Indian history Telugu pdf
ఢిల్లీ సుల్తానులు-DELHI SULTANATE
1.తుగ్లక్ వంశం
1. గియాసుద్దీన్ తుగ్లక్.
· ఇతను గుర్రాలపై వార్తలు
పంపే పద్ధతిని ప్రవేశపెట్టాడు.
· ఇతను ఐదు
సంవత్సరాలు అనగా 1320 -1325 వరకు పరిపాలించాడు.
· ఇతని కుమారుడైన మహమ్మద్ బిన్ తుగ్లక్ చేత హత్యగావింపబడ్డడు.
2. మహమ్మద్
బిన్ తుగ్లక్.
· 1323 లో మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించాడు మరియు ఓరుగల్లు కోటను ఆక్రమించి "సుల్తాన్పూర్" అని పేరు పెట్టాడు.
· మహమ్మద్ బిన్ తుగ్లక్ మరొక
పేరు "జూనఖాన్".
· 1325 లో పూర్తి రాజ్య తన చేతుల్లో తెచ్చుకొని 25 సంవత్సరాలు పరిపాలించాడు.
· ఇతని పాలన లో ఢిల్లీ
సుల్తాన్ రాజ్యం పరాకాష్టకు చేరుకుంది మరియు ఆర్థిక ఒడిదుడుకులు కలిగే నిర్ణయాలు
తీసుకున్నాడు.
· 1327 సంవత్సరంలో రాజధాని ఢిల్లీ నుండి దేవగిరి మార్చాడు.
· హిందువుల పండుగలలో పాల్గొన్న మొదటి ముస్లిం చక్రవర్తి మహమ్మద్ బిన్
తుగ్లక్.
· ఇతను ప్రాథమిక లోహాల నుండి వెండి నాణాలను ముద్రించమని ఆదేశించాడు. ఈ
నిర్ణయం కాస్త విఫలమైంది. ఎందుకంటే సాధారణ ప్రజలు
కూడా ఈ వెండి నాణాలను ముద్రించి పన్ను చెల్లించడానికి మరియు జిజియా పన్ను చెల్లించడానికి ఉపయోగించారు.
· మహమ్మద్ బిన్ తుగ్లక్
నిర్మించిన కోట "దౌలతాబాద్ కోట".
· 1327 లో మహమ్మద్ బిన్ కు తుగ్లక్ వ్యతిరేక తిరుగుబాటులు మొదలయ్యాయి.
· 1336 సంవత్సరంలో తుగ్లక్ ను దిక్కరించి కాపయ నాయకుడు ఓరుగల్లు కోటను ఆక్రమించాడు
మరియు హరిహర బుక్క రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు.
· 1347 సంవత్సరం లో హాసన్ గంగు బహుమనీ సామ్రాజ్యమును స్థాపించాడు
· మహమ్మద్ బిన్ తుగ్లక్
గురించి మొరాకో యాత్రికుడైన ఐబాన్ బాటుట రాసిన "తారిక్ ఈ ఇలై" అనే గ్రంథంలో తెలియజేశాడు.
· మహమ్మద్ బిన్ తుగ్లక్
హిమాలయాల సమీపంలోని క్వారా జాతి వారిపై దండెత్తి మంచు వల్ల మరియు ప్లేగు వ్యాధి వల్ల పూర్తి
సైన్యాన్ని కోల్పోయాడు
· తుగ్లక్ 1351 సంవత్సరంలో దాగి అనే వారిని
ఓడించడానికి గుజరాత్ వెళ్లి అక్కడే మరణించాడు.
· ఇతని మరణం తో అతని బాధలు ప్రజలకు ప్రజల బాధలు ఇతనికి తప్పవని వ్యాఖ్యానించిన వారు – లేన్ పూల్.
3. ఫిరోజ్ షా తుగ్లక్.
· ఇతని 37 సంవత్సరాల పాలన యమునా నది
నుండి నీటి పారుదల కాల్వలను ప్రారంభించడం మరియు ఆహార స్థితిగతులను స్తిరికరించడం
మరియు కరువును తగ్గించడం తో మొదలైంది.
· ఇతను 26 రకాల పనులను రద్దు చేశాడు
మరియు బానిస వ్యవస్థ రద్దు చేసి "దివాన్ ఈ బంధగాన్" అనే వ్యవస్థ ను ప్రారంభించాడు.
· ఇతను నిరుద్యోగ భృతి మరియు బిందు సేద్యం , తుంపర సేద్యం ప్రారంభించాడు
· ఇతను ఆదా ,భికా అనే నాణాలను ముద్రించాడు.
· తను పేదలకోసం "దివాన్ ఈ ఖైరత్" అనే శాఖలు ఏర్పాటు చేశాడు.
· ఇతను జాగీర్దారీ వ్యవస్థ ను తిరిగి ప్రారంభించి
సైనికులకు జీవితాలకు బదులుగా భూములను పంపిణీ చేశాడు.
· ఫిరోజ్ షా యొక్క స్వీయ చరిత్ర "పతుహత్ ఈ ఫిరోజ్
షాహి".
· భరణి అనే పండితుడు రచించిన గ్రంథం "తారిక్ ఈ ఫిరోజ్ హాహి".
· ఫిరోజ్ షాహీ నిర్మించిన
నగరాలు:-
1.
ఫతే బాద్.
2.
ఫిరోజ్పూర్
3.
