Telangana festivals
Telangana Hindu and Girijana festivals
తెలంగాణాలోని ముఖ్యమైన హిందూ మరియు గిరిజన పండగలు
గిరిజన పండుగలు
1. నాగోబా జాతర
·
అదిలాబాద్ జిల్లాలోని గోండులు నాగోబా జాతరను ప్రతి సంవత్సరం మాఘ మాస పౌర్ణమి రోజు జరుపుతారు.
·
ఈ జాతర ఇంద్రవెల్లి మండలంలో కేస్లాపూర్ గ్రామంలో జరుపుతారు.
·
నాగోబా అంటే పామును దేవత రూపంలో కొలుస్తారు.
·
ప్రొఫెసర్ “హైమన్డార్ఫ్” అనే వ్యక్తి 1940లో నాగోబా జాతర నిర్వహించి జిల్లా కలెక్టర్ ని ఆహ్వానించి తమ సమస్యలను చెప్పుకుoటారు.
·
ఇలా ప్రతి సంవత్సరం జిల్లా కలెక్టర్ ని ఆ జాతరకు ఆహ్వానించి తమ సమస్యలు చెప్పుకునే సంప్రదాయం ఇంకా కొనసాగుతోంది.
·
“మేశ్రం” వంశీయులు ఈ జాతరలో కీలక పాత్ర పోషిస్తారు.
2. సమ్మక్క సారలమ్మ జాతర -జయశంకర్ భూపాలపల్లి జిల్లా
·
ఈ జాతరను మొత్తం నాలుగు రోజులు జరుపుతారు.
·
సమ్మక్క సారలమ్మ యుద్ధంలో వీరోచిత పోరాటం వల్ల వారి సాహసం, ధైర్యం గుర్తుచేసుకుని ఈ జాతర జరుపుతారు.
·
పదమూడవ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యాన్ని “ప్రతాపరుద్రుడు” అనే రాజు పరిపాలించేవాడు.
·
ఒక సంవత్సరం కరువు వల్ల పడగిద్ద రాజు ప్రతాపరుద్రునికి కప్పం చెల్లించలేదు, అందువల్ల ప్రతాపరుద్రుని సేనాని “యుగంధరుడు” మేడారం పై దండెత్తుతాడు.
·
ఈ విషయం తెలుసుకున్న సమ్మక్క-సారక్కలు మరియు వారి సేనాని కాకతీయ సేనాపతి అయిన యుగంధరుడితో వీరోచితంగా పోరాడారు.
·
ఈ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా యునెస్కో తో గుర్తింపు పొందింది.
·
ఈ జాతర యొక్క ప్రాధాన్యతను గుర్తించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996 లో ఈ జాతరను రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది.
·
ఈ జాతర “తెలంగాణ కుంభమేళ” లాగా ప్రసిద్ధి చెందింది.
·
ఈ జాతరలో బెల్లంను నైవేద్యంగా సమర్పిస్తారు.
·
మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారక్క ను గద్దెకు తీసుకువస్తారు.
·
రెండవ రోజు చిలకలగుట్ట పై ఉన్న గద్దెపై సమ్మక్కను ప్రతిష్టిస్తారు.
·
మూడవ రోజు గద్దెలపై సమ్మక్క సారలమ్మ లను కొలువు చేస్తారు.
·
నాలుగవ రోజు వారిద్దరిని యుద్ధరంగానికి తరలిస్తారు.
3. తీజ్ పండగ
·
లంబాడాలు ఈ పండుగను శ్రావణ మాసంలో వర్షాలు పడినప్పుడు జరుపుతారు.
·
ఈ పండుగను తొమ్మిది రోజుల పాటు పెళ్ళికాని వారు మాత్రమే జరుపుతారు .
·
ఈ పండుగ చివరి రోజు పరమాన్నం ను మరియు నెయ్యి సేవాభయ్యా అనే దేవుడికి నైవేద్యంగా పెడతారు.
· ఈ పండుగ సమయంలో పెళ్లి కాని వారు మిరపకాయలు, ఉప్పు మాంసం తినకూడదు.
·
మేరమ్మ అనే పేరు మీద మేకను బలి ఇస్తారు.
