daily gk and current affairs in Telugu
SEPTEMBER 9
1.సెప్టెంబర్ 9 :- “ది ఇంటర్నేషనల్ డే టు ప్రొటెక్ట్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ అటాక్”.
· ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు 9న “దాడి నుండి విద్యను రక్షించడానికి అంతర్జాతీయ దినోత్సవం” (the international day to protect education from attack). ను జరుపుకుంటున్నాం.
· విద్యార్థులు మరియు విద్యావేత్తలకు రక్షణ మరియు పాఠశాలలను కాపాడటం మరియు వాటిపై అవగాహనను పెంచడం దీని ఉద్దేశం.
2. సెప్టెంబర్ 9 :- “వరల్డ్ EV డే” (ప్రపంచ ఎలక్ట్రిక్ వెహికల్ దినోత్సవం)
· “ప్రపంచ ఎలక్ట్రిక్ వెహికల్ దినోత్సవం” సెప్టెంబర్ 9 న ప్రపంచమంతటా జరుపుకుంటారు. ఈరోజున ఇ- మొబిలిటీ వేడుకను సూచిస్తుంది.
· ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్ ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎలక్ట్రిక్ వెహికల్ సదస్సులు జరుగుతాయి.
· వరల్డ్ EV డే అనేది సుస్టైనబుల్ మీడియా కంపెనీ “ గ్రీన్ టీవీ” సృష్టించబడిన దినోత్సవం.
3.ప్రజా సంక్షేమ ప్రోజెక్టుల అభివృద్ధి కోసం గుజరాత్ ప్రభుత్వం “వటల్ ప్రేమ్ యోజన”ను ప్రారంభించింది.
· గుజరాత్ ప్రభుత్వం రూపాయలు 1000 కోట్లతో ,నాన్ రెసిడెంట్స్ తో ప్రజలతో కలిసి ప్రజా సంక్షేమ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం కొరకు “వటల్ ప్రేమ్ యోజన”ను ప్రారంభించింది.
· పబ్లిక్ మరియు స్టేట్ కాంట్రిబ్యూషన్ ద్వారా గ్రామీణాభవృద్ధిపై దృష్టి సారించింది. ఈ యోజన గుజరాత్లో ప్రారంబిచబడింది.
· ఈ పథకం 40% రాష్ట్ర ప్రభుత్వo మరియు 60% సాధారణ ప్రజలు మరియు నాన్ రెసిడెంట్స్ ప్రజల సహకారంతో చేపట్టనుంది.
· ఈ పథకం ద్వారా నాన్ రెసిడెంట్స్ కు తమ దేశం పై ప్రేమ గౌరవంను తెలిపే అవకాశాన్ని కల్పించింది.
· “వటల్ ప్రేమ్ యోజన” కింద చేపట్టనున్న ప్రాజెక్ట్స్
2. అంగనవాడి మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
3. CCTV నిఘా వ్యవస్థ.
4. నీటి రీసైక్లింగ్ ,డ్రైనేజ్ వ్యవస్థ శుద్దీకరణ ,చెరువుల సుందరీకరణ
4. “G-20 శిఖరాగ్ర సమావేశం”(8వ ఎడిషన్) కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది.
· G20 అధ్యక్షా కార్యక్రమాలు డిసెంబర్ 1, 2022 నుండి ప్రారంభం అవ్వనున్నాయి.
· కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రి “పియుష్ గోయల్” G-20 summit 2023 కు భారత “శేర్పగ” నియమించబడ్డాడు.
· శేర్ప అనగా శిఖరాగ్ర సమావేశానికి ముందు సన్నాహక పనులు చేపట్టే దౌత్యవేత్త.
5. “టాటా AIA లైఫ్ ఇన్సూరెన్స్” కు “నీరజ్ చొప్ర” బ్రాండ్ అంబాసిడర్ గా నియమిoపబడ్డడు .
· నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించి బంగారు పతకాన్ని గెలిచిన తర్వాత “టాటా AIA లైఫ్ ఇన్సూరెన్స్” తన బ్రాండ్ అంబాసిడర్ గా బహుళ సంవత్సరాల బ్రాండ్ భాగస్వామ్యామ్ పై సంతకం చేసినట్లు ప్రకటించింది.
· నీరజ్ చోప్రా టాటా AIA లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క కలలను మరియు ఆరోగ్యకరమైన సంతోషమైన జీవితాల యొక్క ప్రధాన విలువలను దృష్టిలో ఉంచుతాడు.
· దేశవ్యాప్తంగా రాబోయే కొన్ని సంవత్సరాలపాటు వినియోగదారులకు పరిష్కారాలను అందించడంలో టాటా AIA లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రయత్నాలకు మద్దతుగా ఉంటాడు.
