ASAFJAHI-DYNASTY
అసఫ్ జాహి వంశం (క్రీస్తుశకం 1724-1948)
PART-1
స్థాపకుడు |
నిజాం ఉల్ ముల్క్ |
రాజధాని |
ఔరంగాబాద్, హైదరాబాద్ |
తెగ |
తురాని తెగకు చెందినవారు |
గొప్పవాడు |
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ |
చివరివాడు |
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ |
నిజాం ఉల్ ముల్క్ దక్కన్ లో ఔరంగాబాద్ రాజధానిగా 1724లో స్వతంత్ర రాజ్యం ఏర్పరిచాడు.
1.
నిజాం ఉల్ ముల్క్( 1724- 48)
· నిజాం ఉల్ ముల్క్ అసలు పేరు మీర్ ఖమృద్దిన్ ఖాన్,
ఇతను అసఫ్ జాహి వంశస్థాపకుడు.
· ఔరంగజేబు ఇతనికి నాలుగువేల సేనను ఇచ్చి మున్సబ్
దారునిగా నియమించి “చిన్ కిలిచ్ ఖాన్” అనే బిరుదునిచ్చాడు.
· ఫారుక్ సియర్ ఇతనికి 7000 సేనను ఇచ్చి మన్సబ్ దారునిగా నియమించి “నిజాం
ఉల్ ముల్క్”, “ఫతే జంగ్” అనే బిరుదులను ఇచ్చాడు
· మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా 8000
సేనను ఇచ్చి అసఫ్ జా అనే
బిరుదునిచ్చాడు.
· ఇతను 1724లో “శక్కర్ ఖేడా” యుద్ధంలో ముబారక్ ఖాన్ ని
ఓడించి అసఫ్జాహీ రాజ్యాన్ని స్థాపించారు.
· ఇతను మొదటగా ఔరంగాబాదును రాజధానిగా
చేసుకొని పరిపాలన చేశాడు.
· 1739లో జరిగిన కర్నాల్ యుద్ధంలో పర్షియా
రాజు నాదిర్ష మొఘల్ సైన్యాన్ని ఓడించగా మొగలులకు నాడిర్ష కు మధ్య నిజాం శాంతి
ఒప్పందం చేయడంలో ముఖ్యమైన
పాత్ర పోషించారు.
2. నాజర్ జంగ్
· ఇతను మొగల్ చక్రవర్తితో నిజాం ఉదౌలా అనే బిరుదు పొందింది దక్కన్ సుబేదారు అయ్యాడు.
· ఇతను నిజాం ఉల్ ముల్క్ రెండవ కుమారుడు , నిజాం ఉల్ ముల్క్ మరణానంతరం నాజర్
జెంగ్ తన మేనల్లుడు అయిన ముజఫర్ జంగ్ తో వారసత్వ యుద్ధంలో గెలిచి రాజు అయ్యాడు.
3. ముజఫర్ జంగ్
· ఫ్రెంచ్ గవర్నర్ డుప్లే సహాయంతో
ముజఫర్ జంగ్ నవాబ్ గా నియమించబడ్డాడు.
· కడప నవాబు అయిన హిమ్మత్ ఖాన్ 1751లో ముజఫర్ జంగ్ ను చంపాడు.
4.
సలబత్ జంగ్ (1751-61)
· బుస్సి అనే ఫ్రెంచ్ అధికారి నాజర్ జాంగ్ తమ్ముడైన సలబత్ జాంగ్ నీ హైదరాబాద్ నవాబ్ గా ప్రకటించాడు.
· దాంతో ఈ నవాబు ఉత్తర సర్కారులను 1752లో ఫ్రెంచి వారికి బహుమతిగా ఇచ్చాడు
తర్వాత తిరిగి వెనక్కి తీసుకున్నాడు.
· 1761 సలబత్ జంగ్ ను బంధించి తానే
పరిపాలకుడు అని నిజాం అలీ ప్రకటించుకున్నాడు.
5.
నిజామ్ అలీఖాన్(1761 -1803)
· నిజామ్ అలీ ఔరంగాబాద్ నుండి హైదరాబాద్
కి తన రాజధానిని తరలించారు.
· ఇతన్ని రెండవ అసఫ్జా అంటారు, ఇతని కాలం నుండి అసఫ్జాహీలు నిజములుగా పిలువబడ్డారు.
· లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టిన “సైన్య సహకార ఒప్పందం”లో చేరిన మొట్టమొదటి రాజు ఇతను.
· జోగి పంతులు మధ్యవర్తిత్వంతో ఉత్తర సర్కారులు శ్రీకాకుళం,
ఏలూరు, రాజమండ్రి, ముస్తఫా నగర్ 1766 బ్రిటిష్ వారి వశమయ్యాయి.
