ఉపరాష్ట్రపతి
vice president of India
ఉపరాష్ట్రపతికి సంబంధించిన వివరాలు భారత రాజ్యాంగంలో 5వ భాగంలో ఉంటాయి. ఉపరాష్ట్రపతి పదవిని అమెరికా ఉపాధ్యక్ష పదవితో పోల్చవచ్చు.
ఆర్టికల్ 63
ఆర్టికల్ 63 ప్రకారం మన దేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు.
ఆర్టికల్ 64
ఆర్టికల్ 64 ప్రకారం రాజ్యసభకు అధ్యక్షునిగా ఉంటాడు.
ఆర్టికల్ 65
ఆర్టికల్65 ప్రకారం తాత్కాలిక రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతి వ్యవహరించవచ్చు.
ఆర్టికల్ 66
ఆర్టికల్ 66(1)
ఆర్టికల్
66(1) ప్రకారం పార్లమెంటు ఉభయ సభల
సభ్యులు (నామినేటెడ్ సభ్యులతో కలిపి) ఉపరాష్ట్రపతిని “నైష్పత్తిక
ప్రాతినిధ్య ఒక ఓటు బదలాయింపు పద్ధతి”లో ఎన్నుకుంటారు.
మౌలిక
రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతిని పార్లమెంటు సంయుక్త సమావేశంలో ఎన్నుకునేవారు. 1961లో
చేసిన 11 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉపరాష్ట్రపతికి విడివిడిగా ఓటు వేసే
పద్ధతిని చేశారు.
ఉప రాష్ట్రపతి
ఎన్నిక రాష్టపతి వల్లే ఉండదు. ప్రతి ఒక్క ఓటర్ విలువ 1 కి సమానం కావున, మొత్తం వోట్ల విలువ లోక్ సభ (545) మరియు రాజ్యసభ
(245) కలిపి 790ఓట్లు.
రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక పద్ధతిలో తేడాలు పోలికలు
పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు మరియు రాష్ట్రంలో ఉన్న విధానసభకి ఎన్నికైన వారు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు కానీ ఉపరాష్ట్రపతి ని కేవలం పార్లమెంట్ సభ్యులు మాత్రమే ఎన్నుకుంటారు.
ఉప రాష్ట్రపతి యొక్క అర్హతలు
·
భారతీయ
పౌరుడై 35 సంవత్సరాలు నిండి ఉండాలి.
·
రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావడానికి కావాల్సిన అర్హతలు ఉండాలి.
·
ఉపరాష్ట్రపతి అభ్యర్థిని
బలపరచాలి అంటే ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి నామినేషన్ పత్రాని
నియోజకగణంలోని 20 మంది సభ్యులు ప్రతిపాదించాలి, నియోజకగణంలోని 20 మంది సభ్యులు బలపరచాలి అలాగే ఉపరాష్ట్రపతి పదవికి పోటీ
చేస్తున్న అభ్యర్థి రూ.15000 RBIలోచెల్లించాలి.
ఆర్టికల్ 67
ఆర్టికల్
67 ప్రకారం రాష్ట్రపతి ఐదు సంవత్సరాలు పదవిలో ఉంటారని చెబుతోంది.
ఆర్టికల్ 69
ఆర్టికల్ 69 ప్రకారం ఉపరాష్ట్రపతి పదవీ ప్రమాణస్వీకారంను రాష్ట్రపతి చేత లేదా రాష్ట్రపతి సూచించిన వ్యక్తి చేత ప్రమాణ స్వీకారం చేయిబడుతాడు.
ఉప రాష్ట్రపతి పదవి కాళీ ఏర్పడే అవకాశాలు
పదవీ కాలం పూర్తి అయినప్పుడు లేదా రాజీనామా చేసినప్పుడు.
ఉప రాష్ట్రపతి ఎన్నిక
చెల్లదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పినప్పుడు.
రాష్ట్రపతి
మరణించినప్పుడు ఈ పదవికి ఖాళీ ఏర్పడుతుంది.
ఉప రాష్ట్రపతిని తొలగించే పద్ధతి
ఆర్టికల్స్
67(b) లో పేర్కొన్న విధంగా ఉప
రాష్ట్రపతిని తొలగిస్తారు. రాష్ట్రపతిని తొలగించినట్లుగా మహాభియోగ తీర్మానం
ప్రక్రియ ద్వారా ఉపరాష్ట్రపతిని తొలగించరు.
