INDIAN PRESIDENT POWERS
రాష్ట్రపతి-అధికారాలు
రాష్ట్రపతి గల వీటో అధికారం
వీటో అంటే తిరస్కరించే అధికారం అని అర్థం పార్లమెంటు ఏదైనా ఒక బిల్లును ఆమోదించి తర్వాత రాష్ట్రపతి ఆమోదానికి పంపితే ఆర్టికల్ 111 ప్రకారం అతను ఆ బిల్లును ఆమోదించవచ్చు లేదా నిరాకరించవచ్చు. బిల్లుపై ఎలాంటి అభిప్రాయం తెలపకుండా మౌనం గా ఉండవచ్చు, బిల్లును పునః పరిశీలనకు పంపవచ్చు. అయితే రాష్ట్రపతి ద్రవ్య బిల్లును పునః పరిశీలనకు పంపించడానికి వీలు ఉండదు.
భారత రాష్ట్రపతి కింద వీటో అధికారాలను ప్రదర్శిస్తారు
1. అబ్సల్యూట్ వీటో
· రాష్ట్రపతి ఏదైనా ఒక బిల్లును తిరస్కరిస్తే అది ఎట్టి పరిస్థితుల్లోనూ చిత్రంగా మారదు ఆ బిల్లు శాశ్వతంగా రద్దు అవుతుంది.
· ఏదైనా ఒక బిల్లు క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి వద్దకు పంప పడితే రాష్ట్రపతి దానిని ఆమోదం తెలుపక ముందే మంత్రిమండలి రాజీనామా చేస్తే తర్వాత కొద్ది రోజులకు కొత్తగా ఏర్పడిన మంత్రిమండలి రాష్ట్రపతినీ ఆ బిల్లును ఆమోదించవద్దని సలహా ఇచ్చినప్పుడు ఆ బిల్లు విషయంలో రాష్ట్రపతి ఆమోదం తెలియకుండా పూర్తిగా రద్దు చేయవచ్చు.
·
ఉదాహరణకి R వెంకటరామన్ రాష్ట్రపతిగా ఉన్న పుడు 1991లో పార్లమెంటు సభ్యుల జీతాలు, అలవెన్స్ సంబంధించిన బిల్లులో రాష్ట్రపతి ఈ వీటో ఉపయోగించాడు.
·
ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి గవర్నర్ పంపినప్పుడు రాష్ట్రపతి తన ఆమోదాన్ని నిరాకరిస్తే ఆ బిల్లులు ఎప్పటికీ చట్టంగా మారవు.
2. క్వాలిఫైడ్ వీటో
·
ఏదైనా ఒక బిల్లును పార్లమెంటు చేత ఆమోదించబడి
రాష్ట్రపతి ఆమోదానికి పంపినప్పుడు రాష్ట్రపతి దానిని తిరస్కరిస్తే, రెండవ సారి అదే
బిల్లును 2/3
వంతు మెజారిటీతో పార్లమెంట్ ఆమోదించి
రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆ బిల్లుకు ఆమోదం తెలపాలి.
3. సస్పేన్సివ్ వీటో
·
పార్లమెంటు చేత ఆమోదించబడే ఒక బిల్లును రాష్ట్రపతికి పంపినపుడు మొదటిసారీ రాష్ట్రపతి ఆ బిల్లును తిరస్కరిస్తే, రెండవ పర్యాయం అదే బిల్లును పార్లమెంటు సాధారణ మెజారిటీతో ఆమోదించి తిరిగి పంపితే భారత రాష్ట్రపతి ఆ బిల్లును తప్పనిసరిగా ఆమోదించాలి. ఒకవేళ ఆమోదించక పోయినట్లయితే ఆమోదించినట్లు గా భావిస్తారు.
4. పాకెట్ వీటో
·
ఏదైనా ఒక బిల్లును పార్లమెంటు ఆమోదించి రాష్ట్రపతికి పంపినపుడు రాష్ట్రపతి ఆ బిల్లుపై సానుకూల దృక్పథం లో లేనప్పుడు ఆ బిల్లుని తిరస్కరించకుండా, పునః పరిశీలనకు పంపకుండా రాష్ట్రపతి తన దగ్గరే ఉంచుకుంటాడు. అంటే నిర్ణయాన్ని కొద్ది రోజులు వాయిదా వేస్తాడు. దీనినే పాకెట్ వీటో అంటారు.
