తెలంగాణలోని ముఖ్యమైన దేవాలయాలు famous temples in telangana in telugu - job aspirants

Latest

job aspirants

TSPSC-POLICE-GROUPS-SSC-RRB

Translate to your preferred language

All subjects

Monday 23 August 2021

తెలంగాణలోని ముఖ్యమైన దేవాలయాలు famous temples in telangana in telugu

తెలంగాణలోని ముఖ్యమైన దేవాలయాలు

(Famous Temples in   Telangana in Telegu) 

telangana temples in telugu pdf how many famous temples in telangana telangana temples images with names telangana famous temples images famous temples in telangana  famous temples in hyderabad how many temples are there in telangana mysterious temples in telangana


తెలంగాణలోని ముఖ్యమైన దేవాలయాలు , ఎన్నో ప్రసిద్ధ క్షేత్రాలు ఎంతో చరిత్ర కలిగి ఉండి ఎంతో ప్రాముక్యత పొందాయి.

  1.వరంగల్ వేయి స్తంభాల గుడి.

·        ఈ ప్రముఖ దేవాలయం వరంగల్ అర్బన్ జిల్లాలో నిర్మించారు

·        దీనిని క్రి.శ.1163 లో కాకతీయ రాజు రుద్ర దేవుడు నిర్మించాడు.

·        దీన్ని చాళుక్య వాస్తు శైలిలో నిర్మించడం జరిగింది.

·        ఈ దేవాలయంలో విష్ణువుశివుడుసూర్య దేవుడు అనే ముగ్గురు దేవుళ్ళు త్రికూటాలయం గా పిలవబడుతుంది.

·        ఈ దేవాలయాన్ని నక్షత్ర ఆకారంలో నిర్మించారు.

·        నల్ల బసాల్ట్ ఏకశిలా రాయితో నంది విగ్రహాన్ని చెక్కించారు.

·        ఈ ఆలయాన్ని 2004 భారతదేశం పురావస్తు సర్వే ద్వారా పునర్నిర్మించబడింది.

         2. స్వయంభు శంభు లింగేశ్వర దేవాలయం

·        ఈ ప్రముఖ దేవాలయం వరంగల్ జిల్లాలో ఉంది.

·        క్రీ. శ 1162 లో గణపతి దేవుడు దీనిని నిర్మించాడుఆయన కుమార్తె రుద్రమదేవి పూర్తి చేశారు.

·        గర్భగుడిలోని శివలింగం ఇతర లింగాల తో పోలిస్తే భిన్నంగా ఉంటుంది.

·        కాకతీయులు నిర్మించిన దేవాలయాల్లో అతి పెద్దది.

         3.భద్రకాళి దేవాలయం

·        ఈ ప్రముఖ దేవాలయం వరంగల్ జిల్లాలో వేయి స్తంభాల గుడి కి చేరువగా నిర్మించడం జరిగింది.

·        క్రీ.శ. 625 లో రెండవ పులకేశి నిర్మించాడు.

·        శ్రీ భద్రకాళి అమ్మవారు దాదాపు తొమ్మిది అడుగుల వెడల్పు తొమ్మిది అడుగుల పొడవు తో భక్తులను కటాక్షిస్తుంది.

·        ఈ గుడికి చేరువలో భద్రకాళి చెరువు ఉంది. వరంగల్ నగరానికి ఈ చెరువు నుండి నీరు పంపిణీ జరుగుతుంది.

         4.కాళేశ్వర ముక్తేశ్వరాలయం.

·        జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంకాలేశ్వరం లో దేవాలయం నిర్మించారు.

·        పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసిన ఈ దేవాలయం శివుడు మరియు యమ దేవుడు కి ఇక్కడి ప్రత్యేకత.

·       శ్రీశైలందాక్షారామంకాలేశ్వరం అనే త్రిలింగ క్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి.

·        ఈ ఆలయంలో చేప విగ్రహం ప్రత్యేక ఆకర్షణ.

         5.రామప్ప గుడి

·        ఈ ప్రసిద్ధ క్షేత్రం ములుగు జిల్లావెంకటాపూర్ మండలంపాలంపేటలో నిర్మించారు

·        క్రీ. . 1213 లో రేచర్ల రుద్రుడు ఈ దేవాలయాన్ని నిర్మించాడు

·        2020 సంవత్సరంలో ప్రసిద్ధ క్షేత్రానికి “యునెస్కో హెరిటేజ్” వారసత్వ హోదా లభించింది ఈ హోదా భారతీయులకే గర్వకారణం.