· మూడో మైసూరు యుద్ధంలో పొందిన కడప,
బళ్ళారి ప్రాంతాలతో పాటు అనంతపూర్ ప్రాంతాలను కూడా సైన్య సహకార పద్ధతిలో భాగంగా బ్రిటిష్ సైన్యానికి అయ్యే ఖర్చు కింద ఇవ్వడం జరిగింది. అందువల్ల ఈ ప్రాంతాలను “దత్త మండలాలు” అంటారు
· ఫ్రెంన్చ్
అధికారి రేమండ్ సహాయంతో ఇతను గన్
ఫౌండ్రీ ని ఏర్పాటు చేశాడు. నిజాం 1803లో “రెసిడెన్సి భవనం” నిర్మించాడు, దీని ఆర్కిటెక్ “శాముల్”
· నిజామ్ అలీఖాన్ మోతీ మహల్, రోషన్ మహాల్,
గుల్షన్ మహల్
లను కట్టించాడు.
6.
సికిందర్ జా (మూడో అసఫ్ జా) 1803-29
· ఇతని పేరు మీదుగానే సికింద్రాబాద్
ఏర్పడింది.
· హైదరాబాదులో బ్రిటిష్ ప్రెసిడెంట్ గా హెన్రీరస్సెల్ 1811లో వచ్చాడు.
· సంస్థానంలో శాంతి భద్రతలు
పెంపొందించడానికి రస్సెల్ దళం లేదా హైదరాబాద్ కంటింజెంట్
సైన్యాన్ని ఏర్పరిచాడు, ఈ దళం హైదరాబాద్
సైన్యంగా పేరు పొందింది.
· నిర్వహణ ఖర్చు పెరగడంతో నిజాం పామర్ కంపెనీ నుండి 60 లక్షల
అప్పు తీసుకున్నాడు.
7. నసిరుద్దౌల(1829-1857) 4వ అసఫ్ జా
· ఇతని కాలంలో రెండు ప్రధాన సంఘటనలు
జరిగాయి అవి
· వహాబీ ఉద్యమం
o
ఈ ఉద్యమానికి హైదరాబాదులో నాజర్ ఉద్దౌలా తమ్ముడు ముబారక్ ఉద్దౌల నాయకత్వం వహించాడు.
o
ఆంగ్లేయులు ఇతని అరెస్టు
చేసి గోల్కొండ కోటలో బంధించగా 1854లో అక్కడే మరణించాడు.
o
ఈ ఉద్యమానికి కడప కర్నూలు నవాబుల నాయకుడు గులాం రసూల్ ఖాన్ మద్దతు
పలికాడు. ఇతను తిరుచునాపల్లి జైలుకు పంపబడ్డాడు.
· బేరర్ ఒప్పందం
o నిజాం తన నుండి తీసుకున్న 60 లక్షలను 1850 డిసెంబర్ 31 లోపు చెల్లించాలని బ్రిటిష్ ప్రభుత్వం షరతు విధించింది.
o
1853లో గవర్నర్
జనరల్ మరియు నవాబు మధ్య ఒప్పందం జరిగింది. తర్వాత రస్సెల్ సైన్యాన్ని హైదరాబాద్ కంటింజెన్సీ సైన్యంగా
మార్చి బ్రిటిష్ ఇండియా సైన్యానికి అనుబంధంగా మార్చారు.
o
అంతేకాకుండా ఈ ఒప్పందం
ప్రకారం బ్రిటిష్ వారికి బీరార్,రాయచూర్,ఉస్మానాబాద్
ప్రాంతాలను
ఇచ్చాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక ప్రధాని సిరాజ్ వుల్ మల్క్ అనారోగ్యంతో మరణించాడు.
o
ఈ సమయంలోనే మీర్ తురాబ్
అలీ ఖాన్ (సాలార్జంగ్1) హైదరాబాద్ ప్రధాని అయ్యాడు.
o
ఈ నవాబు కాలంలోనే సిపాయిల
తిరుగుబాటు ప్రారంభం అయింది.ఈ
తిరుగుబాటు ప్రారంభం అయిన వారం రోజుల
తర్వాత నాసిర్ ఉద్దౌల మరణించాడు.
8. అఫ్జల్ ఉద్దౌలా
· అఫ్జల్ ఉద్దౌలా మరియు ఇతని ప్రధాని సాలార్జంగ్ 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వారికి
మద్దతు పలికారు.
· తిరుగుబాటు తరువాత 1861లో
బ్రిటిష్ వారు ఈ నవాబుకి “స్టార్
ఆఫ్ ఇండియా” అంటే విశ్వాసనీయ మిత్రుడు అనే
బిరుదు నిచ్చారు.
9.
మీర్ మహబూబ్ అలీ ఖాన్(1869-1911)
· అఫ్జల్ ఉద్దౌలా మరణం తర్వాత అతని 2 సంవత్సరాల కుమారుడు అయినా మీర్మహబూబ్ అలీ ఖాన్ ని హైదరాబాద్ నవాబ్ గా ప్రకటించబడ్డాడు.