·
చివరి రోజు తీజ్ గంపలను నీటిలోకి వదులుతుంటారు.
·
రాఖీ పౌర్ణమి నుండి కృష్ణాష్టమి వరకు ఈ వేడుకలు జరుపుతారు.
·
ఈ ఉత్సవం సందర్భంగా బంజారాలు గోధుమ మొలకల బుట్టను తీజ్ ప్రతిమలుగా భావిస్తారు.
·
ఈ పండుగనాడు వారు సంప్రదాయాలకు అనుగుణంగా “దoబోలి” అనే కార్యక్రమం జరుపుతారు.
4. అకిపెన్
·
“అకిపెన్” అంటే గోండుల గ్రామ దేవత
·
గోండులు మొదటగా పూసిన పూలు పండ్లను వారి గ్రామ దేవత అయిన “అకిపెన్” కి సమర్పిస్తారు .
·
వీరికి ముగ్గురు మతపరమైన సేవలు చేయడానికి ఉంటారు.
·
“దేవరి” అనేవారు గ్రామ దేవతను పూజిస్తారు.
·
బత్కల్ అనేవారు గ్రామస్తులు సంక్షేమాన్ని ముందుగానే చెబుతారు.
·
కతోడా అనేవారు తెగల దేవతలను శాంతింప చేస్తారు.
·
ఈ పండగను గోండు మాండలికంలో నోవొంగ్ అంటారు.
5. నిషాని దేవత
·
ఈ పండుగ ఈటెల పండుగగా ప్రసిద్ధి చెందింది.
·
ఈ పండుగను చైత్ర పురాబ్ అని కూడా పిలుస్తారు.
·
తెలుగు నూతన సంవత్సర పండుగ అయినా ఉగాది పండుగ సందర్భంగా నిషాని దేవతను పూజిస్తారు
·
ఈ పండగ సందర్భంగా గ్రామ పూజారి ఒక అబ్బాయికి బాణం మరియు విల్లు ఇచ్చి అడవిలోకి పరిగెత్తమని చెప్తారు అతని వెనకాల డప్పు కొట్టుకుంటూ వెళతారు , అతడు ఏ జంతువునైనా వేటాడి నిషాని దేవతకు సమర్పిస్తారు .
6. పెద్ద దేవుడు
·
భూమిలో త్రిభుజాకారంలో ఒక రాయిని పాతిపెట్టి దేవునిగా కొలుస్తారు.
·
ఈ పండుగ నాడు “పరిగి పిట్ట”ను బలిస్తారు పరిగి పిట్ట ఈ పెద్ద దేవునికి ఇష్టమైనదిగా భావిస్తారు.
·
ఈ పండుగ నాడు బలి ఇచ్చిన మేకను మరియు పరిగి పిట్ట రక్తాన్ని ఒక కుండలో ఉంచి ఆ దేవునికి సమర్పిస్తారు, ఆ పెద్ద దేవుడు ఎలుక రూపంలో వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తారని ఆ ప్రజల నమ్మకం.
7. సీట్ల పండగ
·
ఈ పండుగ నాడు చాలా జంతువులను బలి ఇస్తారు అందువలన ఈ పండుగను బలుల పండుగగా పిలుస్తారు.
·
ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆషాడమాసంలో బంజారాలు జరుపుతారు.
·
ఈ పండుగ నాడు ఏడు రాళ్లను పాతి ఏడుగురు దేవతల రూపంలో పూజిస్తారు.
8. ఏడుపాయల జాతర
·
మెదక్ జిల్లాలో పాపన్నపేట మండలం లో నాగసానిపల్లె లో దుర్గాదేవికి ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున ఏడుపాయల జాతర నిర్వహిస్తారు
·
ఈ దేవాలయం మంజీరా నది ఏడు పాయలుగా వేరుచేయు చోట నిర్మించబడింది
హిందూ పండగలు
9. బొడ్డెమ్మ పండగ
·
ఈ పండగ భాద్రపదమాసంలో జరుపుతారు.
·
ఈ పండగ మొదటి రోజు ఒక పీట మీద మన్నుతో బతుకమ్మ ఆకారంలో గోపురంగా నిర్మించి దాని చుట్టూ తంగేడు మరియు కట్ల పూలతో అలంకరిస్తారు.
