president of india - రాష్ట్రపతి - job aspirants

Latest

job aspirants

TSPSC-POLICE-GROUPS-SSC-RRB

Translate to your preferred language

All subjects

Thursday 25 November 2021

president of india - రాష్ట్రపతి

కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రపతి

president of india the president of india president of india list president of india salary president of india name president of india 2020 president of india is elected by how president of india is elected president of india 2021 president of india all who elect president of india president of india powers president of indian national congress president of india house president of india list in hindi president of india 2019 qualifications for president of india president of india powers and functions president of india qualification president of india car president of india functions president of india term ex president of india president of india hindi president of india email id 7th president of india president of india in hindi president of india role 3rd president of india 8th president of india

భారత రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటరీ వ్యవస్థను ఎంపిక చేసుకున్నారు. పార్లమెంటరీ వ్యవస్థ భారత పరిస్థితులకు అనువైనది అని, అలాగే వివిధ వైవిధ్యాలు ఉన్న భారత్లో అన్ని వర్గాలకు సముచితమైన ప్రాతినిధ్యాన్ని కల్పించడానికి పార్లమెంట్ వ్యవస్థ అనువైనదిగా ఉంటుంది.

పార్లమెంటరీ వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే శాసన శాఖ మరియు కార్య నిర్వహణ శాఖ మధ్య అధికారం మిళితం ఉంటుంది. కావున ఇలాంటి ప్రభుత్వాన్ని పార్లమెంటరీ ప్రభుత్వం అంటారు. ఉదాహరణకి బ్రిటన్,ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా.

పార్లమెంటరీ ప్రభుత్వ ముఖ్య లక్షణాలు

పార్లమెంటరీ వ్యవస్థలో రెండు రకాలైన అధిపతులు ఉంటారు ఒకరు నామమాత్రపు అధిపతి రెండు వాస్తవఅధిపతి. రాష్ట్రపతి లేదా రాజు నామమాత్రపు అధిపతిగా ఉంటాడు. అన్ని అధికారాలు రాష్ట్రపతి పేరుతో చెల్లించబడతాయి. వాస్తవంగా రాష్ట్రపతికి అన్ని అధికారాలు ఉంటాయి కనుక రాష్ట్రపతిని చట్టపర అధిపతి (DE JURE) అంటారు.

ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న మంత్రి మండలి వాస్తవ అధిపతి లేదా రాజకీయ అధిపతి అంటారు. వీరు అన్ని అధికారులు చెలాయిస్తారు.చట్టపరంగా అధికారం లేనప్పటికీ అన్ని అధికారాలను ప్రధానమంత్రి  చేలాయిస్తారు. 

పార్లమెంటరీ వ్యవస్థలో మంత్రి మండలికి వ్యక్తిగత మరియు సంయుక్త బాధ్యతలు ఉంటాయి. వీరు వ్యక్తిగతంగా రాష్ట్రపతికి, సంయుక్తంగా లోక్ సభకు బాధ్యత వహిస్తారు.

పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధానమంత్రికి, క్యాబినెట్ కి ప్రాముఖ్యం ఉంటుంది అందుకే ఈ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి ప్రభుత్వం లేదా క్యాబినెట్ ప్రభుత్వము అని కూడా అంటారు.

రాజ్యాంగంలో ఐదవ భాగంలో 52 నుండి 78 వరకు గల ఆర్టికల్స్ కేంద్ర కార్యనిర్వాహక శాఖకు సంబంధించినవి. ఈ కేంద్ర కార్యనిర్వాహక శాఖలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి,అటార్నీ జనరల్ సభ్యులుగా ఉంటారు. దీనికి అధిపతి రాష్ట్రపతి.

రాష్ట్రపతి

ఆర్టికల్ 52

Article 52 ప్రకారం భారతదేశానికి రాష్ట్రపతి ఉంటారు.

ర్టికల్ 53

Article 53 ప్రకారం కేంద్ర కార్యనిర్వహణ అధికారాలు అన్నీ రాష్ట్రపతికి దక్కుతాయి. ఈ అధికారాలను రాష్ట్రపతి స్వయంగా గాని అధికారుల సహాయంతో గాని నిర్వర్తిస్తారు. అధికారులు అంటే మంత్రిమండలిగా పరిగణించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

భారతదేశంలో రాజ్యాంగపరంగా అధికారాలు అన్ని రాష్ట్రపతికి ఉన్నప్పటికీ ఈ అధికారులను చెలాయించేది మాత్రం ప్రధాన మంత్రి మరియు ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న మంత్రి మండలి మాత్రమే.

