fundamental duties-ప్రాథమిక విధులు - job aspirants

Latest

job aspirants

TSPSC-POLICE-GROUPS-SSC-RRB

Translate to your preferred language

All subjects

Monday 22 November 2021

fundamental duties-ప్రాథమిక విధులు

fundamental duties
ప్రాథమిక విధులు

fundamental duties fundamental duties and rights fundamental duties of india fundamental rights and duties fundamental duties in indian constitution fundamental duties constitution of india fundamental duties of indian citizens fundamental duties drawing fundamental duties in hindi fundamental duties article fundamental duties list how many fundamental duties are there in indian constitution how many fundamental duties are there fundamental duties essay fundamental duties amendment fundamental duties borrowed from fundamental duties poster fundamental duties taken from fundamental duties taken from which country fundamental duties are taken from which country fundamental duties were added to the constitution by fundamental duties upsc fundamental duties pdf fundamental duties define fundamental duties definition fundamental duties in constitution fundamental duties day fundamental duties article 51a why fundamental duties are important fundamental duties complement fundamental rights


·        విధి అనగా ఒక వ్యక్తి ఇతరుల కోసం,సమాజం కోసం నిర్వర్తించవలసిన పని లేదా బాధ్యత. విధులు రెండు రకాలుగా ఉంటాయి. అవి నైతిక విధులు మరియు చట్టబద్ధమైన విధులు. నైతిక విలువలు అంటే పెద్దలను గౌరవించడం,ఇతరులను మోసం చేయకుండా ఉండడం, సామాజిక స్పృహ.

·        చట్టబద్దమైన విధులు అంటే ట్రాఫిక్ నియమాలను పాటించడం, పన్నులను సకాలంలో చెల్లించడం,ప్రభుత్వం గుర్తించిన బాధ్యతలను నిర్వర్తించడం. ప్రతి పౌరుడు తమ దేశం పట్ల తమ తోటి పౌరుల పట్ల సమాజం పట్ల కొన్ని కనీస బాధ్యతలను నిర్వర్తించవలసి ఉంటుందిఅయితే వీటికి రాజ్యాంగ ప్రతిపత్తి ఉండడంచేత ప్రాథమిక విధులు అంటారు.

 

భారత రాజ్యాంగం-ప్రాథమిక విధులు

·        మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక విధుల గురించి ప్రస్తావన లేదు. ఈ ప్రాథమిక విధులను రష్యా రాజ్యాంగం నుండి గ్రహించారు.

·        42వ రాజ్యాంగ సవరణ ద్వారా సర్దార్ స్వరణ్  సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రాథమిక విధులను రాజ్యాంగంలోని 4-A భాగంలో,ఆర్టికల్ 51-Aలో పొందుపరచడం జరిగింది.

·        అయితే ప్రారంభంలో 10 ప్రాథమిక విధులు ఉండేవి. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ విధిని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది.

·        1975లో అంతర్గత అత్యవసర పరిస్థితి ఏర్పడిన కారణంగా ప్రాథమిక విధులు ఆవశ్యకత ఏర్పడింది.

·        2016 నవంబర్ 30న సినిమాహాల్లో చలనచిత్రాన్ని ప్రదర్శించడానికి ముందు జాతీయగీత ఆలాపన వినిపించడం తప్పనిసరి అని తీర్పు చెప్పింది.

·         అయితే 2018 జనవరి 9న సినిమా హాల్లో జాతీయ గీతాలాపన తప్పనిసరి కాదు అని తీర్పు చెప్పింది.

·        మాజీ అటార్నీ జనరల్  దీప్తరి ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చడాన్ని వ్యతిరేకించాడు.

 

ప్రాథమిక విధులు (ఆర్టికల్ 51)

ఆర్టికల్ 51

A)     రాజ్యాంగానికి కట్టుబడి ఉండి, దాని ఆదర్శాలను, సంస్థలను,జాతీయ గీతాన్ని,జాతీయ పతాకాన్ని గౌరవించాలి.

B)      భారత  స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో గల ఉన్నత ఆదర్శాలను పాటించాలి.

C)      భారతదేశ ఐక్యతను, సార్వభౌమత్వాన్ని పరిరక్షించాలి.

D)      దేశ రక్షణకి,జాతీయ సేవకు సదాసన్నదంగా ఉండాలి.

E)      భారత ప్రజల మధ్య మత,భాష,ప్రాంతీయ,వర్గ భేదాలకు అతీతంగా సోదరభావాన్ని పెంపొందించాలి.

F)      భారత ఆచారాలను,భారత సంస్కృతిని, సంప్రదాయాన్ని గౌరవించి పరిరక్షించాలి.

G)      అడవులను,నదులను,పరిసరాలను కాపాడాలి మరియు అభివృద్ధి చేయాలి. జీవుల పట్ల దయ కలిగి ఉండాలి.

H)     శాస్త్రీయ దృక్పధాన్ని,పరిశోధన శక్తిని,మానవ జిజ్ఞాసని  పెంపొందించుకోవాలి.

I)       ప్రజల ఆస్తిని,ప్రభుత్వ అస్తినీ సంరక్షించాలి, హింసను విడిచిపెట్టాలి.

