1857 సిపాయుల తిరుగుబాటు
Revolt of 1857 in Telugu
1857వ సంవత్సరంలో భారతదేశంలో ముఖ్యంగా ఉత్తర, మధ్య భారతదేశంలో భారీ ఎత్తున బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటు వలన బ్రిటిష్ పాలన దాదాపుగా తుడిచిపెట్టుకు పోయింది అని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన తిరుగుబాటు విజయవంతం కాలేదు. ఈస్టిండియా కంపెనీ సైన్యంలో పనిచేస్తున్న సైనికుల తిరుగుబాటుతో ఇది మొదలైంది. కావున ఈ తిరుగుబాటును సిపాయిల తిరుగుబాటు అంటాము. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, బ్రిటిష్ వారు చేస్తున్న అకృత్యాలకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలు, రైతులు, చేతి వృత్తి పనివారు, సైనికులు దాదాపు దేశ ప్రజలు అందరూ ఒక ఏడాది కాలం పాటు ఎంతో తిరుగుబాటు సాగించారు. ఇది భారత దేశ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం ఈ తిరుగుబాటు వలన బ్రిటిష్ కంపెనీ పునాది కూకటివేళ్ళతో కదిలించబడింది.
తిరుగుబాటుకు రావడానికి గల కారణాలు
1857వ
సంవత్సరంలో వచ్చిన తిరుగుబాటు కేవలం
సిపాయిల అసంతృప్తి కారణంగానే రాలేదు. బ్రిటిష్ వారి వలస పాలన విధానాల ప్రభావం వలన, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, బ్రిటిష్ వారు అవలంభించిన పాలనా విధానాల వలన, బ్రిటీష్ వాళ్ళుఆర్థికంగా తమ స్వప్రయోజనాల కోసం భారత్ ను వినియోగించడం
వలన భారతదేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనం అయింది. ఒకప్పుడు భారతదేశం ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అని అనేవారు. కానీ బ్రిటిష్ వారి ఆర్థిక దోపిడి వలన
ప్రజలు తిండికి కూడా కరువయ్యి ఆకలి చావులు పెరిగాయి. కనుకనే తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటు మొదటిసారి జరగలేదు. 1906లో తమిళనాడులో వేల్లూరులో ఒకసారి, 1844లో 34 రేసిమెంట్ సైనికులు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు అంత ప్రాచుర్యం పొందలేదు. త్వరగా అణిచివేయబడ్డాయి
భారతదేశ సంస్థానాలు క్రమంగా అంతరించి పోవడం వలన అంతవరకు వాటిలో ఉన్న పాలనా యంత్రాంగంలో ఉంటున్న ప్రజల జీవన ఉపాధి కోల్పోయారు. సాంస్కృతిక రంగంలో ఉంటూ జీవనం సాగించే ప్రజలు బ్రిటిష్ వారి వల్ల తమ ఉనికిని కోల్పోయారు. సంస్థానాధీశులు కళ లని, సాహిత్యాన్ని పోషించడం వలన కళాకారులు, పండితులు ప్రముఖులు ఉన్నతమైన జీవనం
కొనసాగించారు. బ్రిటిష్
పాలనలో వారికి సరైన ఆదరణ లేకపోవడం వలన ఆర్దికంగా, సామాజికంగా చితికిపోయారు. ఈస్టిండియా కంపెనీ అధికారుల వలన అనేక వర్గాలపై ప్రభావం స్పష్టంగా కనబడింది.
బ్రిటిష్ వారి ఆర్థిక దోపిడి వలన దేశంలో ఉన్న రైతులు, చేతి
వృత్తి పనివారు, హస్త కళాకారుల ఎంతోమంది తమ వృత్తిని
వదిలిపెట్టాల్సి వచ్చింది. పారిశ్రామికీకరణ
వలన బ్రిటిష్ వారి వస్తువులను భారతదేశంలో విక్రయించడం వలన పైగా వస్తువులపై దిగుమతి సుంకం ఉండక పోవడం వలన భారత దేశ ఆర్థిక వ్యవస్థ
అడుగంటి పోయింది. బ్రిటిష్ రెవెన్యూ విధానం, పరిపాలన పద్ధతులు మొదలైన కారణాలు మరియు భూ యజమానులు విపరీతంగా అప్పులపాలై వ్యాపారులకు
వడ్డీలు కట్టి, కాలీ చేతులతో నిలబడాల్సి వచ్చింది.
అంతేకాక అవినీతి కూడా విపరీతంగా పెరిగిపోవడం
వలన సామాన్య ప్రజలు
అనేక కష్టాల పాలయ్యారు బ్రిటీష్ వారి కంపెనీలో పనిచేసే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఉన్న అందరు అధికారులు రెండు చేతుల
దోచుకున్నారు. విలియం ఎడ్వర్డ్
అనే అధికారి తిరుగుబాటుకు దారితీసిన పరిస్థితులను
గురించి వ్రాస్తూ ప్రజల దృష్టిలో పోలీసులు పిడకులు అయ్యారని వారు సాగించిన దమనకాండ, బలవంతపు వాసుళ్లు బ్రిటిష్ ప్రభుత్వం పట్ల జనంలో తీవ్ర వ్యతిరేకత రావడానికి ముఖ్య కారణం అని స్పష్టం చేశారు. శిస్తు, బకాయిలు సక్రమంగా చెల్లించనీ రైతులను జైల్లో నిర్బంధించడం, కొరడాలతో కొట్టడం సర్వసాధారణం అయ్యింది దారిద్ర్యంలో కూరుకుపోయిన ప్రజలు బ్రిటిష్ వారిపై వ్యతిరేకత ఏర్పరుచుకున్నారు. తమ బ్రతుకులు ఇకనైనా మెరుగుపరుచుకోవాలని తిరుగుబాటు వైపు నడిచారు.
బ్రిటిష్ పాలన వలన తమ మతానికి ముప్పు పొంచివుందనే భయం ప్రజలు ఎదురు తిరగడానికి కారణం అయ్యింది. ఈ భయానికి కారణం క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు వీళ్ళు పాఠశాలల్లో, ఆసుపత్రులలో, జైళ్లలో, బహిరంగ ప్రదేశాలలో హిందూ మతంపై, ఇస్లాం పైన విమర్శలు చేస్తూ హిందూ ప్రజల, భారతీయ సంప్రదాయాన్ని విమర్శిస్తూ క్రైస్తవ మతం యొక్క గొప్పతనాన్ని చెబుతూ మత ప్రచారం చేసేవారు. ఈ మిషనరీల కార్యకలాపాలకు ప్రభుత్వం అండగా ఉండడం జరిగింది.
·
1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో
బ్రిటిష్ గవర్నర్ జనరల్ - లార్డ్ కానింగ్
·
1857 తిరుగుబాటు సమయంలో మొగల్ చక్రవర్తి – బహదుర్ షా
No comments:
Post a Comment