· ఇతనికి సాలార్ జంగ్ నేతృత్వం వహించి
సంరక్షకుడిగా ఉన్నారు.
·
మీర్మహబూబ్ అలీ ఖాన్ కి 18
సంవత్సరాలు పూర్తయిన తర్వాత 1884లో లార్డ్ రిప్పన్ స్వయంగా హైదరాబాద్
కి వచ్చి మహబూబ్ అలీ ఖాన్ కి అధికారాలు అప్పగించాడు. హైదరాబాద్ సంస్థానం సందర్శించిన మొట్ట మొదటి వైస్రాయి ఈయనే.
· మీర్మహబూబ్ అలీ ఖాన్ 1893లో “క్వనుంచా-ఈ-ముబారక్” అనే రాజపత్రం ద్వారా రాజ్యాంగపరమైన సంస్కరణలను
ప్రవేశపెట్టాడు.
· ఇతను విద్యా రంగంలో అనేక కృషి చేశాడు ముస్లిం బాలికల కొరకు 1885లో
“సయ్యద్ బిల్ గ్రామీ” చొరవతో ముస్లిం బాలికల కొరకు ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేశాడు.
· నాంపల్లిలో బాలికల పాఠశాలను
· సరూర్ నగర్ లో బాలికల అనాధ ఆశ్రమం
· వరంగల్ మరియు ఔరంగాబాద్ లో ప్రభుత్వ
ఇంజనీరింగ్ కళాశాల ఇతనికి ప్రవేశపెట్టాడు.
· ఇతని కాలంలోనే అసఫీయ లైబ్రరీ ఏర్పాటు
చేశారు.
· ఇతను పర్షియన్ భాష స్థానంలో ఉర్దూ
భాషను
రాజభాషగా ప్రవేశపెట్టాడు.
· ఇతని ప్రధాని వికారుద్దీన్ ఫలక్ నామ ప్యాలెస్ కట్టించాడు.
· 1908 సెప్టెంబర్ లో మూసీ నదికి
భారీగా వరదలు వచ్చాయి. మళ్లీ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు
జరగకుండా మోక్షగుండం విశ్వేశ్వరయ్యతొ ఆనకట్టల నిర్మాణానికి ప్లాన్
వేయించాడు.
· వేల్స్ రాకుమారుడు హైదరాబాద్ రాజ్యాన్ని
సందర్శించినప్పుడు మీర్ మహబూబ్ అలీ ఖాన్ విక్టోరియా జననా హాస్పిటల్
ను కట్టించాడు.
· 1905లో తన 40వ జన్మదిన సందర్భంగా ఈ
నవాబు పబ్లిక్ గార్డెన్ లో టౌన్ హాల్ నిర్మించాడు.
· విక్టోరియా మహారాణి
ఈ నవాబుకి “గ్రాండ్ కమాండర్ స్టార్ ఆఫ్ ఇండియా” అనే బిరుదు ఇచ్చిన సందర్భంలో అందుకని 1905లో మహబూబ్ అలీ ఖాన్ విక్టోరియా మెమోరియల్ అనాధ శరణాలయం సరూర్ నగర్ లో నిర్మించాడు.
10. మీర్ఉస్మాన్ అలీ ఖాన్ (1911-1948)(7వ అసఫ్ జ)
· ఇతని పూర్తి పేరు నవాబ్ మీర్ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్.
· ఇతను పాలనా పరంగా అనేక సంస్కరణలు చేపట్టాడు.
· హైదరాబాద్ సంస్థానంలో ఇతని పరిపాలన రూపం.
సంస్థానం |
నిజామ్ |
సుబా |
సుబేదారి |
జిల్లా |
కలెక్టర్ |
తాలూకా |
తాసిల్దార్ |
గ్రామం |
పట్వారి,పటేల్,గ్రామ
సేవకులు |
· తన సంస్థానంలో శాసన వ్యవస్థ నుండి
న్యాయవ్యవస్థను వేరు చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది.
·
దేశం మొత్తంలో మొట్టమొదట శాసన వ్యవస్థ నుండి న్యాయ వ్యవస్థను వేరుచేయబడిన సంస్థానం హైదరాబాద్ .
· ఏడవ నిజాం పరమత సహనం పాటించే
వాడు దీనికి నిదర్శనంగా మాదన్నపేట,శంకర్ బాగ్, గౌలిపుర మొదలగు దేవాలయాలకు ప్రభుత్వ నిధులను పంపించేవాడు.
· ఇతని కాలంలో లో మీర్లాయక్ అలీ
అనే వ్యక్తి యూ.న్.ఓ కీ పాకిస్తాన్ నుండి మొదటి
ప్రతినిధి బృందంలో సభ్యుడిగా ఇతను పాకిస్తాన్నియుడు కాకున్నా పంపించారు.
ALSO READ:- ASAFJAHI DYNASTY PART -2
No comments:
Post a Comment