తొలగించే
పద్ధతి సాధారణ పద్ధతి మాత్రమే.
ఉప రాష్ట్రపతిని పదవి నుండి తొలగించాలంటే తొలగించే తీర్మానాన్ని మొదట
రాజ్యసభలో ప్రవేశ పెట్టాలి మరియు 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి.
మొదట రాజ్యసభ తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత
లోక్ సభ కూడా ఈ తీర్మానాన్ని ఆమోదిస్తే రాష్ట్రపతి తొలగించబడతాడు. అయితే ఇప్పటి
వరకు ఏ ఉప రాష్ట్రపతిని కూడా తొలగించలేరు.
ఆర్టికల్ 97
ఆర్టికల్
97 ఉపరాష్ట్రపతి యొక్క
జీతం గురించి తెలుపుతుంది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతికి నెలకి
రూ.4,00,000 వేతనం మరియు ఇతర సౌకర్యాలు
లభిస్తాయి.
గతంలో ఉప రాష్ట్రపతి వేతనం నెలకి రూ.1,25,000 రూపాయలు ఉండేది.
ఉప రాష్ట్రపతి యొక్క అధికారాలు
ఉపరాష్ట్రపతి రెండు ముఖ్యమైన అధికారాలు నిర్వహిస్తాడు అవి ఆర్టికల్ 64 ప్రకారం రాజ్యసభకు హోదా రీత్యా అధ్యక్షునిగా వ్యవహరించడం.
ఆర్టికల్ 65 ప్రకారం తాత్కాలిక
రాష్ట్రపతిగా వ్యవహరించడం.ఉపరాష్ట్రపతి రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు
మరియు రాజ్యసభ సమావేశాలు నిర్వహిస్తారు.
రాజ్యసభలో
జరుపు ఉత్తర ప్రత్యుత్తరాలు ఉపరాష్ట్రపతి పేరు మీద జరుగుతాయి. ఉపరాష్ట్రపతి రాజ్యసభ సభ్యుడు
కాదు. కనుక ఓటు హక్కు ఉండదు. కానీ బిల్లుకు సమానమైన ఓట్లు వచ్చినప్పుడు నిర్ణాయక ఓటు
హక్కును వినియోగిస్తాడు.
ఆర్టికల్
65
ప్రకారం ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా కొన్ని సందర్భాలలో వ్యవహరిస్తాడు అవి ఏమిటంటే
రాష్ట్రపతి అనుకోకుండా మరణం వలన లేదా తొలగింపువల్ల లేదా రాజీనామ కారణంగా గరిష్టంగా
ఆరు నెలలు మించకుండా మరియు కొత్త రాష్ట్రపతి ఎన్నిక అయ్యే వరకు ఉప రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు.
ఉదాహరణకి
జ్ఞాని జైల్ సింగ్ అనారోగ్యం కారణంగా ఉప రాష్ట్రపతిగా ఉన్న హిదయతుల్ల రాష్ట్రపతిగా
25 రోజుల పాటు తన విధులను నిర్వర్తించారు. అయితే ఉప రాష్ట్రపతి
రాష్ట్రపతిగా విధులను నిర్వహించినప్పుడు రాష్ట్రపతి అనుభవిస్తున్న సౌకర్యాలను, అధికారాలను,
జీతభత్యాలను పొందుతాడు మరియు ఆ సమయంలో రాజ్యసభ చైర్మన్గా కొనసాగకూడదు.
ఉపరాష్ట్రపతి భారతరత్న, పద్మ అవార్డుల కమిటీకి
అధ్యక్షుడుగా వ్యవహరిస్తాడు. రాజ్యాంగపరంగా రెండవ స్థానం ఉపరాష్ట్రపతి,
మొదటి స్థానం రాష్ట్రపతి కలిగి ఉంటాడు.
భారత
రాజ్యాంగం పరంగా ఉపరాష్ట్రపతికి ఎక్కువ అధికారాలు లేవు. భారత ఉపరాష్ట్రపతి పదవిని
అమెరికా ఉపాధ్యక్షుడుతో పోలిస్తే అధికారంలో చాలా తక్కువ ప్రాధాన్యతను కలిగి
ఉంటుంది.
