constitutional amendments in Telugu 51-80
రాజ్యాంగ సవరణలు – ముఖ్యాంశాలు
రాజ్యాంగ సవరణ 51 to 80
51 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1986 జూన్ 16న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం మేఘాలయ,
అరుణాచల్ ప్రదేశ్, మిజోరామ్, నాగాలాండ్ లోని పార్లమెంటు, రాష్ట్ర
అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది.
52 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1985 మార్చి 1న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం రాజ్యాంగంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టారు.
53 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1987 ఫిబ్రవరి 20న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతం అయిన మిజోరాంనీ 23వ రాష్ట్రంగా చేయడం జరిగింది.
54 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1986 ఏప్రిల్ 1న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం
సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల మరియు ఇతర న్యాయమూర్తుల
జీతభత్యాలను పెంచారు.
55 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1987 ఫిబ్రవరి 20న అమలులోకి వచ్చింది. దీని ప్రకారం 24వ రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ ఏర్పాటు చేశారు.
56 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1987 మే 30న అమలులోకి వచ్చింది దీని ప్రకారం 25వ రాష్ట్రంగా గోవా ను ఏర్పాటు చేశారు.డామన్,
డయ్యును కేంద్ర పాలిత ప్రాంతంగా విడగొట్టారు.
57 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1987 సెప్టెంబర్ 21న అమలులోకి వచ్చింది ఈ సవరణ ప్రకారం
నాగాలాండ్,మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్,
మేఘాలయ రాష్ట్రాల్లో లోక్ సభ మరియు శాసనసభలో షెడ్యూల్ తెగలకు ప్రత్యేక ఏర్పాట్లు.
58 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1987 డిసెంబర్ 9న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం హిందీ భాష
లోకి రాజ్యాంగాన్ని అధికారికంగా తర్జుమా చేశారు.
59 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1988 మార్చి 30న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం రాష్ట్రపతి
పాలన పంజాబ్లో మూడు సంవత్సరాలకు పెంచారు.
60 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1988 డిసెంబర్ 20న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం స్థానిక
సంస్థలకు విధించే పన్నురూ. 250 నుండి రూ.2,500 వరకు పెంచారు.
61 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1989 మార్చి 21న అమలులోకి వచ్చింది ఈ సవరణలో 21 సంవత్సరాలు ఉన్న
ఓటు హక్కును 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది.
62 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1989 డిసెంబర్ 20న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం ఎస్సీ, ఎస్టీలు మరియు ఆంగ్లో
ఇండియన్ లకు పార్లమెంట్ మరియు శాసన సభలో మరో 10 సంవత్సరాల్లో రిజర్వేషన్లు
పొడిగించడం జరిగింది.
63 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1990 జనవరి 6న అమలులోకి వచ్చింది ఈ సవరణలో 59 వ రాజ్యాంగ సవరణ
ద్వారా చేసిన అంశాలను తొలగించారు.
64 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1990 ఏప్రిల్ 16న అమలులోకి వచ్చింది. రాష్ట్రపతి పాలనను
పంజాబ్లో మరో ఆరు నెలలు పొడిగించారు.
65 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1990 మార్చి 12న అమలులోకి వచ్చింది. దీని ద్వారా జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్ కి రాజ్యాంగ హోదా కల్పించారు.
66 వ రాజ్యాంగ సవరణ
ఇది 1990 జూన్ 7న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం 9వ
షెడ్యూల్లో భూసంస్కరణలకు సంబంధించిన రాష్ట్రాలు చేసిన 55 చట్టాలను చేర్చారు.
67 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1990 అక్టోబర్ 4న అమలులోకి వచ్చింది. ఈ సవరణలో రాష్ట్రపతి
పాలనను పంజాబ్లో నాలుగు సంవత్సరాలు పొడిగించారు.
68 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1991 మార్చి 12న లోకి వచ్చింది. ఈ సవరణ లో పంజాబ్
లో రాష్ట్రపతి పాలన మరో ఐదు సంవత్సరాలు పొడిగించారు.
69 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1992 అమలులోకి వచ్చింది.
దీని ప్రకారం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతాన్ని “నేషనల్ క్యాపిటల్ టేరిటరి ఢిల్లీ” గా పరిగణిస్తారు.
70 వ రాజ్యాంగ సవరణ
ఇది 1991 డిసెంబర్ 21 న అమలులోకి వచ్చింది ఈ సవరణ ప్రకారం ఢిల్లీ, పుదుచ్చేరి శాసనసభ్యులకు రాష్ట్రపతి ఎన్నికలలో భాగస్వామ్యం
కల్పించడం జరిగింది.
71 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1992 ఆగస్టు 31న
అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం 8వ షెడ్యూల్లో నేపాలి, మణిపురి, కంకొని భాషలను చేర్చారు. దీని ద్వారా భాషల
సంఖ్య 15 నుండి 18 వరకు పెరిగింది.
72 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1992 డిసెంబర్ 5న
అమలులోకి వచ్చింది. దీని ప్రకారం త్రిపుర శాసనసభలో షెడ్యూల్ తెగల వారికి
రిజర్వేషన్లు వర్తింపజేశారు.
73వ రాజ్యాంగ సవరణ
ఇది 1993 ఏప్రిల్ 24న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకి రాజ్యాంగ హోదా కల్పించడం జరిగింది.
74వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1993 జూన్ 1న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం మున్సిపాలిటీలకు, నగరపాలిక వ్యవస్థకి రాజ్యాంగ హోదా
కల్పించడం జరిగింది.
75 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1994 మే 15న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం గృహ హక్కుదారులు.
అడ్డుకున్న వారికి సంబంధించిన వివాదాల పరిష్కారానికి అడ్మినిస్ట్రేటివ్
ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయడం జరిగింది.
76 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1994 ఆగస్టు 31న లోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం
తమిళనాడు ప్రభుత్వం కొన్ని తరగతులకు 69 శాతం రిజర్వేషన్లను కల్పించి ఈ అంశాన్ని 9వ
షెడ్యూల్లో చేర్చారు.
77 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 1995 జూన్ 17న అమలులోకి వచ్చింది. ఈ సవరణలో ఎస్సీ,ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించారు.
78 వ రాజ్యాంగ సవరణ
ఇది 1995 ఆగస్టు 30న అమలులోకి వచ్చింది.
ఈ సవరణలో వివిధ రాష్ట్రాలు చేసిన భూసంస్కరణలకు సంబంధించిన చట్టాలను చేర్చారు.
79 వ రాజ్యాంగ సవరణ
ఇది 2000 సంవత్సరంలో అమలులోకి వచ్చింది. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీలు మరియు ఆంగ్లో ఇండియన్ లకు పార్లమెంటు, శాసనసభ లో పది సంవత్సరాలు
రిజర్వేషన్లు పొడిగించారు.
80 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 2000 జూన్ 9న అమలులోకి వచ్చింది. పదవ ఆర్థిక సంఘం సిఫార్సుల
ఆధారంగా కేంద్ర రాష్ట్రాల మధ్య పన్ను రాబడిలో 29 శాతాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయడం.
ALSO READ:- constitutional amendments in Telugu 26 to 50
No comments:
Post a Comment