ఫిరోజాబాద్
4.
జాన్ పూర్
5.
హిన్సార్
· ఇతను నాగ కోటపై దండెత్తి జ్వాలాముఖి దేవాలయంను దోచుకొని మూడువందల సంస్కృత గ్రంధాలను ఎత్తుకు వచ్చి వాటిని "దలిల్ ఈ ఫిరోజ్ షాహి" గా తర్జుమా చేయించాడు.
4. నాసిర్ ఉద్దీన్ మొహమ్మద్
బిన్ తుగ్లక్.
· నసీరుద్దీన్ ఒక్క బంధువు సుస్రత్ షా తుగ్లక్ తో కలిసి ఫిరోజాబడ్ నుంచి పరిపాలించాడు.
· వీరిద్దరి మధ్య యొక్క
యుద్ధం తైమూర్ దండయాత్ర కు దారి తీసింది.
· తైమూర్ బార్లస్ తెగకు చెందిన వాడు మరియు సమర్ఖండ్ రాజ్య చక్రవర్తి.
· తైమూర్, నసీరుద్దీన్ యొక్క బలహీనతను
తెలుసుకొని 1398 లో ఢిల్లీపై దండెత్తి మారణకాండ సృష్టించాడు.
· విగ్రహారాధనను
నిర్మూలించాలనే ఉద్దేశంతో తైమూర్ భారతదేశంపై దండెత్తి ఢిల్లీని దోచుకొని "ఖాజిర్
ఖాన్" ను అధికారిగా నియమించాడు.
· ఖాసిర్ ఖాన్ నసీరుద్దీన్ ను వధించి భారతదేశాన్ని ఆక్రమించుకున్నాడు.
2. సయ్యద్ వంశం
· వీరు మహమ్మద్ ప్రవక్త యొక్క వారసులం అని చెప్పుకున్నారు
1.ఖజీర్ ఖాన్
· నసిరుద్దీన్ ను వధించి ఢిల్లీకి చక్రవర్తి అయ్యాడు.
2. ముబారక్ ఖాన్.
· అతని పేరున "ముబారక్
ష" అని మార్చుకున్నాడు.
· పంజాబ్లో కోల్పోయిన భూ
భాగాలను ఖోఖోర్ యుద్దవీరుల నుండి తిరిగి పొందడానికి ప్రయత్నించాడు.
3.అల్లా ఉద్దీన్ ఆలం షా.
· ఆలం షా సయ్యద్ వంశానికి చివరి పాలకుడు.
· ఆలం షా అనగా "ప్రపంచ
విజేత" అని అర్థం.
· ఆలం ష ను వధించినవాడు బహుళ లొడి.
3. లోడి వంశం
1. బహుల్ ఖాన్ లోడి.
· ఢిల్లీ సుల్తానుల ప్రభావాన్ని విస్తరించేందుకు ముస్లిం జోన్ పూర్ సుల్తానుల మీద దాడితో ఇతని పాలన ను ప్రారంభించాడు మరియు ఒక ఒప్పందం తో పాక్షిక విజయాన్ని సాధించాడు.
2. సికిందర్ లోడి
3.నిజాం ఖాన్
· ఇతడు లోడి వంశస్తులలో గొప్పవాడు.
· ఇతను ఆగ్రా నగరాన్ని నిర్మించి
కోర్టును మరియు రాజధాని నీ ఢిల్లీ నుండి ఆగ్రా కు
తరలించాడు.
· ఇతను మధుర చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు ధ్వంసం చేసే ప్రచారానికి నాయకత్వం
వహించాడు మరియు భక్తి ఉద్యమ కారుడైన కబీర్ ను వధించాడు.
· పేదవారి జాబితాను తయారుచేసి
ఆరు నెలలకు ఒకసారి ఆహారధాన్యాలు పంపిణీ చేశాడు.
· ఇతను ఆగ్రాలో ఇండో-ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ భవనాలను
నిర్మించాడు.
· 1517 వ సంవత్సరంలో సహజ మరణం పొందాడు.
· ఇతని మరణానంతరం ఇతని రెండవ కుమారుడైన ఇబ్రహీం లోడి చక్రవర్తి అయ్యాడు.
4.ఇబ్రహీం లోడి.
· ఇబ్రహీం లోడీ తన పరిపాలన
ఏకీకృతం చేసుకోలేకపోయాడు.
· ఇతని బంధువులైన దౌలత్ ఖాన్ లోడి మరియు ఆలం ఖాన్ లోడి లు భారతదేశం పై దండెత్తమని "బాబర్" కు ఆహ్వానించారు. మరియు మేవడ్ చక్రవర్తి అయిన సంగ్రామ్ సింగ్ కూడా బాబర్ ను భారత్ కు ఆహ్వానించాడు.
· 1526 ఏప్రిల్ 21 న జరిగిన మొదటి "పానిపట్టు యుద్ధంలో" బాబర్ ఇబ్రహీం
లోడీని వదించి భారతదేశానికి చక్రవర్తి అయ్యాడు.
· ఇబ్రహీం లోడీ యొక్క మరణంతో
ఢిల్లీ సుల్తానుల పరిపాలన ముగింసింది.
ALSO READ:- DELHI SULATANTES (ఢిల్లీ సుల్తానులు) -PART -1
DOWNLOAD PDF HERE -Indian history Telugu pdf Delhi sultanates
No comments:
Post a Comment