ఆర్టికల్ 54

Article 54 ప్రకారం రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ఒక ప్రత్యేక ఎన్నికల గణం ఉంటుంది ఈ ఎన్నికల గణంలో పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు, రాష్ట్ర విధాన సభకు ఎన్నికైన సభ్యులు, కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ మరియు పాండిచ్చేరి శాసన సభ్యులు కూడా పాల్గొంటారు.

కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పాండిచ్చేరి శాసనసభ సభ్యులకి రాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొనే అవకాశం 70వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో పొందుపరిచారు.

భారత రాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొనని వారు

·        లోక్సభలోని ఇద్దరు ఆంగ్లో-ఇండియన్లు.

·        రాజ్య సభ లోని 12 మంది నామినేటెడ్ సభ్యులు.

·        శాసన మండలి సభ్యులు - Member of Lagislative council.

·        రాష్ట్ర శాసన సభకు నామినేట్ అయిన ఆంగ్లో-ఇండియన్లు.

·        రాష్ట్రపతి ఎన్నికల సమయంలో శాసనసభ రద్దు అయినట్లయితే ఎమ్మెల్యేలు ఓటు వేయరు.

ఆర్టికల్ 55

రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని తెలియజేస్తుంది.ఈ ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటు వేస్తారు. అంటే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రజలు ఎన్నుకుంటారు.

రాష్ట్రపతి ఎన్నికలలో విప్ జారీ చేసే అవకాశం లేదు.

ఎన్నికలలో గెలవాలంటే 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు రావాలి.

రాష్ట్రపతి ఎన్నికలలో పార్లమెంట్ ఎంపీ ఓటు విలువ 708.

 1991 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహిస్తారు.

·        దేశంలోని MLA ల సంఖ్య-4120

·        లోక్ సభ లోని సభ్యులు-543

·        రాజ్య సభ లోని సభ్యులు-233

వీళ్ళు రాష్ట్రపతినీ ఎన్నికునే నియోజక గణంలో ఉంటారు.

దేశంలో మొత్తం MLA ల ఓట్లు విలువ5,49,474

దేశంలోని మొత్తం ఎంపీల ఓట్ల విలువ-  5,49,408

ఎమ్మెల్యేల ఓటు విలువ మొత్తం, ఎంపీ ఓటు విలువ మొత్తం దాదాపు సమానం. దీనినే ప్రిన్సిపల్ ఆఫ్ పారిటి అంటారు. రాష్ట్రాలకు, కేంద్రానికి రాష్ట్రపతి ఎన్నికలలో సమాన ప్రాతినిధ్యం కల్పించడం ఈ ఎన్నికల సూత్రాలను పాటించడానికి అసలైన కారణం.

రాష్ట్రపతి ఎన్నిక విధానం ఐర్లాండ్ దేశం నుండి స్వీకరించారు. రాష్ట్రపతి ఎన్నికను అంబేద్కర్ నెహ్రూ ఫార్ములా అంటారు.

ఈ విధానాన్ని అమెరికా శాస్త్రవేత్త థామస్ హెర్ ఆవిష్కరించాడు. రాష్ట్రపతి ఎన్నికల్లో విధానసభ ఓటు విలువ రాష్ట్ర జనాభా పై ఆధారపడి ఉంటుంది అంటే ప్రతి రాష్ట్రానికి ఓటు విలువ మారుతుంది.

ఎంపీ ఓటు విలువ రాష్ట్రాలవారీగా తేడాలు ఉండవు.

MLA ఓటు విలువ రాష్ట్రం మొత్తం జనాభా/ ఎన్నికైన శాసన సభ్యుల సంఖ్య×1/1000

MP ఓటు విలువ= అన్ని రాష్ట్రాల శాసన సభ్యుల ఓటు విలువ/ ఎన్నికైన పార్లమెంటు సభ్యుల సంఖ్య×1/1000

రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి అభ్యర్థికి మొత్తం పోలై చెల్లిన ఓట్లలో సగం కంటే ఎక్కువ(కోటా) ఓట్లు రావాలి.

కోటా=మొత్తం పోలై చెల్లిన ఓట్లు/ ఎన్నిక కావడానికి సభ్యుల సంఖ్య + 1

రాష్ట్రపతి ఎన్నిక వివాదాలు

రాష్ట్రపతిని ఎన్నుకునే నియోజకవర్గంలో ఖాళీలు ఉన్నాయనే నెపంతో ఎన్నికలను వాయిదా వేయరాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

రాష్ట్రపతి ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. నోటిఫికేషన్ జారీ ఎన్నికల నిర్వహించే తేదీని మొదలైన అన్ని విషయాలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.