SEPTEMBER 10
1. సెప్టెంబర్ 10 :- “ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం”
· ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10న “ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్
ప్రివెన్షన్”(IASP) “ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం” జరుపుతుంది.
·
2021
ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం యొక్క థీమ్: చర్చల ద్వారా ఆశలు సృష్టించడం.
· ఆత్మహత్యలను నివారించవచ్చని ప్రపంచ
వ్యాప్తంగా అవగాహన కల్పించడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం.
· 2003 నుంచి తెలంగాణ దినోత్సవం కోసం ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యకలాపాలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) మరియు మానసిక ఆరోగ్య వరల్డ్ ఫెడరేషన్ ( WFMH) హోస్ట్ గా సహకరించాయి.
2. రాష్ట్రపతి రామనాథ కొవింద్ ఉత్తరాఖండ్,పంజాబ్, తమిళనాడు కు కొత్త గవర్నర్ లను నియమించారు.
· ఉతర్ఖండ్ గవర్నర్ గా “లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్” ను రాష్ట్రపతి “రామనాథ కొవింద్” నియమించాడు.
· “బేబీ రాణీ మౌర్య” గారు ఉతర్ఖండ్ గవర్నర్ గా రాజీనామా చేసిన తర్వాత ఖాళీ అయిన
గవర్నర్ పదవికి గుర్మీత్ సింగ్ నియమించబడ్డాడు.
· “గుర్మిత్ సింగ్” ఇంతకుముందు “ఆర్మీ డిప్యూటీ చీఫ్” గా పని చేశాడు.
· వీరితో పాటు పంజాబ్ గవర్నర్ గా
ప్రస్తుత తమిళనాడు గవర్నర్ అయిన “బన్వరి లాల్ పురోహిత్” నియమించాడు.
· ప్రస్తుత నాగాలాండ్ గవర్నర్ గా ఉన్న “RN రవి” నీ తమిళనాడు గవర్నర్ గా రాష్ట్రపతి
నియమించాడు.
· రాష్ట్రపతి అధికార ప్రకటనతో కొత్త నియామకాలు మరియు వారి కార్యాలయాలు వారి నియామక తేదీలు అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.
3. ప్రభుత్వ రంగ సంస్థ అయిన “నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్” కు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా “నిర్లెప్ సింగ్” నియమితులయ్యారు.
· “నీర్లెప్ సింగ్ రాయి” గారు చైర్మన్అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించక ముందు “నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్” లో డైరెక్టర్ హోదాలో ఉన్నాడు మరియు “రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్” లో కూడా చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా మరియు “నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్” యొక్క నంగల్ యూనిట్ కు జనరల్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహించారు.
4. బ్యాంక్ ఆఫ్ బరోడా తన డిజిటల్ సేవకై “బాబ్ వరల్డ్” (bob world) అనే యాప్ ను రూపొందించింది.
· 220 కి పైగా బ్యాంకింగ్ సేవలను ఓకే అప్లికేషనులో రూపొందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ యొక్క పైలెట్ ప్రాజెక్ట్ ఆగస్టు 23 2021
న ప్రారంభించబడింది.
· ఈ డిజిటల్ ప్లాట్
ఫామ్ 95% రిటైల్ బ్యాంకింగ్ సేవలను కలిగి ఉంటుంది.
· ఈ అప్లికేషన్ను దేశీయంగా మరియు ప్రపంచ వ్యాప్తంగా యాక్సెస్ చేయవచ్చు అని పేర్కొంది.
5. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా “IDFC ఫర్ట్స్ బ్యాంక్” యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉద్యోగ కాలపరిమితిని మరో మూడు సంవత్సరాల పాటు పెంచింది.
· IDFC ఫర్ట్స్ బ్యాంక్ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ “v. వైద్యనాథన్” యొక్క ఉద్యోగ
కాలపరిమితిని మరో మూడు సంవత్సరాల పాటు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
·
ఇది “డిసెంబర్ 19 2021” నుండి అమలులోకి వస్తుంది మరియు ఇతను మొదటిసారిగా 2018 డిసెంబర్ నెలలో ఐ
డి ఎఫ్ సి బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ గా బాధ్యతలు
స్వీకరించారు.
1. 13 వ బ్రిక్స్ (BRICS) 2021 శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అధ్యక్షత వహించారు.
· ప్రధాని నరేంద్ర
మోడీ గారు
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పదమూడవ “బ్రిక్స్” 2021 సమావేశానికి అధ్యక్షత వహించారు.
· భారతదేశ
నేతృత్వంలోని
శిఖరాగ్ర సమావేశం “బ్రిక్స్@15” యొక్క థీమ్:-
కంటిన్యుటీ, కన్సాలిడేషన్ మరియు ఏకాభిప్రాయం కోసం ఇంట్ర-బ్రిక్స్ సహకారం. ఈ 4-C లు బ్రిక్స్
భాగస్వామ్యానికి ప్రాథమిక సూత్రాలు అని మోడీ పేర్కొన్నారు.
