కాకతీయులు (క్రీ.శ. 1030-1323)
KAKATHIYA DYNASTY
PART-1
మూల పురుషుడు |
వెన్న భూపతి (బయ్యారం
చెరువు శాసనం) కాకర్త్య గుండన (మాగల్లు
శాసనం ప్రకారం) |
స్థాపకుడు |
మొదటి బేతరాజు |
స్వతంత్ర రాజ్య స్థాపకుడు |
రుద్రదేవుడు |
రాజధాని |
హనుమకొండ / ఓరుగల్లు |
రాజ భాష |
సంస్కృతం |
వర్ణం |
శూద్రులు |
చిహ్నం |
వరాహం |
రాజలాంఛనం |
కాకతి (అంటే
వేడి), ఆరోగ్య దేవత/ జ్వర దేవత |
మతం |
జైన మతం,శైవం |
వంశం |
దుర్జయ వంశము |
నగర నిర్మాతలు |
హనుమకొండ - ప్రోలరాజు
2 ఓరుగల్లు -కాకతీయ రుద్రుడు |
విదేశీ యాత్రికులు |
మార్కో పోలో రుద్రమ దేవి కాలంలో |
గొప్పవాడు |
గణపతి దేవుడు |
చివరివాడు |
రెండవ ప్రతాపరుద్రుడు |
శిల్పకళ |
1వేయి స్తంభాల గుడి (రుద్రదేవుడు) 2 రామప్ప గుడి (రేచర్ల
రుద్రుడు) దీనికి UNESCO గుర్తింపు
వచ్చింది |
శాసనాలు |
1 బయ్యారం (మైలాంబ) 2హనుమకొండ (కాకతీ
రుద్ర) 3మోటుపల్లి (గణపతి
దేవుడు) |
నాట్యకత్తె |
మాచల్దేవి- రెండవ
ప్రతాపరుద్రుని కాలంలో |
· విద్యా నాథుడు రచించిన ప్రతాపరుద్ర యశోభూషణంలో కాకతీ దేవతను పూజించడం వలన మీరు
కాకతీయులు అయ్యారు అని ఈ గ్రంథంలో పేర్కొనబడింది.
· కాకతీయులు మొదట రాష్ట్రకూటులకు తర్వాత పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా ఉండి రుద్రదేవుని కాలంలో స్వతంత్రులు అయినారు .
· రుద్రమ దేవి కాలంలో ఆంధ్ర దేశాన్ని సందర్శించిన మార్కోపోలో అనే రాయబారి కాకతీయ రాజ్యం
సిరి సంపదలతో తులతూగుతూ ఉండేదని ఆయన ప్రస్తావించారు.
· అంతేగాక ఓరుగల్లు (వరంగల్) ప్రాంతంలో సువాసనతో
కూడిన పండుతుంది అని అన్నాడు.
· ఢిల్లీ సుల్తానుల కాలం నాటి అమీర్ కుస్రు తన రచన అయిన తుగ్లక్ నామాలో కాకతీయుల ఐశ్వర్యం గురించి
గొప్పగా వర్ణించాడు.
· శాసనాలను బట్టి కాకతీయుల కులదేవత “కాకతి” అని మొదట వారు కాకతి ఆరాధకులు కాబట్టి కాకతీయుల అయ్యారు.
· కాజీపేట శాసనాన్ని బట్టి మీరు గుమ్మడమ్మ సంప్రదాయానికి చెందినవారని తెలుస్తోంది.
· జైన దేవత గుమ్మదమ్మ కి మరో
పేరు కాకతి ఈమె అనేక జీవుల్ని అనారోగ్యం నుండి కాపాడే జైన ఆరోగ్య దేవత అని
కాకతీయులు అభిప్రాయం.
· కాకతీయుల కులము గురించి చరిత్రకారులలో అనేక అభిప్రాయాలున్నాయి కొన్ని
శాసనాల్లో సూర్యవంశ క్షత్రియులు అని కొన్ని పుస్తకాల్లో తెలుగు నాయక వంశాల మాదిరి దూర్జయ వంశము అని పేర్కొన్నారు.
· చేబ్రోలు శాసనం ప్రకారం గణపతి దేవుడు మున్నూరు సీమ ప్రాంతంలో జయపనాయుడి సోదరులైన బేతరాజు 1
· ఇతను శనిగరం శాసనం వేయించాడు ఈ శాసనాన్ని రాసింది నారనయ్య
ప్రోలరాజు 1
· ఆగమ పండితుడు రామేశ్వరునికి మొదటి ప్రోలరాజు చైజనపల్లీ
గ్రామాన్ని శివపురం మార్చిదానమిచ్చాడు.
· ఇతనికి అరికేసరి అనే బిరుదు కలదు.
బేతరాజు 2
· ఇతని కాలంలో మొదటి సారి హనుమకొండ రాజధానిగా మారింది.
· ఇతను హనుమకొండలో శివపురం వద్ద బతేశ్వరశివఆలయం కట్టించాడు.