రాష్ట్రపతి ఎన్నికలలో లోక్ సభ సెక్రటరీ జనరల్ లేదా రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా ఉంటారు. రాష్ట్రపతి మరియు ఉప రాష్ట్రపతి ఎన్నికల వివాదాలకు సంబంధించిన విషయాలను ఆర్టికల్ 71 ప్రకారం సుప్రీంకోర్టులోనే పరిష్కరించాలి.

44వ(1978) రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కొన్ని మార్పులు చేశారు. అవి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే నియోజక గణంలో ఖాళీలు ఉన్నాయని ఎన్నికలను వాయిదా వేయరాదు.

రాజ్యాంగ పరిమితికి లోబడి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కి ఎన్నికలకు సంబంధించిన అంశాలను పార్లమెంట్ ఒక చట్టం ద్వారా నిర్ణయించవచ్చు.

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు ప్రకటిస్తే వాళ్లు గతంలో తీసుకున్న నిర్ణయాలు జారీ చేసిన ఆదేశాల చెల్లుబాటు అవుతాయి.

రాష్ట్రపతి ఎన్నిక వివాదాన్ని సాధారణ పౌరులు న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీలు ఉండదు. పదవికి పోటీ చేసిన అభ్యర్థులకు, నియోజక గణంలోని అభ్యర్థులకు మాత్రమే ఆ హక్కు ఉంటుంది.

ఆర్టికల్ 56

రాష్ట్రపతి పదవి కాలపరిమితి.

ఆర్టికల్ 57

రాష్ట్రపతి తిరిగి ఎన్నిక అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పునర్ ఎన్నికకు అర్హులు.

రాజ్యాంగపరంగా పునర్ ఎన్నికకు పరిమితి లేకపోయినప్పటికీ రాజకీయ సంప్రదాయం పరంగా రెండు పర్యాయాలు మించి ఒక వ్యక్తి రాష్ట్రపతి పదవిలో కొనసాగకూడదని నియమం పెట్టుకున్నారు.

ఈ సంప్రదాయాన్ని భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదించాడు. అయితే ఇప్పటి వరకు మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాత్రమే రెండుసార్లు రాష్ట్రపతిగా ఉన్నాడు.

USA రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు రెండు పర్యాయాలు మించి కొనసాగడానికి వీలు ఉండదు.

ఆర్టికల్ 58 (రాష్ట్రపతి అర్హతలు)

president of india the president of india president of india list president of india salary president of india name president of india 2020 president of india is elected by how president of india is elected president of india 2021 president of india all who elect president of india president of india powers president of indian national congress president of india house president of india list in hindi president of india 2019 qualifications for president of india president of india powers and functions president of india qualification president of india car president of india functions president of india term ex president of india president of india hindi president of india email id 7th president of india president of india in hindi president of india role 3rd president of india 8th president of india

రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి ఈ కింది అర్హతలు ఉండాలి

1.     కనిష్టంగా 35 సంవత్సరాలు ఉండాలి.

2.      భారతదేశ పౌరుడై ఉండాలి.

3.      ఆదాయం వచ్చే ప్రభుత్వ పదవిలో ఉండకూడదు.

4.      నేరారోపణలు రుజువై ఉండరాదు.

5.   లోక్సభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావలసిన అర్హతలు ఉండాలి.

6.  పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి. అయితే రాష్ట్రపతి యొక్క అర్హతకు సంబంధించిన చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటు కు మాత్రమే ఉంది.

.రాష్ట్రపతిగా పోటీ చేయడానికి కనీస విద్యార్హత అనేది రాజ్యాంగంలో పొందుపరచలేరు.

తర వివరాలు

భారత రాజకీయాల్లో రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి ,ప్రధాన మంత్రి ,ముఖ్య మంత్రి, గవర్నర్ ,ఎమ్మెల్యేలు, ఎంపీలకు జీతాలు ఉంటాయి. వారు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇతర పదవికి కూడా పోటీ చేయవచ్చు.

అయితే పోటీ చేయడానికి ముందే వాళ్లు ప్రస్తుతం ఉన్న స్థానానికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. అయితే వారు ఎన్నికైతే పూర్వపు స్థానాన్ని కోల్పోతారు. 

