constitutional amendments in Telugu
రాజ్యాంగ సవరణలు – ముఖ్యాంశాలు
1 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1951 సంవత్సరంలో జూన్ 18న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ద్వారా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా
సమానత్వపు హక్కు, స్వేచ్ఛ హక్కు, అస్తి హక్కులపై ప్రజా
ప్రయోజనాల దృష్ట్యా నియంత్రణ విధించడం జరిగింది.
9వ షెడ్యూల్లో భూ
సంస్కరణలకు సంబంధించిన అంశాలను చేర్చడం జరిగింది. 9వ షెడ్యూల్లో చేర్చిన అంశాలను కోర్టుల న్యాయ
సమీక్ష పరిధిలోకి రావు.ఈ రాజ్యాంగ సవరణ కి రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు.
2 వ రాజ్యాంగ సవరణ
ఇది పార్లమెంటులో రాష్ట్రాలకు కేటాయించిన స్థానాలపై మార్పుకి
సంబంధించిన సవరణ.
ఇది ఇది 1953 మే
1 తేదీన ఆమోదం పొందింది దీనికి రాష్ట్రాల ఆమోదం కూడా లభించింది
3 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1955 ఫిబ్రవరి 22వ తేదీన అమలులోకి వచ్చింది ఈ సవరణ
ప్రకారం ముడి పత్తిని, ఆహారధాన్యాల ఉత్పత్తి, పశువులకు సంబంధించిన అంశాలను ఉమ్మడి
జాబితాలో కి మార్చడం జరిగింది.ఇది రాష్ట్రాల ఆమోదం పొందింది.
4 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1955 ఏప్రిల్ 27 వ తేదీన అమలులోకి వచ్చింది రాష్ట్ర
ప్రభుత్వాలు మరియు భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఆస్తులపై ఇచ్చే
నష్టపరిహారంపై కోర్టుల పరిధికి వెలుపల ఉంచారు.దీనికి రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు.
5 వ రాజ్యాంగ సవరణ
1955 డిసెంబర్ 24న ఈ
సవరణ అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం రాష్ట్రాల భౌగోళిక సరిహద్దులను రాష్ట్రాల
పేర్లు మార్చే బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టడానికి ముందు రాష్ట్రపతి
రాష్ట్రాల అభిప్రాయం కోసం రాష్ట్రాలకి పంపించడం జరిగింది. దీనికి సమాధానం
చెప్పడానికి రాష్ట్రాలకి నిర్ణీత గడువు కూడా ఇవ్వడం జరిగింది.
6వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1956వ
సంవత్సరంలో సెప్టెంబర్ 11వ తేదీన అమలులోకి వచ్చింది ఈ సవరణ ప్రకారం అంతర్
రాష్ట్రాల మధ్య జరిగే వాణిజ్యలపై పన్నులు విధించే అధికారం
పార్లమెంటుకు ఉంటుందని ఈ సవరణలో పేర్కొన్నారు.
7వ రాజ్యాంగ సవరణ
1956 నవంబర్ 1న ఈ
సవరణ అమలు లోకి వచ్చింది. ఈ సవరణల ద్వారా రాష్ట్రాల
పునర్విభజన జరిగింది. రాష్ట్రాల పునర్విభజన
ద్వారా 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత
ప్రాంతాలను ఏర్పాటు చేశారు.
లోక్సభ, రాజ్యసభ
మరియు రాష్ట్ర శాసనసభల స్థానాలపై మార్పులు చేశారు. హైకోర్టులో తాత్కాలిక మరియు
అదనపు న్యాయమూర్తుల నియామకానికి అవకాశం కల్పించారు. ఒకే
వ్యక్తిని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్ గా నియమించవచ్చు అని పేర్కొన్నారు. కేంద్రపాలిత
ప్రాంతాలకు సంబంధించిన అంశాలపై కొన్ని మార్పులు చేశారు.
8 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1960 జనవరి 5న అమలులోకి వచ్చింది ఈ సవరణ ప్రకారం లోక్సభ,
శాసనసభ లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు, ఆంగ్లో ఇండియన్ లకు కేటాయించిన
స్థానాలను పది సంవత్సరాలు(1970 వరకు) పొడిగించడం జరిగింది.
9 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1960 డిసెంబర్ 28న అమలులోకి వచ్చింది ఈ సవరణ
ప్రకారం పాకిస్తాన్ కి బెరూ-బారి అనే ప్రాంతాన్ని బదిలీ చేయడం జరిగింది. ఈ సవరణ
కి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అనుమతి ఇచ్చింది.
10 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1961 ఆగస్టు 11న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం
కేంద్రపాలిత ప్రాంతంగా దాద్రానగర్ హవేలీని
భారతదేశంలో విలీనం చేశారు. ఈ సవరణ కి రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు.