·        ఈ దేవాలయానికి హెరిటేజ్ హోదా లభించడానికి గల ముఖ్య కారణాలు

§  ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం.

§  నీటిలో తేలియాడే ఇటుకలతో నిర్మించడం.

§  ఇటుకలు ఇప్పటికీ రంగు చెదరకుండా ఉండడం.

§  ఎటు చూసినా మననే చూసినట్టుగా ఉండే నంది ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ.

         6.మేడారం సమ్మక్క సారక్క దేవాలయం.

  ·    ఈ దేవాలయం ములుగు జిల్లాతాడ్వాయి మండలంమేడారం గ్రామంలో ఉంది.

  ·          ఈ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ.

  ·          ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగ గా ప్రకటించింది.

   ·          భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లంను నైవేద్యంగా సమర్పిస్తారు.

   ·          ఈ జాతరను తెలంగాణ కుంభమేళ అంటారు. ఈ జాతరకు  పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి  దర్శనం చేసుకుంటారు.

          7.రాజరాజేశ్వర ఆలయం

·      రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రదేశంలో ఈ ఆలయం ఉంది.

·       వేములవాడ దక్షిణ కాశీగా పిలవబడుతూ ఉంది.

·       వేములవాడ చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించారు.         

·     ఆలయం లోపల దర్గా మరియు రాజ రాజేశ్వర స్వామి కొలువై ఉండడం  వల్ల లౌకిక తత్వానికి ప్రతీకగా నిలిచింది

          8.కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం.

                          

  ·          జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామం లో ఈ దేవాలయం ఉంది

 ·          ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి ఒకవైపు నరసింహ స్వామి ముఖంతో కలిగి మరోవైపు ఆంజనేయస్వామి ముఖంతో ఉండడం ఈ దేవాలయం ప్రాముఖ్యత.             

·         శంకు చక్రాలు మరియు ఉదరంలో సీతారాముల స్వామి ని కలిగి ఉండడం ఇక్కడి ప్రత్యేకత.

         9.సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలo

·          ఈ దేవాలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది మరియు తెలంగాణలోనే అతి పెద్ద రాముల వారి దేవాలయం.         

·          17 వ శతాబ్దంలో శ్రీరామదాసు అయినా కంచర్ల గోపన్న ఈ ఆలయాన్ని నిర్మించాడు.

·          ఏడవ నిజాం అయినా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ ఆలయ నిర్మాణానికి రూ 82,000 విరాళంగా ఇచ్చాడు.                            

·          1960 లో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు.

        10.ఛాయా సోమేశ్వరాలయం               

·          ఈ దేవాలయం నల్గొండ జిల్లా పానగల్లు గ్రామంలో ఉంది.

·          సుమారు 10వ శతాబ్దంలో కందూరు చోడులు ఈ ఆలయాన్ని నిర్మించారు.                  

 ·          ఈ ఆలయంలోని గర్భగుడి లో సూర్యరశ్మి తో సంబంధం లేకుండా కనిపించే స్తంభాకర నీడ అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.                            

·          ఈ గుడిని కాంతి పరిక్షేపణం ఆధారంగా నిర్మించడం వలన గర్భగుడిలో శివ లింగం యొక్క నీడ పడుతుందని శేష గాని మనోహర్ గౌడ్ గారు వివరించారు.

        11.వాడపల్లి శివాలయం          

·          నల్గొండ జిల్లాలోని వాడపల్లిలో కాకతీయ రాజులు 12వ శతాబ్దంలో శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు.                            

·          ఈ దేవాలయంలో నదికి 120 మీటర్ల ఎత్తున శివలింగం ఉంటుంది.

         12. పిల్లలమర్రి దేవాలయం

·        ఇది కాకతీయులు నిర్మించిన అత్యంత పురాతనమైన శివాలయo.

·        కాకతీయ రాజు గణపతి దేవుని కాలంలో నాగిరెడ్డి వంశస్థులు పిల్లలమర్రిలో త్రికూట ఆలయాన్ని నిర్మించారు.

·        త్రికూట ఆలయంలో కాటేశ్వరకాచీశ్వరానామేశ్వరా దేవాలయాలు కలవు.

            13.యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం.                        

·          ఈ దేవాలయం “యాదాద్రి భువనగిరి” జిల్లా లో కలదు            

·          ఈ దేవాలయాన్ని తెలంగాణలోని అతి పెద్ద పుణ్యక్షేత్రం గా తీర్చిదిద్దడం జరుగుతుంది.

 ·          దీనిని “పంచ నరసింహ క్షేత్రం” గా పేర్కొన్నారు.                    

