ప్రధానమంత్రి కార్యలయం
prime minister's office(India)
PMO ఆఫీస్ కు రాజ్యాంగబద్ధ గుర్తింపు లేదు. ఇది ప్రజల నుండి వ్యక్తిగత ఇబ్బందులను, ప్రజల విజ్ఞప్తులు, ఫిర్యాదులు మొదలైన పౌర సంబంధమైన తదితర విషయాలు తెలుసుకునేందుకు ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రధానమంత్రి సచివాలయం చట్టబద్ధమైన సంస్థగా 1961 నుండి స్థానం పొందింది
ప్రధానమంత్రి కార్యాలయానికి ప్రిన్సిపల్
కార్యదర్శిగా ఒక సీనియర్ ఐఏఎస్ (ప్రస్తుతం ప్రమోద్ కుమార్ మిశ్ర) అధికారి
ఉంటాడు. క్యాబినెట్ కార్యాలయం కంటే ప్రధానమంత్రి కార్యాలయం చిన్నది.
సాధారణంగా పరిపాలన అనుభవం, విశేషమైన ప్రతిభ, చొరవ చూపగల సీనియర్ ఐఏఎస్ అధికారి
ని ప్రధానమంత్రి తన కార్యాలయానికి కార్యదర్శిగా ఎంపిక చేసుకుంటారు.
ఉప
ప్రధానమంత్రి
రాజ్యాంగంలో ఉప ప్రధానమంత్రి పదవికి సంబంధించి అంశాలు ఎక్కడ పొందుపరచలేదు
కావున ఇది రాజ్యాంగేతర పదవి అవుతుంది.
అయితే ప్రాంతీయ రాజకీయాలు, రాజకీయ కారణాల
వలన ఈ పదవి ఏర్పాటు చేయడం జరిగింది ఉప ప్రధానమంత్రి కూడా మంత్రి మండలి లో ఒక
అంతర్భాగం.
ఉప ప్రధానమంత్రికి దేవీలాల్ కేసులో సుప్రీంకోర్టు ఉప ప్రధాని హోదాలో పదవి ప్రమాణ స్వీకారం చేయవచ్చని
తీర్పు చెప్పింది.
మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్
మంత్రులు రకాలు
గోపాల స్వామి అయ్యంగార్ సిఫారసుల మేరకు 1949లో
మంత్రులను మూడు రకాలుగా విభజించడం జరిగింది అయితే ఈ విభజన పరిపాలన సౌలభ్యం కోసమే
అని చెప్పారు. దీనికి రాజ్యాంగ బద్ధత లేదు.
1. క్యాబినెట్
మంత్రులు
2. స్టేట్ మంత్రులు
3. డిప్యూటీ మంత్రులు
క్యాబినెట్
మంత్రులు
1978లో 44వ రాజ్యాంగ
సవరణ ద్వారా క్యాబినెట్ అనే పదాన్ని 352 ప్రకరణలో చేర్చారు.
అయితే క్యాబినెట్ మంత్రులకు మిగతా మంత్రుల కంటే ఎక్కువ అధికారాలు ఉంటాయి.
క్యాబినెట్ మంత్రులు ముఖ్యమైన శాఖలు అయిన రక్షణ, ఆర్థిక, రైల్వే, హోమ్, వ్యవసాయం మొదలైన వాటికి క్యాబినెట్ మంత్రులు ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలు ప్రధానమంత్రి అద్యక్షతన గల క్యాబినెట్ మంత్రి వర్గం తీసుకుంటుంది.
ప్రస్తుతం
అంతరంగిక
క్యాబినెట్
క్యాబినెట్ మంత్రులలో వీరు అతి ముఖ్యమైన వారు ఈ అంతరంగిక క్యాబినెట్ ని సూపర్
క్యాబినెట్ గా వర్ణిస్తారు వీరు ప్రధానమంత్రితో సన్నిహితంగా మెలిగేవారు మరియు వీరు
ప్రధానినీ కలుస్తూ ఎప్పటికీ కీలకమైన సూచనలు సలహాలు ఇస్తారు.
కిచెన్ క్యాబినెట్
ప్రధానమంత్రి తన అధికార నిర్వహణలో వారికి సమీప బంధువులను మంత్రులుగా చేయడం లేదా కుటుంబ సభ్యులు పరిపాలనలో ప్రభావాన్ని
చూపుతాడు ఈ వ్యక్తుల సమూహమే కిచెన్ క్యాబినెట్.
షాడో క్యాబినెట్
రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశం గల బలమైన ప్రతిపక్షం ఎన్నికలకు ముందుగానే తన
పార్టీ తరపున ప్రధాన మంత్రి అభ్యర్థిని మరియు మంత్రి పదవి చేపట్టే వ్యక్తులను ముందుగానే ప్రకటిస్తుంది. ఈ పద్ధతిని షాడో క్యాబినెట్ అంటారు.ఇది
ఇంగ్లాండ్ లో ఆచరణలో ఉంది. అయితే
భారత్లో 16వ లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ
అని ముందుగానే ప్రకటించింది.
స్టేట్
మంత్రులు (సహాయ
మంత్రులు)
క్యాబినెట్ మంత్రులకి స్టేట్ మంత్రులపై అజమాయిషీ ఉండదు. కేంద్రంలోని కొన్ని
శాఖలను స్టేట్ మంత్రులు స్వతంత్రంగా నిర్వర్తిస్తూ విధినిర్వహణలో ప్రధానికి నేరుగా
జవాబుదారిగా ఉంటారు.