ఉదాహరణకి ఎంపీ, ఎమ్మెల్యే గా ఉన్న అభ్యర్థి తన పదవికి రాజీనామా చేయకుండా రాష్ట్రపతి పదవికి పోటీ చేయవచ్చు. ఒకవేళ రాష్ట్రపతి పదవికి  ఎన్నికైతే ఎమ్మెల్యే గానీ ఎంపీల సభ్యత్వం రద్దు అవుతుంది ఓడిపోతే సభ్యత్వం కొనసాగుతుంది.

కానీ ఈ సౌలభ్యం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఉండదు. వారు తమ ఉద్యోగానికి ముందే రాజీనామా చేసి పోటీ చేయాల్సి ఉంటుంది.

రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి షరతులు, ప్రమాణ స్వీకారం

రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి ఆ అభ్యర్థి  నామినేషన్ పత్రాన్ని 50 మంది నియోజకగణ సభ్యులు ప్రతిపాదించాలి మరియు 50 మంది సభ్యులు బలపరచాలి.

అభ్యర్థి నామినేషన్ పత్రం తోపాటు 15 వేల రూపాయలను ధరావతుగా రిజర్వు బ్యాంకులో డిపాజిట్ చేయవలసి ఉంటుంది.

ఆర్టికల్స్ 60

ఆర్టికల్స్ 60 ప్రకారం ఎన్నికైన రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత లేదా సీనియర్ న్యాయమూర్తి చేత పదవి ప్రమాణ స్వీకారం చేయించాలి. రాష్ట్రపతి ప్రమాణాన్ని దేవుని పేరుతో గాని ఆత్మ సాక్షిగాగాని చేస్తారు.

అతను ప్రమాణం చేసేటప్పుడు రాజ్యాంగ శాసనాన్ని పరిరక్షిస్తామని సంపూర్ణ సామర్థ్యం మేరకు భారత ప్రజల సేవకి వారి సంక్షేమం కోసం కృషి చేస్తానని ప్రమాణం చేస్తారు.

ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించేటప్పుడు కూడా పై విధంగానే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది.

 రాజీనామాకు సంబందించిన అంశాలు

ఆర్టికల్ 56 ప్రకారం రాష్ట్రపతి 5 సంవత్సరాలు పదవిలో ఉంటారు. రాష్ట్రపతి రాజీనామా చేయవలసి వచ్చినప్పుడు తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ ఉప రాష్ట్రపతి సమయానికి అందుబాటులో లేకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అతను అందుబాటులో ఉండకపోతే సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తికి ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఈ విషయాన్ని లోక్ సభ స్పీకర్కు ముందు తెలియపరచాలి.

రాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు గాని లేదా మరణం వల్ల ఖాళీ ఏర్పడినప్పుడు లేదా రాష్ట్రపతి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పుడు రాష్ట్రపతి పదవీ కాళీ అవుతుంది. అప్పుడు ఏర్పడిన కాళిని ఆరు నెలలు లోగా భర్తీ చేయాలి.

రాష్ట్రపతి పదవీకాలం పూర్తి అయితే పదవీకాలం ముగియకముందే రాష్ట్రపతిని ఎన్నిక చేసుకోవాలి. కొన్ని కారణాల వల్ల రాష్ట్రపతి ఎన్నిక వాయిదా పడితే ఆ సందర్భంలో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించడానికి అవకాశం ఉండదు. పదవిలో ఉన్న రాష్ట్రపతి తన పదవీకాలం ముగిసినప్పటికీ కొత్త రాష్ట్రపతి ఎన్నిక అయేంతవరకు ఆ పదవిలో కొనసాగుతారు.

మహాభియోగ తీర్మానం (రాష్ట్రపతిని తొలగించే విధానం)

ఈ మహాభియోగ తీర్మానం ను అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు ఇది ఒక “క్వాజై జుడిషియల్ “ పద్ధతి.

రాజ్యాంగ అతిక్రమణ అనే ఏకైక కారణం వల్ల రాష్ట్రపతిని తొలగిస్తారు. ఈ ప్రక్రియను మహాభియోగ తీర్మానం అంటారు. తీర్మానంను పార్లమెంటు ఉభయ సభలలో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు.

సభలో ప్రవేశపెట్టే ముందు ఆ సభలోని మొత్తం సభ్యులలో ¼ వ వంతు సభ్యులు సంతకాలు చేసి 14 రోజుల ముందు ముందస్తు నోటీసును సంబంధిత సభకు, రాష్ట్రపతికి ఇవ్వాలి. ఆ తర్వాత తీర్మానం ప్రవేశపెట్టిన సభలలో తొలగించే విషయంలో చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత మొత్తం సభ్యులలో(ఖాళీ స్థానాలతో కలిపి) 2/3 వంతు సభ్యులు దీనిని ఆమోదిస్తే మొదటి దశ పూర్తవుతుంది.