జైల్ సింగ్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ప్రభుత్వం పోస్టల్ బిల్లును రాష్ట్రపతికి పంపించినప్పుడు అప్పుడు ఆ రాష్ట్రపతి పాకెట్ వీటిని ఉపయోగించి 18 నెలలు ఆ బిల్లును తన దగ్గర ఉంచుకున్నాడు.
·
అయితే ఒక బిల్లును రాష్ట్రపతి వద్దకు
పంపినప్పుడు ఒక నిర్ణీత గడువులోగా రాష్ట్రపతి తన అభిప్రాయం చెప్పాల్సిన అవసరం ఉండదు.
రాష్ట్రపతి అధికారాలు విధులు
రాష్ట్రపతి
భారత గణతంత్ర దేశానికి రజ్యాదినేత.
ఇతను తన అధికారాలను రాజ్యాంగం ప్రకారం స్వయంగా గాని తన కింది అధికారుల ద్వారా గా
నిర్వహిస్తారు అంటే సాధారణంగా చర్చించే కార్యనిర్వాహక ,శాసన, ఆర్దిక అధికారాలు కార్యనిర్వాహక అధికారం అనే భావన లోనే ఉంటాయి.
కార్యనిర్వాహక అధికారాలు
·
మంత్రిమండలి నియామకం ప్రకరణ-75.
·
ప్రధానమంత్రి నియామక ప్రకరణ-75(1).
·
అటార్నీ జనరల్ నియమక- ప్రకరణ -76-(1).
· రాష్ట్ర గవర్నర్ నియామకం -ప్రకారన-155.
·
కంప్రోలర్ మరియు ఆడిటర్ జనరల్- ప్రకరణ -148.
·
కేంద్ర పాలిత ప్రాంతాలకు గవర్నర్లను మరియు పరిపాలకుల నియమించే- ప్రకరణ-239
·
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు- ప్రకరణ -217
·
అంతర్ రాష్ట్ర మండలి ఏర్పాటు చేస్తారు- ప్రకరణ - 263
·
ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు -ప్రకరణ -280
·
యూనియన్ పబ్లిక్ సర్వీస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షులు మరియు సభ్యుల నియామకం చేపడతారు- ప్రకరణ -316
·
ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషన్ సభ్యుల నియామకాలు చేపడతారు- ప్రకరణ -329
·
షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ అధ్యక్షులను మరియు సభ్యులు నియమిస్తారు ప్రకరణ - 338
·
షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ అధ్యక్షులు మరియు సభ్యులను నియమిస్తారు ప్రకరణ -338(a).
శాసనాధికారాలు
·
లోక్ సభకు ఇద్దరు ఆంగ్లో-ఇండియన్ లను నామినేట్ చేయడం-331.
·
పార్లమెంటు ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే దాన్నే పరిష్కరించడానికి సమావేశాన్ని ఏర్పాటు చేయడం-108.
·
రాజ్యసభకి 12 మంది వివిధ రంగాల నుండి నిష్ణాతులైన వారిని నామినేట్ చేయడం-80(3)
·
పార్లమెంట్ సభలను విడిగా గాని సంయుక్త సమావేశంలో ఉన్నప్పుడు గాని ప్రసంగించడం-87.
· పార్లమెంట్ సభ్యులు అనర్హత నిర్ణయించారు -103.