· పసుపుతో గౌరమ్మను చేసి పసుపు కుంకుమలతో పూజిస్తారు.
10. బతుకమ్మ
·
ఈ పండగ కేవలం తెలంగాణలో మాత్రమే జరుపుకొనే ప్రత్యేకమైన పండుగ.
·
తంగేడు పూలను బంతి పూల ను చామంతి పూలను గుమ్మడి ఆకులను మరియు గునుగు పూలను వరుసగా ఒకదాని పై ఒకటి పేర్చి బతుకమ్మ ను తయారు చేస్తారు.
·
ఈ పూలతో పేర్చిన తర్వాత పైన పసుపుతో చేసిన గౌరి మాతను పెట్టి దీపాలతో అలంకరిస్తారు.
· తెలంగాణలో బతుకమ్మ పండుగను 9 రోజులు జరుపుకుంటారు.
- 1వ రోజు- ఎంగిలిపూల బతుకమ్మ
- 2వ రోజు- అటుకుల బతుకమ్మ
- 3వ రోజు- ముద్దపప్పు బతుకమ్మ
- 4వ రోజు- నానబియ్యం బతుకమ్మ
- 5వ రోజు- అట్ల బతుకమ్మ
- 6వ రోజు- అలిగిన బతుకమ్మ
- 7వ రోజు- వేపకాయల బతుకమ్మ
- 8వ రోజు- వెన్నముద్దల బతుకమ్మ
- 9వ రోజు- సద్దుల బతుకమ్మ
·
బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరీ దేవిని కీర్తిస్తూ పాటలు పాడుతారు .
· ఈ పండుగ జరుపుకోవడం వల్ల మాంగల్య బలం ,సంపద పెరుగుతాయని ప్రజల నమ్మకం.
11. బోనాలు
·
ఈ పండుగ సమయంలో అమ్మవారు ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని ప్రజల నమ్మకం.
·
“బోనం” అంటే అమ్మవారికి సమర్పించే నైవేద్యం.
·
గ్రామం మధ్యలో ఒక “బొడ్రాయి” నిలిపి పసుపు మరియు కుంకుమ పెట్టి అలంకరిస్తారు.
·
కుండలను అలంకరణ చేసి కుండ మెడకు లేత వేపాకులు పెడతారు.
·
ఒక తెల్లని వస్త్రంలో నవధాన్యాలలో పోసి వాటిని మూటకట్టి ఆ గుడ్డను పేని వెలిగిస్తారు.
·
కింది కుండలో నీరు పై కుండలో నైవేద్యం పెడతారు.
·
పోషణ చేసే అవ్వను (pochava) పోశవ్వ గా కొలుస్తారు.
·
ఊరడమ్మ ను ఊరుని రక్షించే అమ్మగా కొలుస్తారు.
·
ఎల్లవ్వను ఎల్లలను రక్షించే అవ్వగా కొలుస్తారు.
·
ఉప్పలమ్మ ఊరి పశువులను రక్షిస్తూ పచ్చిక బీళ్ళల్లో ఉంటుంది .
· 2014 జూన్ 16న తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది.
·
పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలడానికి ఆలయం ముందు ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. ఇప్పుడు కోడిపుంజులను ,మేకలను బలి ఇవ్వడం సంప్రదాయంగా మారింది.
·
ఈ బలి ఇవ్వడానికి ఒక శాస్త్రీయ కారణం ఉంది. సాధారణంగా ఆషాఢమాసంలో అంటే వానాకాలం మొదలయ్యే కాలంలో మనుషుల కన్నా జంతువులకు వ్యాధులు త్వరగా సోకుతాయి అందువల్లనే వాటిని ఇస్తారు.
·
అమ్మవారి సోదరుడు పోతురాజు అని ప్రజల నమ్మకం.
·
ఈ పోతురాజు మేకపోతు గొంతు కొరికి తల మొండెం వేరు చేసి పైకి ఎగరేస్తారు, దీనినే గావు పెట్టడం అంటారు.