తర్వాత రెండవ సభకి పంపడం జరుగుతుంది ఈ దశలో సభ కమిటీ ద్వారా గాని స్వయంగా గాని పైన పేర్కొన్న అభియోగాలపై విచారణ జరుపుతుంది. రాష్ట్రపతి ఆ సమయంలో రాష్ట్రపతి స్వయంగా గాని న్యాయవాది ద్వారా గాని తన వాదన వినిపించవచ్చు. రెండవ సభ కూడా మొత్తం సభ్యులలో 2/3 మెజారిటీతో మహాభియోగ తీర్మానం ఆమోదిస్తే ఆమోదించిన రోజునుండి రాష్ట్రపతి తొలగిపోయినట్లు ప్రకటిస్తారు.

అయితే ఇంతవరకు మహాభియోగ తీర్మానం ద్వారా ఏ రాష్ట్రపతిని కూడా తొలగించ లేదు. కానీ 1971లో అప్పటి రాష్ట్రపతి అయిన వి.వి.గిరి పై మహాభియోగ తీర్మానం నోటీసు ఇచ్చారు కానీ ఆ తర్వాత దానిని ఉపసంహరించుకున్నారు.

అమెరికా అధ్యక్షుడు కూడా పై విధంగానే తొలగించబడతారు కానీ తీర్మానం మాత్రం మొదట దిగువ సభలో ప్రవేశ పెట్టాలి. ఎగువ సభలో తీర్మానం వచ్చినప్పుడు ఆ సభకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తారు.

ఆర్టికల్ 59 ప్రకారం

రాష్ట్రపతి జీతాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. ఈ జీతాలను కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. వీటిని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించడానికి వీలు ఉండదు. రాష్ట్రపతికి నెలకి 5,00,000 రూపాయలు ఉండును. గతంలో 1,50, 000 రూపాయలు ఉండేది.

ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి ఏ న్యాయస్థానానికి జవాబుదారీ కాదు. ఇతనికి సిమ్లాలో వేసవి విడిది, సికింద్రాబాద్లొని బొల్లారంలో శీతాకాల విడిది ఉంటాయి. రాష్ట్రపతి అధికార నివాసంను రాష్ట్రపతి భవన్ అంటారు.

president of india the president of india president of india list president of india salary president of india name president of india 2020 president of india is elected by how president of india is elected president of india 2021 president of india all who elect president of india president of india powers president of indian national congress president of india house president of india list in hindi president of india 2019 qualifications for president of india president of india powers and functions president of india qualification president of india car president of india functions president of india term ex president of india president of india hindi president of india email id 7th president of india president of india in hindi president of india role 3rd president of india 8th president of india
president of india the president of india president of india list president of india salary president of india name president of india 2020 president of india is elected by how president of india is elected president of india 2021 president of india all who elect president of india president of india powers president of indian national congress president of india house president of india list in hindi president of india 2019 qualifications for president of india president of india powers and functions president of india qualification president of india car president of india functions president of india term ex president of india president of india hindi president of india email id 7th president of india president of india in hindi president of india role 3rd president of india 8th president of india

దీనిని నిర్మాణంను 1912లో ప్రారంభించి 1929లో పూర్తి చేశారు. రాష్ట్రపతి భవన్ రూపశిల్పులు లుటియన్స్ మరియు బేకర్.

గతంలో దీనిని   వైస్రాయ్ రెసిడెంట్ అని పిలిచేవారు. జనవరి 26 నుండి రాష్ట్రపతి భవనంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రపతి భవన్ ప్రాంతాన్ని రైజీనా హిల్స్( RAISINA HILLS)  అని అంటారు.

ALSO READ:-fundamental duties-ప్రాథమిక విధులు

ALSO READ:-Directive Principles of State Policy ఆదేశిక సూత్రాలు

1 comment:

  1. This is particularly necessary in case your components would require much less common metals. Experienced employees is crucial for a profitable metal fabrication project. Ask potential companions in regards to the measurement of their employees and what experience they have within the field. Some customers come to us with an entire laptop rendering and prototype. CNC machining Others need to check and modify designs before manufacturing a big run. Ourin-house engineering teamcan work with these customers to modify designs and supply ideas on method to|tips on how to} obtain the higher-quality part.

    ReplyDelete