·          శ్రీ కృష్ణ దేవాలయాలు తన జీవిత చరిత్రలో ఈ ఆలయం గురించి పేర్కొన్నాడు.

            14.కొలనుపాక జైన క్షేత్రం.

·        ఈ దేవాలయం యాదాద్రి భువనగిరి జిల్లా లో కలదు ఈ జైన క్షేత్రం తెలంగాణ లోనే ముఖ్యమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.

·        జైన క్షేత్రాన్ని రెండువేల సంవత్సరాల క్రితం నిర్మించారు.

·        ఈ ఆలయ నిర్మాణానికి డోలాపూర్ రాయిని రాజస్థాన్ నుండి తెప్పించారు.

            15. డిచ్పల్లి రామాలయం.

·        నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి లో ఈ దేవాలయం కలదు.

·        17వ శతాబ్దంలో కొండపై ఉన్న ఈ రామాలయంను నలుపు తెలుపు రంగుల రాయి తో నిర్మించారు.

·        ఈ కొండపై శిల్పాలు ఖజురహో శిల్పాలతో పోలి ఉంటాయి అందుకే ఈ దేవాలయాన్ని “ఇందూరు ఖజరహో” అంటారు.

            16. శ్రీ నీలకంటేశ్వర ఆలయం

·        నిజాంబాద్ పట్టణంలో కొండ పైన వెలసిన శ్రీ నీలకంటేశ్వర ఆలయం ఎంతో పవిత్రమైనది.

·        ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే జనవరిలో వచ్చే రథసప్తమి రోజు శివలింగం పైన సూర్య కిరణాలు ప్రసరిస్తాయి.

         17.  జోగులాంబ దేవాలయం

·        జోగులాంబ గద్వాల జిల్లాఆలంపూర్ మండలం లో ఈ దేవాలయం ఉంది.

·        ఈ ఆలయ సమూహాలు 7 నుండి 8 వ శతాబ్దం మధ్యకాలంలో నిర్మించారు.

·        ఈ ఆలయంలోని నవబ్రహ్మ ఆలయం జోగులాంబ ఆలయం అత్యంత ప్రఖ్యాతి పొందాయి.

·        దేశంలో ఉన్న 18 ఇది శక్తి పీఠాలలో జోగులాంబ ఆలయం ఒకటిగా పేర్కొన్నారు.

            18. ఆవంచ వినాయకుడు

·        మహబూబ్ నగర్ జిల్లాలోని తిమ్మాజీపేట మండలం లోని ఆవంచ గ్రామంలో దేశంలోనే అతిపెద్ద ఏకశిలా వినాయక విగ్రహం కలదు.

·        ఈ విగ్రహం పశ్చిమ చాళుక్యుల కాలంలో నిర్మించారు.

·        ఈ ఆలయం ఐశ్వర్య గణపతి గా రెండవ కాణిపాకంగా ప్రసిద్ధిచెందినది కానీ స్థానికులు దీనిని “ఎoకయ్య గుండు” అని పిలుస్తారు.

             19.సోమశిల ఆలయం.

·        నాగర్ కర్నూల్ జిల్లా లోని కొల్లాపూర్ మండలంలో ఈ సోమేశ్వరాలయం కలదు ఆలయం చుట్టు పక్కల ఉన్న పదిహేను ఆలయాల్లో కూడా శివలింగాలు ప్రతిష్టించారు.

·        ఈ ప్రాంతంలో సప్త నదుల సంగమ క్షేత్రం కలదుఇక్కడ పన్నెండు సంవత్సరాలకు వచ్చే కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తులు పుణ్య స్నానాలు చేస్తారు.

           20.  ఉమామహేశ్వర ఆలయం.

·        నాగర్ కర్నూల్ జిల్లా లోని అచ్చంపేట్ మండలంలో ఈ ఆలయం కలదు.

·        ఉమామహేశ్వర ఆలయం ను శ్రీశైలానికి ఉత్తర ద్వారం గా పేర్కొంటారు.

·        ఈ ఆలయం పరిసరాలలో పల్లవులు చెక్కించిన శివలింగం విష్ణుకుండినులు చేయించిన నగర బేరి ఇప్పటికీ ఉన్నాయి.

            21. వర్గల్ సరస్వతి దేవాలయం.

·        సిద్దిపేట జిల్లాలోని వర్గల్ మండలం లో ఈ సరస్వతి ఆలయం కలదు.

·        ఈ దేవాలయ పరిసరాలలో శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం, శనీశ్వరాలయం, శివాలయంకూడా ఉన్నాయి.

