భారత రాజ్యాంగ పరిషత్
(రాజ్యాంగ రచన)
Constituent Assembly of India
●
ప్రపంచంలో మొదటి సారిగా రాజ్యాంగ రచనకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు
చేసిన దేశం అమెరికా.
●
1787 లో అమెరికా ఫిలడెల్ఫియా
సమావేశంలో రాజ్యాంగ రచనకు ఏర్పాటు చేసుకున్నారు.
●
1927 మేలో బాంబే లో జరిగిన సమావేశంలో మోతిలాల్ నెహ్రూ రాజ్యాంగ
రచన ఆవశ్యకత గురించి తెలియజేశారు.
●
1928 మేలో మోతిలాల్ నెహ్రూ అధ్యక్షతన 9 మంది సభ్యులతో కూడిన ఒక
సంఘాన్ని రాజ్యాంగ రచనకు కమిటీ నియమించింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను “నెహ్రూ రిపోర్ట్” అంటారు, ఇదే భారతీయులు సొంతంగా
రాజ్యాంగ రచన చేసిన తొలి ప్రయత్నం.
భారత రాజ్యాంగ పరిషత్ నిర్మాణం
●
కేబినెట్ కమిటీ సిఫార్సుల మేరకు రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య ఎన్నిక
విధానం మరియు ఇతర ప్రక్రియలు నిర్ణయించడం జరిగింది .
●
1946 జూలై,ఆగస్టు నెలలో రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగాయి. ప్రతి ప్రావిన్స్ నుండి దాదాపు 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడు ఆనాడు 11 ప్రావిన్స్
లు ఉండేవి .
●
రాజ్యాంగ పరిషత్ లోని మొత్తం
సభ్యులు 389 ఇందులో 292 మంది బ్రిటిష్ ఇండియా నుండి ఎన్నికవుతారు, 93
మంది ప్రతినిధులు స్వదేశీ సంస్థానాల నుండి నామినేట్ అవుతారు.
● అన్ని రకాల వర్గాల ప్రజలు రాజ్యాంగ పరిషత్ లో సభ్యులుగా గలరు.
●
“ఫ్రాంక్ ఆంథోనీ” యూరోపియన్ల వర్గం నుండి ఎన్నికయ్యాడు.
●
మౌలానా అబుల్ కలాం ఆజాద్
,సయ్యద్ సాదుల్లా ముస్లిం వర్గాల నుండి ఎన్నికయ్యారు.
రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికైన తెలుగువారు
1. టంగుటూరి ప్రకాశం పంతులు గారు.
2. పట్టాభి సీతారామయ్య
3. నీలం సంజీవరెడ్డి గారు
4. దుర్గాబాయి దేశ్ముఖ్
5. కళా వెంకట్రావు గారు
6. కల్లూరు సుబ్బారావు
7. మోటూరి సత్యనారాయణ
8. N.G.రంగా
9. బొబ్బిలి రాజా రామకృష్ణ రంగారావు,
10. V.C. కేశవరావు,
11. తిరుమల రావు.
ఆశయాల తీర్మానం
●
ఈ ఆశయాల తీర్మానం అనేది రాజ్యాంగ తత్వానికి ,లక్ష్యాలకు, ఆదర్శాలకు మూలం
ఇది. ప్రవేశికకి
ప్రధాన ఆధారం, దీనిని 1946 డిసెంబర్ 13 న “జవహర్లాల్ నెహ్రూ” దీన్ని ప్రవేశపెట్టారు, ఆశల
తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ 1947 జనవరి 22న ఏకగ్రీవంగా ఆమోదించింది.
రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం
●
1946 dec 9 న ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్లో రాజ్యాంగ
పరిషత్ మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 211 మంది
హాజరయ్యారు ఈ సమావేశం 4 రోజుల పాటు జరిగింది.
●
రాజ్యాంగ పరిషత్ లో సీనియర్ సభ్యుడైన డాక్టర్ సచ్చిదానంద సిన్హా
ను తాత్కాలిక అధ్యక్షుడిగా, ఫ్రాంక్ ఆంటోనీనీ
ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నారు.
●
డిసెంబర్ 11న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ని రాజ్యాంగ పరిషత్ కి
శాశ్వత అధ్యక్షుడిగా జె.బి.కృపలానీ
ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
●
హెచ్.సి. ముఖర్జీ నీ ఉపాధ్యక్షులుగా
పట్టాభిసీతారామయ్య ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, తర్వాత V.T. కృష్ణమాచారినీ కూడా రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షులు గా నియమించారు.
