presidents list of India
భారత రాష్ట్రపతులు -వరుసక్రమం
1.
డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ (1950 Jan 26-1962)
·
ఇతని రాష్ట్రం బీహార్, మొదటి రాష్ట్రపతి మరియు ఇతను రెండు సార్లు ఎన్నికయ్యాడు .
·
రెండవ సారి అత్యధిక మెజారిటీతో( 99.4 శాతం) ఎన్నికయ్యారు. హిందూ కోడ్ బిల్లు విషయంలో ఆమోదం తెలుపకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.
·
1962లో ఇతనికి భారతరత్న బిరుదు లభించింది. ఇతను “ఇండియన్ డివైడెడ్” అనే గ్రంథాన్ని రచించాడు
2. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్(1962-1967)
·
ఇతను తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. మొట్టమొదటి ఉపరాష్ట్రపతి.
·
ఉప రాష్ట్రపతి నుండి రాష్ట్రపతిగా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి ఇతను.
·
ఇతను గొప్ప ఉపాధ్యాయుడు, తత్వవేత్త, దార్శనికుడు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన మొదటి రాష్ట్రపతి.
·
చైనాతో యుద్ధం అనంతరం రక్షణ మంత్రి అయిన కృష్ణ మీనన్ పదవినుండి తొలగించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు 1954లో ఇతనికి భారతరత్న లభించింది.
·
రష్యా అధ్యక్షుడు అయిన స్టాలిన్ తో ఇంటర్వ్యూ జరిపిన వ్యక్తి.
3.
డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1967-1969)
·
ఇతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి మరియు తొలి ముస్లిం రాష్ట్రపతి.
4. వి.వి. గిరి (1969 మే 3- జులై 20)
·
ఇతను ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి. తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన చేసిన మొట్టమొదటి ఉపరాష్ట్రపతి. 1975లో ఇతనికి భారతరత్న అవార్డు లభించింది.
హిదయతుల్లా (1969 జులై 20- ఆగస్ట్ 24)
·
ఇతను మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. తాత్కాలిక రాష్ట్రపతిగా పని చేసిన వ్యక్తి. ఇతను సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి.
వి.వి. గిరి (1969 ఆగస్ట్ 24 -1974 ఆగస్ట్ 24)
·
స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన మొదటి రాష్ట్రపతి ఇతను. అతి తక్కువ మెజారిటీతో ఎన్నికైన రాష్ట్రపతి.
·
ఇతను రచించిన ప్రముఖ గ్రంథం “వాయిస్ ఆఫ్ కెన్షేషన్”.
·
ఇతను రెండవ ప్రాధాన్య ఓటు ద్వారా ఎన్నికయ్యాడు. తన ఎన్నికల వివాదం లో సుప్రీంకోర్టులో స్వయంగా హాజరై తన వాదనను వినిపించిన రాష్ట్రపతి వి.వి.గిరి.
·
జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రెండవ రాష్ట్రపతి.
5.ఫక్రుద్దీన్ అలీ అహ్మద్(1974-1977)
·
ఇతను అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యక్తి పదవిలో ఉండగా మరణించిన రెండవ రాష్ట్రపతి. జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన మూడవ రాష్ట్రపతి.
·
ఇతని కాలంలోనే రాష్ట్రపతి పదవికి రబ్బరు స్టాంపు అనే పేరు వచ్చింది.
జి.డి.జెట్టి(1977 feb
11-july25)
·
ఇతను మహారాష్ట్ర కు చెందిన వ్యక్తి. తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన మూడో వ్యక్తి.
6.
నీలం సంజీవరెడ్డి(1977-1982)
·
ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ముఖ్యమంత్రిగా పనిచేసిన మొదటి రాష్ట్రపతి.
·
అతి చిన్న వయస్సులో రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి. లోక్ సభ స్పీకర్ గా పనిచేసిన ఏకైక రాష్ట్రపతి.
7. జ్ఞాని జైల్ సింగ్ (1982-1987)
·
ఇతను పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. తొలి ముస్లిం రాష్ట్రపతి.ఇతని సమాధి “ఎక్తాస్థల్”.
·
ఇతను వెనుకబడిన తరగతుల నుండి వచ్చిన మొదటి రాష్ట్రపతి ఇతను వివాదాస్పదం అయిన పోస్టల్ బిల్లుపై పాకెట్ విటో ఉపయోగించిన రాష్ట్రపతి.
