SHATHAVAHANA DYNASTY
శాతవాహనులు
PART-1
· వంశ మూలపురుషుడు : శాతవాహనుడు
· వంశ రాజ్య స్థాపకుడు
: శ్రీముఖుడు
·
శాతవాహనులు మొదట వీరికి సామంతులు : మౌర్యులకు
· వీరి శాసానాలు
:దేవి నాగానిక వేయించిన నానాఘాట్ శాసనం
· గౌతమి బాలశ్రీ వేయించిన శాసనం : నాసిక్ శాసనం
· మూడవ పులోమావి వేయించిన శాసనం : మ్యాకదోని శాసనం
· ఈ వంశంలో గొప్పవాడు
: గౌతమీ పుత్ర శాతకర్ణి
· ఈ వంశంలో చివరి చక్రవర్తి : 3వ పులోమావి
· నగరాల నిర్మాతలు
: నవ నగర స్వామిగా పేరు పొందిన 2వ పులోమావి ధరణికోట
అని పిలువ బడే ధాన్యకటకం నగరాన్ని నిర్మించాడు.
· వీరి గురించి తెలిపిన విదేశీయుడు :మెగస్తనీసు
· వీరి గురించి తెలుపు విదేశీ రచన :ఇండికా
జన్మస్థలం:-
· మహారాష్ట్ర వాదం - P.T.శ్రీనివాస అయ్యగారు,
హెచ్.సి.రాయచౌదరి
ప్రతిపాదించారు.
· విదర్భ వాదం - వి.వి.మిరాశీ ప్రతిపాదించారు.
· తెలుగు వాదం - కోటిలింగాలు, కొండాపూర్, ధూళికట్ట
మొదలైన ప్రాంతాలలో లభించిన నాణాల ప్రకారం శాతవాహనుల స్వస్థలం తెలంగాణ ప్రాంతం అని
డాక్టర్ బి.వి.పరబ్రహ్మశాస్త్రి గారి అభిప్రాయం.
శాతవాహన రాజులు
శ్రీముఖుడు
·
శ్రిముఖుడు శాతవాహన రాజ్య స్థాపకుడు.
·
శ్రీముఖుని తండ్రి పేరు శాతవాహనుడు, ప్రతిష్టానపురం రాజధానిగా ఇతను అధికారంలో ఉన్నారు.
·
శ్రిముఖుని తండ్రి నాణెములు కొండాపూర్లో
మరియు ఇతని నాణెములు కోటిలింగాలలో లభించాయి.
· ఇతన్ని శివముఖ, సింధుఖ అనే పేర్లతో కూడా పిలుస్తారు.
కృష్ణుడు
· ఇతని కాలంలోనే భాగవత మతం దక్కన్ లోకి
ప్రవేశించింది.
· ఇతను నాసిక్లో బౌద్ధ సన్యాసుల సంక్షేమం కోసం ధర్మ
మహామాత్య అనే అధికారులను నియమించాడు.
మొదటి శాతకర్ణి
· శాతవాహన వంశ నిజమైన స్థాపకుడు.
· వైదిక యజ్ఞయాగాలు నిర్వహించిన మొదటి రాజు
ఇతనే.
· ఇతను పుష్యమిత్ర శుంగుడుని ఓడించినందుకు గుర్తుగా
నాణెములపై ఉజ్జయిని పట్టణం ముద్రించాడు.
రెండవ
శాతకర్ణి
· ఇతను సాంచీ
స్తూపానికి దక్షిణ తోరణం నిర్మించాడు.
· గార్గి సంహిత ప్రకారం విదిశను జయించాడు.
· ఇతని ఆస్థాన కళాకారుడు వశిష్ట పుత్ర ఆనంద.
· ఇతను అత్యధికంగా 56 సంవత్సరాలు పరిపాలించాడు.
కుంతల శాతకర్ణి
· కుంతల శాతకర్ణి సంస్కృతభాషను ప్రోత్సహించాడు మరియు
ఇతని కాలంలో సాహిత్యం, శృంగారం అభివృద్ధి చెందాయి.
· ఇతని కాలంలో ప్రాకృతం స్థానంలో సంస్కృతం శాతవాహనుల అధికార భాషగా
మారింది.
· ఇతని భార్య మలయావతి “కరిర్త” అనే కామ
క్రీడ వలన మరణించింది.
· ఇతని ఆస్థానంలో శర్వవర్మ, గుణాడ్యుడు అనే కవులు ఉన్నారు శర్వవర్మ “కాతంత్ర వ్యాకరణం”, గుణాడ్యుడు “బృహత్కథ” రచించాడు.