· ఇతను గొప్ప శివ భక్తుడు, ఇతని గురువు రామేశ్వర పండితుడు ఇతను కాజీపేట శాసనాన్ని వేయించాడు.
· ఇతని తరువాత దుర్గరాజు పరిపాలన సాగించడం జరిగింది.
ప్రోలరాజు 2
· ఇతను హన్మకొండలో సిద్దేశ్వర, స్వయంభు దేవాలయం కట్టించాడు.
· ఇతని ఘనకార్యాలను రుద్రదేవుని హనుమకొండ శాసనం తెలుపుతోంది.
స్వతంత్ర
రాజులు (1158-1323)
రుద్ర దేవుడు (1158-1196)
· రుద్రదేవుడు స్వతంత్ర స్వతంత్ర పాలన ప్రారంభించిన మొదటి కాకతీయరాజు .
· ఇతనే ఒకటో ప్రతాపరుద్రుడు, కాకతి రుద్రుడు అని అంటారు.
· క్రీస్తుశకం 1162 లో రుద్రదేవుడు
స్వాతంత్ర్యం ప్రకటించుకున్నట్లు హనుమకొండ శాసనం పేర్కొంటోంది.
· ఇతను హనుమకొండ,గణపవరం అనే శాసనాలు వేయించాడు.
· మెడ రాజు,దొమ్మరాజు వంటి చిన్న చిన్న రాజ్యాలను జయించాడు.
· హనుమకొండ శాసనం అచితెండ్రుడు లిఖించాడు.
· రుద్రదేవుడు హనుమకొండలో
రుద్రేశ్వరాలయం/వేయి స్తంభాల గుడి ని క్రీస్తుశకం 1162 లో నిర్మించాడు ఈ రాజు
రుద్రసముద్రంతటాకం తవ్వించారు.
· ఓరుగల్లు పట్టణాన్ని కట్టించి రాజధానిని పాక్షికంగా హన్మకొండ నుండి ఓరుగల్లుకు మార్చాడు పూర్తి స్థాయిలో
మాత్రం గణపతి దేవుడు మార్చాడు .
· రుద్రదేవుడు సంస్కృతంలో నీతిసారం రాశాడు.
· ఇతని కాలంలోనే శైవ జైన సంఘర్షణలు మొదలయ్యాయి.
· ఇతనీ మంత్రి గంగాధరుడు హనుమకొండలో ప్రసన్న కేశవ ఆలయాన్ని కట్టించాడు, గంగాధరుడు 1182 లో జరిగిన పల్నాటి యుద్ధంలోనలగామరాజుకి
సహకరించాడు.
· ఇతను యాదవ రాజు జైతుగి చేతిలో మరణించాడు.
మహా దేవుడు (1196-1199)
· మహా దేవుడు శైవ భక్తుడు, రుద్రదేవుని మరణం తర్వాత ఇతని తమ్ముడు మహాదేవుడు సింహాసనం ఎక్కాడు.
· తన మరణానికి కారణమైన
జైతుగిపై దండెత్తి
చనిపోయాడు, ఈ దండయాత్రలో మహాదేవుని
కుమారుడు గణపతి దేవుడు బందీగా చిక్కాడుబ.
గణపతి దేవుడు (1999-1262)
· ఇతను కాకతీయ రాజులలో గొప్ప రాజు గణపతి దేవుడు.
1. ప్రధాన సేనాని-రేచర్ల రుద్రుడు
2. రథదళాధిపతి- గంగయ్య సేనాని
3. గజ దళపతి-జాయపసేనాని
· జాయపసేనాని యొక్క రచనలు నృత్య రత్నావళి,గీత రత్నావళి, వాయిధ్య రత్నావళి .
· గణపతిదేవుని తండ్రి మహాదేవుడు యాదవరాజు అయినా జైతుగీ చేతులో చనిపోగా గణపతిదేవుడు 12 సంవత్సరాలు బందీ అయ్యాడు, దీనివల్ల కాకతీయ రాజ్యం సంక్షోభంలో పడిపోయింది
అప్పుడు మహాదేవుని సేనాని రేచర్ల రుద్రుడు కాకతీయ రాజ్యాన్ని ఈ సంక్షోభం నుండి రక్షించారు .
· ఈ రేచర్ల రుద్రుడు చేబ్రోలు శాసనాన్ని వేయించాడు అంతేకాకుండా పాలంపేట లో 1213లో రామప్ప గుడి కూడా కట్టించాడు ఈ రామప్ప గుడికి ఇటీవల
కాలంలో unosco గుర్తింపు పొందింది.
· గణపతి దేవుని యొక్క గురువు విశ్వేశ్వర శంభు, ఈయనకు కాండ్రకోట అనే గ్రామంను దానం చేశాడు ఈ రాజు.