·
ఆపరేషన్ బ్లూ స్టార్( స్వర్ణ దేవాలయం) జరిగింది ఇతని కాలంలోనే.
8. ఆర్.వెంకటరామన్ (1987-1992)
·
ఇతను తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి.ఇతను అత్యధిక ప్రధాన మంత్రులచే పదవి ప్రమాణ స్వీకారం చేయించాడు.
9. డాక్టర్ శంకర్ దయాల్ శర్మ (1992-1997)
·
ఇతను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇతను వివాదాస్పదం అయిన దళిత క్రిస్టియన్లకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లుపై వీటో అధికారం చెలాయించాడు.
·
ఇతని సమాధి పేరు కర్మభూమి.
10. కె.ఆర్.నారాయనన్ 1997-2002
·
ఇతను కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. దళిత వర్గానికి చెందిన మొదటి రాష్ట్రపతి ఇతను.
·
అత్యధిక మెజారిటీతో గెలిచిన రెండవ రాష్ట్రపతి ఇతను సాధారణ పౌరుల వలే ఓటు హక్కు వినియోగించుకున్న మొదటి రాష్ట్రపతి.
·
అమెరికా ప్రభుత్వం చేత బెస్ట్ స్టేట్ మాన్ అంటే ఉత్తమ రాజ్యాధినేత అనే అవార్డు పొందిన భారత రాష్ట్రపతి ఇతను.
11. ఏపీజే అబ్దుల్ కలాం 2002-2007
·
ఇతను తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఇతను ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి వ్యక్తి.
·
ఇతను త్రిశూల్ మరియు నాగ్ క్షిపణుల సృష్టికర్త.
·
లాభదాయక పదవుల బిల్లును పునః పరిశీలనకు పంపాడు. ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న రెండవ రాష్ట్రపతి.
·
ఇతనికి 1997లో భారతరత్న లభించింది. ఇతను 2015 జూలై 27 నాడు మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో "ఎ లివబుల్ ప్లానెట్ ఎర్త్" అనే అంశంపై ప్రసంగిస్తుండగా పడిపోయి చనిపోయాడు.
12. శ్రీమతి ప్రతిభా పాటిల్ (2007
July 25 -2012 July 25)
·
మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి. రాజస్థాన్ గవర్నర్ గా మహారాష్ట్రలో మంత్రిగా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా పనిచేశారు.అత్యధిక దేశాలు పర్యటించిన రాష్ట్రపతి ఈమె.
·
ఈమె అత్యధికంగా 35
మందికి క్షమాభిక్ష పెట్టింది. బ్రిటిష్ రాణి ఎలిజిబెత్ ఆహ్వానం అందుకున్న తొలి రాజ్యాధినేత. 74 సంవత్సరాల వయసులో సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి.
13. ప్రణబ్ ముఖర్జీ (2012
July 25-2017 July
25)
·
ఇతను పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇతను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా పనిచేశారు.
కేంద్రంలో రక్షణ, వాణిజ్య మరియు విదేశాంగ మంత్రిగా పనిచేశారు.
·
ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు హాజరైన రాష్ట్రపతి. ఇతను ద డ్రమాటిక్ డికెడ్ గ్రంథం రచించాడు.
·
ప్రణబ్ ముఖర్జీ ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ అగ్నిహోత్రి రిటర్నింగ్ అధికారి గా వ్యవహరించారు.
14. రామ్నాథ్ కోవింద్ (2017 july 25- prasent)
·
రామ్నాథ్ కోవింద్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడు. 1971లో న్యాయవాదిగా స్థిరపడ్డాడు.
·
రామ్నాథ్ కోవింద్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా అనూప్ మిశ్రా వ్యవహరించాడు. రామ్నాథ్ కోవింద్ ఢిల్లీ హైకోర్టు సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు.
·
2006లో బీహార్లోని ఐదుగురు చిన్నారులతో సహా ఏడుగురు సజీవ దహనం కేసులో జగత్ రాయ్ అనే వ్యక్తికి సుప్రీం కోర్టు మరణశిక్ష విధించగా దానిని తిరస్కరించాడు.
·
రామ్నాథ్ కోవింద్ సందర్శించిన తొలి విదేశి దేశం జిభూతి.
ఇతనికి నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనే పురస్కారాన్ని గునియా దేశం నుండి పొందాడు.
ALSO READ:-fundamental duties-ప్రాథమిక విధులు
ALSO READ:-Directive Principles of State Policy ఆదేశిక సూత్రాలు
No comments:
Post a Comment