●
అంతర్జాతీయ న్యాయవాది
బెనగల్ నరసింహారావును రాజ్యాంగ పరిషత్ ముఖ్య సలహాదారుగా
నియమించారు ఇతను బర్మా రాజ్యాంగ రచనలో కూడా పాల్గొన్నాడు.
రాజ్యాంగ పరిషత్ కమిటీలు
●
రాజ్యాంగ పరిషత్ లో వివిధ అంశాల పరిశీలనకు 22 కమిటీలను ఏర్పాటు చేశారు.
●
అత్యంత ముఖ్యమైన “డ్రాఫ్టింగ్ (ముసాయిదా) కమిటీ” .1947 ఆగస్టు 29 న
బి.ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో
ఈ ముసాయిదా కమిటీని నియమించడం జరిగింది.
●
రాజ్యాంగ ముసాయిదా కమిటీ లో బిఆర్ అంబేద్కర్ చైర్మన్ గా,N.గోపాలస్వామి
అయ్యంగార్, కె.ఎం.మున్షీ, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, సయ్యద్ సదుల్లా, N.మాధవరావు,
టి టి కృష్ణమాచారి సభ్యులుగా ఉన్నారు.
రాజ్యాంగ పరిషత్ ఇతర అంశాలు
●
రాజ్యాంగ పరిషత్ చిట్టచివరి సమావేశం 1950 జనవరి 24న జరిగింది. ఆరోజు సమావేశానికి 284 మంది
హాజరైనారు,భారత రాజ్యాంగం “1950 జనవరి 26” నుంచి అమల్లోకి వచ్చింది. ఆరోజునే “గణతంత్ర దినోత్సవం” గా దేశ ప్రజలందరూ జరుపుకుంటారు.
●
రాజ్యాంగ అమలు తేదీని జనవరి 26 నే నిర్ణయించడానికి చారిత్రక నేపథ్యం ఉంది, భారత జాతీయ
కాంగ్రెస్ నెహ్రూ అధ్యక్షతన లాహోర్లో జరిగిన సమావేశంలో పూర్ణ స్వరాజ్ దినోత్సవంగా
ప్రకటించింది. ఆ సంఘటనకు గుర్తుగా జనవరి 26నే నిర్ణయించడం జరిగింది.
●
రాజ్యాంగం రూపకల్పన కోసం కొరకే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం
పట్టింది.
రాజ్యాంగ పరిషత్ నిర్వహించిన ఇతర విధులు
●
రాజ్యాంగ పరిషత్ కి ఏనుగును
చిహ్నంగా గుర్తించడం జరిగింది.
●
దేవనాగరి లిపిలో గల హిందీని
కేంద్రప్రభుత్వ భాషగా 1949 సెప్టెంబర్ 14 ఆమోదించడం జరిగింది జాతీయ జెండాను
1947 జూలై 22న ఆమోదించింది.
●
GV మౌలంకర్ నీ మొట్టమొదటి స్పీకర్ గా ఎన్నుకుంది.
●
1950 జనవరి 24న జాతీయ గేయాన్ని మరియు జాతీయ గీతాన్ని
ఆమోదించింది, మొట్టమొదటి రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్ ని ఈ పరిషత్ ఎన్నుకుంది.
రాజ్యాంగానికి అత్యంత ముఖ్యమైన ఆధారం “1935 భారత ప్రభుత్వ చట్టం”, అందుకే మన రాజ్యాంగాన్ని “1935 చట్టం యొక్క నకలు” అని అంటారు.
రాజ్యాంగ పరిషత్ యొక్క ఇతర సమాచారం
●
భారత రాజ్యాంగానికి ఆధారమైన రాజ్యాంగాల
సంఖ్య 60.
●
రాజ్యాంగ పరిషత్ లో 15 మంది నామినేటెడ్ సభ్యులు కలరు అందులో సర్వేపల్లి
రాధాకృష్ణ, K.T. షా ముఖ్యమైన వారు.
●
రాజ్యాంగ పరిషత్ రచన కొరకు 64
లక్షలు ఖర్చు అయినవి
● బి.ఆర్. అంబేద్కర్ ని రాజ్యాంగ నిర్మాతగా అభివర్ణించింది
అనంతశయనం అయ్యంగారు.
●
“అంబేద్కర్ ని నైపుణ్యం గల ఫైలెట్” గా పేర్కొన్నది డాక్టర్
రాజేంద్రప్రసాద్
● రాజ్యాంగ పరిషత్ లో ఎక్కువ
సవరణలను ప్రతిపాదించింది హెచ్.వి కామత్
●
రాజ్యాంగ పరిషత్ కి కార్యదర్శిగా
వ్యవహరించింది హెచ్ .బి. అయ్యంగర్
● రాజ్యాంగ ప్రవేశిక కి art work చేసింది “నందన్ లాల్ బోస్”
●
మౌలిక రాజ్యాంగంలో 230
పేజీలు ఉన్నాయి
●
రాజ్యాంగ పరిషత్ లో కమ్యూనిస్టు
పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించింది సోమనాథ్ లహరి.
