైనస్” అనే బిరుదు ఇచ్చింది ఈ బిరుదు పొందిన ఒకే ఒక్క
భారతీయుడు ఇతడు.
అసఫ్జాహీల కాలంనాటి సామాజిక వ్యవస్థ
వీరి కాలంలోనీ ఆశ్రిత కులాలు
ఈ కులాలు యాచిస్తూ జీవనం గడించేవారు, వీరు
అడుక్కునే కులాలను బట్టి వీరికి వివిధ పేర్లు కలవు
రాజుల
దగ్గర |
భట్రాజులు |
బ్రాహ్మణుల
దగ్గర |
విప్రవినోదులు |
పద్మశాలీల
దగ్గర |
సాధనా
శూరులు |
కోమట్ల
దగ్గర |
వీరముష్టి,
మైలారీలు |
పెరుకల
దగ్గర |
వరుస
బట్టులు |
మాలల
దగ్గర |
ముష్టిగ |
మాదిగల
దగ్గర |
డక్కలి
,భాగవతులు, తపెటులు |
1.
దూదేకుల కులం వారు – సూఫీ
సన్యాసుల బోధనల వల్ల స్ఫూర్తి పొంది
ఇస్లాంను స్వీకరించిన వారు. వీరు సున్ని శాఖకు చెందినవారు.
2.
లూసో ఇండియన్స్- పోల్చిగిసు మరియు
దక్కన్ ల సంకరజాతి.
3.
బలోతదార్లు- వీరు
గ్రామ సేవకులు, వీరు ఊరి సర్కారు డబ్బులు తీసుకెళ్లి తాసిల్దార్ ఖజానాలో జమ
చేసేవారు.
ALSO READ:- ASAFJAHI PART-1
No comments:
Post a Comment