· ఈ సమావేశంలో భారత
ప్రధాని ప్రసంగిస్తూ స్థిరంగా, వినూత్నంగా, విశ్వసనీయంగా మరియు స్థిరంగా నిర్మించుకోండి అని
పేర్కొన్నాడు.
· ఈ సమావేశంలో బ్రెజిల్, రష్యా,
ఇండియా ,చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు పాల్గొన్నాయి.
· బ్రెజిల్
ప్రెసిడెంట్- జైల్ బోల్సోనరో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మరియు ఇండియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమోపోసాతో పాటు బ్రిక్స్
నాయకులందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
· ఈ సమావేశానికి భారత్ అధ్యక్షత వహించడం మూడవసారి , మొదటిసారిగా 2012లో మరియు రెండవ సారి 2016 లో భారత్ అధ్యక్షత వహించింది.
2. “చంపారన్ సత్యాగ్రహం ఎక్స్ప్రెస్” రైళ్లు యొక్క ఫ్రీక్వెన్సీని భారత రైల్వే మంత్రిత్వ శాఖ వారానికి రెండు సార్లు గా పెంచింది.
· చంపారన్ సత్యాగ్రహం
ఎక్స్ప్రెస్ ఉత్తర రైల్వే జోన్ కు చెందిన రైల్ ప్రస్తుతం ఇది వారానికి ఒకసారి
నిర్ణయింపబడితే భారత రైల్వే మంత్రిత్వ శాఖ వారానికి రెండు సార్లుగా పెంచింది.
· చంపారన్ సత్యాగ్రహం ఎక్స్ప్రెస్ “బాపుదం మోతిహారి” నుండి “ఆనంద్ విహార్” మధ్య నడుస్తుంది.
3. గుజరాత్ ముఖ్యమంత్రి “విజయ్ రుపాని” తన పదవికి రాజీనామా చేశారు.
· గుజరాత్ ముఖ్యంత్రి
“విజయ్ రూపని” తన పదవికి రాజీనామా చేశారు.రాజీనామా పత్రంను గవర్నర్ “ఆచార్య దేవరత్”
కు సమర్పించారు.
· గాంధీ నగర్ లో
జరిగిన సమావేశం తర్వాత గుజరాత్లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాజీనామా చేశారు.
· ఈయన రాష్ట్ర
అసెంబ్లీ ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు రాజీనామా చేశారు.
· రాజీనామా సమర్పించిన తర్వాత రూపాని విలేఖర్లతో మాట్లాడుతూ సీఎంగా అవకాశం ఇచ్చిన బీజేపీకి ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు.
4. జాతీయ మైనారిటీల చైర్మన్ గ మాజీ IPS అధికారి ఈక్బాల్ సింగ్ లాల్పుర నియమితులయ్యారు.
· మాజీ IPS
అధికారి “ఈక్బల్
సింగ్ లల్పురా” పంజాబ్ కి చెందినవాడు మరియు సిక్కు తత్వశాస్త్రంపై ఎన్నో
పుస్తకాలు రచించాడు.అవి “జప్జి సాహిబ్ ఎక్ విచర్”, “గుర్బాని ఏక్ విచార్” మరియు “రాజ్
ఖరెగా కల్సా” వంటి సిక్కు శాస్త్రంపై 14 పుస్తకాలు రచించాడు.
· రాష్ట్రపతి పోలీస్ పతకం, మెరితోరియస్ సేవలకు పోలీస్ పతకం,శిరోమణి సిక్కు సహిత్కర్ అవార్డు మరియు స్కాలర్ అవార్డు వంటి అవార్డులు ఆయన గెలుచుకున్నారు.
5. హర్యానా ముఖ్యమంత్రి “మనోహర్ లాల్ ఖట్టర్” హర్యానా పర్యావరణం మరియు కాలుష్య కాడ్ అనే పుస్తకాన్ని విడుదల చేశారు.
· హర్యానా
ముఖ్యమంత్రి “మనోహర్ లాల్ ఖట్టర్” మరియు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ మరియు ప్రముఖ
కవి శ్రీమతి “దీరా ఖండ్వేలల్” గారు కలిసి “హర్యానా పర్యావరణం మరియు కాలుష్య కోడ్” అనే పుస్తకాన్ని
విడుదల చేశారు.
·
కొత్త వెంచర్లను ఏర్పాటు చెయ్యడనికి పర్యావరణనికి
సంబందించిన చట్టాలు మరియు నిబంధనల గురించి పూర్తి జ్ఞానం కోల్పోయిన వ్యవస్థాపకులు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది అని తెలిపారు.
No comments:
Post a Comment