· శర్వవర్మ మరియు గుణాడ్యుడి మధ్య ఏర్పడిన సవాలు
గురించి వివరించిన గ్రంథం సోమదేవుని “కథాసరిత్సాగరం”.
పులోమావి -1
· ఇతను 15వ శాతవాహన రాజు.
· వాయు పురాణం లేదా యుగ పురాణం ప్రకారం ఇతను మగధను
పది సంవత్సరాలు పరిపాలించాడు.
· ఇతను మగధ పాలకుడైన సుశర్మను ఓడించి మగధను
జయించినట్లు మత్స్య పురాణం చెబుతుంది.
· ఇతని నాణాలు పాటలీపుత్రలో లభించాయి.
హాలుడు
· ఈ రాజు కాలంలోనే ప్రాకృత భాషకు స్వర్ణయుగం వచ్చింది.
· ఆంధ్రుల చరిత్రలో తొలి కవిరాజుగా ప్రసిద్ధి చెందాడు.
· ఇతను శ్రీలంక రాకుమార్తె అయినా లీలావతిని గోదావరిలో పెళ్లి
చేసుకున్నాడు.
· ఈ వివాహంపై "కుతూహలుడు" అనే కవి “లీలావతి
పరిణయం” అనే గ్రంథాన్ని రాశాడు.
· ఈ రాజు ప్రాకృతంలో “గాథా సప్తశతి”ని రచించాడు.
గాథా సప్తశతి
· ఈ రచన శివస్తోత్రంతో ప్రారంభం అవుతుంది.
· ఈ గ్రంథంలో 700
గ్రామీణ శృంగార కథలను పేర్కొంటుంది.
· ఈ గ్రంథం వలనే శాతవాహనుల కాలం నాటి సాంఘిక
జీవనం తెలుస్తుంది.
గౌతమీపుత్ర
శాతకర్ణి
· శాతవాహన రాజులలో 23వ రాజు.
· శాతవాహనుల రాజులలో గొప్ప రాజు ఇతను.
· అధికారంలో రావడంతోనే శాలివాహన
శకం క్రీస్తుశకం (78 సంవత్సరం) ప్రారంభించాడు.
· భారత ప్రభుత్వం 1957 నుండి క్రీస్తుశకం 78 వ సంవత్సరంను అధికారికంగా
"శాలివాహన శకం" ఆరంభం సంవత్సరంగా పాటిస్తుంది.
· అయితే ఈ శాలివాహనశకంను పాటించిన ఏకైక రాజు యాదవ రామచంద్ర దేవుడు, ఇతను దేవగిరిని పరిపాలించేవాడు.
· శాతకర్ణి బౌద్ధ భిక్షువులకు 100 నివర్తనాల
భూమిని దానం చేశాడు.
· శాతవాహన రాజులలో తన పేరుమీద శాసనాలు వేయించిన రాజు ఇతడు.
· ఈ రాజు నాణెములు పెదబంకూర్, కొండాపూరులో ఎక్కువగా లభించాయి.
· ఈ రాజు శాసనాన్ని వేయించింది అతని తల్లి అయిన గౌతమీ బాలశ్రీ ఆ శాసనం పేరు “నాసిక్ శాసనం”.
· గౌతమీపుత్ర శాతకర్ణికి “త్రిసముద్రతోయపితవాహన” అనే
బిరుదు కలదు. ఈ బిరుదుకు అర్థం తన అశ్వములను మూడు సముద్రాలలో అంటే హిందూ, అరేబియా, బంగాళాఖాతంలో నీరు
తాపినవాడు అని అర్థం.
· ఇతను నహపానుడిని ఓడించి అతని దగ్గర ఉన్న
నాణెములుపై తన పేరుతో తిరిగి ముద్రించారు.
వశిష్టపుత్ర పులోమావి (పులోమావి
2)
· ఇతని కాలంలోనే అమరావతి
స్తూపం నిర్మించబడింది .
· నాసిక్ శాసనాన్ని గౌతమీ
బాలశ్రీ ఇతని కాలంలోనే వేయించింది.
· ఈ రాజు ప్రతిష్టానపురం నుండి అమరావతికి రాజధాని
మార్చడం జరిగింది.
· ఈ రాజు అనేక జాతులను సమైక్యం చేయడంవల్ల ఇతనికి “నవనగరస్వామి” అనే
బిరుదు పొందినట్లు చరిత్రకారుల అభిప్రాయం.
· ఇతని ధరణికోట శాసనం ఆంధ్రదేశంలో లభించిన మొట్టమొదటి శాతవాహనుల శాసనం.