రాజ్యాంగ పరిషత్ పై ప్రముఖుల అభిప్రాయాలు
●
రాజ్యాంగం వైఫల్యం సిద్ధమైతే రాజ్యాంగాన్ని నిందించరాదు అమలు పరిచే వారిని
నిందించాలి -బి ఆర్ అంబేద్కర్.
●
భారత రాజ్యాంగం ఇతర రాజ్యాంగాల
కొల్లగొట్టి రూపొందింది అని చెబితే నేను గర్వపడతాను ఎందుకంటే మంచి ఎక్కడున్నా గ్రహించడం
తప్పేమీ కాదు - బి ఆర్ అంబేద్కర్ .
●
రాజ్యాంగాన్ని ఐరావతం తో పోల్చినది - హెచ్ బి కామ్
●
భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం, సుదీర్ఘమైనది మరియు దివ్యమైనది -
సర్ ఐవర్ జెన్నింగ్స్.
● భారత రాజ్యాంగం ప్రజల బహుళ
అవసరాలను, ప్రయోజనాలను నెరవేర్చింది పరిషత్ కి సర్వబౌమాధికారం లేదనే వాదనను తిరస్కరిస్తున్నాను
- జవహర్లాల్ నెహ్రూ.
●
రాజ్యాంగ పరిషత్ నిర్మాణం లో
ప్రజాభిప్రాయ ఛాయలు లేవు – K.సంతానం.
● రాజ్యాంగ పరిషత్ కేవలం హిందువులకు
మాత్రమే ప్రాతినిధ్యం వహించింది - లార్డ్ సైమన్.
●
రాజ్యాంగ రచనలో సమన్వయ పద్ధతి
కంటే సర్డుపాటు పద్ధతి కి ప్రాధాన్యత ఇచ్చారు – O P గోయల్.
●
రాజ్యాంగ పరిషత్ దేశంలో ఒక ప్రధాన
వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించింది – విన్ స్టన్ చర్చిల్.
రాజ్యాంగం యొక్క భాగాలు సంబంధించిన అంశాలు
భాగం |
ప్రకరణలు |
అంశాలు |
1 |
1-4 |
కేంద్రం – రాష్ట్రాలు - భూభాగాలు |
2 |
5- 11 |
పౌరసత్వం |
3 |
12-35 |
ప్రాథమిక హక్కులు |
4 |
36-51 |
ఆదేశిక నియమాలు |
4 a |
51a |
ప్రాథమిక విధులు |
5 |
52-151 ప్రకరణ |
కేంద్ర ప్రభుత్వం |
6 |
152-237 ప్రకరణ |
రాష్ట్ర ప్రభుత్వం |
7 |
7 వ భాగాన్ని 7వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు |
|
8 |
239-242 |
కేంద్రపాలిత ప్రాంతాలు |
9 |
243a-243o |
పంచాయతీల నిర్మాణం |
9a |
243p-243zg |
మున్సిపాలిటీల నిర్మాణం |
9b |
243zh-243zt |
సహకార సంఘాల ఏర్పాటు |
10 |
244-244a |
షెడ్యూల్ అండ్ ట్రైబల్ ప్రాంతాలు |
11 |
245-263 |
కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలన
సంబంధాలు |
12 |
264-300a |
కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక ఒప్పందాలు |
13 |
301-307 |
వాణిజ్య వ్యాపార సంబంధాలు |
14 |
308-323 |
కేంద్ర రాష్ట్ర సర్వీసులు |
15 |
324-329 |
ఎన్నికలు- ఎన్నికల సంఘం |
16 |
330-342 |
ఎస్సీ ఎస్టీ బిసి లకు ప్రత్యేక రక్షణలు |
17 |
343-351 |
అధికారిక భాషలు |
18 |
352-360 |
అత్యవసర అధికారాలు |
19 |
361-367 |
మినహాయింపులు |
20 |
368 |
రాజ్యాంగ సవరణ విధానం |
21 |
369-392 |
జమ్ము కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ,నాగాలాండ్ రాష్ట్రాలకు ప్రత్యేక
రక్షణలు |
22 |
393-395 |
హిందీలో సాధికారికంగా రాజ్యాంగ తర్జుమా |
No comments:
Post a Comment