J)         తన వ్యక్తిగత సమిష్టి  చర్యల ద్వారా ప్రతి రంగంలోనూ అత్యున్నత స్థానాన్ని పొందడానికి కృషి చేయాలి. దానిద్వారా దేశం అత్యున్నత అభ్యుదయానికి మన వంతు సహాయం అందించగలుగుతాం.

K)     పిల్లలకు విద్యావకాశాలు కల్పించే బాధ్యత తల్లి,తండ్రి లేదా సంరక్షకుని బాధ్యత.

 ALSO READ:- FUNDAMENTAL RIGHTS OF INDIAN CONSTITUTION


ప్రాథమిక విధుల లక్షణాలు

·        ప్రాథమిక విధులుకి న్యాయ సంరక్షణ లేదు.

·        వీటి అమలు కోసం పార్లమెంటు ప్రత్యేకంగా చట్టాలు చేయాలి.

·        ఈ ప్రాథమిక విధులు కొన్ని పౌర బాధ్యతలు మరికొన్ని నైతికపరమైన బాధ్యతలు ఈ ప్రాథమిక విధులు కేవలం పౌరులకు మాత్రమే వర్తిస్తాయి.

·        కొన్ని ప్రాథమిక విధులను భారతీయ మత విలువలు, భారత సంప్రదాయాలు, పురాణాల ఆధారంగా తీసుకున్నారు.

 

విమర్శలు

·        అత్యంత ముఖ్యమైన పన్ను చెల్లింపులు, కుటుంబ నియంత్రణ,ఎన్నికలలో ఓటు వేయడం మొదలైన విధులను ప్రాథమిక విధులు లో పొందుపరచలేదు.

·        కేవలం నియంతృత్వ దేశాల్లో మాత్రమే ప్రాథమిక విధులు ఉంటాయి. ప్రజాస్వామ్య దేశాల రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఉండవు అని చాలా మంది  ప్రజల అభిప్రాయం.

 

ప్రయోజనాలు

·        హక్కులు,ప్రాథమిక విధులు ఈ రెండు ఒక నాణెనికి ఉన్న రెండు పార్శ్వాలు.

·        ప్రాథమిక విధులు ఉండడం దేశ అభివృద్ధికి ఎంతో అవసరం ఎందుకంటే విధులు లేకుండా హక్కులు  మాత్రమే గుర్తిస్తే అది బాధ్యతారాహిత్యానికి దారితీస్తుంది మరియు హక్కులు లేని బాధ్యతలు బానిసత్వానికి ప్రతీక గా ఉంటాయి.

·        ఇవి ఆచరణాత్మకమైనవి కాకపోయినా ప్రజలకు నిరంతరం ఎల్లప్పుడూ నైతిక బాధ్యతలను గుర్తు చేస్తూనే ఉంటాయి.


ప్రాథమిక విధులుపై జస్టిస్ J.S. వర్మ కమిటీ ఇచ్చిన సూచనలు

·        ఈ కమిటీ 1999లో నియమించబడింది. భారతీయ శిక్షాస్మృతిలో ఉన్న  ఈ క్రింది చట్టాల ద్వారా కొన్ని విధులను అమలు చేయమని చెప్పింది ఉదహరణకు

                 i.          అవి పౌర హక్కుల పరిరక్షణ చట్టం-1955

                ii.          ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951

              iii.          వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972

            

         

 ఈ కమిటీ యొక్క మరికొన్ని సిఫార్సులు

·        అవి ప్రతి సంవత్సరం జనవరి 3న ప్రాథమిక విధులు దినోత్సవంగా పాటించాలి.

·        అన్ని విద్యలయాలలో ప్రాథమిక విధులను పాఠ్యాంశంగా చేర్చాలి.

·        విద్యా సంస్థలు  తప్పకుండా NCC నీ ప్రవేశపెట్టాలి. ప్రాథమిక విధులు గురించి ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతమైన ప్రచారం చేయాలి.

 

ముఖ్యమైన తీర్పులు

 

శ్యామ్ నారాయణ్ చాక్సీ v/s యూనియన్ ఆఫ్ ఇండియా

·        జాతీయ పతాకాన్ని ప్రైవేటు వ్యక్తుల ప్రచారం కోసం వినియోగించరాదని ఈ కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

 

నవీన్ జిందాల్ v/s యూనియన్ ఆఫ్ ఇండియా(2004)

·        జాతీయ జెండాను ఎగుర వేయడం భావవ్యక్తీకరణ కిందికి వస్తుందని భారత పౌరులు స్వేచ్ఛగా జాతీయ జెండాను ఎగురవేసే హక్కు ఉంటుందని పేర్కొంది.

 

 Dr.దాశరథి v/s ఆంధ్రప్రదేశ్

·        ఆస్థాన కవుల హోదా చెల్లదని ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

 

బిజో మాన్యువల్ Vs కేరళ (1986)

·        జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాల్సిన అవసరం లేదని ఈ కేసులో సుప్రీంకోర్టు  చెప్పింది. జాతీయగీత ఆలాపన వారి మత విశ్వాసాలకు విరుద్ధం అని నిరూపించగలిగితే దానికి మినహాయింపు ఉంటుంది.

·        అయితే జాతీయ గీతాన్ని ఆలపించినప్పుడు అందరు గౌరవసూచకంగా నిలబడాలని పేర్కొంది .

 ALSO READ:- FUNDAMENTAL RIGHTS OF INDIAN CONSTITUTION

No comments:

Post a Comment