· గణపతిదేవుని కాలంలో అనేక కులాలు ఏర్పడ్డాయి అనేక కులాలలో తగాదాలు
ఏర్పడకుండా జాగ్రత్త పడ్డాడు అనేక కులాల తో సంబంధ బాంధవ్యాలు ఏర్పరుచుకున్నాడు
దీన్నిబట్టి గణపతిదేవునికి దీర్ఘదృష్టి కలదని చరిత్రకారుల అభిప్రాయం.
· గణపతి దేవుని కుమార్తె రుద్రమాంబ (భర్త చాళుక్య వీరభద్రుడు), గణపమంబ (భర్త- బేతరాజు).
· గణపతి దేవుడు కోటకు నాలుగువైపులా నాలుగు శిల నిర్మాణ తోరణాలు
కట్టించాడు, ఈ రాజు కాలంలో మౌల్యల చౌడ సేనాని చౌడ
సముద్రం తవ్వించాడు.
· రుద్రదేవుడు ప్రారంభించిన
ఓరుగల్లు కోట పూర్తి చేసి రాజధానిని పూర్తిస్థాయిలో హనుమకొండ నుండి ఓరుగల్లుకు
క్రీస్తుశకం 1754లో మార్చాడు
· 1262లో పాండ్యరాజు అయినా జయవర్మసుందర
నెల్లూరు సమీపంలో ముత్తుకూరు యుద్ధంలో గణపతిదేవునికి ఓడించాడు, ఈ యుద్ధం తప్ప యుద్ధం మినహాయిస్తే గణపతిదేవునికి
పరాజయం అంటే తెలియదు.
రుద్రమదేవి( క్రీస్తుశకం 1262-1289)
· ఆంధ్రదేశంలో రాజ్యాధికారం చేపట్టిన మొట్టమొదటి మహిళ.
· ఈమె కాలంలో ఇటలీ యాత్రికుడు మార్కో పోలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించాడు .
· ఈమె ప్రముఖ శాసనాలు 1,బీదర్ కోట శాసనం
2,మల్కాపురం శాసనం,ఇది ప్రసూతి వైద్య కేంద్రాల గురించి తెలుపుతుంది.
· చందుపట్ల/అత్తిరాల శాసనం ప్రకారం రుద్రమదేవి అంబదేవునిచే హత్య చేయబడింది.
రెండవ ప్రతాపరుద్రుడు
· ఇతను రుద్రమదేవి మనవడు, ఇతని కాలంలో 77 బురుజులకు 77 మంది నాయకులు ఉండేవారు ఇతని కాలంలో ఆంధ్ర దేశం పై ముస్లింల
దండయాత్ర అధికం అయ్యింది, ఈ దండయాత్ర గురించి రెడ్డిరాణి తన కలువచేరు శాసనం లో పేర్కొంది.
· ఇతని కాలంలో మాచల్దేవి అనే పేరిణినృత్యకళాకారిణి ఉండేది .
· గియజుద్దిన్ తుగ్లక్ కాలంలో అతని కుమారుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యంపై దండెత్తి ప్రతాపరుద్రన్ని ఓడించాడు .
· ఈ ఓటమి గురించి పేర్కొన్న శాసనం విలాస శాసనం.
· వరంగల్ కి సుల్తానాపూర్ అనే పేరు పెట్టి బురానుద్దీన్ అనే పాలకుడని నియమించాడు అయితే ప్రతాపరుద్రుని బంధించి
తీసుకు వెళుతుండగా ఇతను నర్మదా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని విలాస శాసనం
పేర్కొంటోంది.
కాకతీయుల పరిపాలన
· కాకతీయులు మొట్టమొదటిసారిగా దత్తత ద్వారా కిరీటం లభించే పద్ధతి వీరి
వంశం లోనే జరిగింది.
· రాజు చివరి రోజులలో యువరాజులతో కలిసి పరిపాలన చేయడం కాకతీయ రాజ్యం లోని మొట్టమొదటిసారిగా మనం చూడవచ్చు.
· హిందూ రాజవంశాలలో ఒక మహిళను
సింహాసనం ఎక్కించిన ఘనత కాకతీయులకే దక్కుతుంది.
· నాయంకర విధానం రుద్రమదేవి ప్రవేశపెట్టగా ప్రతాపరుద్రుడు సమర్థవంతంగా అమలు చేశాడు .
· రాజు చెడు అలవాట్లు వదిలి నీతి గ్రంథాలు వింటే ఎంతో శక్తి సామర్థ్యాలు వస్తాయి అని నీతిసారం పేర్కొంటోంది.
· మడికి సింగన రచించిన సకలనీతి సమ్మతం అనే గ్రంథంలో అష్టాదశ
తీర్థులు అనే ఉద్యోగుల ప్రస్తావన ఉంది.
· కాకతీయ పరిపాలన సౌలభ్యం కోసం రాజ్యాన్ని నాడులు,స్థలాలు, గ్రామాలుగా విభజించారు
· రాజ్యం |
· రాజు |
· నాడు |
· అమాత్యులు |
· స్థలం |
· స్థలకరణం |
· గ్రామం |
· గ్రామ
అధిపతి |
No comments:
Post a Comment