·
ఈ పండుగ నాడు ఊరేగింపు డప్పు చప్పుడుతో నడుస్తుంది. దీనికి గల శాస్త్రీయ కారణం ఈ చప్పుడు వల్ల ఊర్లో ఉన్న దుష్ట శక్తులు, అదృశ్య శక్తులు పారిపోతాయి అని ప్రజల విశ్వాసం.
·
బైండ్ల పూజారి ప్రతిరూపమే పోతురాజు.
·
పండగ మరుసటి రోజు వేప మండలు పట్టుకుని జుట్టు విరబోసుకుని బోర్లించిన కుండ పై నిలబడి భవిష్యత్తు చెబుతారు, ఈ విధానంను రంగం ఎక్కడం అంటారు.
·
పూనకం వచ్చిన మహిళను శాంత పరచుటకు ఆమె పాదాలను నీళ్లతో కడుగుతారు.
·
ముుదిరాజ్ కులస్తులు బోనాల రోజు ఉపవాసం చేసి తర్వాత రోజు “రంగం” పేరుతో భవిష్యత్తు చెబుతారు.
·
మొట్టమొదట హైదరాబాద్ నగరంలో లో గోల్కొండ కోటలో ఎల్లమ్మ దేవాలయంలో లస్కర్ బోనాలు ప్రారంభమవుతాయి.
·
తర్వాత పాతబస్తీలోని లాల్ దర్వాజా లో,తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో జరుగుతాయి.
·
ఈ మహంకాళి విగ్రహాన్ని నరసయ్య అనే సైనికుడు ప్రతిష్టించాడు. ఇతను కలరా వ్యాధి బారిన పడకుండా తిరిగి వచ్చినందుకు ఈ విగ్రహ ప్రతిష్టాపన చేశాడు.
12. దసరా/నవరాత్రి/ విజయదశమి
·
ఈ పండుగ తొమ్మిది రాత్రులు హిందువులు జరుపుకునే అతి పెద్ద పండుగ.
·
పదవరోజు మహిషాసురమర్దిని అయినా దుర్గాదేవిని పూజిస్తారు.
·
దసరా రోజు అంటే విజయదశమి రోజున రావణుడు, మేఘనాథుడు,కుంభకర్ణుడు మొదలైన రాక్షసుల దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఇది ఇది మంచి చెడుపై సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు.
·
పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వరం వలన దేవతలతో యుద్ధం చేసి ఇంద్రపదవిని చేపడతాడు, తర్వాత దేవేంద్రుడు త్రిమూర్తులతో తన బాధను చెప్పుకోగా మహిషాసురుని చంపడానికి త్రిమూర్తులు ఒక దేవతను పుట్టిస్తారు, ఈ దేవతనే “మహిషాసురమర్దిని’ అంటారు.
·
ఎనిమిదవ రోజు దుర్గాష్టమిగా, తొమ్మిదవ రోజు (మహానవమి) సరస్వతి దేవతగా పూజిస్తారు
13. సదర్ పండుగ
·
ఈ పండుగనే “మహిషాపండగ” అంటారు.
·
ఈ పండుగను సాధారణంగా “యాదవులు” ఎక్కువగా జరుపుకుంటారు.
·
యమధర్మరాజు వాహనమైన దున్నపోతును శుభ్రంగా కడిగి అలంకరించి ఊరేగిస్తారు, ఇలా చేయడం వల్ల అకాల మరణాలు, యమగండంలు, మృత్యు భయాలు తొలగిపోతాయని ప్రజల విశ్వాసం.
·
ఈ పండగ సాధారణంగా దీపావళి మరునాడు జరుపుకుంటారు.
14. వ్యాస పూర్ణిమ/ గురుపూర్ణిమ
·
వేదవ్యాసుడు ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయనను మానవాళికంతటికీ గురువుగా భావిస్తారు, అందువల్లనే వేదవ్యాసుని పుట్టినరోజును “గురుపౌర్ణమి”గా జరుపుకుంటారు.
·
వేదవ్యాసుని పూర్వనామం “కృష్ణద్వైపాయనుడు”.
·
ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు ఈ పండగ జరుపుతారు, సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు.
No comments:
Post a Comment