11 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1961 డిసెంబర్ 19 అమలులోకి వచ్చింది. ఈ సవరణ
ప్రకారం రాష్ట్రపతిని ఎన్నుకునే నియోజకగణంలో
ఖాళీలు ఉన్నాయని నెపంతో ఎన్నికలను వాయిదా వేయారాదని చెప్పడం జరిగింది.
12 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1961 డిసెంబర్ 20వ తేదీన అమలులోకి వచ్చింది ఈ సవరణ
ప్రకారం గోవా మరియు డామన్- డయ్యులను భారతదేశంలో విలీనం చేశారు.
13 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1963 డిసెంబర్ 1వ తేదీన అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం నాగాలాండ్ కి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడం జరిగింది.
14 వ రాజ్యాంగ సవరణ
ఇది 1962 డిసెంబర్ 28న అమలులోకి వచ్చింది ఈ సవరణ ప్రకారం పాండిచ్చేరి, యానాం, కరైకల్,
హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, గోవా, త్రిపుర, మాంహే ప్రాంతాలకు శాసనసభను ఏర్పాటు చేసి
కేంద్రపాలిత ప్రాంతంగా మార్చి భారతదేశంలో విలీనం చేసుకోవడం జరిగింది.
అంతేగాక కేంద్ర
పాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి ప్రత్యేక శాసనసభను మంత్రివర్గాన్ని ఏర్పాటు
చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు.
15 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1963 అక్టోబర్ 5న అమలులోకి వచ్చింది. ఈ సవరణ
ప్రకారం హైకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయస్సును 60 నుండి 62 సంవత్సరాలకు పెంచారు.
హైకోర్టు యొక్క పరిధిని విస్తరించారు మరియు హైకోర్టులో న్యాయమూర్తులుగా పదవీ విరమణ
చేసిన వారికి కూడ అవకాశం కల్పించారు. ఉద్యోగులను తొలగించే విషయంలో రాష్ట్రపతి
గవర్నర్ అధికారంను సవరించారు.
16 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1963లో
అక్టోబర్ 5న లోకి వచ్చింది ఈ సవరణ స్వేచ్ఛా హక్కుల పై ఎమ్మెల్యే, ఎంపీ మరియు C.AG. పదవి ప్రమాణ స్వీకారంలో మార్పు.
17 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1964 జూన్ 20న అమలులోకి వచ్చింది ఈ సవరణ ప్రకారం
వ్యవసాయ భూములు స్వాధీనం చేసుకున్నప్పుడు మార్కెట్ విలువ చెల్లించాలి. మరియు ఎస్టేట్
పద నిర్వచనం మార్చారు.
18 వ
రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1966లో
ఆగస్టు 27న అమలులోకి వచ్చింది ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రం అనే మాటలను పునర్ నిర్వహించారు.
హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ ను పునర్వ్యవస్థీకరించారు.
19 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1966 డిసెంబర్ 11న అమలులోకి వచ్చింది. ఈ సవరణ
ఎన్నికల వివాదాలకు సంబంధించిన ఎన్నికల ట్రిబ్యునల్ ఎర్పాటు గురించి.
20 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1966 డిసెంబర్ 22న అమలులోకి వచ్చింది. జిల్లా జడ్జీలను నియమించే ప్రాతిపదికను రాజ్యాంగంలో ఈ
సవరణ ద్వారా చేర్చడం జరిగింది.
21 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1967 ఏప్రిల్ 10న లోకి వచ్చింది. దీని ప్రకారం సిందీ
భాషను 15 వ అధికారిక భాషగా
8వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది.
22 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1969 సెప్టెంబర్ 25న అమలులోకి వచ్చింది. ఈ సవరణ
ప్రకారం మేఘాలయను స్వతంత్ర ప్రతిపత్తి ప్రాంతంగా ఏర్పాటు చేశారు. మరియు అస్సాం
రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక ప్రాధాన్యతలను కల్పించారు.
23 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1970 జనవరి 23న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ద్వారా పార్లమెంటు
మరియు రాష్ట్ర శాసనసభలో కేటాయించబడిన షెడ్యూలు కులాలు, ఆంగ్లో ఇండియన్స్ కి
రిజర్వేషన్లను 1980 సంవత్సరం వరకు పెంచారు.
24 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1971 నవంబర్ 5న అమలులోకి వచ్చింది. దీని ప్రకారం
పార్లమెంటుకు ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలో ఏ భాగానీ అయినా సవరించే అధికారం
పార్లమెంటుకు కల్పించబడింది.
25 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1972 ఏప్రిల్ 20 న చేశారు “నష్ట పరిహారం” అనే పద
స్థానంలో “కొంత మొత్తం” అనే పదం చేరింది ఆదేశిక నియమాలలోని 39b, మరియు 39-c అమలుకు చట్టాలు
చేస్తే వారిని న్యాయస్థానం ప్రశ్నించరాదు.
ALSO READ :- constitutional amendments in telugu 26 to 50
No comments:
Post a Comment