·        ఈ పాఠశాల ఆవరణలో వేద పాఠశాల నిర్వహించడం జరుగుతుంది సుమారు 300 మంది ఇక్కడే నివసిస్తూ వేదాలను అభ్యసిస్తారు.

          22. కోటి లింగేశ్వర ఆలయం.

·        ఈ ఆలయం సిద్దిపేట జిల్లాలో కలదు.

·        ఈ ఆలయంలో కొన్ని లక్షల శివలింగాలు ఉండడం ప్రత్యేకత కావున ఈ ఆలయాన్ని కోటిలింగేశ్వర ఆలయం గా పిలుస్తారు.

·        ఈ ఆలయాన్ని 1979లో శ్రీ మదనానంద స్వామి గారు నిర్మించారు.

         23.  అయినవోలు దేవస్థానం

·        ఈ ప్రసిద్ధ క్షేత్రవరంగల్ పట్టణ జిల్లా అయినవోలు గ్రామం లో కలదు.

·        పశ్చిమ చాళుక్య చక్రవర్తి అయినా ఆరవ విక్రమాదిత్యుని మంత్రి అయినా అయ్యాన దేవుడు ఈ ఆలయాన్ని కట్టించాడు.

·        అష్టభుజ కృతిలో 108 స్తంభాలతో ఆలయం చాళుక్య నిర్మాణశైలిలో కనువిందు చేస్తుంది.

·        ఇక్కడ కొలువైన మల్లన్న స్వామిని మైలార్ దేవునిగాకండెల రాయుడు గా పేర్కొంటారు.

        24.  రామలింగేశ్వరాలయం

·        సంగారెడ్డి జిల్లాలోని నంది కంది గ్రామంలో రామలింగేశ్వర స్వామి ఆలయం కలదు.

·        ఈ ఆలయాన్ని కళ్యాణి చాళుక్యులు నక్షత్ర ఆకారంలో నిర్మించారు.

·        ఈ ఆలయంలో చాళుక్య శిల్పులు వివిధ దేవుళ్ళ విగ్రహాలను దేదీప్యమానంగా చెక్కించారు.

       25.కాశీ విశ్వేశ్వర ఆలయం

·        సంగారెడ్డి జిల్లాలోని కలాబ్పుర్ అనే గ్రామంలో ఈ కాశీ విశ్వేశ్వర దేవాలయం కలదు.

·        ఈ దేవాలయంని 14వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించారు.

·        ఇది వేయి స్తంభాల గుడి ని పోలి ఉంటుంది.

         26.బిర్లా మందిర్.

·        హుస్సేన్ సాగర్ కు దక్షిణాన ఉన్న ఖాలపహాడ్ మరియు నౌబత్ పహాడ్ కొండలపై దేవాలయాన్ని నిర్మించారు.

·        1976 సంవత్సరంలో  ఈ దేవాలయాన్ని రాజస్థాన్ నుండి తెప్పించిన తెల్లని పాలరాతితో నిర్మించారు.

·        బిర్లా మందిర్ ఉత్తర మరియు దక్షిణ వాస్తు శైలిల మిశ్రమ సమ్మేళనం.

·        ఆలయ ప్రాంగణంలో రామాయణ మహాభారత చిత్రాలను పాలరాయి పై అద్భుతంగా చెక్కారు.

·        ఈ ఆలయంలోని వెంకటేశ్వర స్వామి ప్రతిమ తిరుమల తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి ప్రతిరూపంగా చెప్పవచ్చు.

           27.జగన్నాథ ఆలయం.

·        హైదరాబాదులోని బంజారా హిల్స్ రోడ్ నెం.12 లో కలదు.

·        ఒరిస్సాలోని “పూరి జగన్నాథ్ స్వామి” ఆలయం కు ప్రతిరూపంగా ఈ ఆలయాన్ని నిర్మించారు.

·        ఈ ఆలయంలో శ్రీకృష్ణుడుబలరాముడుసుభద్ర లు ప్రధాన విగ్రహాలుగా చెక్క బడ్డారు.

           28.బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయం.

·        హైదరాబాదులో ఉన్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయం తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలకు ఎంతో ప్రసిద్ధి.

·        ఈ ఆలయమును 15 వ శతాబ్దంలో నిర్మించగా20వ శతాబ్దంలో పునఃనిర్మించారు.

         29. పెద్దమ్మ ఆలయం.

·        హైదరాబాదులోని జూబ్లీహిల్స్లో ఈ ఆలయాన్ని నిర్మించారు.