అమెరికాలో
అధ్యక్ష పదవి అనుకోకుండా ఖాళీ ఏర్పడితె ఉపాధ్యక్షుడు మిగిలిన కాలానికి
అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. కానీ భారతదేశంలో మాత్రం గరిష్టంగా ఆరు నెలలు మాత్రమే
ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు.
అదనపు సమాచారం
·
అత్యధిక మెజారిటీతో కె.ఆర్.నారాయనన్(700ఓట్ల) ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యాడు.
·
అతి తక్కువ కాలం వి.వి.గిరి ఉపరాష్ట్రపతిగా పదవిలో ఉన్నాడు.
·
K.కృష్ణ కాంత్ పదవిలో ఉండగా మరణించిన ఏకైక ఉపరాష్ట్రపతి.
·
ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, M. హిదయతుళ్ళ మరియు శంకర్ దయాళ్ శర్మ.
·
ఉపరాష్ట్రపతిగా పనిచేసి ఆ తర్వాత రాష్ట్రపతి అయిన వారు జాకీర్ హుస్సేన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.వి.గిరి, R.వెంకటరామన్, శంకర్ దయాళ్ శర్మ, కె.ఆర్.నారాయనన్.
·
రెండుసార్లు ఉప రాష్ట్రపతి అయిన వారు సర్వేపల్లి రాధాకృష్ణ మరియు ముహమ్మద్ హమీద్ అన్సారి.
· తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి ఉపరాష్ట్రపతి వి.వి.గిరి మరియు రెండవ రాష్ట్రపతి B.D. జెటి
·
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పనిచేసి ఉపరాష్ట్రపతులు అయినవారు శంకర్ దయాల్ శర్మ మరియు కృష్ణకాంత్. ఉపరాష్ట్రపతి గా పనిచేసే రాష్ట్రపతి ఎన్నికలలో ఓడి పోయిన వారు భైరాంసింగ్ షెకావత్.
·
రాష్ట్రపతి మరియు ఉప రాష్ట్రపతి లేనప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు.
·
ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు 2017 ఆగస్టు నెలలో ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యాడు.
·
ఈ ఎన్నికలలో 771 ఓట్లు పొలయితే వెంకయ్య నాయుడుకి 516 ఓట్లు లభించాయి మరియు ఇతని ప్రత్యర్థి గోపాలకృష్ణ గాంధీ.
·
వెంకయ్య నాయుడు యొక్క ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా షంషేర్ కే షరీఫ్ వ్యవహరించాడు.
ఆర్టికల్స్ 63 to 71
·
63-భారత ఉపరాష్ట్రపతి.
·
64-ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ గా ఉండడం.
·
65-రాష్ట్రపతి పదవీ కాళి ఏర్పడినప్పుడు ఉప రాష్ట్రపతి రాష్ట్రపతి గా వ్యవహరించడం.
·
66-ఉప రాష్ట్రపతి ఎన్నిక.
·
67-ఉప రాష్ట్రపతి కాలవ్యవధి.
·
68-ప్రస్తుతం ఉన్న ఉపరాష్ట్రపతి పదవి కాలం ముగియక ముందే నూతన ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ పూర్తి కావలెను.
·
69-ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం.
·
70-కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రపతి అధికార విధుల నిర్వహణ.
·
71-ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన అంశాలు.
ఉపరాష్ట్రప -
పదవీ కాలం
1.డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ 1952-1957
2.డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ 1957-1962
3. డాక్టర్ జాకీర్ హుస్సేన్ 1962-1967
4. Dr .వి.వి.గిరి 1967-1969
5. గోపాల్ స్వరూప్ 1969-1974
6. B.D.జెటి 1974-1979
7. M. హిదయతుల్ల 1979-1984
8. ఆర్.వెంకటరామన్ 1984-1987
9. డాక్టర్ శంకర్ దయాళ్ 1987-1992
10.K.R.నారాయనన్ 1992-1997
11.క్రిష్ణ కాంత్ 1997-2002
12.భైరోన్ సింగ్ షెకావత్ 2002-2007
13.హమీద్ హన్సారి 2007-2012
14. హమీద్ హన్సారి 2012-2017
15.ఎం .వెంకయ్య నాయుడు 2017 ఆగస్టు 5
No comments:
Post a Comment