యజ్ఞశ్రీ శాతకర్ణి (చివరి
గొప్ప రాజు)
· వరుసక్రమంలో ఇతడు 27వ చివరి గొప్పరాజు.
· శాతవాహన రాజులలో చివరి గొప్ప రాజు.
· ఇతను రెండు తెరచాపల నౌక బొమ్మ గల నాణాలు ముద్రించారు.
· అయితే వీటిని ప్రారంభించింది మాత్రం రెండవ
పులోమావి.
· యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలోనే మత్స్య పురాణం సంకలనం చేయబడింది.
· యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునికి శ్రీపర్వతంపై(నాగార్జున
కొండ) పారావత విహారం నిర్మించాడు.
· ఇతని కాలంలోనే ధాన్యకటక మహా స్థూపానికి ఆచార్య
నాగార్జునుడు శిలా ప్రకారం నిర్మించాడు.
· భానుడి హర్ష చరిత్రలో ఈ రాజుని త్రిసముద్రాధీశ్వరుడు అని పేర్కొన్నాడు.
· యజ్ఞశ్రీ శాతకర్ణి చిన్నగంజాం శాసనాన్ని
వేయించాడు. ఇది ప్రకాశం జిల్లాలో ఉంది.
· ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీని ఉద్దేశిస్తూ “సుహృల్లేఖ” రచించాడు.
మూడవ పులోమావి(చివరి
పాలకుడు)
· ఇతని సేనాపతి శ్రీశాంత మూలుడు తిరుగుబాటు
చేయడంతో ఈ రాజు రాజ్యాన్ని వదిలి బళ్లారి పారిపోయి
అక్కడినుండి కొంతకాలం పరిపాలించాడు.
· ఇతను బళ్లారి లోనే మ్యాకధోని
శాసనాన్ని వేయించాడు.
· ఈ శాసనం శాతవాహనుల రాజ్య పతనం గురించి
వివరిస్తుంది.
నాణెములు
· ఆంధ్రుల చరిత్రలో నాణాల ముద్రించిన మొట్టమొదటి
రాజులు శాతవాహనులు.
· మొదటి శాతకర్ణి వెండి నాణేలు, ఓడ తెరచాప తెరచాప గుర్తు
గల నాణెములు యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించాడు.
· నాణెములుపై ఉజ్జయిని పట్టణ
గుర్తు వేయించింది గౌతమీపుత్ర శాతకర్ణి మరియు మొదటి శాతకర్ణి.
ఆర్థిక
వ్యవస్థ
•
రాజ్యంలో అధికంగా ప్రజలు
వ్యవసాయం చేసేవారు మరియు భూమిశిస్తు ప్రధాన ఆదాయం మార్గం.
• పంటలో 1/6 వంతు పన్నుగా
విధించేవారు మరియు పంటలపై దేయమేయం, రాజ భాగం వంటి పనులు
మరియు వృత్తులపై కురకర వంటి పన్నులు విధించేవారు.
• కొన్ని సందర్భాలలో
శాతవాహన రాజులు బ్రాహ్మణులకు భూదానాలు చేసేవారు, ఈ భూములను శూద్రులు సాగుచేసి మక్త అనే పన్ను చెల్లించినట్లు
తెలుస్తుంది.
• నాసిక్ శాసనం ప్రకారం వ్యవసాయ భూములకు నీరు
అందించడానికి ఉదయాoత్రికుల శ్రేణి ఉండేది.
వీరు తయారు చేసిన వివిధ పనిముట్లు:-
• ఉదక యంత్రం - భూమిని దున్నే యంత్రం
• ఘటి యంత్రం - నీళ్లను పైకి తేవడానికి
ఉపయోగించే యంత్రం
• గరిక యంత్రం - ముడి పత్తి నుండి విత్తనాలను
వేరు చేసే యంత్రం
ముఖ్యమైన అంశాలు :-
• శాతవాహనుల కాలం నాటి అభివృద్ధి సంఘాలను శ్రేణులు
అనే వారు.
• వీరి కాలంలో 18 రకాల
శ్రేణులు ఉన్నట్లు తెలుస్తోంది, వీరు నిర్వహించే
సమావేశాన్ని గోష్టి అనేవారు.
• వర్తకులలో ప్రభుత్వ
ప్రతినిధి శెట్టి ఉండేవారు.
• వృత్తి సంఘాల
కట్టుబాట్లను శ్రేణి ధర్మం అనేవారు.
• వృత్తి సంఘాలు తర్వాత కులాలుగా అవతరించాయి.
No comments:
Post a Comment