·
పార్లమెంటు సభ్యులు ఆమోదించిన బిల్లులను చట్టాలుగా కావడానికి ఆమోదం తెలపడం-111
·
లోక్సభలో ఆర్థిక బిల్లులను రాష్ట్రపతి అనుమతితో ప్రవేశపెట్టడం -117
·
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే రాష్ట్రాల సరిహద్దులను మార్చడం, కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం, రాష్ట్రాల పేర్లు మార్చడం మొదలైన వాటికి సంబంధించిన బిల్లులను పూర్వ అనుమతి ఇవ్వడం -3
·
రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోద ముద్ర వేయడం -368
రాష్ట్రపతి యొక్క ఆర్థిక అధికారాలు
·
పార్లమెంట్ లో ప్రవేశపెట్టే ద్రవ్య బిల్లుకు పూర్వ అనుమతి ఇవ్వడం -117(1)
·
ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం -280
·
భారత ఆగంతుక నిధి ని తన అధీనంలో ఉంచుకోవడం – 267
·
అత్యవసర ప్రారంభంలో వార్షిక బడ్జెట్ను ,సప్లిమెంటరీ బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి అనుమతివ్వడం-112
న్యాయాధికారులు (ఆర్టికల్ -72)
·
రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారులను వినియోగించే సమయంలో ప్రజాభిప్రాయాన్ని, కుటుంబం బాధితుల మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి.
·
రాష్ట్రపతి శిక్షను రద్దు చేసి క్షమాభిక్ష ప్రసాదించవచ్చు లేదా శిక్ష కాలాన్ని తగ్గించవచ్చు, శిక్షలను మార్పు చేయవచ్చు ఉదాహరణకి రాజీవ్ గాంధీ హత్య కేసులో ముద్దాయి నళినికి విధించిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు.
·
క్షమాభిక్ష అమలు కాకుండా వాయిదా వేయవచ్చు అంటే శిక్షను తాత్కాలికంగా వాయిదా వేయవచ్చు.
·
శిక్ష నుండి తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇవ్వవచ్చు అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని మానసిక స్థితి సరిగా లేనప్పుడు గర్భిణీ స్త్రీ విషయంలో, వయోభారం విషయంలో, తీవ్ర అస్వస్థతకు గురైన ప్పుడు ఈ వెసులుబాటు ఉంటుంది.
ఆర్టికల్ 143
ప్రజా సంబంధమైన వ్యవహారాలలో సుప్రీంకోర్టు సలహాను
రాష్ట్రపతి తీసుకోవచ్చు. దీనిని సలహాగా మాత్రమే పరిగణించాలి. రాష్ట్రపతి దీనికి బద్దుడు
కావాల్సిన అవసరం లేదు.
రాష్ట్రపతి స్థానం
రాజ్యాంగపరంగా
అన్ని అధికారాలు రాష్ట్రపతికి సంక్రమించినప్పటికి వాస్తవానికి ఈ అధికారాలను
చెల్లించేది మాత్రం ప్రధానమంత్రి అధ్యక్షతన గల మంత్రిమండలి. రాష్ట్రపతి జాతికి
ప్రాతినిధ్యం వహిస్తాడు. కాని జాతిని పరిపాలించడు.
సర్వేపల్లి
రాధాకృష్ణ తన పదవీ విరమణ రోజున రాష్ట్రపతి స్థానం గురించి మాట్లాడుతూ రాష్ట్రపతి జాతీయ
ప్రయోజనాలకి,
జాతీయ సమైక్యతకి ప్రతీక ఆయన దేశ ప్రగతి
పై, స్థిరత్వంపై చాలా ప్రభావం చూపగలరు అని
అన్నారు దీనిని బట్టి రాష్ట్రపతి స్థానం ప్రాముఖ్యత మనకు అర్థం అవుతుంది.
1976లో చేసిన 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా
మరియు 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రపతి స్థానం దిగజారింది. రాజకీయాలలో తన ప్రాముఖ్యతను కోల్పోయాడు.
42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి
అధికారాలు నామమాత్రంగా మారాయి ప్రధానమంత్రి, మంత్రిమండలి ఇచ్చిన సలహా మేరకు
రాష్ట్రపతి తన విధులను నిర్వహించవలసి వచ్చింది 44వ రాజ్యాంగ సవరణ చట్టం
ద్వారా తన సలహాలు పున పరిశీలనను మంత్రిమండలికి రాష్ట్రపతి కోరినచో రెండవ సారి
మంత్రిమండలి సలహా అనుగుణంగానే వ్యవహరించాల్సి ఉంటుంది.
అయితే
స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో మొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ పదవీ
కాలంలో హిందూ కోడ్ బిల్లు వివాదంలో మంత్రి మండలి సలహాకి రాష్ట్రపతి కట్టుబడి
ఉండాలనే నియమం రాజ్యాంగంలో లేదని గుర్తు చేశారు.