డిప్యూటీ మంత్రులు
క్యాబినెట్ మంత్రులకి సహాయం చేయడానికి నియమించబడిన మంత్రులని డిప్యూటీ
మంత్రులు అంటారు.
ప్రస్తుతం డిప్యూటీ మంత్రులను నియమించడం లేదు. వీరికి ఎలాంటి స్వతంత్ర
ప్రతిపత్తి ఉండదు.
క్యాబినెట్
యొక్క ముఖ్య విధులు
క్యాబినెట్ మండలి విదేశాంగ విధానం, అంతర్జాతీయ ఒప్పందాలు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటుంది.
కేంద్ర ప్రభుత్వంలోని అన్ని నియామకాలు, పథకాలు, ముఖ్యమైన నిర్ణయాలు క్యాబినెట్
నిర్ణయం ప్రకారమే జరుగుతాయి.
రాష్ట్రపతికి విధుల నిర్వహణలో సలహాలు ఇస్తుంది. అయితే ఈ కేబినెట్ సలహా
రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే వాటిని
ఆమోదించేలా క్యాబినేట్ చర్యలు తీసుకుంటుంది.
క్యాబినెట్
పాత్ర పై ప్రముఖుల అభిప్రాయాలు
- లోవెల్ అనే వ్యక్తి ప్రకారం క్యాబినెట్ అనేది ప్రభుత్వానికి మూలస్తంభం.
- రామసే మ్యూర్ అనే వ్యక్తి ప్రకారం ప్రభుత్వం అనే నావకి క్యాబినెట్ అనేది స్టీరింగ్ వీల్ లాంటిది.
- గ్లాడ్ స్టోన్ అనే వ్యక్తి అభిప్రాయం ప్రకారం క్యాబినెట్ అనేది ప్రభుత్వ విధానాలకు అయస్కాంతం లాంటిది.
- బేగ్ హార్ట్ అనే వ్యక్తి ప్రకారం క్యాబినెట్ అనేది కార్యనిర్వాహక శాఖ, శాసన శాఖ వివాదాలను కలిపి ఒక వారధి. అలాగే పట్టి ఉంచి రింగు లాంటిది.
క్యాబినెట్
కమిటీలు
కేంద్రంలో ప్రతి పనిని క్యాబినెట్ మాత్రమే చేయలేదు కావున క్యాబినెట్ పని
భారాన్ని తగ్గించడానికి మరియు ప్రజల సమస్యల పైన నిరంతరం పర్యవేక్షణ
కొనసాగించడానికి వీలుగా క్యాబినెట్ మంత్రులతో కూడా కొన్ని కమిటీలను ఏర్పాటు చేస్తారు.
అయితే వీటికి చట్టబద్ధత లేదు. పార్లమెంట్ వ్యవహారాల నియమ ప్రకారం ప్రకారం వీటిని
ఏర్పాటు చేయడం జరిగింది.
వీటిని ప్రధానమంత్రి ఏర్పాటు చేస్తాడు. ఈ కమిటీలు రెండు రకాలుగా ఉంటాయి.
1.స్థాయి కమిటీలు
మరియు
2.తాత్కాలిక కమిటీలు.
ప్రత్యేక సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే తాత్కాలిక కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఆ
సమస్య పరిష్కారం కాగానే ఈ తాత్కాలిక కమిటీలు రద్దు అవుతాయి.
ప్రతి కమిటీలో ముగ్గురు నుండి ఎనిమిది మంది సభ్యులు ఉంటారు. కొన్ని సమయాలలో
సహాయ మంత్రులు కూడా తీసుకుంటారు వీటికి చైర్మన్లుగా క్యాబినెట్ మంత్రులు ఉంటారు.
అయితే ముఖ్యమైన కమిటీలకు ప్రధానమంత్రి ఛైర్మన్ గా ఉంటారు.
ప్రస్తుతం 10 క్యాబినెట్ కమిటీలు
ఉన్నాయి అయితే ప్రభుత్వాలు మారినప్పుడు ఆ ప్రభుత్వం తనకు ఇష్టం ఉన్నట్లు అవసరానికి
తగ్గట్టు ఈ కమిటీలో సంఖ్యలో పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.
ప్రస్తుతము ఉన్న
క్యాబినెట్ కమిటీలు అవి
·
రాజకీయ వ్యవహారాల కమిటీ
·
నియామకాల కమిటీ
·
ఆర్థిక వ్యవహారాల
కమిటీ
·
పార్లమెంటరీ
వ్యవహారాల కమిటీ
·
రక్షణ వ్యవహారాల కమిటీ
·
ప్రపంచ వాణిజ్య సంస్థ కమిటీ
·
ఆధార్ వ్యవహారాల
కమిటీ
·
పెట్టుబడుల కమిటీ
·
ధరల పై కమిటీ
·
వసతుల కమిటీ
·
అత్యంత ముఖ్యమైన కమిటీని రాజకీయ వ్యవహారాల కమిటీ అంటారు. దీనిని సూపర్
క్యాబినెట్ అని అంటారు
·
ప్రధానమంత్రి రాజకీయ
వ్యవహారాల కమిటీ, ఆర్థిక వ్యవహారాల కమిటీ, నియామకాల కమిటీ, ఆర్థిక కమిటీకి చైర్మన్
గా వ్యవహరిస్తాడు.
·
కేంద్ర హోంమంత్రి
వసతుల కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు.
Nice
ReplyDeleteThank you ...
Delete