·        దాదాపు 150 సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించగా1993 లో దివంగత మాజీ మంత్రి పి. జనార్దన్ రెడ్డి గారిచే పునర్నిర్మించడం జరిగింది.

·        ఈ ఆలయ ప్రాంగణం లోని ధ్వజస్తంభం దగ్గర రూపాయి బిళ్ళ పడిపోకుండా నిలువుగా నిలబడేల ఉంచితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

            30. ఉజ్జయిని మహంకాళి ఆలయం.

·        1813లో కలరా వ్యాధి” ప్రబలిన కారణంగా ఉజ్జయినిలో ఉన్న అప్పయ్య మహంకాళి ఆలయం ను సందర్శించుకుని కలరా వ్యాధి నుండి ప్రజలను విముక్తి కలిగితే మీ విగ్రహాన్ని సికింద్రాబాద్ లో ప్రతిష్టాపన చేస్తాను అని పూజ చేశారు.

·        ఈ విధంగా 1815 లో సికింద్రాబాదులో మహంకాళి విగ్రహం ప్రతిష్టించారుఅందుకే దీనిని ఉజ్జయిని మహంకాళి ఆలయం అని పేర్కొంటారు.

·        ఈ ఉజ్జయిని మహంకాళి దేవాలయం తెలంగాణలో బోనాల పండుగ కు ప్రసిద్ధి.

      31.సంఘీ ఆలయం.

·        రంగారెడ్డి జిల్లా సంగినగర్ లో ఉన్న అద్భుతమైన పాల రాయి ఆలయం.

·        ప్రధానంగా పూజింపబడే దేవుడు వెంకటేశ్వర స్వామి.

·        పరమానంద గిరి అనే కొండ పైన ఈ ఆలయాన్ని నిర్మించారు.

·        గోపురం ఎత్తు 15 అడుగులు ఉంటుంది.

·        ఈ ఆలయం చోళ – చాళుక్య వాస్తు శైలిలో నిర్మించడం జరిగింది.

  32.అనంత పద్మనాభ స్వామి ఆలయం

·        వికారాబాద్ జిల్లా లోని అనంతగిరి కొండలలో ఈ ఆలయం కలదు.

·        స్కంద పురాణం ప్రకారం మార్కండేయుడు అనే రిషి ద్వాపరయుగంలో ఈ ఆలయాన్ని నిర్మించాడు

·        ప్రధాన ఆలయాన్ని నిర్మించినది హైదరాబాద్ నవాబ్.

·        ఈ ఆలయం అనంతగిరి కొండలలో దట్టమైన అడవి ప్రాంతంలో ఉండడం ప్రత్యేక ఆకర్షణ.

       33. జ్ఞాన సరస్వతి దేవాలయం.

·        నిర్మల్ జిల్లా బాసర అనే గ్రామం లో ఈ ఆలయం కలదు.

·        కర్ణాటక మహారాజైన బిర్బలుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు.

·        వ్యాసమహర్షి కారణంగా ఈ ఆలయం వెలసింది అని ప్రతీతి.

·        ఈ ఆలయంలో ప్రధానంగా లక్ష్మీ సరస్వతి కాళీ దేవతలు కొలువై ఉన్నారు.

       34. మెదక్ చర్చి.

·        1914 లో చార్లెస్ వాకర్ ఫస్నెట్ దీనిని గోతిక్ శైలిలో నిర్మించారు.

·        మెదక్ లోని ఈ చర్చి ఆసియాలోనే అతిపెద్ద చర్చిలలో ఒకటి.

·        చర్చి నిర్మాణంలో వాడిన టైల్స్ ని ఇటలీ నుండి తెప్పించారు.

·        మీ చర్చి లో అతి పెద్ద ఆకర్షణ క్రీస్తు జీవితంలో విభిన్న దృశ్యాలను వర్ణించే కలిసిన గాజు కిటికీలు.

      35. సెయింట్ మేరీస్ చర్చ్

·        1850లో సికింద్రాబాద్ లో నిర్మించారు.

·        ఇది అతి పురాతన “రోమన్ క్యాథలిక్ చర్చ్.

·        ఇందులో ఉన్న నాలుగు గంటల ను 1901లో ఇటలీ నుండి తెప్పించారు.

  

     పైన చదివిన తెలంగాణా ప్రసిద్ధ క్షేత్రాలు వాటి ప్రాముక్యత పై క్విజ్ రాయడానికి              కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.

            తెలంగాణ లోని ప్రసిద్ద దేవాలయాలు మరియు పండుగల ప్రాముఖ్యత క్విజ్

 

 

 

 

 

No comments:

Post a Comment