లోక్
సభలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రానప్పుడు లేదా కొన్ని పార్టీలు సంకీర్ణ
మంత్రిమండలి ఏర్పాటు చేయడం వీలు కానప్పుడు రాష్ట్రపతి తన విశేష అధికారాలను
వినియోగిస్తారు.అంతేకాక మంత్రిమండలి సమర్ధవంతంగా పని
చేయనప్పుడు రాజ్యాంగపరమైన యంత్రాంగం లోపించినప్పుడు లేదా ప్రభుత్వము అదుపుతప్పినప్పుడు
రాష్ట్రపతి ఎంతో శక్తివంతమైన వ్యక్తిగా తయారవుతారు.
రాష్ట్రపతి
గురించి మాజీ రాష్ట్రపతి అయిన ఆర్.వెంకటరామన్ మై
రెసిడెన్షియల్ ఇయర్స్ లో రాష్ట్రపతిని అత్యవసర ద్వీపంగా పేర్కొన్నాడు.
రాష్ట్రపతి పదవీపై ప్రముఖుల అభిప్రాయాలు
·
భారత్లో పార్లమెంటరీ విధానం ఉన్నందువలన ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రి మండలి సలహా మేరకే రాష్ట్రపతి వ్యవహరించాలి - డాక్టర్ రాజేంద్రప్రసాద్.
·
భారత రాజ్యాంగం కేంద్ర మంత్రి మండలికి పాలనాపరమైన అధికారాలను కల్పించినప్పటికీ రాష్ట్రపతి పదవికి ప్రత్యేక గౌరవం, ప్రాముఖ్యతను కూడా ఇచ్చింది - జవహర్లాల్ నెహ్రూ.
·
మంత్రి మండలి సలహా లేకుండా లేదా విరుద్ధంగా రాష్ట్రపతి ఏమి చేయలేరు. రాష్ట్రపతి పదవిని బ్రిటీష్ రాజా కుటుంబంతో పోల్చవచ్చు. ఎందుకంటే వారు దేశానికి ఏలిక మాత్రమే, పాలకులు కారు. రాష్ట్రపతి మంత్రిమండలికి మిత్రునిగా, తాత్వికునిగా, మార్గదర్శిగా వ్యవహరిస్తారు - డాక్టర్ B.R. అంబేద్కర్.
ప్రత్యేక సమాచారం
·
అతి పెద్ద వయసులో రాష్ట్రపతి అయిన వారు- కె.ఆర్.నారాయనన్.
·
అతి చిన్న వయసులో రాష్ట్రపతి - నీలం సంజీవరెడ్డి.
· ముఖ్యమంత్రులుగా పనిచేసిన రాష్ట్రపతి అయినవారు- నీలం సంజీవరెడ్డి, జ్ఞాని జైల్ సింగ్, శంకర్ దయాల్ శర్మ.
·
అత్యధిక రాష్ట్రపతుల ను అందించిన రాష్ట్రం- తమిళనాడు. ఈ రాష్ట్రంలో సర్వేపల్లి రాధాకృష్ణ, ఆర్.వెంకట్రామన్, ఏపీజే అబ్దుల్ కలాం.
·
ట్రేడ్ యూనియన్ ఉద్యమ నేపథ్యంలో రాష్ట్రపతి అయిన వారు వి.వి.గిరి.
·
రాష్ట్రపతిగా వ్యవహరించిన ఏకైక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ M. హిదయతుల్లా.
·
ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతి అయిన వారు - ఏపీజే అబ్దుల్ కలాం.
ALSO READ
ALSO READ:-fundamental duties-ప్రాథమిక విధులు
ALSO READ:-Directive Principles of State Policy ఆదేశిక సూత్రాలు
There’s a decent range of banking tools out there that should cater properly to most Canadian gamers. In this part, we are going to break down the 토토사이트 key thing} benchmarks and how JackpotCity casino stands out as a high on-line casino vacation spot in Canada. After creating your MuchBetter account, log in to your JackpotCity account and select the choice to add funds, then select ‘MuchBetter’ because the cost technique.
ReplyDelete